ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు.
నిజాంపేట: నేటి ధాత్రి
ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో చోటుచేస్తుంది. రామయంపేట నుంచి వస్తున్న బైక్ ను ఆటో ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫారెస్ట్ అధికారి మహేష్, ఎంపీడీవో కార్యాలయ ఆపరేటర్ శ్రీనివాస్ గౌడ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.