Women Staff Felicitated at JNV Nalgonda
మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం
పి ఎం శ్రీ జవహర్ నవోదయ నల్గొండ
నేటిధాత్రి చలకుర్తి క్యాంప్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నల్గొండ జిల్లా పి ఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంపులో మహిళా ఉద్యోగులందరికీ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ గారి ఆధ్వర్యంలో పూల మొక్కలు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర అన్ని రంగాలలో ముందు ఉండాలని ఉపాధ్యాయులు వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులైన ఓఎస్ జానకి ,చంద్రకళ, పి ఈ టి మంజుల రాధా, ఆర్ట్ విజయదుర్గ , టిజిటి ఇంగ్లీష్ రీమా, పి జి టి కెమిస్ట్రీ కళ్యాణి, పిజిటి హిస్టరీ మమత, పిజిటి ఇంగ్లీష్ రాఘవి , మహిళా కౌన్సిలర్ స్రవంతి , కంప్యూటర్ సైన్స్ భాగ్య రేఖ, స్టాఫ్ నర్స్ నిర్మల, అటెండర్ అరుణమ్మ , మట్రన్స్ సరిత, విజయ, మరియు మెస్ వర్కర్స్ సాలమ్మ ,మంగమ్మ,ముత్తమ్మ మొదలగు మహిళా ఉద్యోగులను ఘనంగా శాలువాలు కప్పి సన్మానం చేశారు.
ఉపాధ్యాయులైన భాస్కరాచారి, అమరలింగా చారి, సంతోష్ ,శేఖర్ శర్మ ,గురప్ప, విష్ణుశర్మ ,ఆచార్యులు, రాజేష్ ,మోహన్ , విష్ణు అమోల్ గోజే, మురళి, హేమంత్ , లక్ష్మయ్య తదితర ఉపాధ్యాయ ఉపాధ్యాయేత బృందం కలిసి మహిళా ఉద్యోగులను సన్మానించడం జరిగింది. ఆచార్యులు తెలుగు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉన్నారని ఏదైనా సాధించగలరని గడిచిపోయిన కాలానికి ప్రస్తుత కాలానికి ఆడవాళ్ళ పాత్రను గురించి ప్రసంగించడం జరిగింది. విష్ణు శర్మ తెలుగు ఉపాధ్యాయులు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ‘యంత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవత’ అంటూ కవిత్వాన్ని వినిపించడం జరిగింది. పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ స్త్రీ యొక్క గౌరవం గురించి సమాజంలో స్త్రీ యొక్క పాత్ర గురించి పాఠశాలలో మహిళా ఉద్యోగులు నిర్వర్తిస్తున్న విధులను గురించి ప్రసంగించడం జరిగింది. అలాగే శేఖర్ శర్మ మాట్లాడుతూ మగవారు లేకపోయినా ఆడవారు సంసారాన్ని సమాజాన్ని తన శక్తిని ఉపయోగించి ముందుకు తీసుకెళ్లగలుగుతుందని గౌతమ బుద్ధుని భార్య అయిన యశోదర గురించి చెప్పడం జరిగింది. అన్ని ఆలోచించగల ధైర్యం ఆడవారికి ఉంది అని శేఖర్ శర్మ సైన్సు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. అలాగే సత్యనారాయణ టీజీటీ హిందీ ఉపాధ్యాయులు తన యొక్క కవిత్వాన్ని వినిపించడం జరిగింది. గురప్ప మహిళా దినోత్సవాన్నీ పురస్కరించుకొని మాట్లాడుతూ తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా స్త్రీ యొక్క పాత్రను గురించి వివరించడం జరిగింది. సమాజంలో ఆడవారికి ఉండే పాత్రను గురించి అందరూ మాట్లాడారు తర్వాత మహిళా ఉద్యోగులందరికీ శాలువాలు మరియు పువ్వుల మొక్కలు ఇచ్చి వారిని సన్మానించారు.
