Drinking Water Problem Resolved in Rantheertham
రాంతీర్థంలో తాగునీటి సమస్యకు చెక్…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాంతీర్థం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పరిష్కారం చూపారు. ఇటీవల త్రవ్వించిన బోరు బావికి కొత్త మోటారును అమర్చి, తాగునీటి సరఫరాను బుధవారం ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు తాగునీటి కష్టాల నుండి విముక్తి పొందారు. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కృషిని గ్రామస్థులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తాగునీటి సరఫరాను కొనసాగిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
