పరకాలలో హ్యాట్రిక్ ఎమ్మేల్యేగా చల్లా ధర్మారెడ్డి ని గెలిపించుకుందాం

నడికూడ,నేటి ధాత్రి:

మండలం లోని రామకృష్ణపూర్,సర్వపూర్ , కౌకొండ, ధర్మారం నడికూడ గ్రామాల్లో బి.ఆర్.ఎస్ యూత్ కమిటీ సమావేశాలను మండల యూత్ అధ్యక్షులు బొల్లారం అనిల్ కుమార్ అధ్యక్షతన ఆయా గ్రామాల యూత్ అధ్యక్షుల అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు),ఆయా గ్రామాల సర్పంచులు, నడికూడ మండల యూత్ నాయకులు హాజరు కావడం జరిగింది.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయం,విద్యుత్,త్రాగునీరు,విద్య,వైద్యం,పరిశ్రమలు,ఐటీ తదితర రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిపిన ఘనత సీఎం కేసిఆర్ ది.ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం,24 గంటల ఉచిత విద్యుత్తు వలన రైతులను రాజును చేసిండు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడం, రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే మిగులు విద్యుత్తుకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేసారు అని అన్నారు.కాంగ్రెస్,బీజేపీ మోసపూరీత హామీలను నమ్మకుండా,సామజిక మధ్యమాల లో చేసే అసత్య ప్రచారాలని యువత ఎప్పటికప్పుడు త్రిప్పికొట్టాలని,అదే విధంగా పరకాల చరిత్రలో ఎవరు చేయని అభివృద్ధి చేసి ఎమ్మెల్యే చల్లా తనదైన ముద్ర వేసుకున్నారని, శాసనసభ్యుని గా బాధ్యత చేపట్టిన నుండి కోట్ల రూపాయల తో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసారని అన్నారు.
అదే విధంగా నడికూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు మాట్లాడుతూ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మన పరకాల నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు,బీటీ రోడ్లు,గ్రామ పంచాయితీ భవనాలు, మహిళా భవనాలు నిర్మించిన ఘనత చల్లా కే దక్కుతుందని అన్నారు.
మండల యూత్ నాయకులు మాట్లాడుతూ
వైద్య, విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మౌలిక వసతులను,కొత్తగా నిర్మించిన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ,హైదరాబాద్ పట్టణ అభివృద్ధి,భద్రత,మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా యువత ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయించాలని కోరారు.
యువతకు చల్లా ట్రస్ట్ ద్వారా యువతకు భోజన వసతి తో పాటు,ఉచిత కోచింగ్ అందచేయడం ద్వారా వందలాది మంది పోలీసులుగా ఉద్యోగాలు పొందారని అన్నారు.
ఈ సమావేశాల్లో ఆయా గ్రామాల సర్పంచులు పెండ్లి రాజు, శ్రీలతరవీందర్, మేకల రమేష్ ,ఎంపీటీసీ మేకల సతీష్,పరకాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్స్ పోచంపల్లి రఘుపతి,తిప్పర్తి ప్రశాంత్, యూత్ అధ్యక్షులు బొల్లారం అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి సురాబు శ్రీకాంత్, సోషల్ మీడియా మండల కో ఆర్డినేటర్ దోమ పవన్, బీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు గుడికందుల శివ, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్, యూత్ అధ్యక్షులు దుప్పటి సుమన్, కృష్ణమూర్తి, దేవరాజ్,గ్రామ కమిటీల అధ్యక్షకార్యదర్శులు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,యూత్ కమిటీ నాయకులు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!