మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో
బెల్జిపులను నిర్వహిస్తున్న 15 మంది యజమానుల పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఎస్ఐ కరుణ తెలిపారు. నవాబుపేట మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూన్నా వీరందరినీ మంగళవారం తహశీల్దార్ మల్లికార్జున రావు ముందు హాజరుపరిచి బైండోవర్ చేయించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తహశీల్ధార్ మల్లికార్జున్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై కరుణ, హెడ్ కానిస్టేబుల్ రెడ్యానాయక్, కానిస్టేబుల్ అంజి, బాలస్వామి, నాగరాజు, పాల్గొన్నారు.