జగిత్యాల జిల్లా నేటిదాత్రి:ప్రతినిధి జిల్లాలోని రాయికల్ మండలమూటపెల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీరాజం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి ఐ జనరల్ ఇన్సిరెన్స్ ద్వారా మంజూరైన ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల చెక్కును తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.గంగాధర్, శాఖ అధికారి వై.నర్సారెడ్డి ప్రాంతీయ బీమా అధికారి చిట్ల సనత్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రమాద భీమా పధకాన్ని వినియోగించుకుని ప్రజలందరు వారి కుటుంబాలకు ఆసరాగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మూటపెల్లి గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్ రంజిత్, కొత్తపేట గ్రామ సర్పంచ్ రాజేశం, ఒడ్డెర కాలని గ్రామ సర్పంచ్ వెంకమ్మ నర్సయ్య, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, రమేష్, రాజేందర్, నసిర్, తిరుపతి, లక్ష్మీ నర్సయ్య, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్
చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం రోజున చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ నేటిదాత్రి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికల పాత్ర గొప్పదని అన్నారు నికార్సయిన వార్తలను ప్రచురించడం లో నేటి ధాత్రి దినపత్రిక ముందుంటుందని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో నేటిదాత్రి రిపోర్టర్ కట్కూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇంకెన్నాళ్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు – కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్ కేయూ క్యాంపస్, నేటిదాత్రి:ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం వలన ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలకి పాల్పడ్డారు , అలాగే మొన్నటికి మొన్న మహబూబాద్ జిల్లా వాసి నిరుద్యోగి ముత్యాల సాగర్ ఖమ్మం రైల్వే ట్రాక్ ఆత్మహ్యతకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అలాగే అతని కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నోటిఫికెషన్స్ రాకపోవడం వలన నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడే ప్రభుత్వం ఇంకా ఎంత మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల గురించి ఆలోచించే బదులు నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆలోచించి ఇకనైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
` ఆ గుట్టు కినకట్టు ఎందుకు? ` గుట్టకొనడమే శాపం! గుడి కూల్చివేయడం మహా పాపం!!
` గుడిపై గుసగుసలు..శషబిశలెందుకు? ` వ్యాపారంలో దాపరికం ఏందుకు..? ` నమ్మకం లేని వ్యాపారాన్ని ప్రజలు నమ్ముతారని గ్యారెంటీ ఏది..? ` గుంటూరు స్వామి అలియాస్ శివ స్వామి ఎవరు? ` విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఇప్పుడే ఎందుకు తెరమీదకొచ్చింది? ` గుడి మీద పెత్తనానికి శివస్వామి వేస్తున్న ఎత్తుగడలేంటి? ` అసలి శ్రీధర్ రెడ్డి, దేవేంద్‌రెడ్డిలెవరు? ` సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలకేమౌతారు? ` గూడుపుఠాని అంతా ఎందుకు? ` కోట్లకు కోట్లు పంచినట్లు ప్రకటనలెందుకు?
హైదరాబాద్ , నేటిధాత్రి : ఇంతకీ.. ఒకే ఒక్క మాట… జూబ్లీహిల్స్‌లో కూల్చిన అభయాంజనే స్వామి గుడి నిర్మిస్తారా? లేదా? ఈ ముక్క చెప్పడానికి ఇన్ని విన్యాసాలెందుకు? ఇంత తెరచాటు నాటకాలెందుకు? ఇంత దోబూచులాటలెందుకు? రోజుకొకరు తెరమీదకు వచ్చుడెందుకు? మధ్యలో స్వాములను ఉసిగొల్పుడెందుకు? గుడిలో పూజారి వుంటే చాలు…ఈ స్వాములంతా ఎవరు? ఎందుకు? వచ్చే స్వాములు గుడి కోసమా? వారి పబ్బం కోసమా? ఇంతకీ గుంటూరు స్వామి అలియాస్ శివ స్వామి ఎవరు? ఎందుకొచ్చాడు? ఎవరు తెచ్చారు? ఈవిషయంలో ఎలా తలదూర్చాడు? ఎవరు ఆయనకు పెత్తనమిచ్చారు? మధ్య వర్తిత్వం ఎవరు చేయమన్నారు? ఎవరికీ కనిపించని బిల్డర్లు శివస్వామిని ఎందుకు ముందు పెట్టారు? అది వాళ్లకు వాళ్లుగా తీసుకున్న నిర్ణయమా? లేకు శివస్వామి కుతంత్రమా? బిల్లర్లతో శివస్వామి ఏంచెప్పాడు? వారిని ఏం చెప్పి నమ్మించాడు? అసలు 4 ఎకరాల 18 గుంటల గుడి భూమి, 2వేల గజాలకు తెచ్చిందెవరు? తర్వాత 750 గజాలు అంటూ ప్రచారం చేసింది ఎవరు? ఇప్పుడు కేవలం 266 గజాలదాకా తెచ్చిందెవరు? మితగా భూమిని ఏం చేయడానికి శివస్వామి మధ్యలో దూరాడు? హటాత్తుగా విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఎక్కడినుంచి వచ్చింది? ఇక్కడే పదేపదే ప్రస్తావన ఎందుకు జరగుతోంది? గుడి స్ధలంలో ఆయన నిర్ణయం ఏమిటి? గుడిపై పెత్తనం కోసమా? గుడిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసమా? అసలు ఓ స్వామితో గుడి బ్లూప్రింట్ వ్యవహారమేమిటి? అగ్రిమెంట్లు ఏమిటి? ఆయన వచ్చి ఉద్యమకారుల మీద ఆరోపణలు చేయడమేమిటి? ఆ అధికారం ఎవరిచ్చారు? జనం ముందు ఒక మాట, బిల్డర్లతో ఒక మాట స్వామి చెబుతున్నదెందుకు? ఇలాంటి స్వామిని విశ్వహిందూ పరిషత్ ఎలా నమ్మింది? అంత పెద్ద హిందూ ధార్మిక సంస్ధకే మచ్చ తెచ్చే పని ఎవరి ప్రోద్భలంతో చేశారు? గుడి కోసం ముందు అనుకున్న స్ధలం మీద కన్నెశాడా? అందుకోసమే ఇలాంటి విన్యాసాలు శివస్వామి చేస్తున్నాడా? అన్నది తెలియాల్సివుంది. పైగా అసలు బిల్డర్లు ఇంత వరకు జాడా పత్తా లేరు? కాని కొత్తగా తెరమీదకు వచ్చిన శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డిలు ఎవరు? సడన్‌గా విశ్వహిందూ పరిషత్ ప్రచారక్‌లు ఎలా ఇందులోకి వచ్చారు? బిల్డర్లకు బంధువులమని చెప్పుకుంటున్నారు? విశ్వహిందూ పరిషత్‌లో పనిచేసుకుంటూ ధర్మంకోసం, గుడి కోసం కాకుండా, బిల్డర్లకోసం పనిచేయడం ఎంత వరకు సమంజసం? వీటికి సమాధానం దొరికితే గాని అసలు గుడి సంగతి ఏం చేయాలనుకుంటున్నారో తేలిపోతుంది.
అత్త సొమ్మేదో అల్లుడు దానం చేసినట్లు గుట్ట కొని, దాని మీద వున్న గుడి కూల్చి, దేవుణ్ణి కింద దించి, అనాధగా విగ్రహాన్ని వదిలేసి, అక్కడ కడతాం…ఇక్కడ కడతాం…ఇంత స్ధలమిస్తాం…అంతిస్తామని భేరమేమిటి? అసలు దేవుడితో దోబూచులాటమేమిటి? ఈ భయం లేని పనులేమిటి? గుట్టు ఈ కనికట్టు చేసేంత అవసరమేమిటి? ఈ దోబూచులాటలెందుకు? వ్యాపారులు కనిపించకుండా దోచూచులాటమేమిటి? ఆ స్ధలం మాది? దాన్ని మేం కొన్నామని చెప్పలేనప్పుడు వారు చేసేది వ్యాపారం ఎలా అవుతుంది? అందులో నీతి వుందన్న భరోసా ఎలా కలుగుతుంది? ప్రభుత్వం ఇచ్చిందే నిజమైతే…వ్యాపారులు కొనుకున్నదే వాస్తవమైతే…బహిరంగంగా చెప్పుకోవడానికి అడ్డమేమొస్తుంది? నిజాయితీగా కొనుగోలు చేసి ఆలోచనేమిటి? కొన్న వాళ్లు కొనుగోలు చేయడం తప్పు కాదు. కాని అది మాది అని చెప్పలేనప్పుడు ఏదో తప్పు చేసినట్లే కదా? దోచూబులాడడం చూస్తేంటే ఏదో దాస్తున్నట్లు అర్ధమే కదా? ప్రజల ముందుకు రాకుండా పోవడానికి ఈ శషబిషలు పడుతున్నారంటే ఏదో మతలబు దాగున్నట్లే కదా? సహజంగా ఏ వ్యాపారి అయినా దాన్ని నిర్భయంగా చెప్పుకోగలగాలి? ఇంత వివాదం జరగుతుంటే అది మాది? అని చెప్పుకోలేని వ్యాపారులు రేపు ఎలా ప్లాట్లు చేసి అమ్ముకుంటారు? ఎలా నమ్మిస్తారు? ఈ వివాదాలు మరుగన పడేసి ఎలా వాటిని వ్యాపారంగా మల్చుకుంటారు? జనం ఎలా నమ్ముతారు? వాటిని ఎలా కొనుగోలు చేస్తారు? ఇంత వివాదం ముసురుతున్న తర్వాత కూడా దాన్ని పూర్తి చేయగలరా? అమ్ముకునేంత నమ్మకం వ్యాపారులకు వున్నా, కొనుగోలు చేసేవారికి ధైర్యం వుండొద్దా? నమ్మకం కలుగొద్దా? వ్యాపారంలో దాపరికం మోసం కాదా? చేసేవారికి, చెప్పుకునే ధైర్యం లేని వారిని నమ్మి, కోట్లకు కోట్లు చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేస్తే, నష్టపోయేది ఎవరు? కబ్జాలపేరుతో జరుగుతున్న తతంగాలు ప్రజలకు తెలియవా? డాక్యుమెంట్లు మాత్రమే చూసి స్థలాలు కొనే కాలం పోయింది? నమ్మకం అన్నది ఎంతో మఖ్యమైపోయింంది? ఇంత జరుగుతున్నా కనీసం కస్టమర్లకైనా భహిరంగంగా నమ్మకం కల్గించే పని ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం తల్చుకుంటే ఏ స్థలాన్నైనా తీసేసుకోవచ్చు. పైగా ప్రభుత్వమే ఇచ్చిన స్థలం తీసుకోవడం పెద్ద పని కూడా కాదు. కొనుగోలు చేసిన వారు గుట్టను కొనొచ్చు. కొండను తవ్వొచ్చు. నేల మట్టం చేయొచ్చు. కాని రేపటి రోజు కొనుక్కున్న వాళ్లు రోడ్డున పడరన్న గ్యారెంటీ ఏమిటి? వివాదాలు ముసిరితే దాచుకోలేరు. వదిలేసి పోయే పరిస్ధితి వస్తే నెత్తిన తడిగుడ్డ వేసుకోక మానరు. ఇది వాస్తవం. అయినా మభ్యపెడతాం..మసి బూసి మారేడు కాయ చేస్తాం…అడిగిన వారిని అబాసు పాలు చేస్తాం…వారిని కొన్నామని, వారికి కోట్లు చెల్లించామని అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన నిజాలౌతాయా? ఇలా ప్రజల్లో గందర గోళం చేసి, తాంబూలాలు ఇచ్చామని గుడి కోసం పోరాటం చేస్తున్నవారిలో చీలికలు తెచ్చి, ఉద్యమాన్ని పలుచన చేద్దామని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, సమస్యల మరింత జఠిలం చేసుకుంటున్నదే అసలు వ్యాపారులు. వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేని స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తే, ప్రజల నుంచి వచ్చే ఆరోపణలకు వివరణ ఇచ్చుకోకుండా, తెరవెనకు నాటకాలు ఆడితే సరిపోదు. ఎన్నటికైనా జనం ముందుకు వచ్చే రోజు వస్తుంది. అదే జనం చెప్పిందే చేయాల్సి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది.
జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుండి ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారికి ఎల్లవేళలా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న జమ్మికుంట పురపాలక సంఘం మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్ కు కాలనీ ప్రజలు గురువారం కౌన్సిలర్ పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీపతి నరేష్ ప్రస్తుతం తమ కాలనీలో నెలకొన్న సమస్యలను తనదిగా భావిస్తూ.. వాటి పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నాడని. గెలిచిన రెండెండ్ల కాలంలో కాలనీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని పేర్కొన్నారు. అకాల వర్షాలు వచ్చి కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరిన సందర్భంలో తను ముందుండి వరద బారినపడిన ప్రజలకు చేయూతను అందించేందుకు ఎంతో సాహసించాడని తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వారికి జరిగిన నష్టానికి నష్ట పరిహారం ఇప్పించాడని కొనియాడారు. ఇటీవల ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందగా అతన్ని దహన సంస్కారాలు చేయడంలో కాలనీ ప్రజలు వెనుకాడుతున్న సమయంలో సైతం తను ప్రాణాలకు తెగించి అట్టి వ్యక్తి యొక్క దహన సంస్కారాలు దగ్గరుండి చేయించడం అభినందనీయమన్నారు.
`ప్రభుత్వ సొమ్మంటే నొక్కేయడమేనా? ` అది నేరం కాదా..శిక్షలుండవా? ` ఇంత భయం లేని భరితెగింపా? ` కరీంనగర్ ఆర్వోలో దోషులను వదిలేస్తారా? ` నరేష్, అనూష,గంగ లీలలు దోచింది వసూలు చేయరా? ` సస్పెండ్ చేశాక మళ్లీ ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు? `80 లక్షలు మాయమైతే శాఖ పెద్దలకు చీమకుట్టినట్లు కూడా లేదా? ` రూపాయి కూడా ఇన్నేళ్లైనా రికవరీ కాకుంటే ఎలా? ` కేసు కూడా నమోదు కారణం ఎవరు? ` కమీషనర్ దాకా సమాచారం చేరకుండా చేసిందెవరు? ` మాతో పెట్టుకొంటే ప్రభుత్వానికే నష్టమంటున్నదెవరు? హైదరాబాద్ , నేటిధాత్రి : రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు నాలుగు తరాలక సంపాదిస్తారంటారు? అది ఎంత వరకు నిజమో! కాదో!? కాని ఒక్కసారి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో చిన్న క్లర్కు పోస్టు వున్నా చాలు అంటున్నారు. అంతకన్నా ఎక్కువే సంపాదించొచ్చట. ప్రభుత్వ స్టాంపు పేపర్లు మాయం చేస్తే ఏటా లక్షలు వెనకేసుకోవచ్చు? పై వాళ్ల చల్లని చూపులుంటే ఇక కోట్లే కొల్లగొట్టొచ్చు? ఇది ఎవరో అంటున్న మాట కాదు… సాక్ష్యాత్తు ఆ శాఖలో పనిచేసే వాళ్లే అనుకునే మాట. ఇక ఉద్యోగులతో ప్రజల పడరాని పాట్లు పడుతున్న సంగతి తెలియంది కాదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే, ఆ కాగితాలు చేతికొచ్చాయంటే అంతకన్నా అదృష్టవంతుడు మరొకరు వుండరన్నంత ఆనందపడాలి. కాగితాలు చూసి మురిసిపోవాలో…అంతకన్నా ఎక్కువ ముట్టజెప్పి ఉన్నది ఊడ్చుకున్నందుకు ఏడవాలో తెలియని పరిస్ధితిలో కొన్ని లక్షల మంది ప్రజలు వున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శాఖల్లో ఒకటైన కరీంనగర్ ఆర్వో కార్యాలయంలో జరిగిన లూటీ అక్షరాల ఎనబైలక్షలకు పైగానే అంటున్నారు. ఇది అందరికీ తెలుసు. కాని ఏం జరిగింది? అవినీతి చేసిన అధికారులు దర్జాగా వున్నారు. స్టాంపు పేపర్లు మాయం చేసిన వాళ్లు హాయిగా వున్నారు. ప్రమోషన్లు కూడా పొందారు. అటు లంచాలు, ఇటు లూటీలతో నోట్ల సాగు చేసుకుంటున్నారు. ఆస్ధులు పెంచుకుంటున్నారు. సహజంగా అవినీతి అంటే లంచాలు మాత్రమే అనుకుంటారు ఎవరైనా! కాని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో మాత్రం స్టాంపులకు స్టాంపులు అమ్ముకుంటారు. నకిలీ ఛలాన్లు సృష్టిస్తారు? లక్షలకు లక్షలు స్టాంపు పేపర్లు మాయం చేస్తారు? స్టాంపు వెండర్ల మీద తోసేస్తారు? ఇదిలా వుంటే రిజిస్ట్రేన్ల విషయంలో సకల విద్యలు ప్రదర్శిస్తారు. లీలలన్నీ వినియోగిస్తారు? తిమ్మిని బమ్మిని చేస్తారు? ఆఖరుకు సెటిల్ మెంట్లు కూడా చేస్తుంటారు? భూమాయ చేసేస్తారు? ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ఇలా వాళ్లు చేయని పని అంటూ వుండదు. లంచం లేకుండా ఫైలు కదలించరు. ఏ రోజుకారోజు వేలకు వేలు జేబులో పెట్టుకోకుండా ఇల్లు చేరరు. ఇదీ ఆ శాఖలోని ఉద్యోగుల తీరు? కాదని ఎవరూ అనలేరు? ఎందుకంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న సందర్భం చూశాం…ఈ వ్యవస్ధలో మార్పు కోసం సిఎం కూడా పెట్టాల్సినంత శ్రద్ద పెడుతున్నా…అధికారులు భయపడడం లేదు. ప్రభుత్వ బొక్కసానికి దర్జాగా బొక్క పెడుతున్నారు. కోట్లకు కోట్లే కొల్లగొడుతున్నారు. అప్పుడప్పుడు…అక్కడక్కడ దొరుకుతున్నారు…సస్పెండ్ కూడా అవుతున్నారు. తప్పు వేరేవారి మీద తోసేస్తున్నారు. ఇక్కడినుంచి ఒక్క అడుగు కూడా శాఖపై అవినీతి నిరోధక శాఖ అడుగు ముందుకు వేయడంలేదు. అటు సస్పెండ్ చేసి ఏసిబి చేతులు దులుపుకుంటుంది? విచారణ పేరుతో ఆ శాఖ పెద్దలు ఉద్యోగులకు క్లీన్ చీట్ ఇస్తారు…తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంటారు…అందుకు లక్షలకు లక్షలు మళ్లీ చెల్లింపులు సమర్పించుకుంటారు. అంతగా అవసరమైతే వారి విచారణ ఫైళ్లను వారి చేతుల్లోనే పెట్టుకునేంత సమర్ధత కూడా సాధిస్తుంటారు. ఇదిలా వుంటే ఆ శాఖ పెద్దలకు అవసరమైన సేవలు అందిస్తుంటారు… వారికి మామూళ్ల ఏజెంట్లుగా తరిస్తుంటారు. స్వామి కార్యం, స్వకారంతో మరింత వెనకేసుకుంటారు. ఇలా పెద్దలే మెండుగా ఆశీస్సులు అందిస్తుంటే దోచకోవడం, దాచుకోడం మా హక్కు అన్నంతగా మారిపోయింది. ఉద్యోగుల దురాగతం. కింది స్ధాయి నుంచి జరిగే అవకతవకలకు జిల్లా స్ధాయినుంచి రాష్ట్ర స్ధాయి పెద్దలకు వరకు ఊతమౌతున్నారు. వారి అండదండలతోనే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ఈ విషయాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్న నేటి దిన పత్రికను చూసి, కమీషనర్ చూసినప్పుడు కదా? ఆయనకు విషయాలు తెలిసినప్పుడు కదా? ఆయన స్పందించినప్పుడు కదా? మేంచూసుకుంటాం …లే? మేనేజ్ చేస్తాం …లే? అంటున్నారంటే వారిలో పెరిగిన అతి విశ్వాసానికి అండ ఎవరు? వారి అడ్డగోలు సంపాదనకు దన్ను ఎవరు? అన్నది ఇప్పటికైనా తేల్చితే గాని ఈ అవినీతి ఆగదు. ఇప్పటికే అనేక కార్యాలయాల్లో ఇలాంటి అవినీతే వెలుగు చూస్తున్నా, పెద్దలు ఎందకు చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మాతో పెట్టుకొని పెద్దలేమీ చేయలేరన్న మాటలు నిజం చేస్తున్నారా? అన్నది తెలియాల్సిన అవసరం వుంది. (ఆఫ్ ది రికార్డు?) ` మాతో పెట్టుకుంటే నష్టం ప్రభుత్వానికే..!: ట్వింకిల్ జాన్? మాతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం? కొసరు లెక్కలు చూసే వరకే కమీషనర్‌కు సమయమే సరిపోదు. ఏసిబి చేసేదేముంది? తర్వాత మళ్లీ ఉద్యోగాలిస్తే చూస్తూ ఊరుకోక ఏం చేస్తుంది. విజిలెన్సే మన చేతిలో వుంటే, మన ఉద్యోగులు రక్షణ మన చేతిలో వుండగా ఎవరూ ఏం చేయలేరు? మనల్ని ఎవరూ ఆపలేరు? ప్రభుత్వం ఏనాడో బాధ్యతలు వదిలేసింది? ఉద్యోగాల భర్తీ ఏనాడో అటకెక్కించింది? కొత్త వాళ్లు వచ్చేది లేదు? మనం పోయేది లేదు? కొత్త ఉద్యోగాలకు దిక్కులేదు? అదనపు పనులు చూసేందుకు మనం కాకపోతే మరెవరు? ఈ ప్రభుత్వం వున్నంత వరకు కొత్త వాళ్లు రారు..మన పోస్టులకు ఢోకా లేదు. రాసుకునేవారు రాసుకుంటుంటే…మనం చేసేదేమైనా? ఆగుతుందా? ఒక్కపైసా అయినా రికవరీ ఏమైనా అయ్యిందా? ఏసిబి కేసులు నమోదు చేసినా, విచారణ కమీటీ మన చేతిలోనే…ఫైళ్లు మన చేతిలోనే…ఇంకా ఎందుకు భయం? ఏ ప్రభుత్వం వచ్చినా మనదే రాజ్యం…వందల సంఖ్యలో నిత్యం వార్తలొస్తాయి? వాటిని పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదు. అంత సమయం మనశాఖలో పెద్దలకు లేదు? రివ్యూలకే సమయం సరిపోవడంలేదు? లెక్కలు చూసేదెవరు? తేల్చేదెవరు? అయామ్ హియర్…డోన్ట్ ఫియర్…డోన్ట్ వర్రీ…ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సాక్ష్యాత్తు ఉద్యోగులతో కరీంనగర్ డిఐజీ ట్వింకిల్ జాన్ అన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలా అధికారుల ఆలోచనలు వుంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టించలేదు. పట్టినా శిక్షించలేడు. అందుకే ఇక విజిలెన్స్ అనే వింగ్ ఎందుకు? దండగ? దాన్ని తీసేయ్యండి? అని బాధితులు అంటున్నారు. వాళ్లే తప్పు చేస్తారు. విచారణ కమిటిలో వాళ్లే వుంటారు. ఇక అమాయకులను బలిచేస్తారు. వాళ్లు మాత్రం ఉద్యోగాల్లో వుంటారు. ప్రమోషన్లు కొట్టేస్తుంటారు. లంచాలతో పాటు, ప్రభుత్వ సొమ్మును కూడా కోట్లుకు కోట్లు లూటీ చేస్తుంటారు…అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎన్ని కిరికిరిలు పెట్టాలో అన్ని పెట్టి అలా లంచాలు తింటారు. ఇలా స్టాంపు పేపర్లేమో తమ ఇంట్ల కాగితాల్లాగా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటారు…కోట్లుకు కోట్లు తరలిపోతున్నా…పెద్దలు చూడరు…పట్టించుకోరు…ఇదీ జనం నిట్టూర్పు!!!
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24వ డివిజన్ లో జెండా వందనం కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ దాచేపల్లి సీతారాం అలాగే డివిజన్ ప్రాంతవాసులు డివిజన్ కార్పొరేటర్ తేజస్వి శిరీష్ తదితరులు పాల్గొని వాసవి క్లబ్ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డివిజన్ లోని వారు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్లు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది
ఈరోజు హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో హబ్సిగూడ ఎన్ జి ఆర్ ఐ బస్ స్టాప్ వద్ద 73వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్, సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి గారు జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి మరియు హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ వడ్ల వెంకటేష్ చారి మాట్లాడుతూ,1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.ఈ కార్యక్రమంలో ఓంసింగ్ మధు రణధీర్ ఉదయ్ పవన్ చందు దినేష్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఖానాపురం నేటిధాత్రి:మండలంలోని సొసైటీ కార్యాలయంలో ఒడిసిఎఎంసి చైర్మన్ రామస్వామి నాయక్ సిఈవో ఆంజనేయులు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రకాష్ రావు, ఎంపీడీవో సుమన వాణి, జెడ్పిటిసి స్వప్న శ్రీనివాస్, మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సుభాషిని, ఆర్ఐ సత్యనారాయణ ఆయా కార్యాలయాల్లో సిబ్బంది లతోపాటు 73వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం స్వీట్లు పంచారు. ఈకార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, మండల ప్రజా పరిషత్ సిబ్బంది,తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది,అందరు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్నగౌడ్
చెన్నారావుపేట-నేటిధాత్రి:చెన్నారావుపేట మండల కేంద్రంలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నారావుపేట టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్నే వెంకన్న గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు ఆవిష్కరించి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలైన రోజు కనుక అప్పటినుండి నేటి వరకు గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, రాజ్యాంగంలో మానవ హక్కులు పరిపాలన, న్యాయ, పాలక, అధికార వ్యవస్థల హక్కుల గురించి రాసిన అంబేద్కర్ గారు 1950న రాజ్యాంగంలో పొందుపరిచారు అని అన్నారు. మనిషి యొక్క జీవన విధానంతో పాటు సమానత్వం, స్వాతంత్య్రం, స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి ప్రసాదించి, కుల, మత, లింగ వివక్షలు లేని సమాజాన్ని మనకు అందించాడు అంబెడ్కర్ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగనీ మనకు అందించారని అన్నారు. ఈ సందర్భంగా ధనిక, పేద, పాలక, పాలిత వర్గ విబేధాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం, సర్వ మత సమ్మేళనం, సౌబ్రాతృత్వాలను అందించి అత్యంత ఘననీయ, ఆమోగాయోధ్యమైన రాజ్యాంగాన్ని నిర్మించాడని అన్నారు. ఆయన కృషి వలనే మనం ఇలా బ్రతుకుతు న్నామని అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు బాధవత్ విజేందర్ జడ్పిటిసి బానోత్ పత్తినాయక్,జడ్పి కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు కుండే మల్లయ్య,మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ గఫ్ఫార్,పార్టీ మండల యువ నాయకులు కంది కృష్ణ చైతన్య రెడ్డి, మాజీ జడ్పిటిసి జున్నుతుల రాంరెడ్డి,గ్రామపార్టీ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు,వార్డు సభ్యులు రసమల్ల సతీష్ ,బండి ఉపేందర్ ,గట్ల రాంబాబు, జాగృతి మండల అధ్యక్షుడు మూడు రమెష్ ,జున్నుతుల మహేందర్ రెడ్డి, ఎస్ సి సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య , మండల నాయకులు సాధు నర్సింగరావు, పార్టీ మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీల నాయకులు, సొసైటీ ఛైర్మన్ లు, డైరెక్టర్ లు, ఆర్ ఎస్ ఎస్ డైరెక్టర్ లు వివిధ గ్రామాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా ప్రసిద్ధి గాంచి దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని కోరిన కోర్కెలు తీర్చమని వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకొంటూ ఉంటారు. అలాంటి మహత్తర జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ ఎన లేని సేవలు చేసిన గాయత్రి గ్రానైట్ సంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్ర కి ఈ అవకాశం దక్కటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రామయ్య తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రామారావ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ సర్కిల్ ఆఫీస్ లో సి ఐ మరియు మండలం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ దావూద్ వినోద వీరారెడ్డి జడ్పిటిసి గొర్రె సాగర్ తదితరులు పాల్గొనడం జరిగింది, అలాగే బిజెపి కార్యాలయంలో మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరియు గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల కార్యదర్శులు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాలలో మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సర్పంచులు అన్ని యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది.
రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా నేటిదాత్రి: ఇల్లంతకుంట మండలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో నీ ఆర్మూర్ నుండి నందిపేట గ్రామానికి వెళ్తుండగా కొంతమంది తాగుబోతు తెరాస దుండగులు ఎంపీ పై హత్యయత్నం చేసిన దుండగులకు పోలీస్ వాళ్ళు సకరించటం పేక్షకపాత్ర పోషించటం సరికాదు, ఎంపీ బీజేపీ నాయకులపై దాడిచేయటాన్ని తీవ్రంగా కండిస్తూ తెలంగాణా రాష్ట్ర హోమంత్రి మహబూబ్అలీ దిష్టి బొమ్మ దహనం చెసిన ఇల్లంతకుంట మండల బీజేపీఅధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి నాయకులు తీవ్రంగా కండిస్తూ వెంటనే దాడి చేసిన తెరాస దుండగులను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు, ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రల సంతోష్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లరం ప్రసన్న, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, మండల మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ పసిద్దీన్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపిల్ల శ్రీకాంత్, సమ్ము, అమ్మన్ తదితరులు పాలుగోన్నారు
` ఉత్తరాధిన ఉరకలు…దక్షిణాదిన కుదేలు ` తెలంగాణలో వానపాములా పాకుతూ… ` ప్రజలు నమ్మినా….నాయకులు ముంచుతూ… ` రేవంత్ రెడ్డి రాకతో పార్టీలో పెరిగిన జోష్… ` హుజూరాబాద్ ఉప ఎన్నికతో తుస్… ` సీనియర్ల అలక…జూనియర్ల కినుక… ` ఒకరికొకరు దూరం…దూరం… ` అంతర్గత విభేదాలతో ప్రజల్లో వేళ్లలేని దుస్థితి ` ఐకమత్యం మాయమై ప్రజలకు దూరమై
దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్నది నిజం. ఇది పసిగట్టలేకపోవడం కాంగ్రెస్ శ్రేణుల వైఫల్యం. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు గెలిచింది కాంగ్రెస్. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్‌పార్టీ. ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరుగుతున్నా, ఒక్క తెలంగాణలో తప్ప అంతటతా కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికీ దేశంలో కనీసం 200 లోక్‌సభ స్ధానాల్లో కాంగ్రెస్ బలంగా వుంది. బిజేపికి ప్రత్నామ్నాయ శక్తిగానే కాంగ్రెస్ వుంది. కాని నాయకులే డీలాగావున్నారు. పార్టీ అధికారంలో వుంటేగాని పార్టీని అంటిపెట్టుకొని వుండలేదు. హైదరాబాద్ , నేటిధాత్రి : దేశంలో మార్పు కనిపిస్తుంటున్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయంటున్నారు. ఉత్తరాధిన కాంగ్రెస్ ఉరకలెత్తే స్ధితిలో వుందంటున్నారు. కాని దక్షిణాదిలో ఒకరి కాళ్లు ఒకరు పట్టుకొని లాగేసుకుంటున్నారు. లేని దగ్గర లేనే లేదు..వున్న దగ్గరైనా పుంజుకోనివ్వలేకపోతున్నారు. జనం ఓట్లేస్తున్నా నిలుపుకోలేకపోతున్నారు. గెలిచిన వాళ్లు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. వాళ్లను ఆపిన వాళ్లు లేరు. కొత్తగా పిసిసి రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ అంటున్నా ఎవరూ కనికరించడం లేదు. పెద్దగా స్పందన లేదు. అక్కడోఇక్కడో చేరుతున్నట్లు కనిపించినా స్పూర్తిదాయకమైన చేరికలు లేవు. పెద్ద పెద్ద నేతలు లేరు. ఇటీవల మాజీ పిపిసి. అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇదిగో చేరే..అదిగో చేరే అన్నారు. ఆఖరుకు ముహూర్తం కూడా చెప్పారు. మళ్లీ వాయిదా అంటున్నారు. అయితే డిఎస్ చేరికతో కొత్తగా ఒరిగేదేమీ వుండకపోవచ్చు. కాకపోతే చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడొచ్చు. గెలిచినోళ్లను గెలిచినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి గుంజుకుపోతుంటే గుడ్లప్పగించి చూశారు. వద్దని వారించలేకపోయారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే, వచ్చేసారి ప్రజలను మెప్పించి అధికారం తెచ్చుకుందామని నాయకులు ఒకరికొకరు నచ్చజెప్పుకునే ఐక్యత లేదు. పార్టీ మారేది వుంటే రాజీనామా చేసి వెళ్లిపో అని ఎవరూ గట్టిగా మాట్లాడిరది లేదు. ఎంత మంది పోతే అంత మాకు మేలే అన్నట్లు 2014 నుంచి నాయకులు వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీని పాతాలానికి దిగబడిపోయేలా చేసింది. అయినా కార్యకర్తల బలం ఆ పార్టీకి మెండుగానే వుంది. నాయకుల మధ్యే ఐక్యత కొరవడిరది. మాటల యుద్దం మాత్రమే వారి మధ్య ఏళ్లుగా కొనసాగుతోంది. ` రేవంత్‌తో ఉరుకుడే..ఉరుకుడు అనుకున్నరు?: ఏళ్లుగా ఎదురు చూసిన రేవంత్ రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం కనిపించింది. కార్యకర్తల ఆలోచనలతోపాటు రేవంత్‌రెడ్డి నిజానికి పరుగెత్తాలనే చూశాడు. అంతకు ముందునుంచే ఒక వర్గం ఆయనను ఎలా అడ్డుకోవాలో చూస్తూనే వుంది. అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూనే వుంది. కదలకుండా కాళ్లలో కట్టెలుపెట్టే పనులు చేస్తూనే వుంది. ఇవన్నీ తెలిసినా రేవంత్ రెడ్డి చాకచాక్యంగా వ్యవహరిస్తారనే అందరూ అనుకున్నారు. కాని సీనియర్ నేతలు ఉచ్చుల్లో పదేపదే రేవంత్ రెడ్డి చిక్కుకొని, ముందుకు వెళ్లలేక, వెనక్కి అడుగేయలేక కూడా ఆలోచనలో పడే కాలం వస్తుందని ఎవరూ ఊహించలేదు. జడ్పీటీసిగా గెలిచిన నాడు రేవంత్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఇండిపెండెంటుగా ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు ఎవరూ తోడు లేరు. తెలుగుదేశంలో పార్టీలో ఆయనకు ఏనాడు ఎదరులేదు. అదేంటోగాని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అయ్యాక అడుగులు వేయాలంటే ఆచి తూచి వేయాల్సివస్తుంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదేమో! అనిపిస్తున్నా, హుజూరాబాద్ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఎప్పటికైనా ఇబ్బందికరమే…ఈటెల రాజేందర్‌కు పరోక్షంగా సహకరించారాలేదా? అన్నది పక్కన పెడితే యుద్దానికి ముందే అస్త్రసన్యాసం చేయడం అన్నది రాజకీయాల్లో తగనిది. అందరికంటే ముందు పరుగెత్తాలి. ప్రజల మెప్పు పొందాలి. క్యాండెట్ ప్రకటన జరగాలి. యాంత్రాంగమంతా కదలాలి. కాని పెద్దగా అదేం జరగలేదు. రేవంత్ రోడ్‌షోలు తప్ప మరేం జరగలేదు. సీనియర్లకు హుజూరాబాద్ ప్రచారానికి ఆహ్వానం లేదు. ఇది సాక్ష్యాత్తు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే. ఇక తాజాగా జగ్గారెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్లోఒక్కసారిగా చప్పుడు లేదు. కాంగ్రెస్‌పార్టీ పనులేమీ లేదు. ప్రచారం లేదు. ఉలుకు లేదు. పలుకు లేదు. అప్పుడప్పుడు మీడియా సమావేశం తప్ప, జనంలోకి వెళ్లింది లేదు. జనాన్ని జాగృతం చేసింది లేదు. కొట్లాడిరది లేదు. వరి కొనుగోలు దగ్గరే ఆగిపోయారు…అక్కడినుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. వరి కుప్పల మీద రైతులు చనిపోతే వెళ్లి, వారికి అండగా నిలిచారు. అయినా ఫాయిదా లేకుండా చేసుకున్నారు. ఆ క్రెడిట్ కాస్త బిజేపి తన్నుకుపోతుంటే చూస్తూ నొరెళ్లబెట్టారు. అనవరసరంగా ఏదో… అయ్యామని సీనియర్లు లోలోపల నసిగారు. ఆరంభశూరత్వం తప్ప మరేం లేదని మీడియా ముందే తిట్టుకున్నారు. ముందే మేం చెప్పామని, ఆ కోపమంతా రేవంత్ మీద తీర్చుకుంటున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వుంది. చాలా రాష్ట్రాల్లో బలంగా వుంది. వచ్చేనెల ఎన్నికలు జరగాల్సిన వున్న రాష్ట్రాలైన పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్సే ముందంజలో వుందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్ గాలే వీస్తోందంటున్నారు. ఇక గోవాలో గత ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు గెల్చుకున్నా ఏం జరిగిందో తెలిసిందే… ఈసారి తప్పు చేయకుండా పూర్తి స్ధాయి మెజార్టీ స్ధానాలు సాధించాలన్న కసితోనే పనిచేస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ పరిస్ధితి ఎమిటన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా, ఎంతో కొంత మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం ఏమిటి? ఒకరికొకరిలో ఈ వైరుద్యమేమిటి? కలిసి సాగేందుకు ఇబ్బందేమిటి? తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కసిలేదెందుకని? పైకి చెప్పే మాటలకు, వారు అనుసరిస్తున్న విధానాలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. ఇటీవల 317 జీవో విషయంలో ఆచి తూచి అడుగులేయాలనుకున్నది. కాలయాపన చేసింది. ఉద్యోగులకు అండగా నిలువలేకపోయింది. వారిలో నమ్మకం నింపలేకపోయింది. సందులో దూరి ఇక్కడ కూడా బిజేపి క్రెడిట్ కొట్టుకుపోయింది. కాంగ్రెస్‌ను రాష్ట్ర రాజకీయాల్లో మరింత దూరం చేసింది. అందుకే రాజకీయాల్లో ఒక మాట చెప్పుకుంటారు…నేను గెలిచాను…అనడమే కాదు… నిన్ను ఓడిరచానని పదే పదే గుర్తు చేయాలి. అప్పుడే రాజకీయాల్లో పై చేయి సాధిస్తుంటారు. సరిగ్గా ఇక్కడ బిజేపి అదే ఆట ఆడుతోంది. కాంగ్రెస్‌కు జవసత్వాలు రాకుండా బిజేపి కూడా టిఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తోంది. కాంగ్రెస్ లేస్తే తాము నిలబడలేమని బిజేపికి తెలుసు…అది గమనించలేకే కాంగ్రెస్ ఆపసోపాలు…ఈ మాత్రం అవగాహన వుంటే అది కాంగ్రెస్ ఎందుకౌతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా ప్రసిద్ధి గాంచి దేశ నలుమూలల నుండి లక్షలాది ప్రజలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని కోరిన కోర్కెలు తీర్చమని వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకొంటూ ఉంటారు. అలాంటి మహత్తర జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ ఎన లేని సేవలు చేసిన గాయత్రి గ్రానైట్ సంస్థ అధినేత వద్దిరాజు రవిచంద్ర కి ఈ అవకాశం దక్కటం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
గాదె వాగు సమీపంలో జరిగిన సంఘటన కార్లయి కి చెందిన ఇద్దరికి స్వల్ప గాయాలు
కొత్తగూడ, నేటిధాత్రి.కూరగాయలతో వస్తున్న ఆటోను గమనించిన కోతులు దాడి చేస్తాయని వాటిని గమనించిన డ్రైవర్ ఆటో ను అతి వేగంగా వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లయి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారస్తులు నర్సంపేట నుండి కూరగాయలు తీసుకొని వస్తుండగా గాదె వాగు సమీపంలో కోతులు గమనించాయిఆ ప్రదేశంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆటోను కోతులు వెంబడించి చాయి వాటిని తప్పించుకొని వస్తుండగా మూలమలుపు వద్ద ఉన్న గుంతలో కి వెళ్లి ఆటో బోల్తా పడింది ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.భవన నిర్మాణం ఎంత ముక్యమో అదే విధంగా ఇన్ఫ్రాస్త్రక్టర్ ,పరిసరాలు, పార్కింగ్,పచ్చదనం లాంటి అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు కొన్ని సూచనలు చేసారు.మహబూబాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరిద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, గోగుల రాజు, హరిసింగ్, ఎలెందర్ మరియు తదితరులు ఉన్నారు.
అటు సురేష్?ఇటు నరేష్!? మధ్యలో క్లర్కులు? కరీంనగర్ ఆర్వోలో అవినీతి లీలలు? అంతా రావే చేశాడు? ద్విపాత్రాభినయంతో దోచేశాడు? అధికారి ఆయనే…విచారణాధి అతేనే! ఇంకేముంది!? ఊరవతల కార్యాలయం….సోకులకు సోపానం? అన్ని అవలక్షణాలు ఆయన సొంతం? అయ్యవారి సేవలో పాత్రదారులు? ఆటలో అరటి పండ్లు వెండర్లు? నా ఆటచూడు, పాట చూడు…నాటు…నాటు….???? రిజిస్ట్రేషన్ల శాఖలో సన్యాసం తీసుకొన్న వ్యక్తికి ఉద్యోగమిస్తే, నాలుగు రోజుల్లో సంసారిని చేస్తారని ఓ సామెత. ఇది చాలా సుతిమెత్తగా చెప్పడానికి పత్రికాభాషలో చెప్పిన మాట. అంటే ఏమిటో ఇప్పటికే అందరకీ అర్ధమైవుంటుంది. ఆ మాట ఎవరో కాదు, ఆ శాఖ పనితీరును చూసిన పెద్ద పెద్ద వాళ్లే అన్నమాటనట! నాలుగు రోజుల్లో నీతి మంతుణ్ణి అవినీతికి కేఆరాఫ్ అడ్రస్ చేసేస్తారని అంటారు. ఇది నిజమే అన్నట్లు కరీంనగర్ జిల్లా ఆర్వోలో తవ్విన కొద్ది అవినీతి మూలాలు బైటపడుతున్నాయి. చిన్న చేపలే అనుకంటే, తిమింగలాలు, వాటిని ఆడిరచి, ఆరగంచుకునే అనకొండలు కూడా వెలుగు చూస్తున్నాయి. అసలు వింటుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కాదేదీ అవినీతికనర్షం అన్నంతగా వారు ఎంచుకునే విధానాలు, అనుసరించే మార్గాలు, సృష్టికే ప్రతిసృష్టిలాగా అన్నీ తయారు చేయగలరు. అన్నీ మింగేయగలరు. మొత్తం ఖజానాకే బొక్క పెట్టగలరని నిరూపిస్తూ వస్తున్నారు. అయినా వారు చిక్కరు…దొరకరు…కారణం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు…చదవండి… మంత్రాంగం నడిపేవారి చేతిలో యంత్రాంగం వుంటే, అడమన్నట్లు ఆడేందుకు సిద్ధంగా అనుచరులు వుంటే, కనిపించిన సొమ్మును చూసి జేబులో మడుకునే అలవాటున్నవారంతా ఒక్కచోట చేరితే ఎలా వుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అదలా వుంటే కింది స్ధాయి వాళ్లు చేసే పనులను చూసీ చూడనట్లు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులు తోడైతే ఇక అవినీతికి అడ్డూ అదుపు వుంటుందా? అంతుంటుందా? నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష..ఇంతే ఇంకేముంది దాచుకో, దోచుకో…కాలం గడిస్తే చాల గాయం మాయమైపోతుంది. చేసిన తప్పులు మర్చిపోతారు. కొత్తకొత్త వాటిని ఎంచుకోవచ్చు. జనం సొమ్ము ఊదేసుకోవచ్చు. కోట్లుకు కోట్లు దిగమింగేయొచ్చు. అడిగేవారు ఎవరు? అడ్డుకునేవారు ఎవరు? అంతా మాయా…మశ్చీంద్రా…కింది స్ధాయి వారిని పై స్ధాయి వాళ్లు చేతిలో పెట్టుకుంటారు. పై స్ధాయి వాళ్లు కింది స్ధాయి వారికి సహకరిస్తూ వుంటారు. ఇంకేముంది వాళ్లు ఆడిరది ఆట…పాడిరది పాట…సుఖం…సౌఖ్యం…బహువిధాల లాభం…ఇంకేమింకేం కావాలే…అనుకుంటూ పాడుకోవడం తప్ప… పాత్రదారులు, సూత్రదారులు అంతా కలిసి ఆర్వో శాఖ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. కోట్లకు కోట్లు ఉద్యోగులు కొల్లగొడుతున్నారు. కింది నుంచి పై స్ధాయిదాకా వాటాలు పంచుకుంటున్నారు. దొంగలుగా ముద్ర పడాల్సినచోట దొరలుగా వెలుగొందుతున్నారు. ఇతరులను బలిచేస్తున్నారు. వండే దగ్గర, వడ్డించే దగ్గర ఒక్కడే వుంటే ఏం చేస్తాడు? వండిరదాట్లో వాడే సగం మింగేస్తాడు…ఇదే ఇక్కడ ఆర్వోలో ఉన్నతాధికారులు అనుసరిస్తున్న బాట అని ఆ శాఖలో చాలా మంది అంటున్నమాట. ఆ మాటలను నిజం చేస్తూ జనం సొమ్ము కొల్లగొడుతున్నారన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్న మాట. అక్కడా వాళ్లే, ఇక్కడా వాల్లే కూర్చొని ప్రభుత్వ సొమ్ము మేసేస్తున్నారు. దగ్గరుండి ప్రభుత్వాదాయాన్ని జేబుల్లో నింపుకుంటున్నారు. ఖజానా ఖాళీ చేస్తున్నారు. ఆడ వుంటా…ఈడ వుంటా…?: పాత్రదారి, సూత్రదారి ఒక్కడే అయితే మంత్రమైనా, యంత్రమైనా ఒక్కటే…ఇదే సర్వరోగ నివారణి. ఉద్యోగుల కొరత పేరుతో పెత్తనమంతా ఒక్కరికే అప్పగిస్తే ఇలాగే వుంటుంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన శాఖ పెద్దలకు అన్నీ బాధ్యతలు అప్పగించడంతో, తాళం పగలగొట్టించడం, తాళం వేయించడం ఒక్కరే చేస్తే, గదిలో మాయమైనదేమిటో చెప్పడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఇదే అనువుగా 2015 వరకు కరీంనగర్ జిల్లా ఆర్వో బాధ్యులైన రమణారావు ఆడి, ఆడిరచిన ఆటలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న రమణారావు తన కనుసన్నల్లోనే అంతా కానిచ్చి, ఉద్యోగులైన సురేష్, నరేష్‌తోపాటు మరో ఇద్దరు మహిళా క్లర్క్‌లతో కోటికి పైగా ఆ రోజుల్లోనే అప్పనంగా నొక్కేసి, ఖజానాకు కన్నం పెట్టాదన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకు ఎలాంటి సంబంధం లేని వెండర్లను బలి చేసిశారని ప్రధాన ఆరోపణ. ఎడమ, కుడి భుజాలుగా పనిచేసిన సురేష్, నేరేష్‌లకు అండగా నిలిచి, ఇతర క్లర్కులతో లక్షలకు లక్షలు మాయం చేసినట్లు తెలుస్తోంది. సురేష్ కథ వెలుగులోకి…?: సురేష్ అనే వ్యక్తి చేసినఅవినీతి బైటపడిరది. కాని రమణారావు ఎంతో చాకచక్యంగా సురేష్ తప్పేం లేదన్నట్లుగా రిపోర్టు తయారు చేసి, తప్పంతా వెండర్లదన్నాడు. అది నిజం చేయాలంటే వెండర్లు తప్పంతా తమదే అనాలి. వెంటనే సురేష్ వెండర్లనుంచి రాతపూర్వక హమీ పత్రాలు సేకరించే పనిలో పడ్డాడు. ముగ్గురు వెండర్లనుంచి నయానో, భయానో తీసుకోవాలనుకున్నారు. కాని ఇద్దరే సంతకాలు చేశారు. తప్పంతా తమదే అన్నారు. కాని ఒక వెండర్ మాత్రం చేయని తప్పుకు నేనెందుకు బాధ్యత వహిస్తాను? దోషిని ఎందుకౌతాను? నేరం చేయకుండా ఎందుకు శిక్ష అనుభవిస్తాను? అసలు నేను చేసిన నేరమేమిటి? అంటూ నిలదీశాడు. ఈ విషయం రమణారావు దాకాచేరింది. సదరు వెండర్‌ను పిలిచి సురేష్ తప్పు చేస్తే, అదే రోజు నాకెందుకు చెప్పలేదని బెదిరించే ప్రయత్నం రమణారావు చేశారు. సహజంగా ఉన్నతోద్యోగులంటే సామన్యులకు కొంత భయం వుంటుంది. వారి ముందు మాట్లాడాలంటే బెరుకుంటుంది. ఎలాగైనా సదరు వెండర్ భయపడతాడని రమణారావు ఆశించాడు. వెండర్ అడ్డం తిరిగాడు. ఆ సమయంలో కుర్చీలో వున్నది మీరు లేరన్నాడు. ఇంకేముంది రమణారావుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. దాంతో ఎలాగైనా సదరు వెండర్లపై కేసు నమోదు చేస్తే తప్ప సురేష్ ఈ కేసునుంచి బైట పడడం జరగదని గ్రహించారు. కరీంనగర్ వన్ టౌన్ సిఐకితో కేసు నమోదు చేయించాలని చూశారు. కాని ఆనాటి సిఐ అడిగిన ప్రశ్నలకు తిరిగి రమణారావు, సురేష్‌లక దిమ్మ తిరిగింది. ఇక ఇక్కడ కుదిరే పని కాదని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. అయినా సురేష్ మీద కేసు నమోదు కాక తప్పలేదు. కాకపోతే రమణారావు తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి సురేష్‌ను కాపాడడం జరిగింది. వెండర్లను నానా తిప్పల పాలు చేయడం జరిగింది. అయితే అటు కేసు కోర్టులో నడుస్తుండగానే సురేష్‌కు ప్రమోషన్ కూడా కల్పించిన ఘనత కూడా రమణారావుకే దక్కింది. కాలం కాస్త గడిచింది. సురేష్ ప్రమోషన్ మీద వెళ్లడంతో ఆ స్ధానంలోకి వచ్చిన మహిళా క్లర్క్, ఆమెకు అసిస్టెంట్‌తో కలిసి, రమణారావు సుమారు 90లక్షలకు పైగా స్టాంపుల గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్ వ్యవహారంలో రికవరీ జరిగింది. కాని మహిళా క్లర్క్‌లతో, స్టాంపుల మాయాజాలం చేయించిన రమణారావే విచారణ అధికారి కావడంతో అవి బైటకు రాకుండా చూసుకున్నారు. ఇంతలో రిటైర్డ్ అయి చేసిన తప్పులపై ఎలాంటి విచారణ లేకుండా చూసుకున్నారు. విచారణ వ్యవస్ధ లేదా?: ఎందుకు లేదు. ఖర్మకాలి ఆ శాఖలో ఎవరైతే ఉన్నతాధికారో, అతనే విచారణ అధికారి కావడం ఆయనే రమణారావు కావడం కాలం కలిసొచ్చింది. సొమ్ముకు కాళ్లొచ్చేలా చేసి, ఆయన జేబులోకి వచ్చేలా మార్గం పడిరది. అయితే రమణారావు లీలలు ఇవే కాకుండా, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మరో మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా జిల్లా రిజిస్ట్రార్‌గా తాత్కాలిక విధులు నిర్వర్తించడం అన్నది ఆయనకు బాగా కలిసివచ్చింటారు. ఇక ఆయన అవినీతి ఊడలు ఆదిలాబాద్ నుంచి వరంగల్ దాకా పాతుకుపోయాయని చెబుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే ఇంత జరిగితే, ఆయన అదనపు విధులు నిర్వర్తించిన మిగతా జిల్లాలనుంచి కూడా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పాపం వెండర్లు?: ఎలాంటి తప్పు చేయకపోయినా సమిధలైపోయిన వెండర్ల పరిస్ధితి పెనం నుంచి పొయ్యిలో పడేలా మరో ఉపద్రవం వచ్చి పడిరది. స్టాంపు వెండర్లు ముగ్గురు తాము ఎలాంటి తప్పు చేయలేదని ఏ లాయర్ ద్వారా నిరూపించుకుంటున్నారో…అదే లాయర్ దగ్గరకు కూడా తనకు న్యాయం చేయాలని కోరుతూ, ఆ కేసు నుంచి విముక్తి కోసం సురేష్ కూడా అదే లాయర్‌ను సంప్రదించడం జరిగింది. ఆయన కేసు టేకప్ చేయడం కూడా జరిగింది. ఇది సినిమాలో చూస్తుంటాము. ఇక ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాము. నైతికంగా లాయర్‌కూడా అలా చేయొద్దు…కాని వృత్తిపరంగా అది కూడా తనకు ఛాలెంజ్ అనకున్నారో ఏమోగాని ఆ కేసు సాగుతోంది… రమణరావే సూత్ర, దారి పాత్రదారి?: పూజారే ప్రసాదం ఆరగిస్తే భక్తులకు ఏం మిగులుతుంది అన్నట్లు. ప్రజా ధనం ఇలా ఉన్నతాధికారులు ఊదేస్తూ, మిగిలినవి ఉద్యోగులకు పంచుతూ పోతుంటే ఖజానా నిండేదెప్పటికీ? జనం చెల్లిస్తున్న సొమ్ముకు న్యాయం జరిగేదప్పటికీ? ఏది ఏమైనా కరీంనగర్ ఆర్వోలో గతంలో జరిగిన ఈ మొత్తం వ్యహారం పూర్తి స్ధాయిలో వెలుగులోకి రావాల్సివుంది. జనం సొమ్ము తిన్నవాళ్లు కక్కాల్సివుంది. అమాయకులైన స్టాంపు వెండర్లకు న్యాయం జరగాల్సివుంది. అటు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సమాజ పరంగా వారు కోల్పోయిన పరపతి రావాలంటే వారు తప్పు చేయలేదని నిరూపన కావాలి. అయినా సినిమా కోసం క్యూ లో నిలబడి టిక్కెట్టు కొనుక్కునేవాడికి టెక్కెట్టు కావాలే గాని, అది ఎలా వచ్చిందన్నది అవసరంలేదు. అయితే వెండర్‌గా ఆర్వో కార్యాలయం నుంచి స్టాంపు పేపర్లు కావాలే గాని, అధికారులు ఎలా ఇచ్చారన్నది తెలుసుకోవాల్సిన పనిలేదు. ఇంతే ఇది సింపుల్…కాని వెండర్ల చీటి చిరిగింది. చిరిగి చాటంతై, సాపంతైంది. బతుకంతా తొర్రైంది. శాఖ పెద్దలారా?ఒక్కసారి అటు వైపు చూడండి. నిజా నిజాలు తెలుసుకోండి. అమాయకులను కాపాడంది. ఖజానాకు పడిన బొక్కను పూడ్చండి. అవినీతి అధికారులు మెక్కింది కక్కించండి..అని ప్రజలు కోరుతున్నారు.
వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు సోమవారం వరంగల్ లో వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర గారి 61 వ పుట్టినరోజు వేడుకలు వరంగల్ ప్రధాన కూడలి లో నిర్వహించడం జరుగిందని ప్రతీ సంవత్సరం పేద ప్రజల నడుమ జరపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోచంమైదాన్ జంక్షన్లో 60 కిలోల కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఘనంగా వేడుకలు జరిపి పేదలకు పండ్లు పంపిణి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు బోలుగొడ్డు శ్రీనివాస్,భూక్య మోతిలాల్ నాయక్,రొయ్యల పావని,బొల్లికొండ విజయలక్ష్మి,బోళ్ల సుజాత,ఈర్ల లావణ్య,రవిచంద్ర యువసేన సభ్యులు జై గౌడ జిల్లా అధ్యక్షుడు మార్క రవిగౌడ్,బొల్లోజు శ్రీనివాస్,దూరిశెట్టి సుదీర్,రంగరాజు పృద్వి రాజ్,రామరాజు,వినయ్,కుసుమ రాజు,బూర హరికృష్ణ, నాగరాజు,నరేష్,తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.