
పరకాల నేటిధాత్రి
పార్టీలో కష్టపడి అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో వివిధ కారణాలతో మృతిచెందిన
మృతుల వివరాలు:గొనెల నర్సమ్మ, మేడిపెళ్ళి ఐలమ్మ, మాదాసి రాజు, బొల్లం రాజు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.వారితో మాట్లాడుతు అధైర్య పడవద్దని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.