
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ టెంపుల్ పద్మశాలి సంఘం వద్ద పద్మశాలి బాంధవుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి కుల బాంధవులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన సహాయం చేస్తూ 30 కోట్ల రూపాయలు విడుదల చేశారని అలాగే ప్రతి ఆడపదుచుకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని అలాగే గత ప్రభుత్వం లాగా ఇచ్చిన మాట తప్పమని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరిస్తుందని తెలియజేస్తూ మళ్లీ పద్మశాలి వర్గాలకు ఎంతో మేలు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుందని నేతన్నలు రైతన్నలు ఒకటే అని వారికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనిఅలాగే గతంలో వస్త్ర సంక్షోభం ఉందని దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జౌ లి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పోన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి పద్మశాలి బాంధవుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సహాయ సహకారాలు అందించి ముందుకు సాగాలని వి రు చేసిన సహాయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు పద్మశాలి ఆనందం జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మొర రాజు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్కారం మహేష్ ఉపాధ్యక్షులు అశోక్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ సామల గణేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింగం గౌడ్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ మోర లక్ష్మీరాజు అహంకారం రవి రెడ్డి మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి చుక్క శేఖర్ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు