మోకు దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడిగా మచ్చిక రవీందర్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని ముచింపుల గ్రామానికి చెందిన రవీందర్ గౌడ్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ పేర్కొన్నారు అనంతరంనియామక పత్రాన్ని రవీందర్ కు అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తన నియామకాన్ని కొరకై సహకరించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా గౌడ కులస్తుల అభ్యున్నత కోసమై అనునిత్యం పనిచేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ సంఘ అభివృద్ధి కొరకై పాటుపడతానని అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తడక అనిల్ గౌడ్, చుక్క శ్రీకాంత్ గౌడ్, సాంబయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!