నిజాంపేట, నేటి ధాత్రి
నస్కల్ కు రోడ్డు వేయాలని 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు లింగం, బక్కన్న గారి నరేష్ గౌడ్, పాతూరి అజయ్ గౌడ్, కొమ్మాట రాజు నగరం, దుబాసి సంజీవ్, దొంతరమైన దుర్గయ్య, పాగాల ఎల్లం యాదవ్, ఆకుల రమేష్, గుడిసెట్టి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు