· ప్రహసనంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ
· కేసీఆర్ విచారణతో పరాకాష్టకు చేరిన రాజకీయం

· రాష్ట్ర వ్యాప్తంగా బీఆరఎస్ నిరసనలు
· మున్సిపల్ ఎన్నికల తరుణంలో రేవంత్ తప్పటడుగులు

· ఆంధ్ర రాజకీయాలను తలపిస్తున్న తెలంగాణ
· ఇద్దరు మాజీ ‘దేశం’ నాయకుల మధ్య నలుగుతున్న కాంగ్రెస్

· సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అయోమయం
· అధికారంలో వున్నా ఆవహించిన నైరాశ్యం
· బీఆరఎస్‌కు అనుకూలంగా మారుతున్న రేవంత్ చర్యలు
హైదరాబాద్, నేటిధాత్రి:
విచారణలో ప్రశ్నలు మాత్రమే వుండాలి. ఉద్దేశాలుండకూడదు. ఒకవేళ ఉద్దేశాలే ప్రశ్నలను శాసిస్తే, చరిత్ర తన నిశ్శబ్ద కలంతో నిజాన్ని లిఖించక మానదు. అందువల్లనే ఎప్పుడైనా చరిత్రను కక్షతో రాయకూడదు, నిజంతోనే రాయాలి. అప్పుడే చరిత్ర నిలిచి వెలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో బీఆరఎస్ నాయకులపై జరుగుతున్న సిట్ విచారణను చూస్తుంటేకాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు శైలి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు సెంటిమెంట్, భావద్వేగ రాజకీయాలకు కేం ద్రమైన తెలంగాణలో నేడు పరస్పర కక్షపూరిత రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి సంకుచితార్థం తీసే యత్నాలు జరుగుతున్నాయి. ఇది ఏ ఒక్క కేసీఆర్‌కో లేదా రేవంత్‌కో పరిమితం కాదు. తెలంగాణ యావత్తు ప్రజానీకానికి సంబంధించింది. ఆంధ్ర రాజకీయాల ప్రభావం క్రమంగా తెలంగాణ రాజకీయాలపై పెరుగుతున్న పరిస్థితికి ప్రధాన కారణం రేవంత్‌రెడ్డికి, చంద్రబాబుతో వున్న సాన్నిహిత్యం. దీని పుణ్యమాని ఆంధ్రలోని తిట్ల రాజకీయా లు తెలంగాణలోకి ప్రవేశించాయి. రేవంత్ అధికారంలోకి రానంత వరకు మౌనంగా వున్న ఆం ధ్ర మీడియా ఇప్పుడు జడలు విప్పి బీఆరఎస్‌పై తన అక్కసును ప్రదర్శిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్ రాజకీయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రేవంత్, కేసీఆర్‌ల మూలాలు తెలుగుదేశం పార్టీలో వుండటం, చంద్రబాబు ఒకప్పటి వీరి బాస్ కావడాన్ని పరిశీలిస్తే (ఇప్పుడు ఒకరిరితో మరొకరికి పడకపోవచ్చు) “మాజీ తెలుగుదేశం నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరాటం వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తం ప్రచ్ఛనంగా వుందని” అని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరం స్థానాన్ని ఇప్పుడు, రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఆక్ర మించగా, కాంగ్రెస్‌లో మొదటినుంచి వున్న స్వయం ప్రకాశం లేని సీనియర్ నాయకులు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితికి గురికావడం వర్తమాన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.
ఏదో కారణంపై వేధింపులు, జైళ్లకు పంపడం వ్యక్తిగతంగా ఎదురులేకుండా చేసుకునే రాజకీ యాలు నెరపడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల శైలి. కానీ తెలంగాణలో భావజాలం, ఉద్యమం, ఒక కారణం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వర్తమానానికి వస్తే, సిట్ విచారణ పేరుతో హరీష్‌రావు, కేటీఆర్ చివరకు కేసీఆర్‌ను కూడా పిలిచి అడిగిన భేతాళ ప్రశ్నలు, ఇచ్చిన విక్రమార్క సమాధా నాలు, విచారణపై బీఆరఎస్ నేతల ఆగ్రహం చివరకు వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారింది. టీఆరఎస్ నేత జీవన్‌రెడ్డి ఏకంగా తెలంగాణ స్టెíల్లో తిట్లపురాణం మొదలుపెట్టారు. ఇక ఆం ధ్రమీడియా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను తెలంగాణ ఆత్మగౌరవం అన్న కవరింగ్ ఇస్తు న్నారంటూ ఆరోపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపారు. మరి 1983లో ఎన్టీఆర్ “తెలుగువారి ఆత్మగౌరవం” పేరుతోనే కదా అధికారంలోకి వచ్చింది. అంతకుముందు మనల్ని ఢిల్లీలో మదరాసీలనేవారు. అప్పుడు తెలుగువారి ఆత్మగౌరవా నికి చిహ్నంగా ఎన్టీఆర్ నిలిస్తే, ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి కేసీఆర్ గుర్తుగా వున్నారు. టెపిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రక్రియ. అది భద్రతా చర్యల్లో భాగం కనుక ఏ ప్రభుత్వం అధి కారంలో వున్నా కొనసాగుతూనే వుంటుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్`1885 కింద ప్రజల భద్రతకోసం దేశవ్యాప్తంగా ఇది అమల్లో వుంది. ఇది నిర్దిష్ట నియమాలకు లోబడి జరుగుతుంది.ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు ఇది వివాదమవుతుంది. ఈ అంశమే ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య సంఘర్షణలకు దారితీస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు కూడా కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయన్నది ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటికి మరమ్మతులు చేసినట్లయితే పెద్ద ఖర్చు భారం కాకుండా ఈపాటికి ప్రాజెక్టు సాధారణ స్థితిలో పనిచేసేది. కాలయాపన వల్ల డ్యామేజీ ఎక్కువ అవుతుందనే అంశం ఇక్కడ ప్రధానం. తప్పుకు బీఆరఎస్‌ను దోషిగా నిలబెట్టడంలో తప్పులేదు కానీ, అంతపెద్ద ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకుండా ఇప్పటివరకు సాగదీయడం అధికార కాంగ్రెస్ తప్పిదం. ఇక్కడ రాజకీయ ప్రయోజనం కంటే, అంతపెద్ద ప్రాజెక్టు భద్రత, లక్షల ఎకరాల సాగునీటి లభ్యత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికీ కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ విమర్శలు ఆపి రాష్ట్రహితం కోసం దాని మరమ్మతులు చేపట్టాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. సాంకేతిక లోపాలు, వరదలు ఇందుకు ప్రధాన కారణమన్నది ఎన్డీఎసఏ వర్గీకరించింది. నిజం చెప్పాలంటే దేశంలో గతంలో నిర్మించిన ప్రాజెక్టులు దెబ్బతిన్న సంఘటనలు చాలానే వున్నాయి. సిక్కిం తీస్తా 1200 మెగావాట్ల 3హెచఈపీ ప్రాజెక్టు 2023లో గ్లేసియర్ సరస్సు ఒక్కసారిగా విరుచుకుపడటంతో కొట్టుకుపోయింది. 2024లో కర్ణాటకలో రూ.650 కోట్లతో నిర్మించిన బరాజ్ మూడునెలల్లోనే కూలిపోయింది. 2023`24 సంవత్సరాల్లో హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా 14`16 జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. 2023లో పోలవరం ప్రాజెక్టుకు చెందిన 150 మీటర్ల “టో య్`వాల”కు వంపు ఏర్పడింది. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. 2023`24 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని 2వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కొండచెరియలు విరుచుకుపడి బాగా దెబ్బతిన్నది. 1978లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టుకు 2021లోసామర్థ్యానికి మించి 3.25లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో తెగిపోయింది. 8మంది మరణించగా 50మంది గల్లంతయ్యారు.సమీపంలోని పించా ప్రాజెక్టు కూడా దెబ్బతిన్నది. 2024లో పెదవాగు ప్రాజెక్టు భారీ వరదల కారణంగా తెగిపోయింది. ఒక్కోదానికి ఒక్కో కారణం. కారణమేదైనా తప్పిదాన్ని సరిచేయడం విజ్ఞత కలిగిన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికిరాకుండా పోతే, తెలంగాణలో దేశంలోనే అత్యధిక వరి దిగుబడి ఎట్లా సాధ్యం?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సోమవారం కేసీఆర్‌ను, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించడం తోá రాష్ట్రంలో రాజకీయ దుమారం పరాకాష్టకు చేరింది.ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం నుంచే వివాదం మొదలై, చినికి చినికి గాలివానలా మారింది. నోటీసులు జారీచేయం లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు. మాజీ ముఖ్య మంత్రి, 65 సంవత్సరాలు దాటిన వద్ధుడిని ప్రశ్నించేందుకు అవసరమైన విధివిధానాలు పాటించడంలో సిట్ వైఫల్యం స్పష్టంగా వెల్లడి కావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆంధ్ర రాజకీయాల్లో మాదిరిగా భీష్మించుకొని కూర్చోకుండా కేసీఆర్ నందినగర్ నివాసానికి రావడంతో విచారణ సజావుగా సాగింది. ఇక్కడ వారేం అడిగారు, ఈయనేం సమాధానం చెప్పారన్న సంగతి కంటే, బీఆరఎస్ ఈ అవకాశాన్ని తన బలప్రదర్శనకు చక్కగా వినియోగించుకున్నదనేది కీలకం. చంద్రబాబు డైరెక్షన్లో, రేవంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎపిసోడ్‌ను పరిశీలి స్తే బూమరాంగ్ అవడం ఖాయమన్నట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్ అని ఎం దుకనాల్సి వస్తున్నదంటే పచ్చమీడియా రేవంత్‌కు అండగా నిలవడం. ఇద్దరు మాజీ తెలుగుదేశంనేతల మధ్య ఇప్పటి తెలుగుదేశం దర్శక నేపథ్యంలో జరుగుతున్న ఈ హైడ్రామాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిగిపోవడం అట్లావుంచి, తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపై రాజకీయాలు ఆధిపత్యం సాధించిన సరికొత్త వాతావరణం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది.
మనదేశ ప్రజల్లో సెంటిమెంట్ ఎక్కువ! ఒకప్పుడు జనతా ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీని జైలుకు పంపించామన్న జనతాపార్టీ నేతల తాత్కాలిక ఆనందం, తర్వాతి ఎన్నికల్లో ఉక్కుమహిళ పై దేశ ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతి సునామీలో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. తర్వాత జన తాపార్టీ ముక్కలు చెక్కలైంది. అదేవిధంగా కేసీఆర్ అహంకారంపై ఆగ్రహించిన తెలంగాణ ప్రజలు ఆయన్ను అధికారానికి దూరం చేస్తే, ఇప్పుడు రేవంత్ కూడా అదే అహంకారంతో కేసీఆర్నుఇబ్బంది పెట్టడం వల్ల కాంగ్రెస్సే నిండా మునుగుతుంది తప్ప గులాబీ బాస్‌కు ఏం కాదు. కానీచంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలను వంటబట్టించుకున్న రేవంత్ దూకుడుతో వ్యవహరించడం ప్రశ్నార్థకమవుతోంది. కేసీఆర్ తాను అధికారంలో వున్నప్పుడు తప్పిదాలు చేసివుండవచ్చు. కానీ ప్రతీకార ధోరణి ఎంతమాత్రం తగదు. ఇది కాంగ్రెస్ నాయకుల్లో కనిపించదు. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో, అధికార ప్రభుత్వం తమను రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నదంటూ బీఆరఎస్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాన్ని చేజేతులారా కల్పించినట్టే అవుతున్నది. కేసీఆర్ విచారణను నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలు, ర్యాలీలే ఇందుకు నిదర్శనం. అదీకాకుండా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
తెలుగుదేశం రాజకీయాలు నరనరానా జీర్ణించుకున్న ఇద్దరు మాజీ టీడీపీ నాయకుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయపోరు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు కొరుకుడుపడని సమస్యగా మారింది. వీరికి అనుభవిస్తున్న అధికారం ఆనందం ఇవ్వని పరిస్థితి నెలకొంది. గమనిస్తే రేవంత్ తన రాజకీయ సుస్థిరత కోసం వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారనుకోవాలి. రేవంత్ వుంటే చంద్రబాబుకు అనుకూలం కనుక పచ్చమీడియా అండగా నిలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రా మధ్య సరిహద్దుల స్పష్టత మసగబారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో, కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను లేవదీస్తే, రేవంత్‌కు కష్టం. రేవంత్ ప్రతి చర్య వెనుక చంద్రబాబు వు న్నారన్న అభిప్రాయం తెలంగాణలో బలీయంగా నాటడంలో ఇప్పటికే బీఆరఎస్ చాలావరకు కతకత్యురాలైంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ఏవిధంగా ప్రతీకగా నిలిచారో, తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ అంతే నిలిచారు. ఇప్పుడు కేసీఆర్ ఆత్మగౌరవం ఒక సెంటిమెంట్‌గా ప్రజ ల్లోకి వెళితే కాంగ్రెస్ భవిష్యత్తు కష్టం. రేవంత్ అధికారంలో వున్నంతవరకే చంద్రబాబు కొంతవ రకు రాజకీయం చేయగలుగుతారు. బీఆరఎస్ రాష్ట్ర పగ్గాలు చేపడితే మాత్రం తెలుగుదేశం ప్రాదుర్భావ ఆశలు అడియాశలైనట్టే!
