
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
ఈరోజు రామాయంపేట పట్టణంలో బిజెపి బూత్ అధ్యక్షుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, మెదక్ ఎంపీ రఘునందన్ రావు యొక్క గెలుపు కోసం ప్రతి బూత్ అధ్యక్షుల నుండి కార్యకర్తల వరకు నిర్విరామంగా అహర్నిశలు కష్టపడడం మరియు రఘు అన్న చరిష్మా మోడీ చరిష్మా కారణంగా ఈ ఘనవిజయం సాధ్యమైంది అంతే తప్ప కేవలం ఏ ఒక్కరి కృషి వల్ల ఇది సాధ్యం కాలేదు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామాయంపేట పట్టణ అధ్యక్షుని వైఫల్యాల వలన అందరిని కలుపుకోలేకపోవడం వలన మేము అధికంగా ఓట్లు సంపాదించలేకపోయాం, తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా పార్టీ ప్రక్షాళన కోసం బిజెపి అధిష్టానం కొత్త అధ్యక్షునిగా భానుచందర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా శీలం అవినాష్ రెడ్డి , పట్టణ కొత్త కమిటీలను నియమించడం ద్వారా వీళ్ళందరూ కృషిచేసి ప్రతి బూత్ అధ్యక్షులను నియమించి తద్వారా అందరూ కార్యకర్తలు మరియు సీనియర్ నాయకుల కృషి కష్టం ఫలితం కారణంగా రఘు అన్న గారి మోడీ గారి చరిష్మా కారణంగా మాత్రమే ఈ విజయం సాధ్యమైందని పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఇంచార్జ్ వెల్ మూల సిద్ధరాములు,ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, సీనియర్ నాయకులు ఆకుల రమేష్, పట్టణ ఉపాధ్యక్షులు ఒలిచే సతీష్ రావు, టంకరి లింగం, ఓబిసి పట్టణ అధ్యక్షుడు డి నాగరాజు, బూత్ అధ్యక్షులు A అనిల్, B అనిల్, K నితిన్, వెలుముల రమేష్, పట్టణ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు