Home Guard Seetharam Honoured by District SP
హోంగార్డ్ బానోతు సీతారాంకు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రం.
చిట్యాల, నేటిదాత్రి :
63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను చిట్యాల పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డ్ బానోతు సీతారాం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో తనకు కేటాయించిన కోర్టు ప్రాసెస్ డ్యూటి లో సీతారాం అత్యుత్తమ సేవలు అందించారు. ఆయన పనితీరును గుర్తించిన జిల్లా పోలీసు యంత్రాంగం, హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎస్పీ గారి ద్వారా ఈ రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సీతారాంను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్
భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు
హోంగార్డ్ ఆర్.ఐ పూర్ణ
వెల్ఫేర్ ఆర్.ఐ కాసిరం నాయక్
ప్రశంసా పత్రం అందుకున్న సీతారాంను చిట్యాల సీఐ మల్లేష్, ఎస్సై శ్రావణ్ కుమార్ మరియు తోటి హోంగార్డ్స్ పెండెల ప్రసాద్, ముత్యాల మొగిలి, రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
