కూకట్పల్లి మార్చి18 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ పార్టీ మారేందుకు సన్నా హమై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మహిళా నాయకురాళ్లతో సమావేశమై వారి వారి అభిప్రాశయాలను తెలు సుకో వడం జరిగింది.ఈ క్రమంలో ఎక్కువ మంది కార్యకర్తలు పార్టీ మారుతు న్నందుకు బాధపడుతున్నారని తెలుసుకున్న కార్పొరేటర్ ఇదే బీఆర్ఎస్ పార్టీలో కొన సాగాలని నిర్ణయించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ అందరం కలిసి ఉండవలసిన
కష్ట కాలంలో పార్టీని విడిచి వెళ్లడం మంచి పరిణామం కాదని కేటీఆర్ చెప్పడంతో మనసు మార్చుకునట్లు తెలిపారు.మా ఎమ్మెల్యేలు మాధవ రం కృష్ణారావు ఆరేకపూడి గాంధీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ
లోనే పని చేసేందుకు నిర్ణయించు కున్నానన్నారు.ఎప్పటికి కేసీఆర్ కేటీఆర్ తోనే ఉంటూ,వారి బాటలో నే పయనిస్తామన్నారు.అదే విధంగా నా కుటుంబ సభ్యులైన కార్యకర్త లతో మాట్లాడిన తరువాత వారు పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని, కొంతమంది ఉన్న గాని వారు కూడా అయిష్టంగానే ఒప్పుకున్నట్లు నాకు తెలిసింది కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రజాసేవ కొనసాగిస్తానని అన్నారు.ఎప్పటికి ఆల్విన్ కాలనీ గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ అడ్డానే అని అన్నారు.ఆల్విన్ కాలనీ డివిజన్ లో దాదాపు తొంభై శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి అని,మిగిలి న పనులను రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడైనా సరే పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నిక లలో అధిష్టానం ఎంపీగా ఎవరికి టికెట్ ఇచ్చిన సరే బీఆర్ఎస్ పార్టీ విజ యానికి మా ఎమ్మెల్యే ఆరేక పూడి గాంధీతో కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నా రు.ఇకపై నేను పార్టీ మారుతు న్నానని ఎలాంటి పుకార్లు వచ్చిన నమ్మవద్దని అన్నారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాస్ ఫోటో నంబర్ 2