Tributes to Shanti Prakash Shukla
పేద ప్రజల కోసం తపించిన వ్యక్తి శాంతి ప్రకాష్ శుక్లా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రామరాజు
శాంతి ప్రకాష్ శుక్ల ఆశయాల సాధన కోసం నేటి యువతరం , ప్రజానీకం ముందుకు కదలాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
స్వాతంత్ర సమరయోధులు , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు , సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్.. అమృత లాల్ శుక్లా తనయుడు ప్రముఖ న్యాయవాది , సమాజ సేవకులు , కమ్యూనిస్టు శ్రేయోభిలాషి శాంతి ప్రకాష్ శుక్లా దినకర్మ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న వారి ఇంటి వద్ద ఆయన సంస్మరణ సభను వారి కుటుంబ సభ్యులు , మిత్రులు , శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇటీవ్ సంస్మరణ సభకు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ అధ్యక్షత వహించారు సభ ప్రారంభానికి ముందు శాంతి ప్రకాష్ శుక్ల గారి చిత్రపటానికిఈ శుక్లా కుటుంబ సభ్యులతో పాటుగా సభకు హాజరైన వారందరూ ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.సంస్మరణ సభను ఉద్దేశించి జన విజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపన అధ్యక్షులు రామరాజు , సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు , సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు జలపాల శంకరయ్య , ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ , గీత, సీనియర్ పాత్రికేయులు తడుక విశ్వనాథంజన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సంపత్ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
