RTC Bus Demand from Tekumatla to Bhupalpally
టేకుమట్ల టు భూపాలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చిన మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
టేకుమట్ల మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజల జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమే డి ఎం తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తానని అన్నారు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐ సి డి ఎస్ ఆఫీస్ ఉందని తక్షణమే ఉపయోగం లోకి తేవాలని గతంలో ఇక్కడే అంగన్వాడి కార్యకర్తల ఆయా కార్యకర్తల మీటింగ్లు సమావేశాలు జరిగేవని ఈ ఆఫీసును జిల్లా కేంద్రానికితరలించడం వలన అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఇక్కడికి తరలించాలని ఆయన దృష్టికి తీసుకుపోగా తరలిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కి పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
