Councillor Mohammed Rafi Launches Development Works
పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మహ్మద్ రఫీ..
జహీరాబాద్ నేటి ధాత్రి;
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ మార్గదర్శకత్వంలో, జహీరాబాద్‌లో వీధి దీపాల ఏర్పాటు కల్వర్టులను శుభ్రపరచడం వంటి స్థానిక మౌలిక సదుపాయాల మెరుగుదలలు జరిగాయి. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన. వార్డ్ నంబర్ 14 కౌన్సిలర్ మహ్మద్ రఫీ దీనిని పర్యవేక్షించారు. ఎంఐఎం నాయకత్వంలో జహీరాబాద్‌లో వీధి దీపాలు హై-మాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం కీలకమైన కార్యకలాపాలలో ఒకటి అని పేర్కొన్నారు. స్థానిక అభివృద్ధి పనుల్లో భాగంగా, కల్వర్టులను శుభ్రం చేసి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కౌన్సిలర్ మహ్మద్ రఫీ ఛైర్మన్‌ను అభ్యర్థించారు.
