TRS Flag Festival Posters Released
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా పండుగల పోస్టర్ విడుదల
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ రక్షణ సేన (టి.ఆర్.ఎస్) పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు మరియు సిరిసిల్ల పట్టణంలో జెండా పండుగలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, మహిళలు, యువకులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రెస్ మీట్లో జిల్లా నాయకులు గుంటుక సంపత్, కుసుమ విష్ణు, సుధాకర్ శర్మ, సుమలత శర్మ, ఎల్లారెడ్డిపేట మండల నాయకులు వరద సతీష్ కుమార్, ఎండీ మజీద్ బాయ్, కదిరి భాస్కర్, కూర సురేష్, నూనె మల్లేష్ యాదవ్, కులేరు వినయ్, చెరుకుపల్లి శైలేజా తదితరులు పాల్గొన్నారు.
