Farmer Attempts Suicide Over Caste Boycott
మనస్థాపంతో గడ్డి మందు తాగిన రైతు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో కుల బహిష్కరణ మనస్థాపనతో గడ్డి మందు తాగిన రైతు పత్తిపాక గ్రామంలో చోటుచే సుకుంది. వివరాలకు వెళితే గ్రామానికి చెందిన బాబు ఐలన్న యాదవ కులానికి చెందిన వాడు తన పెద్ద కుమారుడు వేరే కులం చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడని వారి కుల పెద్దలు కులబహిష్కరణ చేశా రని మనస్థాపన చెంది గడ్డి మందు త్రాగడం జరిగింది బాబు ఐలన్నను 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ప్రధమ చికిత్స చేస్తూ ఈఎంటి అనిల్ పైలెట్ కేదారి ఆసుప త్రికి తరలించారు.
