మధుకు సెక్షన్ మార్పు? మెమో జారీ?
క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా?
క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది?
క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి?
సెక్షన్ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా?
కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్ ఛలాన బాగోతమేటి?
ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు?
ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్ చేశారా?
ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా?
కమీషనర్‌గారు ఒక్కసారి లుక్కేయండి?
జిరాక్స్‌ల కథాకమామిషు తేల్చండి?
కాస్త ప్రక్షాళన చేపట్టండి?
సస్పెండ్ అయిన వారిపై చర్యలు లేకుండా ఎలా వుండవో చెప్పండి?
నేరాలు చేసి ఎలా మళ్లీ కుర్చీల్లో కూర్చుంటున్నారో చూడండి?
మాటలు మార్చినంత సులువులుగా ఫైళ్లు కూడా మాయం చేయడం ఒక కళేమో! రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్యాలయాల్లో కూడా మాటలే కాదు, చేతలు ఇలాగే వుంటాయి. గోల్‌మాల్ వ్యవహరాలు సాగుతూనే వుంటాయి. అందులో భాగమే క్లర్క్ మధు మాయాజాలం. నేటిధాత్రిలో బుధవారం ప్రచురితమైన ‘స్టాంపు పేపర్లు కిదర్ గయా’ అనే వార్తకు అధికారులు కొద్దిగా స్పందించారు. క్లర్కు మధును ఆ స్ధానం నుంచి కదిలించి, మెమో జారీ చేసి, పక్క సెక్షన్‌కు మార్చారు. ఇంతే…ఇది కూడా పనిష్మెంటే అన్నంత గొప్పగా చెప్పుకుంటున్నారు. తప్పు చేసినవారిని ఉపేంక్షిచేంది లేదన్నంతగా మధును మరో సెక్షన్‌కు మార్చేచి చేతులు దులుపుకున్నారు. ఇంతకీ మధు అనే క్లర్క్ ఎరనా….లేక తిమింగలమా అన్నది మాత్రం తేల్చలేదు. మధు ఎరే…అయితే అసలు తిమింగలాలు ఎవరు? అన్నది కూడా తేలాలి. మధును మార్చినట్లే ఆయన చేత చేయించిన వారిని కూడా సాగనంపాలి. కాని అది జరగలేదు. ఇంతకీ ఈ వ్యవహారంలో మధు ఎవరికీ తెలియకుండా చేశాడా? చేస్తుంటే సెక్షన్ ఇన్‌చార్జి, సూపరెండెంటు కళ్లు మూసుకున్నారా? ఏ ఒక్క స్టాంపు పేపర్ బైటకు వెళ్లినా, వారి పర్యవేక్షణ లేకుండా కదలొద్దు. అలాంటిది ఒక్క మధు మాత్రమే నిర్ణయం తీసుకునేంత పెద్దరికం ఆయన చేతిలో వుందా? అన్నది కూడా ఉన్నతాధికారులే చెప్పాలి. అనుమతి లేకుండ ఇంకా ఎన్ని వెళ్లాయో? అన్నది ఎలా తెలియాలి. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏంటంటే?: ప్రభుత్వశాఖలపై వివరాలు బైటకు రావడం సహజం. అలాంటి వార్తలలో అసలు విషయాలు చాలా మరుగునే వుంటాయి. చిన్న చిన్న విషయాలు మాత్రమే బైటకు వస్తుంటాయి. అలాంటి విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సార్లు వెలుగులోకి వస్తుంటాయి. అందులో మూడేళ్ల క్రితం మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లుకు ఎలాంటి లెక్కలు లేకుండా రెక్కలొచ్చి వెళ్లిపోయాయి అన్నది ప్రచారం సాగింది. ఈ విషయాన్ని నేటిధాత్రి బైట పెట్టింది. దాంతో ఏం చెప్పాలో అధికారులకు పాలు పోలేదు. దాంతో అసలు విషయం అది కాదంటూ కొత్త కథ అల్లేశారు. అందులో శివకుమార్ అనే స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు కార్యాలయ క్లర్కు అందజేశాడని అన్నారు. తర్వాత రూ.50వేలకు చెందిన ఛలానా చెల్లించడం జరిగిందన్నారు. ఇది పొంతన లేని సమాధానం. అసలు జరిగిందెంత? అన్నదానిపై స్పష్టత నివ్వాల్సిన సమయంలో అబ్బే జరిగింది అంత కాదు..ఇంత అని ఒప్పుకోవడం జరిగింది. కాని ఇందులో రసవత్తరమైన సంఘటన జరిగినట్లు మరొక విషయం తెలిసింది. ముందు శివకుమార్ అనే స్టాంపు వెండర్ డూప్లికేట్ ఛలాన సమర్పించి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లాడట…అదే నిజమైతే క్లర్క్ చూసుకోకుండా ఇచ్చే అవకాశం లేదు. కాని స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకూ అంటే…అసలు ఛలాన ఎక్కడో పెట్టాను. మర్చిపోయాను. గుర్తు రావడంలేదు. కాకపోతే దానికి సంబంధించిన జిరాక్స్ ఇప్పుడు సమర్పిస్తాను. తర్వాత ఒరిజినల్ తెచ్చి ఇస్తానంటే రూ.50వేల స్లాంపు పేపర్లు ఇచ్చారట. ఇది నమ్మశక్యమైన మాటేనా…ఇదే కాదు..మరో ట్విస్టు కూడా వుంది. అదే శివకుమార్ తర్వాత మరోసారి అసలు ఛలానా తెచ్చి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లడానికి వచ్చాడట. అప్పుడు ఈ పాత ఛలానతో ఎలా ఇస్తాం…గతంలోనే దీని జిరాక్స్ ఇచ్చి, స్టాంపు పేపర్లు తీసుకెళ్లావని క్లర్కు గుర్తు చేస్తే, నేనెప్పుడిచ్చాను…మీరు స్టాంపు పేపర్లు నాకెప్పుడిచ్చారని ప్లేటు పిరాయించాడట. దాంతో అసలు గుట్టు బైట పడుతుందని తేలు కుట్టిన దొంగలా శివ కుమార్‌కు మళ్లీ రూ.50వేల స్టాంపు పేపర్లు ఇచ్చారట. సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు వుండవు. అసలు జిరాక్స్ కాపీతో స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? తర్వాత అదే స్టాంపు వెండర్ ఒరిజినల్ ఇస్తే పాతదాన్ని చూపించి కొత్తది ఎందుకు అందులో జత చేయలేదు? మళ్లీ అదే ఛలనాకు స్టాంపు పేపర్లు ఇవ్వడమేమిటి? ఎవరు నిజం చెబుతున్నటు? ఎవరు ఎవరికి భయపడుతున్నట్లు? ఒక స్టాంపు వెండర్ ఆఫీస్ సిబ్బందిని బెదిరించేంత స్ధితి ఎందుకొచ్చింది? ఎవరు కల్పించారు? అతను అంత గట్టిగా మాట్లాడాడంటే లోపం ఎక్కడుంది? నిజంగా ఒక స్టాంపు వెండర్ జిరాక్స్ ఛలాన తెచ్చి ఇవ్వడమే తప్పు. దాన్ని ఛలనాగా భావించి స్టాంపు పేపర్లు ఇవ్వడం క్లర్క్‌తో పాటు, కార్యాలయం సిబ్బంది చేసిన నేరం. దాన్ని కప్పిపుచ్చుకోవడమే కాకుండా, మళ్లీ అదే ఛలాన ఒరిజినల్ తెచ్చి ఇస్తే, మరోసారి అదే నెంబర్ మీద స్టాంపు పేపర్లు ఇవ్వడం అంటే మరో నేరం. ఒకసారి తప్పు చేయడమే పెద్ద తప్పు. దాన్ని కప్పి కప్పుపుచ్చునేందుకు మరోసారి నేరం చేసి కూడా ఏం జరగనట్లు, అదో చిన్న పొరపాటు అన్నట్లు క్లర్కును మరో సెక్షన్‌కు మార్చడమంటేనే ఇందులో ఏదో పెద్ద గూడుపుఠాణీ వున్నట్లే లెక్క. ఆ బొక్కను తవ్వితే గాని, అసలు లెక్కలు బైటకు రావు. కలుగులో దాక్కున్న ఎలుకలను పట్టుకోలేరు.
సానుభూతితో ఉద్యోగం…?: సరే క్లర్కు ఆనార్యోగంతో బాధపడుతున్నప్పుడు ఆయనకు ఇంత పెద్ద పని అప్పగించడం తప్పు కాదా? ఆయనకూడా ఇలాంటి పని కాకుండా ఎలాంటి టెన్ష్‌న్ లేని సీటు కోరుకోవచ్చు కదా? ప్రభుత్వానికి చెందిన ప్రతి రూపాయి లెక్క చూపాల్సిన పెద్ద బాధ్యతను ఎందుకు ఎత్తుకున్నట్లు? చిన్న ఉద్యోగి కార్యాలయానికి కారులో వచ్చేంత సీనుంటుందా? ఇలా ప్రభుత్వాదాయానికి కన్నంపెడుతుంటే జీతంతో పనేముంటుంది. ఇక క్లర్కును పక్కన పెడితే సమస్య తీరినట్లేనా….
సుబ్బారావు ఆశీస్సులే ఇంత దూరం తెస్తున్నాయా?: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసేవారందరికీ సుబ్బారావు ఆశీస్సులు మెండుగా వుంటాయన్నది అందరూ చెప్పుకునే మాటే…మసి బూసుకున్నా సరే…తుడిచేసేంత పెద్ద చేయి ఆయనదట. అందుకే ఎవరు ఎన్ని చేసినా కూడా…మై హూనా అంటుంటారట. కింది స్ధాయి నుంచి పైకెదిగిన ఉద్యోగికి అన్ని వర్గాల ఉద్యోగులతో సత్సంబంధాలు కామన్…అలాగే లొసుగులు కూడా తెలియడం కామన్…ఇదే కామన్‌గా అందరికీ సుబ్బారావు కనిపించడం…ఆదుకుంటాడనే నమ్మకం కల్గించడం…ఎవరెవరు ఏమనుకున్నా…సరే…అంతా మా వెనుకు వున్న కొండంత అండ చూసుకుంటాడన్న ధీమా…ఆహా…రాజ్యమేలాంటే కిరీటాలే కావాలా అన్నారట. ఇలా పై స్ధాయి ఆశీస్సులు కూడా వుంటే సరే…కాపాడే సుబ్బారావు లాంటి వారు ఒక్కరుంటే చాలు…ఏదైనా మాఫ్…అంతే సేఫ్…
కమీషనర్‌గారు…ఒక్కసారి లుక్కేయండి…ఈ బాగోతాలేమిటో చూడండి?: రిజిస్ట్రేషన్ల కమీషనర్‌కు ఆ శాఖలో జరిగే అవినీతిని అంతం చూసేదాకా వదిలిపెట్టరన్న పేరుంది. ఆయన దృష్టికి వచ్చిన ఏ సమస్యను వదిలే సమస్య లేదని అంటారు. ఎక్కడ ఏ మూలన ఏది జరిగినట్లు ఆయన దృష్టికి వచ్చినా సరే క్షణాల్లో స్పందిస్తారు. వారిని తొలగిస్తారు. కాని ఆయన దాకా వెళ్లకుండా మధ్యలోనే సుబ్బారావులు అన్నీ సమకూర్చుతుంటారట. దాంతో పైన కూర్చున్న కమీషనర్‌తో ఏం పని…కాపాడే వారున్నాక అడ్డూ అదుపూ ఏముంది? దాంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సస్పెండ్ అయిన ఎంతో మంది ఉద్యోగుల మీద చర్యలు లేవు. వారి ఉద్యోగాలు తొలగించింది లేదు. కేసులు నమోదు చేసి, జైలుకు పంపించింది. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం ఖాయం…మళ్లీ మళ్లీ వెనకేసుకోవడం తధ్యం…అందుకే ఒక్కసారి కొంత కాలం ఇటు వైపు లుక్కేస్తే ఎంతో మంది దొరికిపోతారు…దొరికిన వారు దారికొస్తారు….లేకుంటే మళ్లీ ఉద్యోగాల్లో చేరుతారు..ఈ సెక్షన్ కాకపోతే మరో సెక్షన్‌లో కొంత కాలం దూరిపోతారు…మళ్లీ పాత సీట్లోకొచ్చి కూర్చుంటారు…ఇదే కామన్…
Year: 2022
దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు
*నేటిధాత్రి హైదరాబాద్*
12-1-2022
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్రప్రభుత్వం, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం కోలుకోలేకుండా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్రం.. ఉల్టా రైతుల పెట్టుబడి ఖర్చులనే రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం, అష్టకష్టాలు పడి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం లాంటి రైతు వ్యతిరేక చర్యలతో… నేడు దేశంలో రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఒక్కసారిగా ఎత్తివేసి, రైతులను వ్యవసాయం చేయకుండా దూరంచేస్తున్న బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం ఐక్యంగా తిరగబడితే తప్ప, వారికి బుద్ధి రాదన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ధరలు తగ్గించే దాకా.. పోరాడాలన్నారు.
ఎనర్జీని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే వ్యతిరేకిస్తూ, వ్యవసాయాన్ని నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్న బిజెపి చర్యలను దేశ రైతాంగం గుర్తించాలన్నారు. రైతుల పొలాల్లో.. రైతులనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’
` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్ గయా..?
` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం?
` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు?
` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..?
` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ?
` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు
` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు?
` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు??
` అంతా పైవాడు చూసుకుంటాడన్న నమ్మకమా..?
` సుబ్బారావు చెంతనుండగా…చింతెందుకు అనుకుంటున్నారట?
` క్లర్కు కాళ్లు మొక్కిండని అధికారులు వదిలేశారట?
` ప్రజాధనం కొల్లగొట్టి దయాగుణం చూపెట్టిన అధికారులు భలే…భలే…?
హైదరాబాద్ , నేటిధాత్రి :
తాడి చెట్టుకిందకు ఎందుకు వెళ్లావంటే దూడ గడ్డి కోసమని ఎవరైనా సమాధనం చెబితే ఎలా వుంటుంది. సరిగ్గా వరంగల్ రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయ క్లర్కు మధు చెప్పే, చెప్పించే సమాధానాలు సరిగ్గా అలాగే వున్నాయి. మూడేళ్ల క్రితం మీ ఆఫీసులో ఏం జరిగిందని నేటి ధాత్రి ప్రశ్నిస్తే…నాకు గుండె జబ్బు వుందన్న సమాధానం చెప్పించాడు. రెవిన్యూ స్టాంపులు మాయమైనట్లు మాకు సమాచారం వుందని అంటే నా గుండెలో మిషన్ ఏర్పాటు చేశారు. సౌండ్ బైటకు కూడా వినిపిస్తుంటున్నాడు. అసలు స్టాంపు పేపర్లు ఎలా మాయమయ్యాయని అడుతుంటే అప్పుడు వేరే రిజిస్ట్రార్ వుండేవారంటారు…అదేంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మేం అడుగుతున్నదేమిటి? మీరు చెబుతున్నదేమిటి? అని అంటే శివకుమార్ అనే స్టాంపు వెండర్ రూ.50వేల రూపాయల చలాన్ తర్వాత చెల్లించేశాడని అంటున్నారు. అసలు ఎక్కడైనా ప్రశ్నకు, సమాధానానికి పొంతన వుందా? అందుకే తాడిచెట్టు సామెత చెప్పాల్సివచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే సరిగ్గా మూడేళ్ల క్రితం వరంగల్ రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం నుంచి రూ.3 లక్షల రూపాయల విలవైన స్టాంపు పేపర్లు మాయం అయ్యాయి. అందుకు కార్యాలయ క్లర్కు మధు కారణం అంటున్నారు. అబ్బే జరిగింది అంత కాదు. కేవలం రూ. 50 వేల స్టాంపు పేపర్లే కాని, ఆ తర్వాత సంబంధిత స్టాంపు వెండర్ శివకుమార్ ఛలాన చెల్లించేశాడు. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఇదీ క్లర్కు మధు వివరణ. అంటే జరిగింది వాస్తవమే కాని, జరిగింది 3 లక్షలు కాదు…అని ఒప్పుకున్నట్లు కాదా? ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకుంటారా లేదా? ఎలా జరిగిందన్నది విచారిస్తారా లేదా? క్లర్కు తన మాటల్లోనే అంత కాదు, ఇంత అనే విషయాన్ని ఒప్పుకున్న విషయం మీకు తెలియంది కాదా? ఆలస్యమైనా సరే…తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తారా? దయాగుణం చూపించి వదిలేశారా? లేక ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని సైలెంటు అయ్యారా? ఇంత కాలం బైటక పొక్కకుండా దాచేశారా?
సహజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సంబంధిత సూపరెండెంటు, సెక్షన్ ఇన్‌ఛార్జిలు బాధ్యత వహించాలి. చేసింది క్లర్కు అయినా చేయించిన వాళ్లు వెనుక ఎవరున్నారు? అవి ఎవరు ఎవరికివ్వమన్నారు? ఎవరికిచ్చారు? ఎవరు వాటిని వాడేసుకున్నారు? అన్న సంగతి కార్యాలయం మొత్తానికి తెలియకుండా జరుగుతుందా? కాని ఎవరూ కిమ్మనలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఎలా జరిగిందని ఆరా తీయలేదు. సరికదా…లక్షలాది రూపాయల ప్రజా ధనం వృధా చేసిన వ్యక్తులకు అండగా నిలుస్తున్నారు. అంటే అర్ధమేమిటి? ఆఖరుకు మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లర్కు ఉన్నతాధికారుల కాళ్లు మొక్కాడని వదిలేశారట. ఎంత భలేగా వుంది కదా! అధికారులది ఎంత జాలి గుండెనో…ప్రభుత్వ ధనం లూటీ చేసిన వారిని కూడా క్షమించేంత దయా గుణం వారికే సొంతం. పోయింది వారి సొమ్ము కాదు కదా? రాజుల సొమ్ము రాళ్ల పాలు అది గతం. ప్రజల సొమ్ము అధికారులపాలు అని మార్చినట్లున్నారు.
అసలు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎలా వుంటుంది? గుండు పిన్ను కొన్నా లెక్కుండాలి. ఒక్క కాగితం వాడినా లెక్కరాయాలి. ఇదీ సర్కారు లెక్కల సంగతి. కాని ఏకంగా మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమైతే లెక్కలు లేవా? రాయలేదా? ప్రజాధనం లూటీ చేశారా? మన్నుతిన్న పాములా సైలెంటుగా వున్నారా? అంటే ఔననే సమాధానం మాత్రం నర్మగర్భంగానే ఊ…అంటూ వస్తూనే…రూ.50వేలు కట్టేశారంటున్నారు. ఇదీ అధికారుల తీరు…ఆఖరుకు క్లర్కు మధు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. అయితే లాజిక్ లేని సమాధానం చెబుతున్నానని అనుకోలేదు. రసీదులు లేకుండా రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం నుంచి స్టాంపు పేపర్ ఒక్కటి కూడా బైటకు వెళ్లే అవకాశం లేదు. సంబంధితం స్టాంపు వెండర్ ఎవరైనా సరే ముందు అవసరమైన మేరకు ఛలనా తీయాలి. దాన్ని అధికారలు డీ పాస్ చేయాలి. అప్పుడు గాని వాటిని ఇవ్వడానికి వీలు లేదు. కాని ఏకంగా రూ. 3లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయం కావడమేమిటి? వాటికి సంబంధించిన రూ.50వేల ఛాలన్ తర్వాత చెల్లించడమేమిటి? అలా నమ్మకంతో కూడా స్టాంపు పేపర్లను ఒక స్టాంపు వెండర్‌కు అందించే అధికారం క్లర్కుకు వుంటుందా? అధికారుల సంతకం లేకుండానే బైటకు వెళ్తాయా? స్టాంపు పేపర్లు అంటే అంత ఆషామాషీ వ్యవహరమైపోయిందా? అంతా గందరగోళంగానే వుంది…
మూడేళ్ల క్రితం స్టాంపు పేపర్లు మాయమైతే ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం ఆశ్యర్యమేస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు మంత్రిగా వున్న కృష్ణ యాదవ్‌ను మహరాష్ట్రకు చెందిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేవలం లక్ష రూపాయల విలువైన నకిలీ స్టాంపు పేపర్ల తయారీ, సరఫరా సహకరించాన్న సమాచారం మేరకు ఆరేళ్లపాటు జైలు జీవితం అనుభవించారు. ఎందుకంటే స్టాంపు పేపర్ల వ్యవహారం అంత సీరియస్. క్యాబినేట్ మంత్రిగా వున్న వ్యక్తిని కనీసం నాడు స్పీకర్‌కు కూడా చెప్పకుండా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలియకుండా, ఎలాంటి బెయిల్ మంజూరు చేయకుండా, ఆరేళ్లపాటు రిమాండ్ ఖైదీగానే జైలులో వుంచారు….కాని వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో 3 లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయమైతే ఇంత నిర్లిప్తతా…అసలు నాడు ఆ మంత్రిమీద కేవలం అనుమానం మాత్రమే…ఆ అనుమానంతో ఆరేళ్లపాటు ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా ఖైదు చేశారు. మూడేళ్లు గడుస్తున్నా…వరంగల్‌లో జరిగిన ఈ విషయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటి మాయం వెనకు ఎవరెవరున్నారన్నరదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే దీనితోపాటు రాష్ట్రంలోని అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న లీలలు అంతా ఇంతా కాదు. అయితే వారందరినీ కాపాడుతూ వారికి అభయంగా వుంటూ ఓ సుబ్బారావు అనే పెద్ద మనిషి వున్నాడని భహిరంగగానే చెప్పుకుంటున్నారు. ఎంతటి అవినీతి చేసినా సరే…నేను చూసుకుంటానన్నంత భరోసా ఇస్తూ కాపాడుతున్నాడట. అసలు స్టాంపు పేపర్ మాయం అన్నది దేశద్రోహానికి చెందినంత కేసు అన్నది తెలిసే చేస్తున్నారా? లేక దొరలేదు కదా? అనుకుంటున్నారా? ప్రభుత్వ రాజముద్రతో కూడుకున్న స్టాంపు డ్యూటీని అధికారులు ఇంత సింపుల్‌గా చేతులు మార్చుతున్నారా? వరంగల్ ఘటన ఇందుకు సాక్ష్యం. సహజంగా పుండు అన్నది ఒక్క దగ్గర మొదలైతే దాని చుట్టూ పుళ్లు పడడం కామన్. శరీరమైనా, సమాజమైనా ఒక్కటే…ఇలాంటివి ఎక్కడెక్కడ, ఏ కార్యాలయాలలో ఎంతెంత జరుగుతోందన్నదానిపై నేటిధాత్రి తన పరిశోధన చేపట్టింది. విస్తుపోయే నిజాలు తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాలు ప్రజలు తెలియాలి. బాధితులు ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో ప్రపంచానికి తెలియాలి. ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎలా మోసాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఇదే మా అక్షర యజ్ఞం…మీ కోసం… సమాజం కోసం…పరిరక్షణ కోసం…మాతో మీరూ కలిసిరండి…బాధితులు మమ్మల్ని సంప్రదించండి. ఇంతకీ ఇప్పటికైనా వరంగల్‌లో జరిగిన సంఘటనపై దర్యాపు జరిపిస్తారో…లేదో చూడాలి.
యుగానికొక్కడు
` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు
` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు
` కేసిఆర్ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా
` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం
` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం…
` భవిష్యత్ తరాలకు సంచలన సందేశం
` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం.
` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు.
` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే…
` ఆసరా సగటు జీవన ఆయుః ప్రమాణానికి సూచిక
` కళ్యాణలక్ష్మి ఒక ఆడపిల్ల ధైర్యానికి ప్రతీక
` ఇప్పుడు అనాధలకు చేయూత…వారి జీవితాలకు భరోసా…
హైదరాబాద్ , నేటిధాత్రి : రామాయణంలో రాముడు చేయలేదు( త్రేతాయుగం). మహాభారతంలో కృష్ణుడు( ద్వాపర యుగం) చేయలేదు. కలియుగంలో ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. రాజరికంలో ఏ రాజు చేసినట్లు లేదు. ప్రపంచ దేశాలలో ఆచరించినట్లు ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి ఒక్కడే..ఒక్కడు…కేసిఆర్ ఆలోచించాడు. అనాధలను అక్కున చేర్చుకునే యజ్ఞం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అనాధలందరూ ప్రభుత్వ బిడ్డలు కావాలని సంకల్పించాడు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు….ఇక రాష్ట్రంలో తాను అనాధను అన్న మాట ఎవరి వెంట వినపడకుండా చేయనున్నాడు….
ఆకలి ఒక నరకం. అనాధ జీవితం ఒక శాపం. కాని యుగానికొక్కడుగా యుగపురుషుడైన ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో ఇక శాపగ్రస్ధులు అనే మాట ఇక వుండదేమో! అనాధ పిల్లలు అంటూ ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో! మాకు ఎవరూ లేరన్న భాధ వారిలో ఒక వుండదేమో… భవిష్యత్తులో అనాధ అన్న పదమే తెలంగాణలో వినిపించదేమో! పసి వయసులోనే అందరూ దూరం చేసుకొని చెత్త కుప్పల్లో బతుకులీడ్చేవారు వుండకపోవచ్చు. భూమ్మీదకొచ్చాక వారికి కూడా జీవించే హక్కు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడం అన్నది ఒక వినూత్నం. విప్లవాత్మకం. ప్రపంచం అబ్బుర పడే నిర్ణయం. అనాధ అనే మనో వేధన బతికినంత కాలం వెంటాడే మానసిక శిక్ష ఇక భవిష్యత్తులతో తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికి వుండదు. వారు కూడా బతికేందుకు, అందమైన జీవితం అనుభవించేందుకు కూడా మంచి రోజులు వస్తున్నాయంటే అది తెలంగాణ సంకల్పం. బలమైన నమ్మకం. ఆ నమ్మకం పేరు కేసిఆర్.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కారణజన్ముడు అని చాలా మంది ఎందుకంటారో …ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చు. చరిత్రలో సమాజం కోసం, ప్రజల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జీవిత పర్యంతం ఉద్యమం సాగించిన అతి కొద్ది మంది యుగకర్తలలో ముఖ్యమంత్రి కేసిఆర్ అందరికంటే ముందున్న వ్యక్తి అని చెప్పకతప్పదు. అవరైఏళ్ల తెలంగాణ ఆకాంక్షను తన జీవితం లక్ష్యం చేసుకొని, పద్నాలుగేళ్లపాటు పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, కలలు గన్న తెలంగాణ ఆవిష్కరణే కాదు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా…అబ్బురపడేలా…ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. ఇది ఏ నాయకుడికి సాధ్యం కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ సాధించి చూపిస్తున్నారు. ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాలోజీ అన్నారు. ఒక్క మంచి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగులు అని ముఖ్యమంత్రి కేసిఆర్ నిరూపిస్తున్నారు. అవును ఇది చరిత్ర కాదలేని సత్యం. జీవిత సత్యం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో చిగురించిన ఏ ఆలోచన వృధా కాలేదు. అది తెలంగాణ సాధన నుంచి మొదలు, నేటి కాళేశ్వర ప్రాజెక్టుదాకా…ఎండిన బీడ్లనుంచి, జలజల పారే నీటి సవ్వడుల దాకా… ఆడపిల్ల పెళ్లి కష్టం నుంచి, సంతోషంగా కళ్యాణ లక్ష్మి దాకా…వృద్దాప్యంలో ఏ కొడుకు, కోడలు ఆసరా లేకుండా ప్రభుత్వమే ఆసరాగా అందిస్తున్న పింఛన్లు వారి జీవితాలకు ఒక భరోసా నింపుతున్నాయి. వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి. ఆత్మగౌరవంతో బతికేందుకు ఉపయోగపడుతున్నాయి. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసునిండా ప్రశాంతంత వుంటే ఏ రోగం రాదు. చావు అంత తొందరగా దరిచేదరంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఎంతో మంది వయసు మళ్లిన వారిని చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇదే నిజమని ప్రపంచం గుర్తించింది. ఏతోడు లేని, నీడలేని పిల్లలుండీ ఆసరా లేని వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రజల సగటు జీవిత ఆయుః ప్రమాణం కూడా పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు అనాధలకు న్యాయం. వారి జీవితాలను కాపాడే బాధ్యతా ధర్మం ప్రభుత్వం తీసుకోవడం అన్నది ఆషామాషీ నిర్ణయంకాదు.
ఆకలి ఒక పాపమో! శాపమో!! కాని ఎవరికైనా అది నరకమే!!! ఏవరూ లేని వారికి అది నిత్య నరకం. పసిపిల్లల పాటిల శాపం. అది ఆకలని వారికి తెలియదు. కడుపులో మంట జీవితాన్ని దహిస్తుంటే ఏమిటో తెలియదు. ఆ క్షణం ఒక ముద్ద కావాలి. లేకుంటే జీవితం ఆరిపోవాలి. అలా ఆకలిని భరించలేక ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సహజంగా పోషకాహారలోపమే పెద్ద శాపమైతే, అసలే ఆహారం అన్నది అందని జీవితాలను ఏమని చెప్పగలం. వారి బాధ వర్ణణాతీం. దానంత దురదృష్టం మరొకటి వుండకోవచ్చు. మహానగరాల్లో వారి జీవితాలు చూస్తుంటే అసలు మానవజన్మ అన్నది ఎంత నరకమో? వారికే ఎందుకంత వేధనో అని మన కళ్లునిండా నీళ్లు సుడులు తిరగక మానవు. కాని ఆ కన్నీటి చుక్కలే నోటి దాహానికి ఆసరా చుక్కలైతే ఇక వారి జీవితం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కళ్లు తెరవకుండానే ఈ లోకం మీదకు వచ్చి, భూమ్మీద పడి, ఎక్కడున్నామో తెలియని వేధనే ప్రపంచమైపోయే పసి అనాధ హృదయాల జీవితం అరణ్యరోధన. అభం శుభం తెలియని వయసులోనే నా అనేవారు లేక, కన్నవారు కనిపించక, ఎవరికి పుట్టామో తెలియక, ఎవరూ దగ్గరకు రానీయకుండా, చెట్టుకింద జీవితాలు. ఎండకు ఎండి, వానకు నాని, మురిక కాలువల పక్కన, వీధి కుక్కల మధ్యన బతకడం అంటే ఇంతకన్నా శాపగ్రస్ధమేముంటుంది. అసలు తామెవరమో? కూడా తెలియని పసిహృదయాలకు అంత శిక్ష ఎందుకో? అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమైనా, ఎంత మంది వారిని ఆదుకోగలరు. ఎంత కాలం ఆదుకోగలరు. దైవం చేసిన మోసంతో భూమ్మీదకొచ్చి, కళ్లు తెరవకుండానే కన్న వారిని దూరం చేసుకొని, ఎంగిలి విస్తర్లే ఆహారమై కడుపుకునింపుకొని కోట్ల మంది జీవిస్తున్నారు. అలా నీడలేని వారికి ఆశ్రయం ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదు. వారిని ఏకంగా ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడం అన్నది చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏ తోడు లేని అనాధ పిల్లలను ప్రభుత్వమే దరి చేర్చుకోవడం, వారి జీవితాలివ్వడం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం, భవిష్యత్తులో అలాంటి వారి జీవితాలకు తావులేకుండా చూడడం అన్నది ఒక దైవకార్యం. ఒక జీవన యజ్ఞం. చరిత్రలో ఇలాంటిది విన్నది లేదు. చూసింది లేదు. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం విశేషం. విప్లవాత్మకం. ఆదర్శం. అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం కోసం వారందరినీ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయానికి నేటిధాత్రి దినపత్రిక ప్రత్యేక అభినందనలు. ఇలాంటి నిర్ణయాలు ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపించారు. పేదల జీవితాలకు కేసిర్ అనే ఒక్క పదమే భరోసా అని మరోసారి రుజువు చేస్తున్నారు. యుగపురుషుడుగా చరిత్ర వున్నంత కాలం కేసిఆర్ నిలుస్తారు. ఇదే నిత్యం…కేసిఆర్ సంక్షేమం సత్యం…యుగయుగాలకు ఆదర్శం…
