`“పరాక్వాట” నిషేధం.. రేవంత్ సర్కార్ గొప్ప నిర్ణయం.
`జీవో నంబర్ 24 జారీ!
`సీఎం రేవంత్ కు తెలంగాణ సమాజం రుణపడి వుంటుంది.
`ఎక్కడా దొరకకుండా కఠినంగా చుస్తే తెలంగాణ సమాజం మరింత సంతోష పడుతుంది.
`పరక్వాట్ చేనుకు చేసే మేలుకన్నా రైతుకు చేసే చేటు ఎక్కువ.
`ఏటా పరక్వాట్ కాటుకు వేలాది మంది రైతులు బలి.
`ఒక్క తెలంగాణ లోనే వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోయాయి.
`కేంద్ర ప్రభుత్వం ఈ గడ్డి మందును నిషేదించాలని డిమాండ్.
`రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి నిషేధ అధికారం లేదు.
`కేవలం 2 నెలలు మాత్రమే నిషేధం విధించే అధికారం.
`ప్రతి రెండు నెలలకోసారి నిషేధం పొడిగించాల్సి వస్తుంది.
`ఆస్ట్రెలియా, చైనా నుంచి దిగుమతి నిషేధం కేంద్రం విధించాలి.
`రాష్ట్రంలో వున్న అన్ని షాపులలో తనిఖీలు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
`పేద రైతులు కలుపు ఖర్చులు తట్టుకోలేక గడ్డి మందు మీద ఆధారపడుతున్నారు.
`అతి తక్కువ ఖర్చుతో వస్తుందని అనుకుంటున్నారు.
`ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమని తెలిసినా వినియోగిస్తున్నారు.
`అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు.
`వ్యవసాయం కూడా ప్రమాదకరం చేసుకుంటున్నారు.
`కలుపు కూలీలకు ఆర్థిక స్తొమత సరిపోక గడ్డి మందు వినియోగిస్తున్నారు.
`ప్రాణాలకన్నా ఏది విలువైంది కాదు.
`ప్రాణం పొతే తిరిగి వచ్చేది కాదు.
`ఏమర పాటు కూడా గడ్డి మందు వల్ల ప్రాణాలు పోతున్నాయి.
`గడ్డి మందుకు విరుగుడు కూడా లేదు.
`ఆర్థిక, కుటుంబ సమస్యలు ఎదుర్కునే రైతు ప్రాణం తీసుకోవడానికి తాగుతున్నారు.
`వాసనకే చనిపోతున్న రైతులు ఒక వైపు..
`జీవితం మీద విరక్తితో కొంత మంది గడ్డి మందు సేవించి ప్రాణాలు తీసుకుంటున్నారు.
`తెలంగాణ ప్రభుత్వం నిషేధం తెచ్చి మంచి ప్రయత్నం చేసింది.
హైదరాబాద్, నేటిధాత్రి:
రైతులు ప్రాణాలను బలిగొంటున్న గడ్డి మందును రేవంత్ సర్కార్ నిషేదించింది. ఇకపై రైతులు ఆ గడ్డి మందును వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా డీలర్లు ఈ మందును కొనుగోలు చేయడం గాని, సరఫరా చేయడం గాని, రైతులకు విక్రమించడాలు కాని చేయెద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం జీవో. నెంబర్.24 జారీ చేసింది. రైతుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది. దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఈ మందును కలుపు నివారణ కోసం రైతుల పొలలకు వినియోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతులు కలుపు నివారణ కోసం వాడుతున్న గడ్ది మందు పరాక్వాట్. కొన్ని సంవత్సరాలుగా ఈ మందును రైతులు కలుపు నివారణ కోసం పిచికారి చేస్తున్నారు. ఈ మందు వల్ల మంచి కన్నా, నష్టమే ఎక్కువ అని రైతులకు తెలుసు. అంతే కాదు ఆ మందు కీడును తలపెడుతుందని తెలుసు. ఆ మందు వాసన చూస్తేనే మనుషులకు అత్యంత ప్రమాదమని తెలుసు. ఆ మందును పిచికారి చేయడానికి రైతులు తమ ముక్కుల్లోకి కనీసం గాలి దూరనంత తువ్వాలు కట్టుకొని మరీ పిచిరారీ చేస్తారు. ఏ మాత్రం ఆ మందు తుంపరలు ముక్కుల్కోకో, కళ్లలోకో వెళ్లినా ఎంతో ప్రమాదం. ప్రాణాలు గాలిలో కలిపోతాయి. అయినా రైతుకు తప్పదు. ఎందుకంటే రైతు కష్టం పగవాడికి కూడా రావొద్దంటారు. ఆ మందును కొంత మంది రైతులు కలుపు నివారణ కోసమే కాకుండా, బాదల నుంచి జీవితాలను విముక్తి చేసుకోవడానికి కూడా వాడుతున్నారంటే ఎంత దయనీయ పరిస్దితో కూడా అర్దం చేసుకోవచ్చు. ఈ మందు మీద దేశ వ్యాప్తంగా అనేక ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు బ్యాన్ చేయాలిన నిరసనలు తెలియజేస్తున్నాయి. రైతుల ప్రాణాలను బలిగొంటున్న ఈ గడ్డి మందు మూలంగా లాభం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఆ మందును పిచికారి చేసి, వచ్చిన రైతు బతుకుతాడో లేదో కూడా తెలియనటు వంటి పరిస్థితులున్నాయి. అలాంటి మందును బ్యాన్ చేయాలని డిమాండ్ వుంది. కాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానిపై దష్టి పెట్టలేదు. రైతుల ప్రాణాలు పోతున్నాయని తెలిసినా దాని గురించి ఆలోచించలేదు. ప్రత్యామ్నాయ మందులను గుర్తించలేదు. దేశ వ్యాప్తంగా ఈ మందునే రైతులు పొలలకు వినియోగిస్తున్నారు. అయితే ఈ మందు నిషేదం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. దానిని పూర్తిగా రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. వ్యవసాయ శాఖ అనేది ఉమ్మడి జాబితాలో వున్నది. అందువల్ల కేంద్రం జోక్యం లేకుండా ఆ గడ్డి మందు మీద చర్చలు తీసుకోవడానికి గత ప్రభుత్వం చొరవ చూపలేదు. అయితే రైతుల ప్రాణాలను దష్టిలో పెట్టుకొని రేవంత్ సర్కార్ కఠినమైన నిర్ణయం తీసుకున్నది. ఈ మందును రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీకుంటామని రేవంత్ సర్కార్ హెచ్చరిస్తోంది. కాకపోతే ఈ మందు నిషేదం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు నెలలు మాత్రమే రద్దు చేయగలదు. అందువల్ల ప్రతి రెండు నెలలకోసారి ఈ మందు రద్దుపై నిర్ణయం తీసుకుంటారు. నిషేదం విదిస్తూ వుంటారు. రెండు నెలలు గడువు తీరిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయినా ఇబ్బంది ఎదురౌతుంది. అందువల్ల ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఉన్నతాదికారులు దీనిపై దష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ఈ రెండు నెలలు నిజానికి రైతులకు ఈ గడ్డి మందు ఉపయోగం వుండదు. కాని రెండు నెలల తర్వాత వర్షాలు పడి, సాగు మొదలు పెడితే మళ్లీ రైతులు ఈ మందు కోసం ఆలోచిస్తారు. దానిని కొనుగోలు చేస్తారు. ఆ లోపు ఈ మందు వాడకంపై ప్రజల్లో చైతన్యం కల్గించాలి. ఆ మందును వినియోగించొద్దని సూచనలు చేయాలి. దానిపై పెద్దఎత్తున ప్రచారం చేయాలి. రాష్ట్రంలోనే అందుబాటులో లేకుండా చూసుకోవాలి. పక్క రాష్ట్రాల నుంచి రైతులు తెచ్చుకోకుండా చూసుకోవాలి. అందుకోసం నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేయాలి. లేకుంటే ఈ మందు రాష్ట్రంలో రాకుండా ఆపడం కష్టసాధ్యమౌతుంది. రైతులు వాడకుండా చూసుకునే బాధ్యత నిర్వర్తించినట్లౌవుంది. గడ్డి మందు అనేది కలుపు తీయడం కోసం వినియోగించుకునే అవసరమైంది. దాని ఖరీదు కూడా చాల తక్కువ. ఇతర పురుగు మందులకన్నా చాలా చౌక. కేవలం రూ.200 రూపాయలతో ఈ మందు కొనుగోలు చేసి, ఏకరం పొలానికి పిచికారి చేస్తారు. దాంతో రైతుకు కలుపు నివారణ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. పేద రైతులైనా, పెద్ద రైతులైనా సరే కలుపు నివారణ కోసం గతంలో కూలీలను వినియోగించుకునేవారు. రైతు కూలీలు ఆ గడ్డిని తొలగిస్తూ వుండేవారు. అలా కొన్ని రోజుల పాటు కూలీలను రప్పించుకొని కలుపు తీయించుకునేవారు. అది కొంత ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చు తప్ప్పుతుందని రైతులు భావించి, ఈ గడ్డి మందును వాడుతున్నారు. పైగా ఇటీవల రైతు కూలీలు దొకడం కష్టమైపోయంది. ఉపాధి హమీ పనుల మూలంగా రైతులకు కూలీలు దొరకడం కష్టమైపోయంది. ఉపాధి హమీ లేని సమయంలో రైతు కూలీలుగా మహిళలు గ్రామాల్లో పొలం పనులు ఎక్కువగా చేస్తుండేవారు. నాట్లు వేయడం, కలుపు తీయడం, కోత కోయడం, తూర్పార పట్టడం వంటి పనులతో కూలీలు బిజీగానే వుండేవారు. ఎప్ప్పుడైతే ఉపాధి హమీ పథకం అమలు మొదలైందో అప్పటి నుంచి పొలం పనులకు రైతు కూలీలు దొరకడం కష్టమైపోయింది. పేద ప్రజలకు పనులు లేక, పల్లెల్లో పస్తులుంటున్నారని తెలిసి, గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకం తెచ్చింది. దాని వల్ల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగింది కూడా వాస్తవమే. కాని కొండ నాలుకు మందేస్తే వున్న నాలుక ఊడిపోయినట్లైంది. ఉపాధి హమీ పనులకు అలవాటు పడిన కూలీలు, పొలం పనులకు వెళ్లడం మానేస్తున్నారు. దాంతో వరి నాట్ల నుంచి మొదలు, కలుపుకు మందు వాడుతూ, కోతలకు కూడా మిషన్లు వచ్చేశాయి. ఇలా రైతులకు మేలు జరుగుతున్నా, కలుపు విషయంలో మాత్రం గడ్డి మందు ప్రాణాల మీదకు తెస్తోంది. అందుకే ఏది ఏమైనా సరే, రైతుల ప్రాణాలే తమకు ముఖ్యమని రేవంత్ సర్కారు గడ్డి మందు మీద నిషేదం విధించింది. గడ్డి మందును రైతుల వాడకుండా చూడాలని చెబుతోంది. ప్రాణం కన్నా ఈ ప్రపచంలో ఏదీ విలువైంది కాదు. బతకడానికి అవసరమైన ఆహారం పండించే క్రమంలో గడ్డి మందును సాగులో వినియోగించి రైతులు ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోవడం నిజంగా బాదాకరం. ఒకప్ప్పుడు పంటలు చేతికి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. కాని ఇప్ప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కలుపు మందు మూలంగా రైతుల ప్రాణాలపోవడం అత్యంత విషాదకరం. అందుకే రేవంత్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నది. అన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్కు ప్రశంసలు అందుతున్నాయి. రైతులు ప్రాణాల కాపాడే ప్రయత్నం గొప్ప రైతు విజయమని అంటున్నారు. రేవంత్ సర్కారును సమాజంలోని అన్ని వర్గాలు కొనియాడుతున్నాయి. రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్రాలే కాదు, కేంద్రం కూడా తీసుకొని, ఆస్ట్రేలియా, చైనాల నుంచి అక్రమంగా రవాణ అవుతున్న గడ్డి మందును నిషేదిస్తే, రైతుల ప్రాణాలు కాపాడిన వాళ్లౌతారు.
