Hindu Sammelan Campaign Launched
ఘనంగా ‘హిందూ సమ్మేళనం’ ప్రచార గోడ పత్రికల ఆవిష్కరణ
హిందూ పరిరక్షణే ద్యేయంగా…
హిందూ సమ్మేళనం విజయవంతం చేద్దాం
కేసముద్రం/ నేటి ధాత్రి
స్థానిక కేసముద్రం మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన భారీ “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేసముద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో సమ్మేళనానికి సంబంధించిన ప్రచార సామగ్రిని గోడ పత్రికను నిర్వాహకులు అభయాంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ చేతుల మీదుగా. ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సమ్మేళనం సభ్యులు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు , ఫ్లెక్సీలు మరియు వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ గోడ పత్రికల ద్వారా గ్రామాలలోని హిందూ బంధువులందరికీ సమాచారం చేరవేసి, సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక హిందూ బంధువులు, ధర్మ పరిరక్షకులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు మరియు సమ్మేళనం నిర్వహణ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
