ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావుపై అభ్యంతరంగా వ్యాఖ్యలు చేయడం తగదు- కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న
కరీంనగర్, నేటిధాత్రి:
42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న శనివారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మాజీ మేయర్ గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలలో విమర్శలు ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని దానికి భిన్నంగా కుక్కలు పందులు అంటూ అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదని, ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావు కాంట్రాక్టర్ గా దోచుకున్నారని, దున్నపోతు అని మనిషిని పోల్చుతూ ఆరోపణలు చేయడం, అవినీతి అనకొండ రీతిగా అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేయడం, నేను నాఉద్యోగంలో భాగంగా గొర్రెలు అమ్ముకున్నానని అనుచిత వ్యాఖ్యలు చేసినారు, సునీల్ రావు చదువుకొని ఉంటే ఈవ్యాఖ్యలు చేసే వారు కాదని కొంత విజ్ఞతతో మాట్లాడాలని, నేను అవినీతికి పాల్పడి ఉంటే ఎప్పుడో జైలుకు వెళ్లే వాడినని, సరెండర్ కు సస్పెన్షన్కు తేడా తెలియని సునీల్ రావు ఐదు సంవత్సరాలు మేయర్ గా ఎలా ఉన్నారు అర్థం కావడంలేదని, సిమెన్ (వీర్యం) ఎలా తయారు చేస్తారు, ఎలా సప్లై చేస్తారు అనే విషయంలో కేవలం డాక్టర్లకు మాత్రమే అవగాహన ఉంటుందని తెలుసుకోవాలి, వ్యవహారం అంతా ఢిల్లీ ఎన్డిటిపి ఆధ్వర్యంలో నడుస్తుంది, దీనిపై అవగాహన లేకుండా అధ్వానంగా మాట్లాడవద్దని, నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినప్పుడు జగపతిరావు దగ్గర ఎమ్మెస్సార్ దగ్గర పొన్నం ప్రభాకర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మేయర్ అయినావు. మేయర్ పదవి ముగిసిన తర్వాత వినోద్ కుమార్ ను మోసం చేసి మళ్లీ నీరాజకీయ స్వలాభం కోసం బిజెపిలో చేరినావు, ఇప్పుడు బండి సంజయ్ ని ఏమి చేయాలనుకుంటున్నావు, బండి సంజయ్ సునీల్ రావు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నాపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కలెక్టరేట్ హెలిపాడ్ వద్ద ఉన్న హనుమాన్ గుడి వద్ద తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు మేయర్ గా ఇలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజల సొమ్ము దోచుకోలేదని నిరూపించదల్చుకుంటే నువ్వు కూడా తడి బట్టలతో వచ్చి హనుమాన్ గుడి వద్ద దేవుని పాదాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయంగా ఎదిగింది నువ్వైతే కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగింది నేను. నేను ఎలాంటి వ్యక్తినో ఎవరి వద్ద శిష్యరికం చేశారో మీకు తెలుసు మీపని మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మంచితనమే గెలుస్తుంది తప్ప అవినీతి కాదు, నీగడీలోకి రానివ్వకుండా అందరిని బెదిరించావు. నువ్వు ఒక మేయర్ స్థానంలో ఉన్నావు కనుక నీతో పనులు అవుతాయని వచ్చిన వారిని బలహీన వర్గాలకు చెందిన వారిపై ఇంటి లోపల దొరలాగా ఉంటూ బయటికి వచ్చిన మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎంతైనా చేస్తాను అంటూ రాజకీయ డ్రామా చేస్తావు. నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆర్టిఐ ద్వారా నాదగ్గర ఉన్న ఆయుధాలలో ఒక ఆయుధాన్ని ప్రయోగించినా నేను లోక్సత్తా ఎం.శ్రీనివాసు శిష్యుని వారు ఎవరికి భయపడరు అది మీకు తెలుసు నేను కేవలం చావుకు తప్ప నీపిల్ల బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరిస్తున్నాను. కలెక్టర్, మంత్రి నన్ను మళ్లీ పెద్దపెల్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు తెలుసుకోవాలని వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణలు చేయవలసి వస్తుందని తెలుసుకోవాలని, నన్ను ఆదరించే విషయం డివిజన్ ప్రజలు చూసుకుంటారని ఇక నుండి మీఅవినీతి చిట్టా బయట పెట్టడానికి నాదగ్గర ఆధారాలు చాలా ఉన్నాయని సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవి బయట పెడతానని హెచ్చరించారు. ఈపత్రిక విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మహమ్మద్ చాంద్, తదితరులు పాల్గొన్నారు.
