
జమ్మికుంట: నేటిథాత్రి
టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు)
కరీంనగర్ అలుగునూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటి సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సి ఓ ఈ) విద్యాలయం సుందరీకరణ కోసం కలర్స్ కావాలని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి కోరగా శనివారం సుమారు 5 వేల రూపాయల కలర్స్ ను
వైస్ ప్రిన్సిపాల్ రామ్ సింగ్ చేతికి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ)
రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు) అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఐదో తరగతి నుండి ఇంటర్ సెకండియర్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటి లో చదువుకొని సమాజంలో మంచి కళాకారుడిగా, సామాజిక కార్యకర్తగా, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారణంగా అన్ని రంగాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన సొసైటీకి అరుణపడి ఉంటానని తెలియజేస్తూ,
గురుకుల విద్యాసంస్థలలో చదివిన ప్రతి పూర్వ విద్యార్థి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన మార్గంలో
పే బ్యాక్ ( టైం / టాలెంట్ / ట్రెజరీ)
ఇస్తూ రుణం తీర్చుకోవాలని కోరారు.
అదేవిధంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాల్లో చదివిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందరు కూడా ఆయా పాఠశాల కళాశాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు కాలేజీలో ప్రారంభం అయినవి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను సకాలంలో కళాశాలలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు