Farmers Advised to Follow Scientists
రైతులు శాస్త్రవేత్తల సూచనలను వినియోగించుకోవాలి
నడికూడ,నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో,వ్యవసాయ శాఖ సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడం, పంటల దిగుబడులు పెంచడం,ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పీజేటీఎస్ఏయూ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గ్రామ స్థాయిలో రైతులను కలుసుకుని,పంటల నిర్వహణ,పంటల సస్య రక్షణ,నీటి నిర్వహణ,నేల ఆరోగ్యం,విత్తనాల ఎంపిక వంటి అంశాలపై సలహాలు అందిస్తారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలు సూచించబడతాయి.ఈ కార్యక్రమం మన నడికూడ మండలంలోని వివిధ గ్రామాలలో ఈ క్రింద సూచించిన తేదీలలో నిర్వహించబడును.29-04-2026 – రాయపర్తి
02-05-2026 – వరికోలు
05-05-2026 –కంఠత్మకూర్
08-05-2026 – కౌకొండ
14-05-2026 –ముస్తాలపల్లి
16-05-2026 – నార్లాపూర్
20-05-2026 – ధర్మారం
22-05-2026 – నడికూడ
కావున రైతు సోదర సోదరీమణులు,ప్రజా ప్రతినిధులు,అనుబంధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రవేత్తల సూచనలను వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి పోరిక జై సింగ్ తెలిపారు.
