రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 07, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన నాయకులు పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు మాత రమాబాయి చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాలలోని విద్యార్థులందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం చేసిన మహా త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ అని కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం ప్రతి నెల డబ్బులు పంపించి అంబేద్కర్ ను జ్ఞానశూర్యున్ని చేయడంలో రమాబాయి కృషి వర్ణించలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం గంగారం, కుమార్, రాజేశం, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అపరంజి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు