Paddy Purchase in Petrol Bunk Sparks Concern
పెట్రోల్ బంకులో ధాన్యం కొనుగోల్…?
నాలుగు నెలలుగా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు బంద్
సొంత వ్యాపారాలకు నెలవుగా హెచ్ పి పెట్రోల్ పంప్…!!
కేసముద్రం/ నేటి ధాత్రి
పెట్రోల్ పంప్ ప్రాంగణంలో అధికారిక అనుమతి లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం నడపడం నిబంధనలకు విరుద్ధమే.
పెట్రోల్ బంకులు అత్యంత ప్రమాదకరమైన, పేలుడు సంభవించే ప్రాంతాలు( ఐ రిస్క్ జోన్) కాబట్టి, అక్కడ కస్టమర్ల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ధాన్యం నిల్వ చేయడం లేదా కొనుగోలు జరపడం భద్రతా పరంగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ దర్గా సమీపంలో ఉన్న హెచ్పి సిఎల్ పెట్రోల్ పంప్ నిర్వాహకులు పెట్రోల్ డీజిల్ నాలుగు నెలలుగా అమ్మకాలు నిలిపివేసి వాహనదారులకు సేవలు అందించాల్సిన పెట్రోల్ పంపులు సొంత వాణిజ్యసముదాయంగా మార్చేసిన తీరు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది,
పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు నిలిపివేసి, నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చడం పూర్తిగా చట్టవిరుద్ధం మరియు అత్యంత ప్రమాదకరం. ఇది హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ డీలర్షిప్ ఒప్పందాన్ని మరియు అగ్నిమాపక భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడం అవుతుందని పలువురు భావిస్తున్నారు.

నాలుగు నెలలుగా ఇంధన అమ్మకాలు నిలిపివేసి, పేరు పెట్రోల్ పంపు ఉన్నట్టుగా ఉత్తుత్తి పెట్రోల్ పంపు గా హెచ్ పి పెట్రోల్ పంపు పేరు మారు మ్మోగుతుందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పెట్రోల్ బంకులో పెట్రోల్ విక్రయాలు జరగాలని ఇలా సొంత వ్యాపారాలకు వినియోగించుకోవడం ధాన్యం కొనుగోలుకు వాడుతుంటే అది డీలర్షిప్ రద్దుకు దారితీసే తీవ్రమైన ఉల్లంఘన అవుతుందని పలువురు భావిస్తున్నారు. హెచ్ పి సి ఎల్
సేల్స్ ఆఫీసర్ మరియు సివిల్ సప్లైస్ అధికారులు ( డి ఎస్ ఓ) పెట్రోల్ బంక్ లో పెట్రోల్ విక్రయాలు జరపకుండా సొంత లాభాలు అర్జించేందుకు వ్యాపార సముదాయంగా మార్చడం పై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు వాహనదారులు కోరుకుంటున్నారు.
ఒక పెట్రోల్ పంపులో నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు నిలిపివేసి, ఇతర వ్యాపారాలు (ధాన్యం కొనుగోలు వంటివి) చేయడం చట్ట విరుద్ధమైన పనులని ప్రజలు భావిస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన నిర్వాహకులపై అధికారులు స్పందించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.
