Chandrababu Naidu Birthday Celebrated in Chittoor
*పిల్లలకు ఒత్తిడి లేని విద్యనందించాలి…
*ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సతీమణి రేణుకా రెడ్డి…
పలమనేరు(నేటిధాత్రి:
ప్రస్తుత విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతున్నారని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి పేర్కొన్నారు.
గంగవరం మండలంలో ప్రీ ఆన్ ఫ్యూచర్ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలను ప్రారంభించారు.
వినూత్నమైన ప్లే-బేస్డ్ ఎర్లీ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ప్రారంభించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఆటల ద్వారా సాగే ఈ విద్యా విధానం పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, శారీరక మరియు మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్ మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె వివరించారు. ఈ విధానం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారని, భవిష్యత్తులో వారికి ఎటువంటి అలవాట్లు లేకుండా మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకుని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆమె కోరారు. అనంతరం పాఠశాల నిర్వాహకురాలు మౌనికకు మరియు ఆమె బృందానికి అభినందనలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డి పల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
