`అవినీతి అనే పదం వినపడకుండా చేయగలరా?
`అవినీతి నిర్మూలన పాలకులకు సాధ్యమేనా?

`తమిళనాడు సిఎం. విజయ్ లాంటి ప్రకటన తెలంగాణలో వినొచ్చా?
`స్వతంత్ర భారతావని మొదటి ఎన్నికల నుంచి వింటున్న మాటే!

`ఎన్నికలొచ్చిన ప్రతిసారి పార్టీలు చెబుతున్న మాటే!
`తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కూడా చేసిన వాగ్దానమే!
`మరేమైంది.. పాలకులే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
`విమర్శల పాలౌతున్నారు..ఓడిపోతున్నారు.
`అధికారుల అవినీతిని ఎలా అరికడతారు?
`ముందు నాయకులు నిజాయితీ పరులు అనే పేరు ఎందుకు తెచ్చుకోవడం లేదు!
`అధికారుల చేత అవినీతి చేయించిదే నాయకులు అనే అపవాదు ఉండనే వుంది.
`కాదని చెప్పే దైర్యం ఎంత మంది నాయకులకు వుంది.
`తెలంగాణలో రోజుకు కనీసం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
`ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత కొన్ని వందల మంది పట్టుబడ్డారు!
వాళ్లలో చాలా మంది మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు?
”ఏ సి బి” అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడిన తర్వాత ఎలా కుర్చీలలో కూర్చుంటున్నారు!
ఒక్కసారి జైలుకు వెళ్లిన యువకులు ఉద్యోగాలకు అర్హులు కాదు!
ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లినా ఉద్యోగాలకు ఎంపిక చేయరు.
అలాంటిది అవినీతి చేసిన ఉద్యోగులు మళ్ళీ ఎలా ఉద్యోగం పొందుతున్నారు!
అవినీతి పరులను రాజకీయ నాయకులే ఎందుకు కాపాడుతున్నారు!
ఒక్క సారి “ఏసిబి” కి పట్టుబడితే ఉద్యోగం పోవాలి!
`అందుకు అవసరమైన చట్టం చేయాలి!
`పాలకులకు అలాంటి చట్టం చేయడం సాధ్యమా?
`ఉద్యోగులతో పెట్టుకున్న పార్టీలు మనుగడలో ఉంటాయా?
`అలాంటి చట్టాలు చేయాలంటే మళ్ళీ ఉద్యోగులే రూపకల్పన చేయాలి!
`తమ ఉద్యోగాలను తామే పోగొట్టుకునే పని చట్టాల రూపాకల్పన చేసే అధికారులు సహకరిస్తారా?
`దశబ్దాలుగా అవినీతి నిర్మూలన అనే పదమే వింటున్నాం!
`చట్టం చేయకుండా ఎన్నికల కోసం పార్టీలు చెప్పే మాటలు నమ్ముతున్నాం.
`వీళ్ళు కాక పోతే వాళ్లు, వాళ్లు కాక పొతే వీళ్ళు చెప్పే సొల్లు విని ఓట్లేస్తున్నాం.
`చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ చెబితే నిజమనుకున్నాం.
`చందమామ రాదని అమ్మకు తెలుసు.. అయినా చెప్పింది.
`అవినీతి నిర్మూలన కూడా అంతే.. రాజకీయ పార్టీలు చెబితే వింటాం!
`అధికారులతో పని కోసం లంచాలు ఇస్తూనే ఉంటాం!
హైదరాబాద్, నేటిధాత్రి:
అవినీతి అంతం మా పంతం..ఇది ఎప్ప్పుడు ఎన్నికలు వచ్చినా దేశంలో ఏ పార్టీ నాయకుడైనా, ఆఖరుకు కేంద్రంలో అదికారంలోకి రావాలనుకున్నా చెప్పే ఏకైక వాఖ్యం. అంతే జనం నమ్మాలి. అది ఎన్ని సార్లు చెప్పినా వినాలి. ఎంత మంది చెప్పినా వినాలి. ఎన్నికల నాడు ఆ మాట చెప్పిన పార్టీలకు ఓట్లేయాలి. గెలిపించాలి. ఆ ఐదేళ్ల కాలంలో అవినీతి గురించి పట్టించుకోకపోయినా, మరో పార్టీ చెబితే మళ్లీ వినాలి. ఆ పార్టీని గెలిపించాలి. ఇది నాన్నా పులి కధే. కాని ఎప్ప్పుడూ కంచి చేరని కధే అవినీతి నిర్మూలన. అయితే ఇన్నాళ్ల తర్వాత ఒకే ఒక్కడు. మన ముందు కొత్తగా కనిపిస్తున్నాడు. కొత్త మాట చెప్పాడు. ఆయనే తమిళనాడు సిఎం. విజయ్. ఇప్పటి వరకు ఆ మాట ఏ నాయకుడు చెప్పలేదు. ఏ సిఎం. ప్రకటించలేదు. కనీసం ఈ మాత్రమైనా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడు మరొక్కరు లేరు. సమాజం నుంచి విజయ్ ప్రకటనకు మంచి స్పందన వస్తోంది. అది ఆచరణలో సాద్యమా? కాదా? అనేది కాలం నిర్ణయిస్తుంది. విజయ్ మాట నిలబెట్టుకుంటారా! లేదా? అనేది కొంత కాలం గడిస్తే తేలిపోతుంది. కాని ముందైతే ఒక మాట చెప్పారు. ఎంత వరకు కట్టుబడి వుంటారన్నది కూడా త్వరలోనే తేలుతుంది. కాని పాలకుడిని ఆ మాత్రం మాటైనా చాలు అనుకోవచ్చు. అధికారులకు కాస్తో, కూస్తో భయం పెట్టడానికి కూడా పనికి రావొచ్చు. సమాజం నుంచి స్పందన రావాలని పాలకులు చెబుతుంటారు. పాలకుల నుంచి ప్రతిస్పందన ప్రజలు కోరుకుంటారు. ప్రభుత్వ అదికారులతో పని చేయించుకోవడం మన హక్కు. అని సినిమా డైలాగులు బాగానే వుంటాయి. కాని అవి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా సాద్యమౌతుందా? అవినీతి అంతమౌతుందా? అనేది జనమే ప్రశ్నించుకోవాలంటే సాద్యమయ్యేదికాదు. అవినీతిని అదుపులో పెట్టాలన్నా, అంతం చేయాలన్నా పాలకులే చేయాలి. అంతే కాని జనం నుంచి స్పందన రావాలి. పోరాటం చేయాలంటే సాద్యమయ్యేది కాదు. ఒకే ఒక్కడు, ఠాగూర్, భారతీయుడు లాంటి సినిమాలు తీస్తారు. మనం చూస్తాం. సినిమా నడుస్తున్నంత సేపు వినోదం చూస్తాం. అంతే అంతకు మించి జనం ఏమీ చేయలేరు. తమ పని కోసం అధికారులను ప్రశ్నించలేరు. అసలు పని కోసం పైసా లేకుండా ఆ అధికారి వద్దకు వెళ్లేనేలేం. ఇది మన వ్యవస్ధలో వున్న నిజం. కాని దానిని ఒప్ప్పుకోం..అయినా లంచం ఇవ్వకుండా ఊరుకోలేం. ఇది అందరి బలహీనత. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అవినీతి రహిత పాలన అందిస్తామనే చెబుతున్నారు. కాని ఆ అవినీతి పెరిగి, పెరిగి అనకొండలు, అనంత కొండలంత పెరుగుతోంది. అంతం లేకుండా విస్తరిస్తోంది. పాలకులు తెలియకుండా జరుగుతోందా? పాలకుల ప్రమేయం లేకుండా జరుగుతోందా? అంటే సమాదానం ఎవ్వరూ చెప్పరు. మొత్తం వ్యవస్ధ అవినీతి చీడతో నిండిపోయింది. దానికి అంతం లేదు. ఆ చీడ పోయేది లేదు. కాని మన తృప్తికోసం నాయకులు చెబుతుంటారు. ఆ ఆశతో జనం ఓట్లేస్తుంటారు. అంతే తప్ప అవినీతి అంతం అనేది ఓ బ్రహ్మ పదార్దం. దానికి ఆది అంతం ఎవరూ చెప్పలేం. ఇచ్చే వారికి, పుచ్చుకునేవారికి కనిపిస్తుంది. అసలు అదికారుల్లో భయం అనేది లేకుండాపోయింది. పట్టుబడుతామన్న భావన లేకుండాపోయింది. పట్టుబడితే పరువు పోతుందన్న ఆలోచనే వారిలో కరువైపోయింది. పోయేది పరువే కదా? సంపాదన దండిగా వుంటే, చేతిలో సొమ్ముంటే పరువు మళ్లీ రెక్కలు కట్టుకొని వాలుతుంది. ప్రజల్లో పలుకుబడి కోసం ఉద్యోగం, అంతస్ధుల కోసం లంచం. రెండూ అధికారులకు కలిసివస్తున్నాయి. లంచం తీసుకోకుండా ఎలా వుంటారు. పట్టుబడినా చింతించాల్సిన అవసరం లేదని దీమాగా వుంటున్నారు. కొలువుపోదు. విరామం తీసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. ఒక్క నెలలో కొన్ని నెలల సంపాదన చేతికొస్తుంది. జీతం కోసం ఆశించే పరిస్దితి లేదు. జీతం రాకపోతే కుటుంబం గడవదన్న దిగులు లేదు. ఒక్క ఏడాదిలో జీతం కాలం సంపాదిస్తున్న ఉద్యోగులు అనేకం వున్నారు. అలాంటి శాఖలను కల్పవృక్షం చేసుకొని సంపాదించుకంటున్నారు. అందుకే పట్టుబడిన ఏ అదికారి ఇళ్లలో సోదాలు చేసిన కోట్లకు కోట్ట కట్టలే కనిపిస్తున్నాయి. వందల కోట్లు ఆస్దులు బైట పడుతున్నాయి. ఇక అలాంటి ఉద్యోగులకు జీతాలెందుకు? రెండు మÖడేళ్లు కొలువు లేకపోయినా దిగులెందుకు? ఏ లంచం తీసుకొని కొలువులు పొగొట్టుకుంటున్నారో..అదే లంచం ఇచ్చి మళ్లీ దర్జాగా కొలువుల్లోకి వస్తున్నారు. పైగా ప్రమోషన్లు పొందుతున్నారు. ఇదీ మన వ్యవస్ధ తీరు. పాలకుల పనితీరు. ఒక్కసారి లంచంతో పట్టుబడితే ఉద్యోగం పోతుంది. జీవితాంతం బతుకు జైలుకు అంకితమౌతుందని ప్రభుత్వం కఠినంగా వుంటే లంచం తీసుకునేందుకు ఉద్యోగులు దైర్యం చేస్తారా? ప్రజల సొమ్ము రూపాయి పట్టుకోవాలంటే వణికిపోకుండా వుంటారా? కాని పాలకులు లంచాలను పెద్ద సమస్యగా చూడడం లేదు. ప్రజలకు ఉద్యోగులతో అవసరం. ప్రజలకు పని చేయించుకోవడం అత్యవసరం అనే విదానం నడుస్తోంది. అవినీతి ఎప్ప్పుడు అంతమొందుతుందని ఆశించే వాళ్లు వున్నా, అవినీతి రూపుమాపడం ఎవరి వల్ల కాదని తెలుసు. కాని తమిళనాడు సిఎం. తీసుకున్న నిర్ణయం ఒక చారిత్మ్రాకమే అని చెప్పాలి. ఒక్క రాష్ట్రం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తే , ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న ఉద్యోగులు మళ్లీ కొలువుల్లో చేరడం అంటేనే అవినీతి నిరోధక శాఖను అపహాస్యం చేసినట్లే.. ఆ వ్యవస్ధ మీద నమ్మకం పోతున్నట్లే. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరే పరిస్దితి రావడం అంటేనే వ్యవస్ధను వెక్కిరించనట్లే..తమను ఎవరూ ఏంచేయలేరనే ధైర్యం వారిలో పెంపొందినట్లే! అలాంటప్ప్పుడు పట్టుకొని ఏం లాభం? మళ్లీ కొలువులు ఇవ్వడం ఎంత నష్టం! ఒక విద్యార్ధి, నిరుద్యోగి ఉద్యమాల పేరుతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే చాలు ఆ వ్యక్తికి జీవితంలో ఉద్యోగం రాదు. ఉద్యమాలు నేరం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు. లంచం హక్కు కాదు. నేరం. నేరం చేసిన ఉద్యోగి జైలుకెళ్లి వచ్చి, మళ్లీ దర్జాగా కొలువు చేయడం వ్యవస్ధను తలకిందులు చేయడమే అవుతుంది. చిన్న పిల్లలకు తల్లులు అన్నం తినిపించడానికో, నిద్ర పుచ్చడానికి జోల పాట పాడడంలోనో చందమామ రావే..జాబిల్లి రావే అంటూ పాడుతుంది. ఎప్పటికీ చందమామ రాదు. జాబిల్లి మనకు కనీసం దగ్గరగా కనిపించదు. చందమామ రాదని తల్లికి తెలుసు. కాని అవినీతి అంతం పాలకులు తల్చుకుంటే ఆగకుండాపోదు. అవినీతి అంతం కాకుండా వుండదు. పాలకులు ఆ పని చేస్తారా? చేయరు…అవినీతిని అంతం చేస్తామని మాత్రం చెబుతారు. లేకుంటే ఓట్లు పడవు. గెలిచిన పాలకులు కాలేరు. ప్రతిసారి మభ్య పెట్టడం రాజకీయ పార్టీలకు అలవాటు. పదే పదే నమ్మి మోసం పోవడం మనకు రివాజు. ప్రతి పనికి లంచం తీసుకోవడం అదికారులకు అలవాటు. లంచం ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే పని కాదు. పైగా అదికారులపై దైర్జన్యం చేస్తున్నారన్న కేసులు తప్ప లంచం ఇచ్చుకోకుండా పనిచేయించుకోవడం సాధ్యం కాదు. ఇదంతా పాలకులకు తెలుసు. మనకూ తెలుసు. తెలిసి జరిగే తప్ప్పును ఎవరూ ఆపలేరు. నిద్రపోయే వాళ్లను తట్టి లేపొచ్చు. కాని నిద్ర నటించేవారిని ఎవరూ మేలు కొలుపలేరు. అది సాధ్యం కూడా కాదు. అవినీతి అంతం కూడా అంతే!! కాదనుకుంటే సమాజం మÖర్ఖత్వమంతే!! జనమంతా చేతకానివాళ్లంతే!!!
