ఆ 80 లక్షలు అంతే సంగతులా!?

`ప్రభుత్వ సొమ్మంటే నొక్కేయడమేనా?
` అది నేరం కాదా..శిక్షలుండవా?
` ఇంత భయం లేని భరితెగింపా?
` కరీంనగర్‌ ఆర్వోలో దోషులను వదిలేస్తారా?
` నరేష్‌, అనూష,గంగ లీలలు దోచింది వసూలు చేయరా?
` సస్పెండ్‌ చేశాక మళ్లీ ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు?
`80 లక్షలు మాయమైతే శాఖ పెద్దలకు చీమకుట్టినట్లు కూడా లేదా?
` రూపాయి కూడా ఇన్నేళ్లైనా రికవరీ కాకుంటే ఎలా?
` కేసు కూడా నమోదు కారణం ఎవరు?
` కమీషనర్‌ దాకా సమాచారం చేరకుండా చేసిందెవరు?
` మాతో పెట్టుకొంటే ప్రభుత్వానికే నష్టమంటున్నదెవరు?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు నాలుగు తరాలక సంపాదిస్తారంటారు? అది ఎంత వరకు నిజమో! కాదో!? కాని ఒక్కసారి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో చిన్న క్లర్కు పోస్టు వున్నా చాలు అంటున్నారు. అంతకన్నా ఎక్కువే సంపాదించొచ్చట. ప్రభుత్వ స్టాంపు పేపర్లు మాయం చేస్తే ఏటా లక్షలు వెనకేసుకోవచ్చు? పై వాళ్ల చల్లని చూపులుంటే ఇక కోట్లే కొల్లగొట్టొచ్చు? ఇది ఎవరో అంటున్న మాట కాదు… సాక్ష్యాత్తు ఆ శాఖలో పనిచేసే వాళ్లే అనుకునే మాట. ఇక ఉద్యోగులతో ప్రజల పడరాని పాట్లు పడుతున్న సంగతి తెలియంది కాదు. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే, ఆ కాగితాలు చేతికొచ్చాయంటే అంతకన్నా అదృష్టవంతుడు మరొకరు వుండరన్నంత ఆనందపడాలి. కాగితాలు చూసి మురిసిపోవాలో…అంతకన్నా ఎక్కువ ముట్టజెప్పి ఉన్నది ఊడ్చుకున్నందుకు ఏడవాలో తెలియని పరిస్ధితిలో కొన్ని లక్షల మంది ప్రజలు వున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శాఖల్లో ఒకటైన కరీంనగర్‌ ఆర్వో కార్యాలయంలో జరిగిన లూటీ అక్షరాల ఎనబైలక్షలకు పైగానే అంటున్నారు. ఇది అందరికీ తెలుసు. కాని ఏం జరిగింది? అవినీతి చేసిన అధికారులు దర్జాగా వున్నారు. స్టాంపు పేపర్లు మాయం చేసిన వాళ్లు హాయిగా వున్నారు. ప్రమోషన్లు కూడా పొందారు. అటు లంచాలు, ఇటు లూటీలతో నోట్ల సాగు చేసుకుంటున్నారు. ఆస్ధులు పెంచుకుంటున్నారు.
సహజంగా అవినీతి అంటే లంచాలు మాత్రమే అనుకుంటారు ఎవరైనా! కాని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో మాత్రం స్టాంపులకు స్టాంపులు అమ్ముకుంటారు. నకిలీ ఛలాన్లు సృష్టిస్తారు? లక్షలకు లక్షలు స్టాంపు పేపర్లు మాయం చేస్తారు? స్టాంపు వెండర్ల మీద తోసేస్తారు? ఇదిలా వుంటే రిజిస్ట్రేన్ల విషయంలో సకల విద్యలు ప్రదర్శిస్తారు. లీలలన్నీ వినియోగిస్తారు? తిమ్మిని బమ్మిని చేస్తారు? ఆఖరుకు సెటిల్‌ మెంట్లు కూడా చేస్తుంటారు? భూమాయ చేసేస్తారు? ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ఇలా వాళ్లు చేయని పని అంటూ వుండదు. లంచం లేకుండా ఫైలు కదలించరు. ఏ రోజుకారోజు వేలకు వేలు జేబులో పెట్టుకోకుండా ఇల్లు చేరరు. ఇదీ ఆ శాఖలోని ఉద్యోగుల తీరు? కాదని ఎవరూ అనలేరు? ఎందుకంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న సందర్భం చూశాం…ఈ వ్యవస్ధలో మార్పు కోసం సిఎం కూడా పెట్టాల్సినంత శ్రద్ద పెడుతున్నా…అధికారులు భయపడడం లేదు. ప్రభుత్వ బొక్కసానికి దర్జాగా బొక్క పెడుతున్నారు. కోట్లకు కోట్లే కొల్లగొడుతున్నారు. అప్పుడప్పుడు…అక్కడక్కడ దొరుకుతున్నారు…సస్పెండ్‌ కూడా అవుతున్నారు. తప్పు వేరేవారి మీద తోసేస్తున్నారు. ఇక్కడినుంచి ఒక్క అడుగు కూడా శాఖపై అవినీతి నిరోధక శాఖ అడుగు ముందుకు వేయడంలేదు. అటు సస్పెండ్‌ చేసి ఏసిబి చేతులు దులుపుకుంటుంది? విచారణ పేరుతో ఆ శాఖ పెద్దలు ఉద్యోగులకు క్లీన్‌ చీట్‌ ఇస్తారు…తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుంటారు…అందుకు లక్షలకు లక్షలు మళ్లీ చెల్లింపులు సమర్పించుకుంటారు. అంతగా అవసరమైతే వారి విచారణ ఫైళ్లను వారి చేతుల్లోనే పెట్టుకునేంత సమర్ధత కూడా సాధిస్తుంటారు. ఇదిలా వుంటే ఆ శాఖ పెద్దలకు అవసరమైన సేవలు అందిస్తుంటారు… వారికి మామూళ్ల ఏజెంట్లుగా తరిస్తుంటారు. స్వామి కార్యం, స్వకారంతో మరింత వెనకేసుకుంటారు. ఇలా పెద్దలే మెండుగా ఆశీస్సులు అందిస్తుంటే దోచకోవడం, దాచుకోడం మా హక్కు అన్నంతగా మారిపోయింది. ఉద్యోగుల దురాగతం. కింది స్ధాయి నుంచి జరిగే అవకతవకలకు జిల్లా స్ధాయినుంచి రాష్ట్ర స్ధాయి పెద్దలకు వరకు ఊతమౌతున్నారు. వారి అండదండలతోనే ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ఈ విషయాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్న నేటి దిన పత్రికను చూసి, కమీషనర్‌ చూసినప్పుడు కదా? ఆయనకు విషయాలు తెలిసినప్పుడు కదా? ఆయన స్పందించినప్పుడు కదా? మేం చూసుకుంటాం …లే? మేనేజ్‌ చేస్తాం …లే? అంటున్నారంటే వారిలో పెరిగిన అతి విశ్వాసానికి అండ ఎవరు? వారి అడ్డగోలు సంపాదనకు దన్ను ఎవరు? అన్నది ఇప్పటికైనా తేల్చితే గాని ఈ అవినీతి ఆగదు. ఇప్పటికే అనేక కార్యాలయాల్లో ఇలాంటి అవినీతే వెలుగు చూస్తున్నా, పెద్దలు ఎందకు చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మాతో పెట్టుకొని పెద్దలేమీ చేయలేరన్న మాటలు నిజం చేస్తున్నారా? అన్నది తెలియాల్సిన అవసరం వుంది.
(ఆఫ్‌ ది రికార్డు?)
` మాతో పెట్టుకుంటే నష్టం ప్రభుత్వానికే..!: ట్వింకిల్‌ జాన్‌?
మాతో పెట్టుకుంటే ప్రభుత్వానికే నష్టం? కొసరు లెక్కలు చూసే వరకే కమీషనర్‌కు సమయమే సరిపోదు. ఏసిబి చేసేదేముంది? తర్వాత మళ్లీ ఉద్యోగాలిస్తే చూస్తూ ఊరుకోక ఏం చేస్తుంది. విజిలెన్సే మన చేతిలో వుంటే, మన ఉద్యోగులు రక్షణ మన చేతిలో వుండగా ఎవరూ ఏం చేయలేరు? మనల్ని ఎవరూ ఆపలేరు? ప్రభుత్వం ఏనాడో బాధ్యతలు వదిలేసింది? ఉద్యోగాల భర్తీ ఏనాడో అటకెక్కించింది? కొత్త వాళ్లు వచ్చేది లేదు? మనం పోయేది లేదు? కొత్త ఉద్యోగాలకు దిక్కులేదు? అదనపు పనులు చూసేందుకు మనం కాకపోతే మరెవరు? ఈ ప్రభుత్వం వున్నంత వరకు కొత్త వాళ్లు రారు..మన పోస్టులకు ఢోకా లేదు. రాసుకునేవారు రాసుకుంటుంటే…మనం చేసేదేమైనా? ఆగుతుందా? ఒక్కపైసా అయినా రికవరీ ఏమైనా అయ్యిందా? ఏసిబి కేసులు నమోదు చేసినా, విచారణ కమీటీ మన చేతిలోనే…ఫైళ్లు మన చేతిలోనే…ఇంకా ఎందుకు భయం? ఏ ప్రభుత్వం వచ్చినా మనదే రాజ్యం…వందల సంఖ్యలో నిత్యం వార్తలొస్తాయి? వాటిని పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదు. అంత సమయం మనశాఖలో పెద్దలకు లేదు? రివ్యూలకే సమయం సరిపోవడంలేదు? లెక్కలు చూసేదెవరు? తేల్చేదెవరు? అయామ్‌ హియర్‌…డోన్ట్‌ ఫియర్‌…డోన్ట్‌ వర్రీ…ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సాక్ష్యాత్తు ఉద్యోగులతో కరీంనగర్‌ డిఐజీ ట్వింకిల్‌ జాన్‌ అన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలా అధికారుల ఆలోచనలు వుంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టించలేదు. పట్టినా శిక్షించలేడు. అందుకే ఇక విజిలెన్స్‌ అనే వింగ్‌ ఎందుకు? దండగ? దాన్ని తీసేయ్యండి? అని బాధితులు అంటున్నారు. వాళ్లే తప్పు చేస్తారు. విచారణ కమిటిలో వాళ్లే వుంటారు. ఇక అమాయకులను బలిచేస్తారు. వాళ్లు మాత్రం ఉద్యోగాల్లో వుంటారు. ప్రమోషన్లు కొట్టేస్తుంటారు. లంచాలతో పాటు, ప్రభుత్వ సొమ్మును కూడా కోట్లుకు కోట్లు లూటీ చేస్తుంటారు…అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు రిజిస్ట్రేషన్ల విషయంలో ఎన్ని కిరికిరిలు పెట్టాలో అన్ని పెట్టి అలా లంచాలు తింటారు. ఇలా స్టాంపు పేపర్లేమో తమ ఇంట్ల కాగితాల్లాగా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటారు…కోట్లుకు కోట్లు తరలిపోతున్నా…పెద్దలు చూడరు…పట్టించుకోరు…ఇదీ జనం నిట్టూర్పు!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!