`ఉండేదెవరో.. ఊడేదెవరో?
`త్యాగాలకు సిద్ధం కావాలి.. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి.

`రాహుల్ గాంధీని ప్రధాని ని చేయాలి.
`కాంగ్రెస్ దేశమంతా పూర్వ వైభవం చూడాలి.

`తెలంగాణ పునాదులు పడాలి.
`క్యాబినెట్ కూర్పు తోనే బీజం పడాలి.
`ఎంత మంది మంత్రులను మార్చుతారో అనే చర్చ జోరందుకున్నది!
`ఎన్నికల క్యాబినెట్ కూర్పు అత్యవసరం!
`ఎన్నికలకు రెండేళ్ల గడువే వుంది.
`అటు కారు వేగంగా దూసుకొస్తోంది.
`షెడ్డునుంచి బైటకు వచ్చేసింది.
`ప్రజాసమస్యల మీద పరుగులు పెడుతోంది.
`ఇటు కమల దళం కాచుకొని కూర్చుంది.
`ఈసారి తెలంగాణా లో పాగా పక్కా అని ప్రచారం జోరుగా సాగిస్తోంది.
`అమితాషా ఇక హైదరాబాద్ లో కూర్చుంటారన్న మాటలు బీజేపీ చెబుతోంది.
`చాప కింద నీరులా బీజేపీ బలం పెంచుకుంటోంది.
`ఎన్నికల నాటికి జనంలో సానుభూతి సంపాదించాలనుకుంటోంది.
`మరో వైపు కవిత కత్తి పట్టుకొని యుద్దానికి సిద్ధమాతోంది.
`ప్రజా సమస్యలు అస్త్రాలుగా చేసుకొని కదన రంగంలోకి దుకాబోతోంది.
`ఒక్క దెబ్బకు మూడు పిట్టలను కొట్టాలని చూస్తోంది.
`కన్న తండ్రినే ఎదిరిస్తున్నప్పుడు, ఎవరినీ వదిలిపెట్టక పోవచ్చు.
`చిన్న చితక పార్టీలు కూడా సమర నాదం మొగిస్తున్నాయి.
`వాటి ప్రభావం కూడా ఎన్నికల మీద పడొచ్చు.
`రేవంత్ సర్కార్ ఇరుకున పడొచ్చు. రాజకీయంగా ఇబ్బంది పడొచ్చు.
`తేరుకొక పొతే మొదటికే మోసం రావొచ్చు.
`మొహమాటానికి పొతే పాలన తెల్లారిపోవొచ్చు.
`మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే బలమైన క్యాబినెట్ అవసరం.
`ప్రజలను ప్రభావితం చేసే ఎమ్మెల్యే లు అత్యవసరం.
`జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే మంత్రులు కావాలి.
`ఇంత కాలం ఎలాగో గడిచింది.. రెండేళ్లు ఎంతో క్రియాశీలకం.
`మాటలే కాదు, చేతల మంత్రులు కావాలి.
`సమిష్టి నాయకత్వం మరింత బలపడాలి.
`ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలి.
`ప్రజలకు చేరువ కావాలి..
`ఇందిరమ్మ ఇండ్ల ఓట్లు గుండుగుత్తగా పడాలి.
`రైతు రుణ మాఫీ, బోనస్, ఉచిత బస్సు ఓట్లు రాల్చాలి.
`గత ఎన్నికలకన్నా ఎక్కువ సీట్లు సాదించాలి.
`రెండో సారి నేనే సిఎం అని చెప్పిన రేవంత్ శపదం నెరవేరాలి.
`మరోసారి తెలంగాణ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలో మంత్రి వర్గ పునర్ వ్యవస్ధీరణ జరగనుందా? మంత్రి వ ర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయా? కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఎంత మందిని సాగనంపుతారు? ఎంత మంది పదువుల్లో కొనసాగుతారు? ఎంత మంది పార్టీ బాద్యతలు చేపట్టాల్సి వుంటుంది. మంత్రులుగా పనిమంతులు ఎంత మంది? మంత్రి పదవుల్లో వున్నా న్యాయం చేయని వాళ్లెంత మంది? పార్టీ భవిష్యత్తుకు ఉపపయోగపడే వాళ్లు ఎంత మంది? కొత్తగా చేర్చుకోబోయేవారు ఎంత బలవంతులు? పార్టీ ఇచ్చిన హమీల మేరకు భర్తీ చేస్తారా? లేక ప్రస్తుత పరిస్దితులకు తగ్గట్టు మంత్రి వర్గ కూర్పును చేపడతరా? ఇలా అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల ముందున్నాయి. ఎట్టిపరిస్దితుల్లోనూ క్యాబినేట్ విస్తరణ వుంటుంది. ఆ విస్తరణతోపాటు పునర్ వ్యవస్ధీకరణ వుంటుంది. ఇది డిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయమైన సమచారం. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అదికారంలోకి రావాలి. రెండోసారి సిఎం. రేవంత్ రెడ్డి పాలన జరగాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి. రాహుల్ గాంధీ ప్రదాని కావాలి. ఇదీ సిఎం. రేవంత్‌రెడ్డి ýక్ష్యం. ఆ లక్ష్యం కోసం ముందుకు సాగాలంటే పార్టీ, ప్రభుత్వం మరింత బలంగా మారాలి. అందుకోసం నాయకులు కష్టపడాలి. కొంత మంది నాయకులు త్యాగాలకు సిద్దపడాలి. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పదవులు పొందాలంటే కొంత సిఎం. రేవంత్ ఆలోచనలకు తగ్గట్టు పనిచేయాలి. అప్ప్పుడు మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వుంటుంది. అనుకున్నట్లుగానే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. కేరళ లాంటి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ కాంగ్రెస్ సొంతం చేసుకున్నది. అంటే ప్రజల ఆలోచనల్లో పెద్దఎత్తున మార్పు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది దేశ వాప్తంగా కూడ జరగాలన్న లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 50 సంవత్సరాల పాటు ఎదురు లేకుండా పాలించిన కాంగ్రెస్‌కు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. గతంలో ఎన్నడూ చూడని పరిస్దితికి చేరుకున్నది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకప్ప్పుడు శాసించిన స్దాయిలో వున్న కాంగ్రెస్ ఇప్ప్పుడు సీట్లు ప్రాంతీయ పార్టీలను యాచించాల్సి వస్తోంది. ప్రాంతీయ పార్టీలను బతికించాల్సి వస్తోంది. తాను చస్తూ, ఇతరులను బతికించే త్యాగం చేయాల్సి వస్తుంది. దాని వల్ల అటు ప్రాంతీయ పార్టీలకు లాభం జరగడం లేదు. కాంగ్రెస్‌కు ఏమాత్రం మేలు చేకూరడం లేదు. అలా ఎంత త్యాగం చేసినా ప్రాంతీయ పార్టీల్లో విశ్వాసం లేదు. కాంగ్రెస్‌ను గెలిపించాలన్న కృతజ్ఞత ప్రాంతీయ పార్టీలకు అసలే లేదు. పరిస్దితులు అనుకూలిస్తే మేమే రాజ్యమేలాలని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. వాటికి జీవం పోస్తున్న కాంగ్రెస్ అదికారంలో కూర్చోబెట్టాలనుకోవడం లేదు. దాంతో కాంగ్రెస్ చేస్తున్న త్యాగానికి అర్ధం లేకుండాపోతోంది. విలువ అసలే లేకుండా పోతోంది. అయినా కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా పటిష్టమైన యంత్రాంగం వుంది. దేశంలో ప్రతి ఊరిలోనూ ఓటు బ్యాంకు వుంది. దశాబ్దాలుగా అది చెక్కు చెదరకుండా వుంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇంకాస్త ఓటు బ్యాంకు పెంచుకుంటే చాలు. అది మర్చిపోయి ప్రాంతీయ పార్టీలను శరణు కోరడం, వాటికి బలం పెంచడం కాంగ్రెస్‌కు మొదటికే మోసం వస్తోంది. అందుకే కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని త్యాగాలకు సిద్దమైతే దేశంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం తెలంగాణ నుంచే మొదలౌతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు. దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుంది. ఉత్తరాదిన ఎంతో కొంత బలపడేందుకు వీలు కల్గుతుంది. మొత్తం మీద కేంద్రంలో అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమౌతుంది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు వున్నాయి. ఆ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ఒంటరిపోరుకు సిద్దమైతే చాలు కాంగ్రెస్‌కు మంచి రోజులు వచ్చినట్లే. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ మెరుగైన సీట్లు సాధిస్తే చాలు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం. అలా దక్షినాధి, ఉత్తరాధి నుంచి ఓట్లను సునామీలా సంపాదించొచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయవచ్చు. అందుకోసం తెలంగాణలో మళ్లీకాంగ్రెస్రావాలి. అందుకే యుద్ద ప్రాతిపదికన మంత్రి వర్గ విస్తరణ, పునర్ వ్యవస్ధీకరణ, శాఖల మార్పు, కొత్త వారితో కూర్పు అన్నీ ఏక కాలంలో చేయాలని సిఎం. రేవంత్ రెడ్డి గట్టినా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించి, రెండోసారి తానే సిఎం. అవుతానని రేవంత్‌రెడ్డి అంటున్నారంటే ఆయన ఆత్మ విశ్వాసానికి అందరూ జేజేలు కొట్టాల్సిందే. అంతే కాదు అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ మాట మాట్లాడడం అంటే ఎంతో ధైర్యం కావాలి. అదిష్టానం నుంచి పూర్తి మద్దతు కావాలి. అలా పార్టీ పెద్దలను మద్దతు లేకుండా ఏ కాంగ్రెస్ నాయకుడు ఆ మాట చెప్పలేరు. ఈ లెక్కన సిఎం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్చను ఇచ్చిందనే అనుకోవాలి. అందుకే ఆయన పదే పదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో లుకలుకలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ సిఎం. పదవి మీద ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు బలంగా పంపుతున్నారు. పార్టీకి ఇబ్బందికరమైన పరిస్దితులు తేవొద్దని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే బాధ్యతనాది అని మంత్రులకు సైతం ఆయన చెప్పకనే చెబుతున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు బ్రాండ్‌గా సిఎం. రేవంత్ రెడ్డి మారిపోయారు. కాంగ్రెస్ అంటే రేవంత్, రేవంత్ అంటే కాంగ్రెస్ అన్నంతగా ఆయన పార్టీని శాసించే స్ధాయికి చేరుకున్నారు. అంతలా పార్టీ అధిష్టానానికి సిఎం. రేవంత్ నమ్మకం కల్గించారు. అందుకే సిఎం. రేవంత్‌రెడ్డి నిర్ణయాలను అదిష్టానం కూడా స్వాగతిస్తోంది. పూర్తి స్వేచ్ఛను కల్పిస్తోంది. రేవంత్ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు కావడానికి ఆనాడు పార్టీ పెద్దలను ఎలా కన్విన్స్ చేయగలిగారో తెలియంది కాదు. ఇప్ప్పుడు అంతకు మంచి ఆయన పార్టీ పెద్దలను భరోసా కల్పిస్తున్నారు. ఈ మÖడేళ్ల కాలంలో కూడా అంత తానై పాలన సాగిస్తున్నారు. ఎన్నికల ముందు మÖడేళ్ల పాటు అన్నీ తానై పార్టీని నడిపించారు. పార్టీలో ఆనాడు ఎదురైన సమస్యలను అలవోగకగా అధిగమిస్తూ వచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. ఏ చిన్న అలజడి వచ్చినా ప్రతి కుటుంబంలో కలతలు కామన్ అనేలా చెప్ప్పుకుంటూ వచ్చారు. అటు ఇంట, ఇటు బైట రాజకీయాలను సమర్ధవంతగా ఎదుర్కొన్నారు. నాడు కేసిఆర్‌కు నిద్రలేకుండా చేశారు. పార్టీ నాయకులను తన అదుపాజ్ఞలో పెట్టుకుంటూ వచ్చారు. కోవర్టులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ పనిచేయకపోయినా సరే తన రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఉద్యమాలు, పోరాటాలు, జైలుజీవితాలు కూడా అనుభవించారు. ప్రజల్లో ప్రశ్నించే గొంతుక అనే పేరు సార్ధకం చేసుకున్నారు. ప్రజలకు చేరువయ్యారు. ప్రజా గొంతుకయ్యారు. నాడు బిఆరఎస్ పాలనా వైఫల్యాలను, అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని చీల్చి చెండాడారు. ప్రజల్లో బిఆరఎస్ అంటే హేయ్య భావం కలిగేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కలిగేలా రాజకీయం చేశారు. ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సిఎం అయిన తర్వాత ప్రజా రంజక పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాల హడావుడి తప్ప ప్రజల్లో ఎలాంటి వ్యతిరకత లేదు. ఇలాంటి సమయంలో మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేకపోతే ఐదేళ్ల సంక్షేమ పాలనకు అర్దం లేకుండాపోతుంది. అందుకే ఎన్నికల క్యాబినేట్ కూర్పు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికల క్యాబినేట్ రూపకల్పన జరుగుతోంది. కొంత మంది మంత్రులు త్యాగాలు చేయాల్సిన సమయం కూడా వచ్చింది. పార్టీ కోసం ఆ నాయకులు పని చేసే తరుణం వచ్చింది. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం వుంది.
