నర్సంపేట,నేటిధాత్రి :
భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఖానాపూర్ మండలంకు చెందిన కోడి భావ్య మృతి చెందగా భావ్య శ్రీ కుటుంబాన్ని ఏబీఎస్ఎఫ్ జిల్లా బోట్ల నరేష్ పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న కోడి భావ్య, వైష్ణవిలను గత వారం రోజుల క్రితం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు,వార్డెన్, వంట మనిషి, పిటిల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా భావ్యశ్రీ, వైష్ణవి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎస్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కోరారు. గత నెల రోజుల నుండి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడానికి మూలాలు తెలుసుకొని వారికి అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శివ ప్రశాంత్, వినయ్, ప్రసాద్, ప్రమోద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.