Demand to Repeal Anti-Farmer Policies
రైతు కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలి
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్ కి సంయుక్త కిసాన్ ,ఎస్, కె ఎం, ధ్వర్యంలో, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ విత్తన చట్టాలు, కార్మిక వ్యతిరేక 4లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలని, అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న ట్రేడ్ డీల్ వల్ల, భారత వ్యవసాయం నిర్వీర్యం అవుతుంది, తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కార్యదర్శి బండ పెళ్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు ఐ కె ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బాల యాకుబ్ రెడ్డి, ఏ ఐ యు కె ఎస్ జిల్లా కార్యదర్శి ఆవుల కట్టయ్య, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు నీరుటి జలంధర్, ఏఐసిటియు జిల్లా కోశాధికారి బొల్లోజు రామ్మోహన్ చారి, రైతుకూలీ సంఘం మండల నాయకులు సపావట్ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
