*కుర్చివేడు టీడీపీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబును పరామర్శించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్..
*త్వరగా కోలుకుని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించిన చిత్తూరు శాసనసభ్యులు…
*ఎమ్మెల్యే గురజాలకు ముందుస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ నీలకంఠం నాయుడు ,పార్టీ కార్యకర్త శోభన్ బాబు…
చిత్తూరు (నేటి ధాత్రి:
చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు మండలం, కుర్చివేడు పంచాయతీ, కుర్చీ వేడు గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇన్చార్జ్ శోభన్ బాబు అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కుర్చివేడు పంచాయతీ పర్యటనలో భాగంగా మాజీ వైస్ ఎంపిపి, మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ నీలకంఠం నాయుడు ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా నీలకంఠం నాయుడు కుమారుడు, టిడిపి కార్యకర్త శోభన్ బాబును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు.అలాగే వృద్దాప్యంలో ఉన్న పార్టీ కురువృద్ధుడు నీలకంఠం నాయుడు, ఆయన కోడలు, శోభన్ బాబు సతీమణి బిందు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు తెలుగు దేశం పార్టీకి ఎనలేని సేవలందించారనీ గుర్తు చేసిన ఎమ్మెల్యే,, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం ఇదే వరవడితో పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఈ క్రమంలో నీలకంఠం నాయుడు, ఆయన కుమారుడు శోబన్ బాబు, సతీమణి బిందు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ కు ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తెలిపారు.
చిత్తూరు నియోజకవర్గ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గురిజాల జగన్ మోహన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కర్మణా దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నీలకంఠం నాయుడు, శోభన్ బాబు, ఆయన సతీమణి బిందు తెలియజేశారు.
