Bomb Threat Forces IndiGo Flight Emergency Landing
రూ. 2 లక్షల 11 వేల కోట్ల మేర ఎఫెక్ట్.. చైనాకు ఝలక్.. ట్రంప్ హ్యాపీస్.!
పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కాలువ (Panama Canal) సమీపంలోని రెండు ప్రధాన ఓడరేవుల నిర్వహణ ఒప్పందాలను పనామా దేశపు సుప్రీంకోర్టు రద్దు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘సీకే హచిసన్’ (CK Hutchison) గ్రూప్‌నకు చెందిన(సబ్సిడియరీ) ‘పనామా పోర్ట్స్ కంపెనీ’ (PPC) తో కుదుర్చుకున్న ఈ కీలక కాంట్రాక్టులు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన కనిపిస్తోందని, ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విధివిధానాలను విస్మరించారని కోర్టు పేర్కొంది.
పనామా కాలువకు రెండు వైపులా ఉన్న బాల్బోవా (Balboa) ఇంకా క్రిస్టోబల్ (Cristobal) ఓడరేవులను నిర్వహించేందుకు 2021లో అప్పటి ప్రభుత్వం పనామా పోర్ట్స్ కంపెనీ ఒప్పందాన్ని మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అయితే, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్లను విచారించిన పనామా సుప్రీం కోర్టు, ఆ ఒప్పందాలు చెల్లవని తీర్పునిచ్చింది. కాగా, సీకే హచిసన్ ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటి. తాజాగా పనామా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆ కంపెనీకి పనామాలో ఉన్న పట్టు సడలే అవకాశం ఉంది. అయితే, వీటి నిర్వహణ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలుస్తుందా? అనే అంశాలపై సందిగ్ధత నెలకొంది.
