108 Staff Tried Till the Last Moment with CPR: Program Manager
సిపిఆర్ తో చివరి వరకు ప్రయత్నం చేసిన 108 సిబ్బంది
ప్రోగ్రాం మేనేజర్ పాటి శివ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రోగికి అవసరమైన ఆక్సిజన్ సౌకర్యం పూర్తిగా అందుబాటులో ఉందని, పరిస్థితి విషమించిన వెంటనే 108 సిబ్బంది సిపిఆర్ చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేశారని ప్రోగ్రాం మేనేజర్ పాటి శివ కుమార్ అన్నారు
అలాగే, బాధితుడు ఇప్పటికే హార్ట్ పేషెంట్ కావడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, 108 ఎమర్జెన్సీ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, నిర్దేశిత ప్రోటోకాల్స్ ప్రకారం అన్ని వైద్య సహాయక చర్యలు చేపట్టారని పైలట్, ఈ ఎం టి లు స్పష్టం చేశారు.
రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు చివరి క్షణం వరకు ఆక్సిజన్ సపోర్ట్, సిపిఆర్ వేగవంతమైన తరలింపు వంటి అత్యవసర సేవలు అందించామని తెలిపారు. ఈ క్రమంలో 108 సిబ్బంది చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం అని ప్రోగ్రాం మేనేజర్ పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 108 సేవలపై నమ్మకం ఉంచాలని, 108 ఎమర్జెన్సీ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల సేవకు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు.
