`ఆదరించిన కాంగ్రెస్ కె సున్నం పెట్టిండ్రు!
`కాంగ్రెస్ ను లేకుండా చేసి అధికారం లోకి రావాలనుకున్నారు.
`ఓ వైపు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తూనే మరో వైపు కత్తి దూసిండ్రు.
`కాంగ్రెస్ తో కలిసిన్నంత కాలం పార్లమెంట్ లో కూడా ప్రతినిధ్యం వహించారు.
`ఎదుగుతున్న బీజేపీ ని చూసైనా కళ్ళు తెరవలేదు.
`బీజేపీ వస్తే ఈ మాత్రం ఉనికి కూడా ఉండదని గ్రహించ లేకపోయారు.
`విదేశీ గడ్డలపై కూడా రాజకీయ పాఠాలు చెప్పి వచ్చేవారు.
`కాంగ్రెస్ కాలంలో అంత స్వేచ్ఛగా రాజకీయాలు చేశారు.
`తమ అవకాశ వాద రాజకీయాల మూలంగా బీజేపీ పెరుగుతుందని అంచనా
వేయలేక పోయారు.
`బీజేపీ పెరుగుతున్న కొద్ది కనుమరుగవుతూ వచ్చారు.
`ఇప్పుడు ఉనికి కూడా లేకుండా కొట్టు మిట్టాడుతున్నారు.
`రెండుగా చీలి ఆనాడే మొదటికే మోసం తెచ్చుకున్నారు.
`ఇప్పుడు కలిసిపోదామనుకునే సరికి దిక్కు దివాణం లేకుండా పోయారు.
`వున్న కేరళను కూడా కోల్పోయారు.
`49 సంవత్సరాల తర్వాత ఎక్కడా అధికారం లేకుండా చేసుకున్నారు.
`ఎర్ర జెండా ముసుగులో ఎప్పుడో చిలికలు పీలికలయ్యారు.
`కమ్యూనిస్ట్ పార్టీలుండేవి అని చెప్పుకునే దశకు చేరుకున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రశ్నించడమంటేనే ఒకప్ప్పుడు కమÖ్యనిజం అనుకునేవారు. ఆ దశ ఎప్ప్పుడో దాటిపోయింది. ప్రశ్నించే స్దాయి నుంచి కనుమరుగయ్యే స్దాయికి దిగజారిపోయింది. ఇదంతా కమÖ్యనిస్టులు చేసుకున్న స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు. కమÖ్యనిజనాన్ని జనం వద్దనుకోలేదు. జనం కాదనుకోలేదు. కాని కమÖ్యనిజం ముసుగులో కొంత మంది నాయకులు చేసిన రాజకీయం మÖలంగా నిజా నిజాలు ఒక్కొక్కటిగా బైట పడుతూ వచ్చాయి. ఒకప్ప్పుడు కమÖ్యనిస్టు నాయకులు తమ ఆస్ధులను ప్రజలకు పంచారు. కాని తర్వాత తరం నుంచి కమÖ్యనిస్టులు ఆస్ధులు పెంచుకోవడం మొదలు పెట్టారు. అందులో ముఖ్యంగా నక్సలిజం వచ్చిన తర్వాత కూడా అసలైన కమÖ్యనిస్టులకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. కమÖ్యనిస్టులను ఏకంగా నక్సలైట్లు వెలివేసేంత దాకా వచ్చింది. కమÖ్యనిస్టులలో వామ పక్షాలు అనే శాఖలుగా చీలిపోయింది. ఏడు పార్టీలుగా మారిపోయింది. కమÖ్యనిస్టులలో కమÖ్యనిస్టులకే పడకుండాపోయింది. కమÖ్యనిజం బావాలలో మార్పులు వచ్చాయి. పార్టీలుగా విడిపోయాయి. దాంతో వారిలో వుండాల్సిన ఐక్యత కనుమరుగైపోయింది. మొదట దేశంలో ఒక పార్టీగా వున్న కమÖ్యనిస్టులు 1964లో రెండుగా చీలిపోయారు. తర్వాత ఏడు పార్టీలుగా విడిపోయారు. కాకపోతే ప్రధానంగా ప్రజల్లో వున్నవి మాత్రం రెండే కమÖ్యనిస్టు పార్టీలు. ఆ రెండు కమÖ్యనిస్టు పార్టీలలో కూడా ఐక్యత ఏనాడు లేదు. సిపిఐ బలంగా వున్న రాష్ట్రాలలో సిపిఐఎంను అణిచివేశారు. సిపిఐఎం బలంగా వున్న చోట సిపిఐకి స్దానం లేకుండా చేసుకున్నారు. విడిపోవడం అనేది చారిత్రాత్మక తప్పిదం అని ఒక దశలో తెలుసుకున్నారు. కలిసి పోదామనుకున్నారు. కాని నాయకుల మధ్య వున్న విభేదాý మÖలంగా పదవుల పోగొట్టుకోవడం ఇష్టం లేక కలిసిపోలేదు. మళ్లీ ఒక్కటి కాలేదు. ఇప్ప్పుడు కాలగర్భంలో కలిసే పరిస్తితి దాకా తెచ్చుకున్నారు. అంతెందుకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఉభయ కమÖ్యనిస్టు పార్టీలు ఎంతో కొంత బలంగానే వుండేవారు. ఎప్ప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందో అప్ప్పుడు సిపిఐ తెలంగాణ వాదంకు అనుకూల నిర్ణయం తీసుకున్నది.. ఎ ందుకంటే తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం చేసిన పార్టీగా సిపిఐకి తెలంగాణలో మంచి పేరుంది. తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసింది. కాని అప్పటికి సిపిఎం లేదు. రెండుగా అప్పటికి కమÖ్యనిస్టులు చీలిపోలేదు. కాని తెలంగాణ ఉద్యమ సమయంలో సిపిఎం మాత్రం సమైక్యవాదాన్ని ఎంచుకున్నది. అదేంటోగాని సమైక్య వాదం ఎంచుకున్న సిపిఎం ఏపిలో పూర్తిగా అడ్రస్ లేకుండాపోయింది. కనీసం తెలంగాణ ఉద్యమానికి సపోర్టు చేసినా తెలంగాణలో ఎంతో కొంత నాయకత్వం కనిపించేది. ఇప్ప్పుడు సిపిఎం. తెలంగానలోనూ లేక, ఏపిలోనూ లేకుండాపోయింది. తెలంగానలో సిపిఐ అనేది ఉనికిలో వుంది. దేశం విషయానికి వస్తే ఉత్తరాదిలో బెంగాల్, త్రిపుర వంటి రాస్ట్రాలో, ఈశాన్య రాష్ట్రాýలో కమÖ్యనిస్టు పార్టీలు బలంగా వుండేవి. ఎర్రజెండాల రాజకీయం ఎప్ప్పుడూ కనిపించేది. దక్షిణాది విషయానికి వస్తే కేరళంలో సిపిఎం నిన్నటి ఎన్నికల దాకా అదికారంలో వుంది. పశ్చిమబెంగాల్లో జ్యోతిబసు సుమారు 24 సంవత్సరాల పాటు ఏక ధాటిగా ముఖ్యమంత్రిగా వుండి చరిత్ర సృష్టించారు. ఎప్ప్పుడైతే వయోభారంతో జ్యోతిబసు సిఎం పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి బెంగాల్లో సిపిఐ ఉనికి లేకుండాపోయింది. మమత బెనర్జీ రాజకీయాలకు పూర్తిగా కనుమరుగైపోయింది. యాభై సంవత్సరాల తర్వాత ఇప్ప్పుడు కేరళలో కూడా కమÖ్యనిస్టులు ఓడిపోయారు. చరిత్రలో ఉనికి లేకుండా చేసుకున్నారు. ఇక్కడ కమÖ్యనిస్టులు చేసిన అతిపెద్ద పొరపాటు అన్నం పెట్టిన పార్టీలకే సున్నం పెట్టడం అనేది ఆ పార్టీలకు వెన్నతోపెట్టిన విద్యలా మారిపోయింది. ప్రజల పక్షం, ప్రజా పక్షం అంటూ మాటలు చెప్పడం, నాయకుల ఇష్టారాజ్యం అనేలా ఆ పార్టీల వ్యవహారం సాగింది. అందుకే దేశంలో ఉనికి కోల్పోతూ వచ్చింది. ఏది ఏమైనా స్వాతంత్య్ర కాలం నుంచి కూడా కమÖ్యనిస్టులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూనేవచ్చింది. ఏనాడు పూర్తిగా ఆ పార్టీని వైరి పక్షంగా చూసుకోలేదు. సమయం, సందర్భం వచ్చినప్ప్పుడల్లా కమÖ్యనిస్టు పార్టీలకు కాంగ్రెస్ తోడుగా నిలుస్తూవచ్చింది. పొత్తుల రూపంలో పదవులు కమÖ్యనిస్టు పార్టీలు అందుకునేందుకు దోహదం చేసింది. కాని ఆ విశ్వాసం కమÖ్యనిస్టులకు లేకుండాపోయింది. కాపాడుతున్న కాంగ్రెస్‌నే కాటేయాలని అనేక సార్లు చూశారు. ఎన్నికల ముందు పొత్తులు, గెలిచాక జిత్తులు చేయడం కమÖ్యనిస్టులకు అలవాటుగా మారింది. అయినా కాంగ్రెస్ ఏనాడు కమÖ్యనిస్టుల నిర్మూలన అనే నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ తో పొత్తులు లేకుండా దేశంలో విస్తరించాలని చాలా సార్లు చూశారు. కాని ప్రజలు అంగీకరించలేదు. కాంగ్రెస్‌ను కాదని కమÖ్యనిస్టులను ప్రజలే నెత్తిన పెట్టుకోలేదు. ఇప్ప్పుడు బిజేపి సినీ రంగాన్ని నమ్ముకొని సినిమాలు తీస్తున్నట్లు ఒక దశలో కమÖ్యనిస్టులు ఎర్ర సినిమాలు విపరీతంగా తీశారు. దాంతో పోలిస్తే బిజేపి నమ్ముకున్న సినిమాల సంఖ్య చాల తక్కువ. అదే కమÖ్యనిస్టులు చైతన్యం పేరుతో తీసిన సినిమాలు కొన్ని వందలున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు సినిమాలు నిర్మాణం చేస్తూ వచ్చారు. అలా ఒక దశలో ఎర్రసినిమాలు వరదలా వచ్చాయి. ప్రజలు సినిమాను సినిమాగానే చూశారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎర్ర సినిమాల ప్రభావం మÖలంగా ఎంతో మంది యువకులు అడవుల పాలయ్యారు. కమÖ్యనిస్టు పార్టీల ఎర్ర సినిమాలో చూపించే హీరోయిజం నిజమని నమ్మి మోసపోయారు. కొన్ని వేల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. సమాజమంటే ఏమిటో తెలియని వయసు, వ్యవస్ధ అంటే తెలియని వాళ్లను కూడా పాటలు, సినిమాలతో ఆకర్షించి అడవుల పాలయ్యేలా చేశారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్లంతా ఎంతో మంది యువకులతో సమాంతర వ్యవస్ధ సృష్టించాలనుకున్నారు. అప్పటికీ దేశంలో కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు జనజీవన స్రవంతిలోకి వచ్చి, ఎన్నికల రాజకీయాల్లో పాలుపంచుకోవాలని కూడా చెప్పారు. అంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ కమÖ్యనిస్టులను కోరినా పెడ చెవిన పెట్టారు. ఇప్ప్పుడు బిజేపి చేతిలో కనీసం పేరు వినిపించకుండా చేసుకున్నారు. ఉభయ కమÖ్యనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వున్నంత కాలం అటు రాష్ట్రాలలో, ఇటు కేంద్రంలో ఎంతో కొంత క్రియాశీల ప్రాదాన్యమే కలిగి వుండేది. అయినా కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంలా తయారై కాంగ్రెస్ ఓటమి కోసం కమÖ్యనిస్టులు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో బిజేపి ఎదుగుతున్న సంగతిని కూడా మర్చిపోయారు. మÖడో పార్టీ వచ్చి కమÖ్యనిస్టుల స్దానాన్ని కైవసం చేసుకొని, ప్రత్యామ్నాయ శక్తిగా మారితో తమకే ఎసరొస్తుందని గ్రహించలేదు. పైగా బిజేపి దేశంలో బలపడితే తమ ఉనికి కూడా ప్రశ్నార్ధకమౌతుందని తెలిసినా మేలుకోలేదు. కాంగ్రెస్ కాలంలో అంత స్వేచ్చగా రాజకీయాలు చేసినా తృప్తి లేకుండాపోయింది. కమÖ్యనిస్టుల అవకాశవాద రాజకీయాలు తమ కొంప ముంచుతాయని అంచనా వేయలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిజేపి పెరుగుతూ వస్తున్న కొద్ది కమÖ్యనిస్టులు కనపడకుండా పోతూ వచ్చారు. కమÖ్యనిస్టులు రెండుగా చీలిన నాడే మొదటికే మోసం తెచ్చుకున్నారు. వామపక్షాల పేరుతో చీలికలు పీలికలైన నాడే అంతానికి దారులు వేసుకున్నారు. ఇప్పటికైనా ఒక్కటౌదామా? అనుకునే సమయానికి దిక్కుదివానం లేకుండాపోతున్నారు. ఆఖరుకు మిగిలిన కేరళం కూడా కోల్పోయారు. ఒకప్ప్పుడు కమÖ్యనిస్టులు వుండేవారు అని చెప్ప్పుకునే దశకు చేరుకున్నారు. అయినా ఇప్పటికి ఎక్కడో అక్కడ ఒకటో, అరో సీటు ఇంకా కమÖ్యనిస్టుల ఖాతాలో పడుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ, తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీలే…ఇప్పటికైనా కమÖ్యనిస్టులు తేరుకొని కాంగ్రెస్‌కు తోడుగా నిలిస్తే తప్ప ఈ మాత్రం జెండాలైనా కనిపిస్తున్నాయి. లేకుంటే ఎర్ర జెండా అనేది కనుమరుగైపోతుంది. శ్రామిక శక్తి వున్నంత వరకు ఎర్ర జెండాకు తిరుగులేదని ఒకప్ప్పుడు గొప్పలు చెప్ప్పుకునేవారు. ఇప్ప్పుడు కార్పోరేట్ సమాజంలో ఎర్రజెండాకు చోటు లేదు. ఇకనైనా మారండి. జనం ఆలోచనలకు తగ్గట్టు రాజకీయం చేయండి.
