కొత్తగూడెం ఏరియా జి.ఎం. ఆఫీసు లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు తేదీ. 2022-12-31.న ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో డిజిఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన ఏ.వి. ఆంజనేయులు చెట్టికి మరియు ఎంవిటిసి లో డిజిఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన.పిఎస్‌ఎస్‌ఎన్ మూర్తి కి కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిదిగ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ . హాజరు అయినారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ హాజరు అయినారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ. ఏ.వి. ఆంజనేయులు చెట్టి. దాదాపు 40 సంవత్సరాలు మరియు పిఎస్‌ఎస్‌ఎన్ మూర్తి గారు కూడా దాదాపు 40 సంవత్సరాలు సుధీర్గ సర్విసు పూర్తి చేసుకొని మంచి నడవడికతో, అంకిత భావంతో పని చేసి తేదీ 2022-12-31 న పదవీ విరమణ పొందుచున్నారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో వర్దీల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో ఏరియా జిఎం జక్కం రమేశ్ కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, సిఎంఓఏఐ కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాస్ , జి.ఎం. (సిపిపి) కార్పొరేట్ సి.హెచ్. నరసింహరావు, ఎస్‌ఓటు జిఎం ఆర్. నారాయణ రావు , జి.కె.ఓ.సి. ప్రాజెక్టు ఆఫీసర్ రమేశ్, ఇంచార్జ్ కొత్తగూడెం ఏరియా ఇంజినీర్ కె. వెంకటేశ్వర్లు , ఏజెంట్ బూర రవీందర్, ఏజిఎం (సివిల్) సూర్యనారాయణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కోటిరెడ్డి, డి.జి.ఎం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి.ఎం.(ఎఫ్.ఏ) రాజశేఖర్, డి.జి.ఎం.(ఎంవిటిసి ) శర్మ, ఎస్.ఓ.ఎం. జి.కె.ఓ.సి. కరుణాకర్, ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య, అడిషనల్ మేనేజర్ రామకృష్ణ, ఎస్.ఈ. (ఈ.ఎం) స్టోర్స్ ప్రకాష్, అడిషినల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ టి. సత్యనారాయణ , సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమనా రెడ్డి, డి.వై.ఎస్.ఈ. (ఐఈ) కె. రాధానాగభూషణం, సీనియర్ పి.ఓ. లు మజ్జి మురళి, జి. సుధాకర్, ఎం. శ్రవణ్ కుమార్, జి.ఎం. పి.ఏ. మూర్తి, లవన్ కుమార్, వీరభద్రమ్మ, ఎస్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ సాగర్, ఉమర్, రామాల ప్రసాద్, సుష్మా, ఆశ, జి.ఎం. ఆఫీసు అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు
గడచిన ఏడాది మిగిల్చిన స్మృతులు…కొత్త ఏడాది దారులు. నిన్న, నేడు, భవిష్యత్తు ఇది నిత్య జీవితంలో కదిలేవే…ఎదురయ్యేవే…కానీ గత ఏడాది రాజకీయాల కాస్త రసవత్తరంగానే సాగాయి. గత ఏడాది దేశ రాజకీయాలలో కూడా సరికొత్త ఆవిష్కరణ జరిగాయి. ముందుగా 2022 ఆరంభం కొంత ఇబ్బంది కరంగానే వుంది. ప్రపంచమంతా కరోనా పరిస్థితులు ఎలా వుంటాయన్న దానిలో ఎవరికీ క్లారిటీ లేదు. అలాంటి రోజుల నుంచి తేరుకొని, మళ్లీ మామూలు జీవితాలు గడపడానికి అనువైన పరిస్థితులు మోసుకొచ్చిన ఏడాది. కాకపోతే ఏడాది చివరలో మళ్ళీ ఒక్కసారి కలకలం రేగినంత పనైంది. చైనాలో మళ్లీ కరోనా సీరియస్ వేవ్ అన్న వార్తలు ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసినంత పనైంది. అయినా ఏడాది చివరలో ఊపిరిపీల్చుకునేలా చేసింది. గత ఏడాది ఎంత సంతోషంగా ప్రజలు ఆహ్వానం పలికారో వీడ్కోలు కూడా అంతే ఆనందంగా పలకడం అన్నది 2022 ప్రత్యేకత అని చెప్పకతప్పదు. కరోనా పీడ వదిలించిన 2022. రెండు సంవత్సరాల పాటు ఒక కుదుపు కుదిపిన కరోనా రకరకాల వేరియంట్ల రూపంలో విరుచుకుపడిరది. అతలాకుతలం చేసింది. 2022 వచ్చే సరికి శాంతించింది. డిసెంబరు నెలలో మళ్ళీ గడగడలాడిస్తుందేమో! అన్న భయాన్ని మోసుకొచ్చింది. చైనాలో ప్రజలు లాక్ డౌన్ ను తట్టుకోలేక ఒక్కసారిగా ప్రజలు ఆందోళన మొదలుపెట్టారు. దాంతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై వున్న ఆంక్షలను సడలించింది. కాకపోతే అలా వదిలేయడమే మంచిదైందని చైనా తెలుసుకున్నది. సెకెండ్ వేవ్ వరకే మన దేశంలో ప్రజల్లో ఇమ్యూనిటీ లెవల్స్ బాగా పెరిగాయి. ప్రజలంతా సామూహికంగా గుమిగూడడం వంటి వాటి వల్ల హార్డ్ ఇమ్యూనిటీ పెరిగింది. చైనా మొన్నటి వరకు జీరో కోవిడ్ పేరుతో లాక్ డౌన్ మూలంగా అక్కడ ప్రజలకు ఇమ్యూనిటీ పెరగలేదు. ఒక్కసారిగా ఆంక్షలు సడలించడంతో చైనాలో కోవిడ్ తొలిరోజులు కనిపించినంత పనైంది. మన దేశంలో కూడా ఆంక్షలు పెట్టొచ్చన్నంత దాకా ప్రచారం సాగింది. ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తంగా వుండాలని సూచించాయి. అయితే చైనాలో కోవిడ్ బిఎఫ్ 7 కేసులు పెరిగాయే కాని, భయపడినంత ప్రళయం జరగలేదు. దాంతో ప్రపంచమంతా ఊపరిపీల్చుకున్నది. కొత్త సంవత్సరం వేడుకలు ప్రపంచమంతా ఆనందోత్సాహాలతో జరుపుపున్నది.
ఇక దేశ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ వరకే పరిమితమైన టిఆర్‌ఎస్, పేరు మార్చుకొని బిఆర్‌ఎస్ అయ్యింది.
జాతీయ స్థాయి పార్టీగా అవతరించింది. ఇది గత ఏడాదిలో నమోదైన సంచలనమనే చెప్పాలి. ఇదిలా వుంటే డిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడ బిఆర్‌ఎస్ ప్రకటించడం అన్నది మొత్తం 2022కే ఒక సంచలనం. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారడం అన్నది ఒక సంచలనం. దక్షిణాదికి చెందిన ఓ నేత హస్తిన కేంద్రంగా జాతీయ రాజకీయాలను మార్చుతానని చెప్పిన మొదటి వ్యక్తి కేసిఆర్ అనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాలలో ఇది కీలక మలుపు అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలు ఎలా వుంటాయన్నది పక్కన పెడితే, దేశ రాజకీయాల దశ..దిశ మార్చేందుకు నేను రెడీ…అని అడుగులు వేసింది. 2022 బిఆర్‌ఎస్ కు మునుగోడు తొలి విజయం. దేశ చరిత్రలో బిఆర్‌ఎస్ సరికొత్త అధ్యాయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధాని అవుతారా! అన్నది కూడా తేలేందుకు కొత్త ఏడాది ఎలా సహకరిస్తుందనేది కూడా చూడాలి.
దేశంలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో ముఖ్యంగా గుజరాత్ లో బిజేపి ఏడొసారి విజయం సాధించింది.
గత ఎన్నికలలో అత్తెసరు సీట్లతో గెలిచిన బిజేపి, ఈ సారి మరింత పుంజుకొని గొప్ప విజయం సొంతం చేసుకున్నది. డిల్లీలో రెండు సార్లు గెలిచి, గత ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికలలోనూ విజయకేతనం ఎగురవేసిన ఆప్ పార్టీ గుజరాత్ లో దూకుడు ప్రదర్శించింది. ఎన్నికలలో ప్రచారంలో గెలిచేది మేమే రాసిపెట్టుకోండి అని సవాలు విసిరింది. దేశ ప్రజలందరూ ఆసక్తి కనబర్చారు. కానీ ఆప్ కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. బిజేపికి గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినా అంతగా రాణించలేదు. ప్రతిపక్షాలు ఎంత సమర్థవంతంగా పని చేసినా బిజేపికి యాభై శాతం పైగా ఓటింగ్ నమోదు కావడం అన్నది ఒక రకంగా రికార్డే అని చెప్పాలి. ఇక తెలంగాణ లో కూడా బిజేపి కొంత పుంజుకున్నది. తెలంగాణ లో వచ్చిన రెండు ఉప ఎన్నికలలో బిజేపి గెలవడం కూడా ఆ పార్టీలో ఊపు పెంచింది. ముఖ్యంగా యువతను పెద్ద ఎత్తున బిజేపి ఆకర్షిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలలో బిజేపి అభ్యర్థులు గెలవడం అన్నదే ఇక్కడ హైలెట్ గా మారింది. ఇక తెలంగాణ మేమే అన్నంత అతి విశ్వాసానికి వెళ్ళిన బిజేపి కోరి, కోరి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చింది. రాజగోపాల్ రెడ్డి ని పార్టీలో చేర్చుకొని రాజీనామా చేయించి, ఉప ఎన్నిక తెచ్చింది. రాజగోపాల్ రెడ్డి మీద వున్న అతి నమ్మకం బిజేపి కొంప ముంచింది. రాష్ట్ర నాయకులు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మడానికి వీలు లేదని తెలుసుకున్నది. ఇదిలా వుంటే, బిజేపి అంతర్గత పోరు బాగానే వుంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల దాకా అధ్యక్షుడుగా తానే వుండాలన్న పట్టుదలతో బండి సంజయ్ ప్రజల్లో వుంటున్నాడు. ప్రజా సంగ్రామ యాత్ర సాగిస్తున్నాడు. క్రెడిట్ మొత్తం బండి సంజయ్ కొట్టేస్తున్నాడు. పైగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల చేతలు పదేపదే శభాష్ అనిపించుకుంటున్నాడు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వున్నా ప్రజలకు దగ్గర కాలేకపోతున్నాడు. పార్టీని గ్రిప్పులో పెట్డుకోలేకపోతున్నాడు. ఇక బిజేపి లో చేరి, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ ను చేసి బిజేపి చేతులు దులుపుకున్నది. బండి సంజయ్ కు ఫ్రీ హాండ్ ఇచ్చింది.
అదే లుకలుకల నడుమ కాంగ్రెస్.
కాంగ్రెస్ పరిస్థితి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. తెలంగాణ వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే వుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు పిసిసి. అధ్యక్షులయ్యారు. ఎన్ని వివాదాలు వున్నా, కాంగ్రెస్ లో అల్ల కల్లోలం కాలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి రోజూ వివాదమే. ఆయనపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయలేని రోజంటూ లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి మునుగోడు దాకా వివాదాలు మూటగట్టుకున్నాడు. ఇటీవల కొత్త పిసిసి కార్యవర్గం, జిల్లాల కమిటీ ఏర్పాటు పెద్ద దుమారం లేచింది. ఈ కొత్త ఏడాది లో రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ ను మార్చుతారన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటుందని తెలుస్తోంది. కాకపోతే రేవంత్ రెడ్డి ని మార్చితేనే మంచిది అని సీనియర్లు పట్టుబడుతున్నట్లు తెలిసిందే.
మళ్ళీ తెలంగాణలో తెలుగు దేశం అడుగులు.
ఇక తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అనే మాట వినపడకపోవచ్చని అనుకున్నారు. తెలుగు దేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే సాహసం చంద్రబాబు చేస్తాడని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి గా పేరు మార్పు కావడంతో తెలుగు దేశానికి మరో అవకాశం దొరికింది. తెలంగాణలో మళ్ళీ తన పునాదులు పదిలపర్చుకునే వెసులుబాటు ఏర్పడిరది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ప్రభావం అంత కొట్టిపారేయలేం! ఇదిలా వుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది. పాదయాత్ర చేపట్టి తెలంగాణ చుట్టేస్తోంది.వివాదాల నడుమ రాజకీయ పాత్ర పోషిస్తోంది. కొత్త ఏడాదిలో తెలంగాణలో ఎన్నికల కోలాహలం.అన్ని రాజకీయ పార్టీల భవితవ్యం తేలనున్న తరుణం.
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను వరంగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కొడగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. కమలాపూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో భైరి నరేష్‌ను కొడంగల్‌కు పోలీసులు తరలించనున్నారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్పస్వాములు ఆందోళణలు చేస్తుండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అయ్యప్పస్వాములు ఆందోళనలు చేస్తున్న క్రమంలో.. దానిని వీడియో చిత్రీకరించడానికి వచ్చిన భైరి నరేష్ అనచరుడు బాలరాజును చితకబాదారు. అయ్యప్పస్వాముల దాడిలో గాయపడిన బాలరాజును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా పాలకుర్తి, దేవరుప్పుల, కోడకండ్ల మండలాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి డిసెంబర్ 31 ఉదయం నుండి అర్ధరాత్రి ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని,ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం, కంటపడితే జైల్ పాలు కావడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ , నిర్వహిస్తున్నారు కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మస్కులను ధరించాలి,సామాజిక దూరం పాటించండి అతిగా మద్యం సేవించి ఘర్షణలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలు,కఠిన చర్యలు తప్పవని,కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒక్క రోజు ఆనందం కోసం మీ ప్రాణాలను,మిమ్మలి నమ్ముకొని ఉన్న మీ కుటుంబ సభ్యుల,ఆనందాలను ఆశాలను నిరాశాలుగా మార్చకండి పర్మిషన్ లేకుండా సమయ పాలన లేకుండా డిజె సౌండ్స్,వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది సమయపాలన పాటించండి సక్రమంగా ఉండండి సమస్యలను కొని తెచ్చుకోకండి ప్రజలు,యువతి ,యువకులు, నూతన సంవత్సర వేడుకలను ఇంటి మధ్య ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలి
`ఓ ఐపిఎస్ ఆఫీసర్ ను పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్ చేయించాడు?
`ఉమ్మడి రాష్ట్రంలో ఓ ఏఎస్పి డాన్ శీన్ ను ఉతికి ఆరేశాడు!
`దెబ్బకు శీను చరిత్ర సితారయ్యింది.
`భయానికి కొంత కాలం కనుమరుగయ్యాడు!
`ఆ అధికారి వెళ్లగానే మళ్ళీ మొదలుపెట్టాడు?
`తాజాగా బాల్క సుమన్ భయానికి హైదరాబాదు పారిపోయాడు!
`అయినా ఆగడాలు ఆపడం లేదు!
`డిఫాక్టో తహిసిల్తార్ గా కొన్ని మండలాలలో ఎంతో మంది భూములు ఆక్రమించుకుంటున్నాడు.
`ఎవరి భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా ముందు శీనుకు కలవాలట!
`పర్మిషన్ తీసుకోవాలట!
`డాన్ శీన్ కు సహకరించి ఇరుకున్న ఆర్మీవో…!
`రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేయాల్సిన పరిస్థితి!
`ఆర్డీవో వీడియో వైరల్!
`హైదరాబాద్ లోని బండ్లగూడలో మకాం… ఫోన్లలో వ్యవహారం.
`కొత్తగా వచ్చిన అధికారులను కోట్లిచ్చైనా ప్రసన్నం చేసుకుంటాడు!
`ఆ తర్వాత వాళ్లను గుప్పిట్లో పెట్టుకుంటాడు!
`మొత్తం రెవెన్యూ వ్యవస్థ లో శీను చక్రం తిప్పుతున్నాడు?
`సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాడు?
`ఇసుకాసురతో చేతులు కలిపి, అధికారులు భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకుంటున్నారు.
`శీను పారిపోయినా పనులు చేసిపెడుతున్నారు.
`ముడుపులు ముసిముసిగా తీసుకుంటున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అతనేమీ స్వాతంత్య్ర సమరయోధుడు కాదు. తెలంగాణ ఉద్యమకారుడు కాదు. సామాజిక వేత్త అంతకన్నా కాదు. అ జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ కాదు…కనీసం నాయకులకు తోడ్పాటు అందించే వ్యక్తి కూడా కాదు. పాపాల బైరవుడు. అరాచకాలకు అడ్డా అతను. పేద ప్రజలను పీడిరచుకుతింటున్న పాపాత్ముడు. సమాజానికి చీడ పురుగు. అతనో సమాంతర వ్యవస్థ. మంచిర్యాల జిల్లాలో అతనో పవర్ పుల్ మ్యాన్. పేరుకు మాత్రం అతను డీలర్….జస్ట్ డీలర్ శ్రీను….అధికారుల దృష్టిలో అతను కల్పవృక్షం. అందరూ చెప్పుకుంటున్నట్లు అతని మరో పేరు డాన్ శ్రీను…అధికారులకు అడిగింది ఇస్తాడు. ఏ కోరికైనా తీర్చుతాడు. కోట్లు ఖర్చైనా వెనుకాడడు. ఎంత పెద్ద స్థాయిలో వున్న అధికారి అయినా సరే అతని మాటలకు పడిపోవాల్సిందే. అలా అందర్నీ మెస్మరైజ్ చేయగలడు. నోట్ల ఆశ చూపగలడు. ఆఖరుకు ఎంతటి స్థాయి అధికారినైనా కొనేయగలడు. గుప్పిట్లో పెట్టుకోగలడు. దాంతో అధికారులు అతను ఏం చేయమంటే అది చేసి పెడతారు. కనీసం కాదని కూడా అనలేరు. అంతలా వారిని ఆడిరచగలడు. అతని ముందు ఏ అధికారి న్యాయం, ధర్మం అని ఎదురుచెప్పకూడదు. అన్యాయమైన పనులు చేయలేమని చెప్పకూడదు. ఏ అధికారి బలహీనత ఏమిటో ముందే తెలుసుకుంటాడు. ఆడిరచడం మొదలు పెడతాడు. అప్పుడు ఎంత చెండాలమైన పనైనా చేసి పెట్టాల్సిందే…జనం జాగలు అతని పేరు మీద రాయాల్సిందే…అవసరమైతే దగ్గర కూర్చొని రాయించుకోగలడు. అంతటి సమర్థుడు. జనం దృష్టిలో దుర్మార్గుడు. పాపాత్ముడు. నీచుడు. చెండాలుడు. కానీ అధికారులకు ఇవేమీ అవసరం లేదు…డీలర్ శీను అదేశిస్తాడు…అధికారులు చేసి పెడతారు. ఆ జిల్లాలో అతను ఏది చెబితే…అది…ఎంత చెబితే అంత…సామాన్యుడు తన భూమి అమ్ముకోవాలన్నా అతని పర్మిషన్ కావాలి. కనీసం కుటుంబ సభ్యుల పేరుమీద మార్చుకోవాలనుకున్నా అతను సరే అనాలి. అతను తనకే కావాలంటే ఇచ్చేయాలి. లేకుంటేవారికి తెలియకుండా పట్టా మార్పు జరిగితే ప్రశ్నించొద్దు. కనీసం గోడు కూడా వెళ్లబోసుకోవొద్దు. అతని అనుమతి ముందే తీసుకోవాలి. లేకుంటే ఏ అధికారి పెన్ను కదలదు. అతని నుంచి ఫోన్ వస్తే తప్ప ఏ పని కాదు…అంతటి శక్తి వంతుడిని చేసింది ఎవరో కాదు. ఉద్యోగ వ్యవస్థ. ఒక అనామకుడు ఇచ్చే సొమ్ముకు ఆశపడి పని చేయడం మొదలు పెట్టిన అధికారులు, ఇప్పుడు అతనేం చెబితే అదే చేస్తామన్న స్థాయికి చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోయారు. ఆత్మాభిమానం అమ్ముకున్నారు. అతని చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఇది మంచిర్యాల జిల్లాలో ఎవరిని కదిలించినా చెప్పే మాట. మంచిర్యాల జిల్లా వాసులు ఏమైనా ఆటవిక రాజ్యంలో బతుకుతున్నారా? అన్న అనుమానం రావొచ్చు? కానీ డాన్ శీను చెప్పు చేతుల్లో బతుకుతున్నారని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. వ్యవస్థలన్నీ లొంగిపోయాక అతను చెప్పిందే వేదం…చేసిందే శాసనం…జిల్లానే అతని రాజ్యం…భోజ్యం.
శీను బాధితులు వందల సంఖ్యలో వున్నారు?
మంచిర్యాల జిల్లాలో ఎవరిని కదిలించినా శీను గురించి కథలు, కథలుగా చెబుతారు. వారు శీను వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపుతూ బోరున విలపిస్తారు. అ తర్వాత అతను ఎంత కర్కోటకుడో తెలుపుతారు. తమను ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేశాడో తెలుపుతుంటారు. అధికారుల అండదండలు శీనుకు ఎలా వున్నాయో పూస గుచ్చినట్లు వివరిస్తారు. తమను చేసిన మోసం చెప్పుకుంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా శాపనార్థాలు పెడుతుంటారు. నేటిధాత్రి తో వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు! డాన్ శీను బాధితులు అనేక మంది నేటిధాత్రిలో వస్తున్న కథనాలు చూసి ఫోన్లు చేస్తున్నారు. హైదరాబాదు కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నారు. జిల్లాలో శీను మోసం చేసిన వాళ్ల లిస్ట్ చాలా పెద్దది. కొన్ని వందల కుటుంబాలు శీను చేతిలో బలయ్యాయి.
సిఎస్ గారు ఒక్కసారి శీను బాగోతం వినండి.ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కక్కించండి.
మైనింగ్ లో రికవరీ కాని ఏకైక వ్యక్తి శీను. సహజంగా అక్రమ మైనింగ్ విషయంలో ఎంతటి వాళ్లైనా సరే, తప్పు జరిగిందని తేలితే తిరిగి ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఒక్క శీను విషయంలో మాత్రం అది జరగలేదు. ప్రభుత్వ వ్యవస్థలోనే ఇదొక సంచలనమనే చెప్పాలి. సహజంగా ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు కాస్త అత్యుత్సాహం కనబర్చడం చూస్తుంటాం. కానీ ఇక్కడ చడీ లేదు…చప్పుడు లేదు. శీనుకు నోటీసులిచ్చింది లేదు. కేసు నమోదైనా పట్టించుకున్నది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయ్యి ఐదేళ్లు గడిచిపోయింది. అధికారుల దగ్గర రిపోర్ట్ కూడా వుంది. అయినా అధికార గణం కదిలింది లేదు. శీను దగ్గర నుంచి రికవరీ చేసింది లేదు. వందల కోట్లు రికవరీ చేయకుండా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారనేది నేటిధాత్రికి అందిన సమాచారం. అసలు అధికారులనే శీను శాసిస్తుంటే, వాళ్లు మాత్రం ఏం చేయగలరని కూడా మంచిర్యాలలో జనం మాట్లాడుకోవడం గమనార్హం.శీను కరుణ వుంటే సీట్లో వుంటారు. లేకుంటే లేదు అన్నట్లుగా వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకుంటే అధికారులు మాత్రం ఏం చేయగలరు. పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా శీను మాటే చెల్లుబాటు అవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేరు. అంతే కాదు శీను చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్ ఫర్ అవుతారు? ఒక దశలో ఓ ఐపిఎస్ ఆఫీసర్ శీను చెప్పినట్లు వినలేదట. అంతే పది రోజుల్లో నీకు స్థాన చలనం తప్పదని హెచ్చరించాడట. అన్నట్లుగా ఆ ఐపిఎస్ ఆఫీసర్ ను పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్ చేయించాడు? అని టాక్.
ఎప్పుడూ మన రోజులే వుంటాయా?
ఒకసారి చీకటి…ఒకసారి వెలుగు. అప్పుడప్పుడు కొన్ని సార్లు మబ్బులు కమ్మేస్తుంటాయి. అందరిలాగే ఓ ఏఎస్పీని కూడా శీను బెదిరించాలని చూశాడు. కానీ ఆ ఎఎస్పీ వద్ద డాన్ శీను పప్పులు ఉడకలేదు. డీలర్ రోజులు గుర్తొచ్చేలా, బంగాళాదుంప ఉడికించినట్లైందట. ఏఎస్పీ దెబ్బకు శీను చరిత్ర సితారయ్యింది. నగర బహిష్కరణ అనుభవించాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ ఎఎస్పీ వున్నంత కాలం శీను కనిపించకుండా పోయాడు. అధికారి అన్నాక ఎల్ల కాలం అక్కడే వుండడు కదా! అతను ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోయాడు. మళ్లీ డీలర్ శీను డాన్ శీను అవతారం మళ్లీ మొదలుపెట్టాడు. తాజాగా బాల్క సుమన్ భయానికి మంచిర్యాల వదలి హైదరాబాదు పారిపోయాడు! బండ్ల గూడలో మకాం పెట్టాడు. అయినా ఆగడాలు ఆపడం లేదు! చేయాల్సిన పనులన్నీ హైదరాబాదు లోని తన ఇంటి నుంచే అన్నీ చక్కదిద్దుతున్నాడని సమాచారం. చీమ చిటుక్కుమన్నా అధికారులు క్షణాల్లో శీనుకు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే రెవెన్యూ వ్యవస్థ మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. డిఫాక్టో తహిసిల్తార్ గా కొన్ని మండలాలలో ఎంతో మంది భూములు ఆక్రమించుకుంటున్నాడు.ఎక్కడా లేని విధంగా , మహిష్మతి సామ్రాజ్యంలో నా మాటే శాసనం అన్నట్లు శీను కూడా అంటుంటాడట.ఎవరు కొత్తగా భూమి కొనుక్కోవాలనుకున్నా ముందు శీనును కలవాలట. ఇది ఆర్డర్. అధికారులు కూడా కలం కదల్చాలంటే ముందు ఈ మాటే చెబుతారట. ఎవరి భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా ముందు శీనుకు కలవాలట! లేకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే ముచ్చటే లేదు. తమ సొంత భూమి బదలాయింపైనా సరే పర్మిషన్ తీసుకోవాలట! తహసీల్దారు కార్యాలయానికి, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫైలు విషయం వివరంగా క్షణాలలో శీనుకు తెలియాల్సిందే. అంతే కాదు రియలెస్టేట్ వ్యాపారం మొత్తం అతని కనుసన్నల్లోనే జరగాలంట.
డాన్ శీన్ కు సహకరించి ఇరుకున్న ఆర్డీవో…!
ఉన్నత స్థాయి ఉద్యోగం. అయితే ఏమిటి? కాసులకు కక్కుర్తి పడ్డాడు. డీలర్ శీనుకు అడుగడుగునా ఉపయోగపడ్డాడు. నిజానికి ఆ స్థాయి అధికారి పేదలకు అండగా నిలవాలి. ప్రజలకు మేలు చేయాలి. డాన్ శీను లాంటి వాళ్లను గడగడలాడిరచాలి. కానీ ఆర్డీవో అయినప్పటికీ శీనుకు లొంగిపోయాడు. కాసులకు దాసోహమయ్యాడు. శీనుకు సాయం చేశాడు. తప్పుడు మార్గం అనుసరించాడు. చేయకూడని పనులన్నీ శీనుకు చేసిపెట్టాడు. తప్పుడు లెక్కలు అనుసరించాడు. తప్పులు చేయడం అలవాటు పడ్డాక శీను విషయంలో జిల్లా కలెక్టర్ మీద నోరు జారి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ట్రాన్స్‌ఫర్ కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడిన ఓ విషయం జనాలకు చేరింది. వీడియో వైరల్ అయ్యింది. ఆర్డీవో పని అయిపోయింది.సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాడు? ఇసుకాసురతో చేతులు కలిపి, అధికారులు భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఆర్డీవో లాగా ఇబ్బందులు పడకతప్పదని తెలిసినా, తప్పుడు పనులలో సాయం ఆపడం లేదు. శీను పారిపోయినా పనులు చేసిపెడుతున్నారు. ముడుపులు ముసిముసిగా తీసుకుంటున్నారు. ఎప్పుడో పాపం పండకపోదు. పాపాల పుట్ట పగలకపోదు. పాపాత్ముడికి సాయపడిన వారికి శిక్ష తప్పదు. పాపాల బైరవుడు డాన్ శీనుకు ఆగడాలకు మూల్యం చెల్లక తప్పదు.
రూ.2 కోట్లతో నూతన గ్రామపంచాయతీ,మహిళ భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన…
గీసుగొండ మండలంలో శుక్రవారం రోజున పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సుడిగాలి పర్యటన చేశారు.పర్యటనలో భాగంగా రూ.2 కోట్లతో బొడ్డుచింతలపల్లి, కొనాయిమాకుల,మనుగొండ, ఎలుకుర్తి,ఆనంతారం,సూర్యతండా,దస్రుతండా,హార్జ్యతండా, ఊకల్ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు,ఊకల్ గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఊకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
నియోజకవర్గంలో 49 కొత్త గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కావడం జరిగింది.
-ఒక్కో భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
-మహిళ కమ్యూనిటీ భవనాలు 35 మంజూరు చేసుకోవడం జరిగింది.
-ఒక్కో భవనానికి రూ.20 లక్షల నిధులు కేటాయించచడం జరిగింది.
-నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కృషిచేస్తాను.
-కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడం జరిగింది.
-అంతటి కష్ట కాలంలో సమర్ధవంతంగా పరిపాలన కొనసాగించి ప్రజల పక్షాన నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.
-గత 7 సంవత్సరాల క్రితం ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలి.
-సీఎం కేసీఆర్ గారి సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తాను.
-ఈ రోజు 24 గంటల కరెంటు సరఫరా దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క మన తెలంగాణలో తప్ప.
-దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టి పారదర్శకంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారిది.
-గడ్డుకాలంలో ఉన్న రైతాంగానికి అండగా నిలిచి రైతులను అక్కున చేర్చుకొని వారి అభివృద్ధి కి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ గారిది.
-వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంటు,రైతుభీమా,రైతుబంధు,పంటపెట్టుబడి అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ గారేన్నారు.
-మహిళల అన్ని రంగాల్లో ముందుకు రావాలని వారిని ప్రోత్సహిస్తూ అండగా నిలిచి సొసైటీలో వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత బి.ఆర్.ఎస్. ప్రభుత్వానిదన్నారు.
-గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులలైన కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు.
-ఈ అవకాశాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి మరింత శ్రమించాలన్నారు.
-రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిగ్రామం అభివృద్ధిలో ఉరకలు పెడుతున్నాయి.
-తెలంగాణ రాష్ట్రానికిచ్చే నిధులు ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందన్నారు.
-బీజేపీ నాయకులు గ్రామాలలోకి వస్తే గ్రామానికి ఏమిచేసారో చూపించాలని ప్రజలు నిలదీయాలన్నారు.
-నల్ల ధనం బయటికి తీస్తా అన్న ప్రధాని గారు ఇంతవరకు ఎందుకు చేయలేదు.
-జన్ ధన్ ద్వారా పేదల బ్యాoకు ఖాతాల్లో 15 లక్షలు జమచేస్తామన్న బిజెపి నాయకులు గ్రామాలలో తిరనివ్వకండి.
-బిజెపి పాలిత రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు లేవన్నారు.అమలు చేసే దమ్ముందా అని అడుగుతున్న.
-కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో త్వరలో ప్రారంభం చేసుకోబోయే కిటెక్స్ కంపెనీలో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సొసైటీ,మార్కెట్,రైతుబంధు,దళితబంధు చైర్మన్లు,కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
`బతుకుదెరువు శాపమైన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగులు.
`ఉద్యోగ సంఘాలు ఎంతో కృషి చేశాయి.
`దేవీ ప్రసాద్ ఆదిలో ప్రోద్బలం.
`తర్వాత సుబ్బారావు, కారం రవీంద్ రెడ్డిల సహాకారం.
`ఇప్పుడు మామిళ్ల రాజేందర్ తోడ్పాటు…
`ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్ దాకా సమస్య తీసుకెళ్లారు.
`సకల ఉద్యోగుల సదస్సు తీర్మానాలలో చేర్చారు.
`మంత్రి వర్గం ఉప సంఘంలో చర్చించారు.
`ఖమ్మం లో కూడా మంత్రి కేటిఆర్ అక్కడి కలెక్టర్ కు ఆదేశాలిచ్చాడు.
`వరంగల్ లో మంత్రి కేటిఆర్ మాటిచ్చాడు.
`ఎప్పటికప్పుడు కొలువులు వచ్చినట్లే వచ్చి, ఆగిపోతున్నాయి.
`ఎంతో సహకరించారు…ఇంకొంచెం సహకరించండి.
`వారి జీవితాలలో కొత్త సంవత్సరంలోనైనా వెలుగులు నింపండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
2016లో తొలగింపబడిన గృహ నిర్మాణ శాఖ ఒప్పంద ఉద్యోగుల సమస్య ఒక అడుగు ముందుకు…పది అడుగులు వెనక్కు… అన్నట్లు సాగుతోంది. వారిని తొలగించిన నాటి నుంచి పడుతున్న వేధన, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల పాటు ఆ శాఖలో విధులు నిర్వర్తించారు. ఇక కొలువులకు ఢోకా లేదనుకున్నారు. పర్మనెంట్ కాకపోయినా, ఉద్యోగ భద్రత వుంటుందనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ళ పాటు కొలువులు చేశారు. పిడుగులాంటి వార్త వినాల్సివస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల ఇండ్ల నిర్మాణం ప్రకటించింది. కానీ ఆ పనులను గృహ నిర్మాణ శాఖకు అప్పగించలేదు. దాంతో తెలంగాణ లో 1700లకు పైగా వున్న ఒప్పంద ఉద్యోగుల తొలగింపు జరిగింది.
తెలంగాణ వచ్చాక తమ జీవితాలు మరింత ఆశా జనకంగా వుంటాయనకున్న ఒప్పంద ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అయితే ప్రభుత్వం వీరిని తొలగించాలనుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఇళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. అందుకే ఆ శాఖ ను ముఖ్యమంత్రి కేసిఆర్ తొలగించారు. పైగా జరిగిన అవినీతిపై విచారణకు కూడా ఆదేశించారు. నిజానికి గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతికి ఈ ఒప్పంద ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఆ శాఖలో పనిచేయడం మూలంగా వీళ్లు బలైపోయారు. కొలువులు కోల్పోయారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ ఒప్పంద ఉద్యోగులకు అండగా నిలిచారు. వీరిలో ఆత్మస్థైర్యం నింపగలిగారు. తొలుత ఈ ఒప్పంద ఉద్యోగులు అప్పటి టిజివో నాయకుడు దేవీ ప్రసాద్ ను కలిశారు. వారి గోడు చెప్పుకున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయించాలని వేడుకున్నారు. దేవీ ప్రసాద్ కూడా వీరికి పూర్తి స్థాయిలో సహకరించారు.
ఈ ఒప్పంద ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్ వద్దకు కూడా దేవీ ప్రసాద్ తీసుకెళ్లారు.
ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ బాధితులకు ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పాయింట్ మెంట్ కూడా ఖరారయ్యే సమయానికి పాలేరు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కొంత కాలం వీరి పని వాయిదా పడిరది. అయినా వాళ్లు తమ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. దేవీ ప్రసాద్ ఆ సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడకు వీళ్లు వెళ్లడం జరిగింది.
అదే సమయంలో ఖమ్మం వచ్చిన మంత్రి కేటిఆర్ దృష్టికి ఈ ఉద్యోగుల సమస్యను దేవీ ప్రసాద్ తీసుకెళ్లారు.
అప్పటికప్పుడు కేటిఆర్ కూడా అక్కడే వున్న కలెక్టర్ కు వీళ్ల సమస్య పరిష్కరించాలని సూచించారు. కాకపోతే ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన తర్వాత చూద్దామని కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇక తమ సమస్యలు తీరినట్లే అనుకున్నారు. అప్పటి టిఎన్జీవో జనరల్ సెక్రెటరీ కారెం రవీదందర్ రెడ్డి, ఉద్యోగ జేఏసి నాయకుడు సుబ్బారావు వీరికి దారి చూపుతూ వస్తున్నారు.
ఒక సమయంలో తెలంగాణ సకల ఉద్యోగుల సదస్సు ఎల్బీనగర్ లో జరిగింది.
ఆ వేధికగా వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలను చర్చించడం జరిగింది. వారి సమస్యలు తీర్చాలని ఆ సభ 18 తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో 5 వ అంశంగా సుబ్బారావు ఒప్పంద గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల సమస్యను కూడా చేర్చారు. సుబ్బారావు చేసిన ఈ పని వల్ల అన్ని శాఖల ఉద్యోగులతో పాటు వీరికి కూడా ప్రాధాన్యత దక్కింది. ఇలా ఉద్యోగ సంఘాల నేతృత్వంలో జరిగిన సదస్సు తీర్మానాలు ముఖ్యమంత్రి కేసిఆర్ కు దేవీ ప్రసాద్ అందజేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఓ సభా సంఘాన్ని ప్రకటించారు. ఆ కమిటీ కూడా వీళ్ల సమస్యను కూలంకషంగా చర్చించింది. చాలా శాఖల సమస్యలు తీరాయి. కానీ ఈ ఉద్యీగుల సమస్య మాత్రం తీరలేదు.
ఇంతలో హైదరాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
దేవీ ప్రసాద్ కు సిఎం కేసిఆర్ టికెట్ ఇచ్చారు. దాంతో ఈ ఉద్యోగుల పని మళ్ళీ పెండిరగ్‌లో పడిరది. అయితే ఆ ఎన్నికలలో దేవీ ప్రసాద్ గెలిస్తే ఈ ఒప్పంద ఉద్యోగుల జీవితాలు మారిపోయేవేమో! ఆ ఎన్నికలలో దేవీ ప్రసాద్ ఓడిపోవడం, కొంత కాలం ఆయన కూడా కొన్ని వ్యాపకాలు తగ్గించుకున్నారు. పైగా అలాంటి సమయంలో దేవీ ప్రసాద్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ఉద్యోగులు కొంత కాలం ఆయనను కలవలేదు.దేవీ ప్రసాద్ కు బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ఉద్యోగులు వెళ్లారు. పనిలో పనిగా వారి విషయం కూడా దేవీ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకుడు కారెం రవీందర్ రెడ్డితో టచ్ లో వుంటూ వస్తున్నారు. అటు సుబ్బారావు, ఇటు రవీందర్ రెడ్డి ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నం చేస్తూ వచ్చారు.
ఎలాగైనా వీళ్ల సమస్యను ఓ దారిలో పెట్టాలన్న ఆలోచనతో సుబ్బారావు, రవీందర్ రెడ్డి లు అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్దకు తీసుకెళ్లారు.
ఆయన తొలుత జరగదని చెప్పినా సుబ్బారావు, రవీందర్ రెడ్డి ల ఒత్తిడి మేరకు ప్రయత్నిస్తానని చెప్పారు. అదే సమయంలో అప్పటి కలెక్టర్ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా చేయలేనని ఆ కలెక్టర్ చెప్పడం జరిగింది. కానీ అప్పటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ మాత్రం తమ శాఖలో ఉద్యోగుల కొరత వుందని, వీళ్లను తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆ వార్త విన్నాక ఈ ఒప్పంద ఉద్యోగుల ఆనందాలకు అవదులు లేకుండా పోయాయి. త్వరలో కొలువులలో చేరుతామని అనుకున్నారు.
అదేంటో గాని ఆ కమీషనర్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కూడా చేయించాడు.
ఇంతలో మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఇలా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు సార్లు 51 మంది ఉద్యోగులకు కొలువులు ఇవ్వడం జరిగుతుందని తీర్మానాలు చేయడం జరిగింది. కానీ కొలువులు రాలేదు. ఒకసారి కమీషనర్ ట్రాన్స్‌ఫర్ తో ఆగిపోయింది. మరోసారి అప్పటి మేయర్ వల్ల ఆగిపోయింది.
ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు.
బతుకుదెరువు శాపమైన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగులు. కొంతకాలం దేవీ ప్రసాద్, సుబ్బారావు, రవీందర్ రెడ్డి లు ఎంత సహకరించారో ఇప్పుడు మామిళ్ల రాజేందర్ తోడ్పాటు కూడా వుంది.
వరంగల్ లో మంత్రి కేటిఆర్ మాటిచ్చాడు.ఎప్పటికప్పుడు కొలువులు వచ్చినట్లే వచ్చి, ఆగిపోతున్నాయి.ఎంతో సహకరించారు…ఇంకొంచెం సహకరించండి. వారి జీవితాలలో కొత్త సంవత్సరంలోనైనా వెలుగులు నింపండి. నిజంగా ఇలాంటి ఇబ్బందులు ఏ ఉద్యోగులకు రావొద్దు. అందరూ సహకరించినా ఎందుకు వీళ్ల కొలువులు ముందట పడడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా…
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే *చల్లా ధర్మారెడ్డి గారు*
అన్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, సంగెం, గీసుగోండ మండలాలతో పాటు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15,16 డివిజన్ల పరిధిలోని 47 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 14,13,000 రూపాయల విలువ చేసే చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో అందజేశారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ…పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. వేలాది మంది మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు.పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని , వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందన్నారు.
లబ్ధిదారుల వివరాలు…
పరకాల మున్సిపాలిటీ(2)- 72,000/-
పరకాల మండలం(7)- 2,15,000/-
నడికూడ మండలం(7)- 2,11,500/-
ఆత్మకూరు మండలం (3)- 1,06,000/-
దామేర మండలం(2)- 46,000/-
సంగెం మండలం (12)- 3,13,000/-
గీసుగొండ మండలం(6)- 2,22,000/-
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ (8) – 2,27,500/-
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వడ్డూరి కుమారస్వామి
నెక్కొండ ,నేటి ధాత్రి: స్మశాన వాటికను సైతం కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు అత్యంత అత్యాధునికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న నెక్కొండ గ్రామపంచాయతీ అన్ని సౌకర్యాలతో ఉండడంతో నెక్కొండ గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ తరుణంలోనే ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా మూడు కంటికి తెలియకుండా అధికారుల అండదండలతో కబ్జాలకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన వాటిక కు సంబంధించిన భూమిని కొంతమంది ప్రబుద్ధులు ఆక్రమణకు గురి చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ నర్సంపేట ఇంచార్జ్ వడ్డూరి కుమారస్వామి నెక్కొండ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దళిత రత్న వడ్డూరి కుమారస్వామి మాట్లాడుతూగుంటుపల్లి చెరువు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న దళితుల స్మశాన వాటిక యొక్క హద్దులు ఏర్పాటు చేయాలని లేదంటే రోజురోజుకు ఆక్రమణకు గురవుతుందని రాను రాను స్మశాన వాటికను సైతం కబ్జాకు గురవుతుందంటూ ఆవేదన వ్యక్తపరిచారు.
స్వాగతం పలికిన ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్ మరియు ఐటిడిఏ పిఓ అంకిత్ ఐఏఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు
గౌరవ రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తదితరులు ఉన్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎస్ పి సంగ్రామ్ సింగ్ జి. ఐ టీ డి ఎ పి ఓ అంకిత్,రాష్ట్ర పతి కి హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు
దేవాలయం లో రాష్ట్ర పతి బృందానికి మంత్రులు డా. వి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి గార్లు రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.
రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే చీర ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు. రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతం గా ఉందని పొగిడారు.అనంతరం దేవాలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద 62 కోట్ల రూపాయలతో ప్రసాద్ స్కీం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను , వీక్షకులను ఆకట్టుకున్నాయి. పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన కల్గించింది. మన సంస్కృతిని చాటే విధంగా కోమ్ముకోయ కళాకారుల బృందం సమక్క సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది, అనంతరం బ్రహ్మంఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.
సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్ పి సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతి కి వీడ్కోలు పలికారు.
`దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో బిఆర్‌ఎస్ వల్ల చలనం!
`అనేక రాష్ట్రాల నాయకత్వాలు కేసిఆర్ కు మద్దతుతో బిజేపిలో సరికొత్త అంతర్మధం.
`త్వరలో మోడీ తో కేసిఆర్ భేటీ?
`జాతీయ స్థాయిలో ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా వుంటాయో?
`బాబుతో ఒరిగేదేమీ లేదు!
`బాబు బడాయి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు!
`దేశంలో కేసిఆర్ కు వున్న క్రేజ్ బాబుకు లేదు.
`ఆంధ్రప్రదేశ్ లోనే నిలదొక్కుకోలేని బాబుతో కలిసి వెళ్లడం మొదటికే మోసం!
`బిజేపిని పలుమార్లు బాబు అవసరానికి వాడుకొని వదిలేయడమే కోలుకోకపోవడానికి కారణం.
`నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు.
`ఇదీ బిజేపి జాతీయ స్థాయిలో విసృతంగా జరుగుతున్న చర్చ!
`తెలంగాణ బిజేపి నేతల మాటలు నమ్మితే కష్టం!
`ఇంటలిజెన్స్ నివేదికలపైనే బిజేపి ఆధారం.
`రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన సమయంలో కేసిఆర్ లో కనిపించిన ఉత్సాహం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు వుండరు. అసలు రాజకీయ నాయకురులలో ఆధిపత్యాలు తప్ప శత్రుత్వం వుండదు. అవసరమైతే నేను నీకు రక్ష లేకుంటే నువ్వు నాకు రక్ష. అంతే…కానీ నాయకుల మధ్య వుండే విభేదాలు కూడా సైద్దాంతిక భేదాభిప్రాయాలు మాత్రమే. అందుకే రాజకీయాలలో ఎప్పుడు ఏ పార్టీ, ఏ పార్టీతో పొత్తు నెరుపుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని రకాల పొత్తులు, స్నేహాలు ఎన్నికల ముందు వుండొచ్చు. కొన్ని సార్లు ఎన్నికల తర్వాత వుండొచ్చు. మొత్తానికి పొత్తు లేని రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్లభం. అందుకే రాష్ట్ర స్థాయి పొత్తులైనా, జాతీయ స్థాయిలో సర్థుబాటులైనా పార్టీల అవసరాల మేరకు వుంటాయి. తాజాగా జాతీయ స్థాయిలో కొత్త పొద్దుపొడుపు? మాట వినిపిస్తోంది.ఒకింత ఆశ్చర్యకరమైన కలయికే అనిపించినా, ఇంత వరకు సఖ్యతతో సాగిన పార్టీలే…ఈ మధ్య కాలంలో కొంత రెండు పార్టీలు దూరమైనా, మళ్ళీ స్నేహ హస్తాలు చాచుకుంటాయన్న ప్రచారం కూడా బలంగానే సాగుతోంది. కొంత కాలం క్రితం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయాలను బిజేపి తక్కువగా అంచనా వేసింది. బిఆర్‌ఎస్ ను తెలంగాణలోనే బలహీన పర్చుదామని చూసింది. కానీ తెలంగాణ లో క్షేత్ర స్థాయి పరిస్థితులను బిజేపి జాతీయ నాయకత్వం బాగా పరిశీలించింది. అటు కేంద్ర ఇంటలిజెన్స్ తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు అందించిన సమాచారంతో బిజేపిలో కొత్త ఆలోచన మొదలైనట్లు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన తీరులో తప్పు పట్టే అంశం ఒక్కటి కూడా లేదు.
పైగా ఎనమిది సంవత్సరాల అతి తక్కువ సమయంలో తెలంగాణను మిగతా రాష్ట్రాల కంటే ముందుంచడం అన్నది గొప్ప విషయం. ఏ రంగంలో చూసినా తెలంగాణ నెంబర్‌వన్ గా కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో ఒక రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో విప్లవాత్మక ప్రగతి సాధించిన దాఖలాలు గతంలో లేవు. కానీ తెలంగాణ లో ఎనమిదేళ్లలో కరువును జయించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. అద్భుతం. ప్రాజెక్టుల నిర్మాణం అమోఘం. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి చేపట్టిన రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలని చెప్పడంలో సందేహం లేదు. కొన్ని శతాబ్థాలుగా సాగులో వెనుకబడిన తెలంగాణ ఎనమిదేళ్లలో అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టేయడం అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన కృషి అనన్య సామాన్యమైనది. దానికి ఏ కొలమానం సరిపోదు. కేసిఆర్ తో కుస్తీ పట్టడం కన్నా సఖ్యతే సరైంది!! అని బిజేపి జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ లో బిఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ.
ఉద్యమకారుడు కేసిఆర్ నేతృత్వంలో సాగుతున్న పార్టీ. సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం, పోరాటంలో క్షేత్ర స్థాయికి చేరుకున్న పార్టీ. బిఆర్‌ఎస్ గా మారినా ప్రజలు ఆదరించనున్న పార్టీ. మొత్తంగా బలమైన పార్టీ. మరి అలాంటి పార్టీని డీ కొనాలంటే కేవలం బిజేపి బలం సరిపోదు. క్షేత్ర స్థాయిలో బిజేపికి క్యాడర్ లేదు. లీడర్ షిప్ కూడా అంతంత మాత్రమే. గెలుపు గుర్రాలుగా ఎన్నికల బరిలో కొట్లాడేంత శక్తి యుక్తులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే గత స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇటీవల ఓ రెండు ఉప ఎన్నికలలో ఆ పార్టీ నేతలు గెలవడం తప్ప బిజేపి సాధించిన విజయాలు లేవు. ఆ గెలిచిన రెండు సీట్లలో దుబ్బాకలో రఘునందన్ రావు కూడా సానుభూతి రాజకీయాలలో వెయ్యి ఓట్లతో బైట పడ్డాడు. ఇక ఈటెల రాజేందర్ విషయం వేరు. ఈ ఇద్దరూ గెలిచినా అ గెలుపు వారి వ్యక్తిగత ఖాతాలోకే వెళ్లిపోయాయి. అయితే తెలంగాణలో కొంత వరకు బిజేపి బలడిరదని మాత్రం చెప్పొచ్చు. ఆ బలం గెలుపోటములను ప్రభావితం చేసేంత మాత్రం బలపడలేదు. అందుకే ఓ వైపు దూకుడును కనబర్చుతూనే, మరో వైపు బిఆర్‌ఎస్ తో పొత్తు ఎలా వుంటుందన్న దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు చెబుతున్నారు. రైతులు, సంక్షేమ ఫలాల లబ్ధి దారులు కేసిఆర్ వెంటేవున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికలలో కూడా బిఆర్‌ఎస్ అనూహ్య విజయం సొంతం చేసుకున్నది. రైతాంగం మొత్తం బిఆర్‌ఎస్ వెంటే వుందని చెప్పడానికి ఈ సాక్ష్యం చాలు అన్నదే బిజేపి జాతీయ నాయకత్వం నమ్ముతున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో బిఆర్‌ఎస్ వల్ల చలనం! ఏర్పడిరదనేది ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనం. బిఆర్‌ఎస్ ను తొలుత బిజేపి కాస్త తక్కువగానే అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందనతో ఆ అవకాశం ఇతర పార్టీలకు ఇచ్చి మనం కొంప ముంచుకోవడం ఎందుకు అనుకున్నట్లుంది. అనేక రాష్ట్రాల నాయకత్వాలు కేసిఆర్ కు మద్దతుతో బిజేపిలో సరికొత్త అంతర్మధనం మొదలైనట్లు కనిపిస్తోంది.
త్వరలో మోడీ తో కేసిఆర్ భేటీ?
ఓ వైపు బిఆర్‌ఎస్, బిజేపి పొత్తు వార్తలు హల్ చల్ చేస్తున్న సందర్భంలోనే ప్రధాని మోడీ, బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ల భేటీ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. కేసిఆర్ చాణక్యం తెలిసిన వాళ్లెవరైనా, ఒక్కసారి కేసిఆర్ తో ఎవరు మాట్లాడినా వారిలో ఒక రకమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఏ విషయాన్నైనా సూటిగా, స్పష్టంగా, అవతలి వ్యక్తికి సులువుగా అర్థం చేయించడం లో కేసిఆర్ దిట్ట. ఆయన మాటల చాతుర్యం కూడా తెలంగాణ రావడానికి కారణమైంది. ఇప్పుడు ప్రధాని మోడీతో కేసిఆర్ భేటీ అనగానే కొత్త సమీకరణాలు ఎలా వుంటాయన్న దానిపై చర్చ సాగుతోంది. ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసిఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు. జాతీయ స్థాయిలో ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా వుంటాయో? అప్పుడు కేసిఆర్ ను తోడు రమ్మంటే ఎలా వుంటుందో! అందుకే చంద్రబాబు ను నమ్ముకోవడం కన్నా కేసిఆర్ తో కలిసి సాగితే వెయ్యేనుగుల బలం అని ప్రధాని మోడీ కూడా నమ్ముతున్నట్లే వుంది.
బాబుతో ఒరిగేదేమీ లేదుని బిజేపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో బలడాలంటే, రాజకీయాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే టిడిపి తో జతకడితే ఎలా వుంటుందన్నదానిపై కొంత కాలం క్రితం బిజేపి ఆలోచించింది. కానీ టిడిపి పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనుకూలంగా లేనట్లు తేలింది. నిజానికి గతంలో కూడా బిజేపి మూలంగానే టిడిపి గెలుస్తూ వచ్చింది. తర్వాత కూరలో కరివేపాకులా బిజేపి ని వాడుకొని టిడిపి వదిలేసింది. ఇప్పుడు కూడా టిడిపి అదే చేస్తుందన్న అనుమానం బిజేపి వుంది. పైగా రెండు సార్లు చంద్రబాబు ప్రత్యక్షంగా బిజేపి పొత్తులో గెలిచి, రెండు సార్లు చారిత్రక తప్పిదం చేశానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడే కాదు, ఎప్పటికైనా టిడిపి తో వెళ్తే మునగడం తప్ప తేలడం వుండదని బిజేపి పెద్దలు తెలుసుకున్నట్లున్నారు. బాబు ఐదేళ్లు పరిపాలించినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 లో జగన్ ను గెలిపించుకున్నారు. టిడిపి ని చిత్తు చిత్తుగా ఓడిరచారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబు ను కోరుకుంటున్న దాఖలాలు లేవు. అలాంటి చంద్రబాబు తో పొత్తుతో మేలు కన్నా నష్టమే ఎక్కువ. ఇక బాబు బడాయి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు! తెలంగాణ లో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం టిడిపి ని ప్రజలకు దూరం చేసింది. మరోవైపు తెలంగాణ వచ్చిన కొద్ది రోజులకే కేసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నెర్ర చేస్తే చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు పారిపోయాడు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ ను వదిలిపోవాల్సి వచ్చింది. రాజధాని పేరుతో అమరావతి గ్రాఫిక్స్ చూపించాడు. ఆంధ్రప్రదేశ్ ను ఎటూ కాకుండా చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకునే ధైర్యం లేని చంద్రబాబు తో తెలంగాణలో కలిసి వెళ్తే మొదటికే మోసం వస్తుందని బిజేపి అంచనా వేస్తోంది. పైగా నిబద్ధత లేని నాయకుడు చంద్రబాబు అన్నది బిజేపిలో బలంగా సాగుతున్న చర్చ అన్నది సమాచారం. ఇప్పుడున్న దేశంలో కేసిఆర్ కు వున్న క్రేజ్ చంద్రబాబు కు లేదు.
తెలంగాణ బిజేపి నేతలు కొందరు ఎన్నికలలో ఒంటరి ప్రయాణం కోరుకుంటున్నారు.
వారి మాటలు బిజేపి జాతీయ నాయకత్వం నమ్మితే కష్టం! అందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మీద కోపం వున్న కొద్ది మంది నాయకులు మాత్రమే తాము ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కొంటామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మరింత బలడేదాక ఏదొ ఒక పార్టీతో కలిసి సాగడమే మేలన్నది అసలైన బిజేపి నేతలు చెబుతున్న మాట. సహజంగా కాంగ్రెస్ ముక్త భారత్ అన్నదే బిజేపి నినాదం. అంతే కానీ ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆ వైరం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, టిఆర్‌ఎస్ తో బిజేపి ఎలాంటి కుస్తీ లేదు. ఈ రెండు పార్టీలు దోస్తీ కడితే ఎదురులేదు. తెలంగాణ తిరుగులేని శక్తిగా వున్న బిఆర్‌ఎస్ తో బిజేపి జత కడితే భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం వుంటుంది. కానీ ఈ మధ్య కొందరు బిజేపి నేతలు పని గట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి బిజేపి జాతీయ నాయకత్వం తెలంగాణలో కేసిఆర్ కు దూరమైనట్లు అధిష్టానం గమనించింది. తెలంగాణ బిజేపి నాయకులు చెబుతున్న దానికి, ప్రజా క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుందనేది బిజేపి జాతీయ నాయకత్వం గమనించింది. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఆ ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అంతటి అద్భుతమైన పథకాల అమలు దేశంలో ఎక్కడా లేదు. ప్రజలు కూడా తెలంగాణలో సంతృప్తిగా వున్నారు. రాష్ట్ర బిజేపి నేతలు చెప్పే విషయాలకు, తెలంగాణ లో పరిస్థితులకు పొంతన లేదని తేలిపోయింది. ఇంటలిజెన్స్ నివేదికలపైనే బిజేపి జాతీయ నాయకత్వం ఆధార పడాలని నిర్ణయించింది. ఎలాగైనా జాతీయ బిజేపి నాయకత్వం ఏది చెబితే అది రాష్ట్ర బిజేపి నాయకత్వం వినాల్సిందే. ఆచరించాల్సిందే! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వాన సమయంలో కేసిఆర్ లో కనిపించిన ఉత్సాహం కూడా ఇందులో భాగమే అని అనుకుంటున్నారు.
స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర వారి స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం నాడు మరి కాసేపట్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.రానున్న నేపథ్యంలో స్వాగతం పలకడానికి దేవస్థానానికి చేరుకొని ఏర్పాట్లు పరవేక్షిస్తున్న .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్.పినపాక శాసనసభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బి ఆర్ ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎంపీల.వద్దిరాజు రవిచంద్ర మాలోత్ కవిత ఎమ్మెల్సీ.తాత మధు, జిల్లా పరిషత్ చైర్పర్సన్. కోరం కనకయ్య గారు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య. జాయింట్ కలెక్టర్.కర్నాటి వెంకటేశ్వర్లు. ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు,
`ఇప్పటికీ చంద్రబాబు కబంద హస్తాలే రేవంత్ చుట్టూ వున్నాయి.
` కాంగ్రెస్ ను ఖతం చేస్తున్నది అందుకే.
`మళ్ళీ టిడిపికి పూర్వ వైభవం కోసమే రేవంత్ ఆరాటం.
` ఎప్పుటికైనా కాంగ్రెస్ ను ఖతం చేయడమే రేవంత్ లక్ష్యం.
` చంద్రబాబు సంతోషమే ముఖ్యం.
` రేవంత్ రహస్య కొత్త పార్టీ ఏర్పాటు అందులో భాగం.
`మిగిలిన కాంగ్రెస్ ను టిడిపి లో కలపడమే అంతిమ ధ్యేయం.
`పరోక్షంగా టిడిపి, బిజేపి లకు సహకరించడమే అసలు రాజకీయం.
`సీనియర్లు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేని అధిష్టానం.
`పాదయాత్ర పేరుతో కొత్త ఎత్తుగడలకు రేవంత్ శ్రీకారం.
` రెంటికీ చెడిన చంద్రబాబు కు ఊతం కోసమే రేవంత్ ప్రయత్నం.
` ఆంద్రప్రదేశ్ లో సైకిల్ మూలన పడిరది.
` తెలంగాణ లో గాడిలో పెట్డే పని రేవంత్ వంతైంది.
`పరోక్షంగా టిఆర్‌ఎస్ ను టార్గెట్ చేయడం కోసమే అందరూ ఏకమైంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
రేవంత్‌రెడ్డి కొత్తపార్టీ నమోదు చేయించాడట! ఇదీ ఇప్పుడు పొలికటిల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. నిజంగా రేవంత్ రెడ్డి కొత్తపార్టీని కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించాడన్నది నిజమా? కాదా? అన్నది కాసేపు పక్కన పెడితే నిప్పులేనిదే పొగరాదు అంటారు. అయినా రేవంత్‌రెడ్డికి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు? అని ప్రశ్నించేవారందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సీనియర్లతో వేగలేకపోతున్నాడని, ఆయనపై సానుభూతి చూపించేవారు కూడా తెలంగాణలో చాలా మందే వున్నారన్నది కొందరి వాదన. కాంగ్రెస్ ఇంకా ఎక్కువ వున్నారు అనేది కూడా ఓ ప్రచారం. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, మరింత పెరిగాడా? తన రాజకీయం తగ్గిందా? అన్నదానిపై అసలైన చర్చ జరడం లేదు. ఒక వేళ నిజంగానే రేవంత్‌రెడ్డి తన అనుచరులతో పార్టీ ఏర్పాటు చేయిస్తే అది తన కోసమేనా? అన్న అనుమానం కూడా కలగకమానదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏదిచేసినా చంద్రబాబు కోసమే చేస్తాడు. ఇది సగటు వ్యక్తికి తెలిసిన నిజం. ఆయన ప్రతిసారి చూపించే స్వామిభక్తికి నిదర్శనం. అందుకే రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు చంద్రబాబు కోసమే అన్న సంకేతాలే వెళ్తాయే తప్ప రేవంత్‌రెడ్డి కోసం కాదన్నది సుస్పష్టం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇదే రకమైన చర్చ సాగింది. అసలు రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడడంలోనే ఒక రహస్యం దాగి వుందన్నది నేటిధాత్రి ఆనాటి నుంచే చెబుతూనే వుంది. సహజంగా ఏ వ్యక్తి అయినా ఒక పార్టీని వీడినప్పుడు, ఆ పార్టీ వల్ల ఎంత ఎదిగినా చివరి క్షణంలో ఆ పార్టీని ఏదో రకంగా బ్లేమ్ చేయడం సహజం. కాని ఇక్కడ అది జరగలేదు. రేవంత్ ఏనాడు తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబు ఇంకా నాకు నాయకుడే అంటున్నాడు. కాని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌కు శత్రువే అన్న మాట ఎక్కడా మాట్లాడలేదు. ఇదో రకమైన లోపాయి కారి ఒప్పందం. చంద్రబాబు కోసమే రేవంత్ చేస్తున్న రాజకీయం.
తెలంగాణ వచ్చాక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ మీద పెత్తనం పోవడం ఇష్టం లేదు.
అంందుకే ఎన్నటికైనా మళ్లీ తెలంగాణ మీద పెత్తనం సాధించాలన్న కుయుక్తులతోనే అడుగులు వేశాడు. హైదరాబాద్‌లోనే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. కాని చంద్రబాబు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు కట్టుకోలేదు. ముఖ్యమంత్రిగా వున్నంత కాలం కిరాయి ఇంట్లోనే వున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశాడు. ఆనక ఇరుక్కుపోయాడు. రేవంత్‌ను ఇరికించాడు. జైలు పాలయ్యేలా చేశాడు. చంద్రబాబు వల్ల నష్టపోయాయనన్న ఆలోచన ఇప్పటికీ రేవంత్‌కు లేదు. తనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల జైలు పాలయ్యానన్న ఆలోచనే రేవంత్‌లో వుంది. రేవంత్ జైలు పాలు కావడానికి కారణం చంద్రబాబు అయినా రేవంత్ కు ఆయన మీద స్వామి భక్తి తగ్గలేదు. ఎన్నటికైనా ఆయన రుణం తీర్చుకునే పనిలోనే వున్నాడు. తప్పని పరిస్ధితుల్లో ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోకతప్పని చంద్రబాబు, ఆగమేఘాల మీద రాజధాని ప్రకటించాడు. తెలంగాణ వడిచివెళ్లాడు. కాని రేవంత్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలనుకున్నాడు. ఎన్నటికైనా తాను తెలంగాణ మీద ఆధిపత్యం కోసం కాచుకొనే చంద్రబాబు ఎదురుచూస్తూనే వున్నాడు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు కావడం అంటే మాటలు కాదు. ఒక దశలో రేవంత్ చేసిన ఓటుకు నోటు కేసు విషయంలో నాయకులెవ్వరూ సమర్ధించలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రాకను సీనియర్లు ససేమిరా అన్నారు. అయినా అధిష్టానాన్ని ఒప్పించి, మెప్పించి, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టిన చంద్రబాబు రేవంత్‌కు పదవి కల్పించడంలో కృతకృతుడయ్యాడు. ఆఖరకు రేవంత్‌ను పిసిసి అధ్యక్షుడిని చేయించాడు. ఇప్పుడు బిజేపి వైపు చంద్రబాబు చూస్తున్నాడు. రేవంత్‌తో కాంగ్రెస్ ఖాళీ చేయించే పనిలో వున్నాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన నేటిధాత్రి అడుగడుగునా హెచ్చరిస్తూనే వస్తోంది.
ఎలాగైనా ఈసారి తెలంగాణలో పాగా వేయాలన్నది చంద్రబాబు బలమైన ఆలోచన.
టిఆర్‌ఎస్ కాస్త, బిఆర్‌ఎస్ కాగానే సైకిల్‌కు మళ్లీ కొత్త రంగు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ సైకిల్ మూలన పడిరది. అక్కడ బిజేపితో కలిసి దోస్తీ కట్టే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకితో బిజపికి అక్కడ జత కట్టాలన్న ఆలోచన లేదు. జగన్‌కు వదులుకోవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. జగన్‌కు ఇంబంది పెట్టాలన్న ఆలోచన ఏ కోశాన బిజేపికి లేదు. ప్రధాని మోడీకి లేదు. కాకపోతే తెలంగాణలో బిజేపి బలపడాలంటే టిడిపితో కొంత సఖ్యత కావాలి. ఆ పార్టీకి క్షేత్రస్ధాయిలో వున్న బలం బిజేపికి ఉపయోగపడాలి. అందుకు చంద్రబాబుతో దోస్తీ కట్టాలి. ఎలాగూ జనసేన కూడా కలిసి వచ్చేందుకు సిద్దంగానే వుంది. మొత్తంగా మూడు పార్టీలు కలిస్తే ఎంతో కొంత బిఆర్‌ఎస్‌ను ఎదిరించేందుకు, కొన్ని సీట్లు సాధించేందుకు అవకాశం వుంటుంది. కాని అది సంపూర్ణం కాదు. బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే ఈ బలం సరిపోదు. మరింత బలం కావాలి. అందుకు రేవంత్ సహాకారం కావాలి. కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాగైనా రేవంత్ వర్గానికి పెద్ద పీట వేయించాలి. ఎన్నికలు దగ్గరున్నందును తనకు ఎదురులేని విధంగా చూడాలి. ఈ విషయంలోనూ రేవంత్ సక్సెస్ అయ్యాడు. తన వర్గాన్ని పిసిసిలో నింపేశాడు. ఎలాగైనా సీనియర్లకు ఇది నచ్చదు. కుంపటి పెడతారు. సీనియర్లు ఆగరు. వారి నోటికి పనిచెబుతారు. అప్పుడు మళ్లీ రేవంత్ తన రాజకీయాన్ని వాడొచ్చనుకున్నాడు. అనుకున్నట్లుగానే జరిగింది. పిసిసి కొత్త కార్యవర్గంపై సీనియర్లు మాటల తూటలు పేల్చారు. కాంగ్రెస్‌లో చేరిన ఇతర నాయకులు చిన్న బుచ్చుకున్నారు. రాజీనామాలు చేశారు. దాంతో సినియర్లకు గొంతులో వెలక్కాయపడ్డట్టైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీనియర్లు చెప్పే మాటలు వినడానికి సిద్దంగా లేదు. ఇదే రేవంత్‌కు కలిసి వస్తోంది. ఎందుకైనా మంచిది. ఎన్నికల నాటికైనా రేవంత్ ఆడే డబుల్ గేమ్ బైట పడితే, పక్కకు తప్పుకోవాల్సివస్తే, ఒక వేళ కాంగ్రెస్సే రేవంత్‌ను తప్పిస్తే దారి వెతుక్కొవాల్సిన అసవరం లేకుండా తన పార్టీ తోడుగా నిలుస్తుంది. రేవంత్‌తో వచ్చిన వాళ్లంతా ఆ పార్టీకి బలమౌతుంది. ఇదీ అసలు పాయింట్.
కాంగ్రెస్‌పార్టీలో రేవంత్ ఏ అడుగు వేసిన సీనియర్ల ఎడ్డమంటే తెడ్డమంటారు.
ఇది తెలిసే రేవంత్ తన జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నాడు. తాను పాదయాత్ర మొదలుపెడుతున్నాని ఓ వైపు చెప్పుకుంటూనే, మరో వైపు పార్టీ ఏర్పాటుపై కూడా దృష్టిపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ముందే దారి సిద్దం చేసుకుంటే ఎన్నికల నాటికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అదే జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొని, నాయకులను తన చెంతకు తీసుకొని, గుండు గుత్తగా తెలుగుదేశంలో చేర్చితే చాలు. తన అనుకున్న పథకం పూర్తవుతుంది. చంద్రబాబుకు కళ్లలో ఆనందం చూసినట్లౌవుతుంది. టిడిపిలో కూడా రేవంత్ మాటే చెల్లుబాటౌతుంది. తెలంగాణలో టిడిపికి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. ఇదీ చంద్రబాబు ఆలోచన. రేవంత్ ఆచరణ. కాని క్షేత్ర స్ధాయి పరిస్ధితులు ఎలా వున్నా, తమకు అనుకూలంగానే వున్నాయన్న భ్రమల్లో రేవంత్, చంద్రబాబు వున్నారన్నది సుస్పష్టమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ ఏ ఒక్క ఎన్నికల్లోనూ తన చాణక్యం చూపించుకోలేదు. కాంగ్రెస్‌ను గట్టెక్కించేపని చేయలేదు. టిడిపిలో వున్నప్పుడు పనిచేసినంత అంకితభావంతో పనిచేయలేదు. ఒక్క ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించలేదు. అలాంటి రేవంత్‌రెడ్డిని నమ్మి నాయకులు ఆయనతో వెళ్తారా? లేదా? అన్నది రేవంత్ అత్యాశను చూపిస్తుందే గాని, వాస్తవం కనిపించడం లేదు.
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని అభిషేకం అర్చనలను చేయించిన ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.శివకేశవుల విశేషాలను తెలుసుకొని పరమ ఆనందం పొందానని, ఇక స్వామివారి మీద భక్తి పాటలు రచనలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారులు రామన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పేర్కొన్నారు.
మంగళవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ,సంగెం తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15,16 డివిజన్ల పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు 20,02,320 రూపాయల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో పెద్ద కొడుకు పాత్రను పోషిస్తూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,116 రూపాయలు అందజేస్తున్నారన్నారు.తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరికీ తెలంగాణ పథకాలు అమలు చేసి అన్ని రంగాల్లో భారత దేశాన్ని అభివృద్ధి పరచాలని కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారన్నారు. 24 గంటల విద్యుత్, తాగునీరు, సాగునీరు,దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమమే అజెండాగా, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాల కొనసాగిస్తున్నారన్నారు.రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పరకాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు,ఎంపిపిలు,కార్పొరేటర్లు, సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మార్కెట్,కుడా & సొసైటీ చైర్మన్లు,డైరెక్టర్లు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
` కేటిఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలు కూడా తయారు చేయించారు.
`మేయర్ ఆగం చేశాడు!
`అధికారులు చేతులెత్తేశారు!
`ఫైలును పెండిరగ్‌లో పెట్టారు!
`అప్పటి నుంచి పాపం తొలగింపబడిన ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు?
`ఇప్పటికైనా అధికారులు కనికరించండి.
` కేటిఆర్ హామీని అమలు చేయండి!
`వారి జీవితాలకు దారి చూపండి.
హైదరాబాద్,నేటిధాత్రి:
కొండ నాలుకకు మందేయమంటే వున్న నాలుక ఊడగొట్టారని అని సామెత. సరిగ్గా ఇలాంటి సంఘటనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగింది. మాజీ మేయర్ ఆలోచనే శాపమైంది? అనేది గృహ నిర్మాణ సంస్థ నుంచి తొలగింపబడిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒప్పంద ఉద్యోగుల ఆవేదన. అప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రాదేయపడుతూ వస్తున్నారు. ఏళ్లుగా రోజులు లెక్కబెట్టుకుంటూ ఆశలు తీరుతాయన్న నమ్మకంతో కనిపించిన నాయకుడిని వేడుకుంటున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఫైలు కదులుతుందంటే సంతోషపడుతున్నారు. ఆగిందంటే దిగులు చెందుతున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఆకలి దిగమింగుకుంటున్నారు. కుటుంబాలు పస్తులుంటున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇతర పనులు చూసుకుందామంటే నాయకుల హమీ మీద నమ్మకం వుంది. ఇవాళ కాకపోతే రేపు అన్న విశ్వాసం పెరుగుతుందే తప్ప తగ్గలేదు. ఎదురొచ్చిన నేతలందికీ వారి గోడు వినిపిస్తూనే వచ్చారు. వాళ్లు కూడా తమ వంతు సహాయకపాత్ర పోషించారు. దాంతో ఆ ఒప్పంద ఉద్యోగుల సమస్య మంత్రి కేటిఆర్ దాకా చేరింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వారికి న్యాయం చేస్తామని చెప్పిన నాయకుల అభ్యర్థన మన్నించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ప్రకటించారు. వారికి న్యాయం చేయమని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు సూచించారు. ఇక మాకు కొలువులు వచ్చినట్లే, మా జీవితాలు ఓ దారిలో పడ్డట్టే అనుకున్నారు. కానీ ఉపద్రవం ముంచుకొచ్చి మొదటికే మోసం వస్తుందనుకోలేదు. జీవితాలు ఆగమౌతాయని ఊహించలేదు. మేలు చేసే రూపంలో నాయకుల అవగాహనా రాహిత్యం మూలం దిద్దుకోలేని నష్టాలు ఇతరులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇదే మరి. ఆరేళ్లుగా కాళ్లరిగిపోయేలా తిరిగి, తిరిగి, తమ సమస్యను ఓ కొలిక్కి తెచ్చుకుంటే మొత్తం మంట గలిపినట్లైంది. నమ్మితే నిండా మునిగినట్లైంది. ఆశలు ఆవిరైపోయి, అంధకారం మిగిలింది. మళ్లీ మొదటి కొచ్చిన సమస్య తో లబోదిబోమంటున్నారు. దిక్కుతోచని స్థితిలోకి ఆ ఉద్యోగులు నెట్టివేయబడ్డారు. ఇకనైనా ఎవరైనా కరుణించి కాపాడండని కనిపించిన నాయకులందరినీ వేడుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి కేటిఆర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లి, న్యాయం చేయమని అడిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ చేసిన చిన్న పొరపాటు మాకు గ్రహపాటును మిగిల్చిందని చెప్పి, కరుణించి, మాకు దారి చూపండని తమ గోడు చెప్పుకోవాలనుకుంటున్నారు.
ప్రొసీడిరగ్స్ వరంగల్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ లో 51 మందికి కొలువు ఫైనల్ చేశారు.
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు జరిగాయి. 51మంది పేర్లు కూడా మినట్స్ బుక్ లో చేర్చడం జరిగింది. ఆ ఉద్యోగులను ఇంజనీరింగ్ విభాగంలోకి తీసుకోవడానికి సీనియర్ ఇంజనీర్ అంగీకారం కూడా తెలిపారు. ఆ తర్వాత ఈ ఉద్యోగులు వెళ్ళి సీనియర్ ఇంజనీర్ ను కలిశారు. అప్పటి మేయర్ గుండా ప్రకాశ్ చేత ఓ లెటర్ తీసుకురమ్మని సీనియర్ ఇంజనీర్ ఆ ఉద్యోగులకు సూచించడం జరిగింది. దాంతో మేయర్ గుండా ప్రకాశ్ ను ఉద్యోగులు కలిసి విషయం వివరించారు. తమకు కొలువులు రావాలంటే సీనియర్ ఇంజనీర్ కు లెటర్ రాయాలని కోరారు. తాను ఒక ఇంజనీర్ కు లెటర్ రాయడమేమిటనుకున్నాడో ఏమో కాని, కమీషనర్ పేరు మీద లెటర్ రాయడం జరిగింది. అప్పటికీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వున్నారు. అయినా గుండా ప్రకాశ్ వినలేదు. కమీషనర్ కు లెటర్ రాసి, వారి చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు. పైగా నేను రాసిన లెటర్ తో మీ కొలువులు వచ్చినట్లే అని నమ్మించాడు. ఉద్యోగుల విన్నపాన్ని కాదని మున్సిపల్ కమీషనర్ కు రాశాడు!
నాయకులు తాము చెప్పిందే వేదం…
పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని చెప్పడం పరిపాటే. ఇక్కడా అదే జరిగింది. ప్రభుత్వ వ్యవహారం అన్నాక కొన్ని నిబంధనలు వుంటాయి. వాటిని అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం వుంటుంది. అందుకు భిన్నంగా సితే మొదటికే మోసం వస్తుంది. సీనియర్ ఇంజనీర్ కు లెటర్ రాస్తే ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి! సరిగ్గా అదే జరిగింది. ఇంజనీర్ కు కోపమొచ్చింది. సహజంగా జరిగేదే ఇది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదంటే ఇలాగే వుంటుంది. 51 మంది బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని సీనియర్ ఇంజనీర్ భావించాడు. కానీ ప్రొసీజర్ ముందుకు సాగకుండా మేయర్ గుండా ప్రకాశ్ ఒక రకంగా అడ్డుపుల్ల వేశాడు. అది తెలిసి చేసినా,తెలియక చేసినా నష్టపోయింది మాత్రం ఆ ఉద్యోగులే.
నాకు లెటర్ రాయించమంటే కమీషనర్ కు లెటర్ రాస్తే నేనేం చేయాలని ఇంజనీర్ ప్రశ్నించారు! తాము ఎంత చెప్పినా మేయర్ వినలేదని వారు సీనియర్ ఇంజనీర్ కు వివరించారు. మరి నేనెలా ప్రొసెడిరగ్స్ ఇవ్వడం జరుగుతుంది? లెటర్ కమీషనర్ పేరు మీద వుండగా, కమీషనర్ ఫైల్ అటాచ్ చేయాలి. ఆ అధికారం నాకెలా వుంటుంది. మొదటికే మోసం జరుగుతుంది. పైగా తాను పరిధి దాటినట్లౌతుంది. కమీషనర్ ఆదేశాలు పాటించాల్సిన ఇంజనీర్ ని. నేను కమీషనర్ పేరు మీద ఆర్డర్లు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు నేనేం చేయలేనని సీనియర్ ఇంజనీర్ చేతులెత్తేశాడు. మీకు వీలైతే మేయర్ చేత మళ్ళీ ఉత్తరం తీసుకురండి. లేకుంటే ఈ లెటర్ తీసుకెళ్ళి కమీషనర్ కు ఇవ్వండి. అక్కడి నుంచి ఆదేశాలు అందితే అప్పుడు ఆలోచిస్తాను. అని ఇంజనీర్ చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. వారి జీవితాలకు దిక్కులేకుండా పోయింది. అప్పటి మున్సిపల్ కమీషనర్ ఉద్యోగుల ఫైలును స్టడీ చేయడానికే చాలా కాలం పట్టింది. ఇందులో లొసుగులున్నాయని చెప్పి, పక్కన పెట్టడం జరిగింది. నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 128 మంది ఒప్పంద ఉద్యోగులు గృహ నిర్మాణ శాఖలో పని చేసే వారు. వారిలో చాలా మంది ఇతర పనులు చూసుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయలేదు. కానీ 51 మంది మాత్రం ఆనాటి నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఆ లిస్టే మంత్రి కేటిఆర్ సమక్షంలో ఆమోదం జరిగిందనేది తెలుస్తోంది. కాకపోతే కమీషనర్ అసలేం జరిగిందో నాకు తెలియాలి? అనడంతో కథ మళ్ళీ మొదటి కొచ్చింది. అక్కడే ఆగిపోయింది.
వీళ్లకు ఉద్యోగాలు ఇస్తారు కదా! మరి నేను మాట ఇస్తున్నాను.
మీరు సూచించడంతోనే నేను కూడా సరే అంటున్నానని ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ఆ సమయంలో అందరూ తలూపారు. ఇక తమకు ఉద్యోగాలు వచ్చినట్లే అని 51 మంది ఎంతో సంతోషించారు. మొదటి నుంచి ఆ ఉద్యోగులకు సాయం చేస్తున్నందున అధికారుల మీద నమ్మకంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఒప్పంద ఉద్యోగులకు రేపటి లోగా అప్పాయింట్ మెంట్ లెటర్లు తయారౌతున్నాయని చెప్పారు. కానీ అప్పాయింట్ మెంట్ సంగతి దేవుడెరుగు. మేయర్ చేసిన పనికి అక్కడే ఆగింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చినా, మేయర్ నిర్ణయం వల్ల ఆగమ్యగోచరమైంది. కడియం శ్రీహరి లాంటి నాయకులు కూడా రేపే మీ ఆర్డర్లు అన్నారు. తెల్లారితే అప్పాయింట్ మెంట్ లెటర్లు రెడీ అనుకున్నారు. ఉదయమే గుళ్లకు వెళ్ళి పూజలు చేశారు. కేటిఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలు కూడా తయారు చేయించారు. మేయర్ తో ఉత్తరం రాయించి తీసుకొచ్చి, ఆ చేత్తో లెటరిచ్చి, ఈ చేత్తో అప్పాయింట్ మెంట్ లెటర్లు తీసుకుందామనుకున్నారు. కలలు కల్లలయ్యాయి. కొలువులు కంటికి కనపడకుండా పోయాయి. మొరో, మొరో మొత్తుకొని చెప్పినా, గుండా ప్రకాశ్ వినకపోవడం వారికి శాపంగా పరిణమించింది.
మేయర్ ఆగం చేశాడు!
ఇదే అదునుగా అధికారులు చేతులెత్తేశారు. ఫైలును పెండిరగ్‌లో పెట్టారు! అప్పటి నుంచి పాపం తొలగింపబడిన ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు?
ఇప్పటికైనా అధికారులు కనికరించండి. తోటి ఉద్యోగులు అన్నదైనా ఆలోచించండి. పదేళ్లపాటు ఒప్పంద కొలువైనా, ప్రభుత్వం కనికరించకపోతుందా అన్న నమ్మకంతో పని చేశారు. అంత కాలం ప్రభుత్వ పర్యవేక్షణలో కొలువు చేసి, మళ్ళీ జీవితాలు మొదటికి రావడం ఎవరికైనా ఇబ్బందే. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఎంతో సహకరించారు. ఈ ఉద్యోగుల ఫైల్ తిరిగి, తిరిగి ఉద్యోగుల చేతికి అప్పాయింట్లు అందిస్తుందనుకుంటే, ఎప్పుడూ అధికారుల టేబుళ్ల మీదే తిరుగుతోంది. ఇకనైనా ఆ ఫైలుకు మోక్షం కలగనీయమని వేడుకుంటున్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ హామీని అమలు చేయండి!
ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం మంత్రి కేటిఆర్ ది. అసలు ఆయన మాటంటేనే జీవోతో సమానం. అయినా అధికారులు ఆ ఫైల్ ను ముందుకు వెళ్లకుండా చేయడం సరైంది కాదు. మేయర్ పొరపాటు చేశాడు. ఇక దానికి పరిష్కారమే లేదా? ఆ ఉద్యోగులు కాళ్లరిగేలా ఏళ్ల తరబడి తిరుగుతూనే వుండాలా? ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోతున్నాయి. వారికి భరోసా ఇచ్చే నాధుడే లేడా! వారి జీవితాలకు దారి చూపండి. సాటి ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులైనా పట్టచుకొని సమస్య తీరేందుకు సహకరించండని బాధితులు వేడుకుంటున్నారు.
`పరకాల కు చెందిన ఓ. ప్రభాకర్ ఇటీవల అజరాలో చేర్చుకున్నారు.
` హైదరాబాదు వెళ్ళినా ఇదే వైద్యం అని మాయమాటలు చెప్పారు?
`హెల్త్ కార్డ్ ఖాళీ చేశారు…
`వైద్యానికి శరీరం సహకరించడం లేదని వదిలించుకున్నారు.
`నడుచుకుంటూ అజరలో చేరిన ప్రభాకర్ కుర్చీకి పరిమితమయ్యాడు.
`ప్రస్తుతం హైదరాబాదు యశోదలో చికిత్స తీసుకుంటున్నాడు.
`చేతి నుంచి మళ్లీ డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నాడు.
` ప్రైవేటు ఆసుపత్రుల నయా మోసం…
`ఆరోగ్య భరోసా కోసం హెల్త్ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయం.
`ప్రజల జీవితాలతో చెలగాటం.
`ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోకుంటే, ఇతర
ఆసుపత్రులు ఇదే చేసే ప్రమాదం వుంది.
`ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి.
`పైన పటారం, లోన లొటారం ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి.
`అజర మీద కేసులు నమోదు చేయాలని బాధితుల డిమాండ్.
`అజరాలో చేరితే బేజారే!
`అక్కడ వైద్యం బేకారే!!
`హెల్త్ కేర్, రిసెర్చ్ సెంటర్ పేరిట అజరా అరాచకం!
`ఫైవ్ స్టార్ హోటల్ లా నిర్మాణం…
`హంగులూ ఆర్భాటాలతో మోసం…
`వైద్యలు కాదు, యమకింకరులు బాధితుల శాపనార్థాలు.
మనిషి ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులు వైద్యం గాలికొదిలేస్తున్నాయి. సంపాదన మీద దృష్టి పెడుతున్నాయి. రోగులను ఆకర్షించేందుకు అద్దాల మేడలు చూపిస్తున్నారు. వైద్యానికి అవసరమైన వ్యవస్థలు మర్చిపోతున్నారు. పేరుకు వైద్యల లిస్ట్ చాంతాడంత చూపిస్తున్నారు. స్పెషల్ బిల్లులలో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. వైద్యానికి అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు లేకున్నా, వైద్యం అంటూ ఊదరగొడుతున్నారు. రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చట్టాలలో వున్న లొసుగులను ఆసరా చేసుకొని వైద్యాన్ని వ్యాపారం చేసుకొని, కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. హన్మకొండ లోని అజరా ఆసుపత్రి లో తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వైద్య రంగానికే మాయని మచ్చను మిగిల్చింది.
హెల్త్ స్కీమ్ పేషెంట్లు టార్గెట్…
అడుక్కున్నోడికి అరవై కూరలు అన్నట్లు, అతి తెలివి తేటలు మించిపోతున్నాయి. డాక్టర్లు కొందరు రింగుగా ఏర్పడడం…నగరాలలో నాలుగు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నారు. తలా ఇంత పెట్టుబడి పెట్టి, ఆసుపత్రుల నిర్మాణాలు సాగిస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లను తలపించేలా హంగులూ ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. తమ ఆరోగ్యాల కోసం అవసరమొస్తుందని ఇటీవల కాలంలో చాలా మంది హెల్త్ స్కీమ్ లలో చేరుతున్నారు. పాలసీలు తీసుకుంటున్నారు. బతకనేర్చినోడికి అరవై దారులన్నట్లు, ప్రైవేట్ ఆసుపత్రులు కొత్త దారులు ఎంచుకున్నారు. కరోనా ప్రభావం మూలంగా ఆర్థిక పరిస్థితి ఎలా వుంటుందో అన్న భయంతో పేదలు తీసుకుంటున్న హెల్త్ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారాయి. ఇలా హెల్త్ స్కీమ్ పాలసీ వుందన్న సమాచారం తెలుసుకొని, పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. వైద్యం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. బాధితులు లబోదిబో మంటున్నారు.
ఇంతకీ ఏం జరిగింది:
ఇటీవల పరకాల పట్టణానికి చెందిన ఓ. ప్రభాకర్ అనే వ్యక్తి నరాల సంబంధిత వ్యాధి చికిత్స కోసం న్యూరో ఫిజీషియన్ వినయ్ కుమార్ ను కలిశాడు. అతని వివరాలన్నీ తెలుసుకున్న ఆ వైద్యుడు అజరా ఆసుపత్రిలో చేరమని సూచన చేశాడు. ఆ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు వున్నాయని నమ్మించాడు. తానే స్వయంగా వచ్చి వైద్యం చేస్తానన్నాడు. దాంతో ప్రభాకర్ అజరాలో చేరాడు. నాలుగు రోజుల పాటు అజరాలో వైద్యం చేసినట్లు హడావుడి చేశారు. బిల్లులు వేశారు. హెల్త్ కార్డును గీకేశారు. తర్వాత మా వల్ల కావడం లేదని చేతులెత్తేశారు. మా వల్ల కావడం లేదని చెప్పడం కూడా తమ గొప్పతనం అన్నట్లుగా, మంచి వైద్యం అందాలన్న సలహా ఇస్తున్నామని హితవు వచనాలు కూడా చెప్పారు. అంతకు ముందు ప్రభాకర్ కుటుంబానికి ఇచ్చిన హామీ మర్చిపోయారు.
వైద్యం కోసం ప్రభాకర్ తొలుత కలిసిన డాక్టర్.వినయ్ కుమార్ తాను ఉస్మానియా లో చదివిన డాక్టర్ నే.
హైదరాబాదు లోని ఆసుపత్రులలో చేసే వైద్యమే నేనూ చేస్తాను. అనవసరంగా హైదరాబాదు వెళ్లడం ఎందుకు అని సలహా కూడా ఇచ్చాడు. నన్ను నమ్మండి. అని భరోసా కూడా ఇచ్చాడు. నాలుగు రోజుల తర్వాత చేతులెత్తేశాడు. వైద్యం చేత కాకున్నా చేర్చుకుంటారు…ఇదీ బాధితులు అంటున్న మాట. అజరా పై శాపనార్థాలు పెడుతున్న మాట. అసలు వైద్యం చేతకానప్పుడు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం దేనికి? వైద్యులన్న సోయి మర్చిపోయి ప్రజలను పీక్కుతినడం దేనికి? నాలుగు రోజులు హడావుడి చెస్తారు! ఐదో రోజు చేతులెత్తేస్తారు! చాలా బాధితులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పేరు పెద్దది. వ్యాపారం గొప్పది. వైద్యం ఉత్తుత్తిది అన్నట్లుంది.
హెల్త్ కార్డుల మీద వ్యాపారం గత కొంత కాలంగా సాగిస్తున్న అజరా ఆసుపత్రి వెనుక పెద్ద వ్యవహారం దాగి వుంది.
పెద్ద ఎత్తున కొంత మంది డాక్టర్లు సిండికేట్ గా మారి అజరా ఏర్పాటు చేశారు. దాదాపు 80 కి పైగా డాక్టర్లు అందుబాటులో వున్నట్లు పెద్ద పెద్ద బోర్డులు ఎర్పాటు చేశారు. కానీ వాళ్లెవరూ ఎల్లప్పుడూ అందుబాటులో వుండరు. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వస్తారు. తలా పది పైసలు వేసుకొని అజరా లో రింగైన డాక్టర్లుకు ప్రత్యేక క్లినిక్ లు వున్నాయి. ఇతర ప్రైవేటు ఆసుపత్రులలో భాగస్వామ్యం వుంది. ఇంత మంది డాక్టర్లు వైద్యం చేయడం కన్నా, లెక్కలు, లాభాల వాటాలు చూసుకోవడం కోసమే వున్నారు? అనేది సర్వత్రా వినిపించే మాట.
తాజాగా ఘటనతో మరోసారి అజర యవ్వారం వెలుగులోకి వచ్చింది.
మాయమాటలు చెప్పి, మెరుగైన వైద్యం చేస్తామని నమ్మించి నట్టెట ముంచారు. వైద్యానికి శరీరం సహకరించడం లేదని వదిలించుకున్నారు. నడుచుకుంటూ అజరలో చేరిన ప్రభాకర్ కుర్చీకి పరిమితమయ్యాడు. ప్రస్తుతం హైదరాబాదు యశోదలో చికిత్స తీసుకుంటున్నాడు. చేతి నుంచి మళ్లీ డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నాడు. ప్రైవేటు ఆసుపత్రుల నయా మోసం…ఆరోగ్య భరోసా కోసం హెల్త్ స్కీములు ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయం. ప్రజల జీవితాలతో చెలగాటం.
ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోకుంటే, ఇతర ఆసుపత్రులు ఇదే చేసే ప్రమాదం వుంది.
అందువల్ల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం నిరంతర నిఘా పెట్టాల్సిన అవసరం వుంది. లేకుంటే ఎంతో మంది అమాయకుల జీవితాలు బలి అవుతాయి. అజరాలో చేరిన ప్రభాకర్ చెందిన హెల్త్ కార్డ్ డబ్బులు లాగేశారు. తర్వాత ఆయన సికింద్రాబాద్ లోని యశోద లో జాయిన్ అయ్యాడు. కానీ సొంతం డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారకులు అజరా ఆసుపత్రి యాజమాన్యం. ఎంతో ముందు చూపుతో హెల్త్ కేర్ కోసం ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఏం లాభం. ఆసుపత్రి దాహానికి ఊడ్చుకుపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఏఏ ఆసుపత్రులలో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్న వాటిని గుర్తించి వెంటనే వాటి పర్మిషన్ రద్దు చేయాలి. ఆ డాక్టర్ల సర్టిఫికెట్లు రద్దు చేయాలి. అప్పుడు గాని డాక్టర్లు కు భయం వుండదు. పైన పటారం, లోన లొటారం ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. అజర మీద కేసులు నమోదు చేయాలని బాధితుల డిమాండ్. అజరాలో చేరితే బేజారే!అక్కడ వైద్యం బేకారే!!హెల్త్ కేర్, రిసెర్చ్ సెంటర్ పేరిట అజరా అరాచకం! ఫైవ్ స్టార్ హోటల్ లా నిర్మాణం చేశారు. హంగులూ ఆర్భాటాలతో మోసం చేస్తున్నారు.
వైద్యలు కాదు, యమకింకరులు బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.
కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రగతివనం నందు 23.12.2022 సాయంత్రం 7.00 గంటలకు నిర్వహించిన సింగరేణి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ .హాజరు ఇనారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్.హాజరు ఇనారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ . జ్యోతి ప్రజ్వలన చేసి సింగరేణి దినోత్సవ వేడుకలకను ప్రారంబించారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్. సేవా అధ్యక్షురాలు శ్రీమతి జక్కం వాణి రమేశ్ గారు, శ్రీమతి ఫాతిమా రజాక్ గారు ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఇంచార్జ్ (ఈ&ఎం) వి. వెంకటేశ్వర్లు, సి.ఎం.ఓ.ఏ. కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాస్, డి.జి.ఎం.లు పర్సనల్ పి. స్యాముయెల్ సుధాకర్, సేవ సెక్రెటరీలు పాల్గొన్నారు.
ప్రగతివనం రుద్రంపూర్ లో ఏర్పాటు చేయబడిన వివిధ రకములైన 9 స్టాల్ల్స్ లో మొట్ట మొదటి సారిగా రక్త దాన శిభిరాన్ని జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయడం జరిగినది. దీనిలో 20 మంది కార్మికులు రక్త దానం చేసినారు.
ఈ సందర్భముగా తమ విధులలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఉత్తమ అధికారి కాటగిరిలో అడిషినల్ మేనేజర్, ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ శ్రీ బి. రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ జె.వి.ఆర్.ఒ.సి. శ్రీ గౌతమ్ రాజేశ్ రెడ్డి, ఉత్తమ ఎన్.సి.డబల్యు కాటగిరిలో శ్రీ జె. లవన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్, శ్రీ భూక్యా సక్రు, ఈ.పి. ఆపరేటర్, జె.వి.ఆర్.ఒ.సి లను జిఎం జక్కం రమేశ్ శాలువా మరియు జ్ఞాపికలతో సత్కరించారు.
తరువాత ఈ సింగరేణి దినోత్సవ వేడుకలలో ఫోక్ డ్యాన్స్, మిమిక్రీ, మ్యాజిక్ షో, టాకింగ్ డాల్, సేవా సభ్యులచే డ్యాన్స్ ప్రోగ్రాం, సింగరేణి కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం జరిగింది.
ఈ సందర్బంగా జిఎం జక్కం రమేశ్. మాట్లాడుతూ సింగరేణి దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నదని, సింగరేణి సంస్థ నూతన టెక్నాలజీ తో ముందుకు కొనసాగుతూ, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న అధికారులను, కార్మికులను, యూనియన్ నాయకులను, కాంట్రాక్ట్ కార్మికులను వారు అభినందించారు. 133 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగింది. అదే విధంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈ రోజు మన రాష్ట్రములో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా, అంతే కాకుండా ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు మార్గదర్శకంగా ఉండడం చాలా సంతోషకరం అని అన్నారు. ఈ సంస్థలో పని చేస్తున్న మనమందరము ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. కనుక సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఏంతో వైభవంగా జరుపుకోవడం మన కర్తవ్యoగా గుర్తించాలన్నారు. అదే విధంగా తేదీ:20.12.2022 న గతంలో ఎన్నడూ సాధించని విధంగా అత్యధికంగా 54,902 టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డు నెలకొల్పడంలో భాగస్థులైన ఉద్యోగులను, సూపర్వైసర్లను, యూనియన్లను మరియు అదికారులను అభినంధించినారు. ఇదే స్ఫూర్తి ని కొనసాగిస్తూ కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ఉద్బోధించినారు. ఈ ఆర్దిక సంవత్సరములో నేటి వరకు 82.81 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని తెలియజేసినారు. అలాగే తదుపరి లక్షమైనటువంటి 57.19 లక్షల టన్నుల ఉత్పత్తిని 31.03.2022 నాటికి సాధించే దిశగా అందరూ కృషి చేయాలని తెలియచేసారు.
ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ , కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ సి.ఎం.ఓ.ఏ. కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాస్, జి.కె. ఒ.సి. పి.ఓ. రమేశ్, ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ, ఏజెంట్ రవీందర్, సేఫ్టీ ఆఫీసర్ కోటిరెడ్డి, డి.జి.ఎం.లు పర్సనల్ పి. స్యాముయెల్ సుధాకర్, ఆంజనేయశెట్టి, డి.జి.ఎం.& ఇంచార్జ్ (ఈ&ఎం) వెంకటేశ్వర్లు, యోహన్, రాజశేఖర్, బులి మాధవ్, ఎం. వి. టి.సి. మేనేజర్ శర్మ, సదానందం, మదన్మోహన్, సత్యనారాయణ, పి.ఎం. కిరన్ బాబు, సీనియర్ పి.ఓ.లు మజ్జి మురలి, జి. సుధాకర్, ఎం. శ్రవణ్ కుమార్, వి. అజయ్, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, రుద్రంపూర్ దిస్పెంసరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరశురాములు, పోగుల సత్యనారాయణ, ఎస్‌ఎస్‌ఎస్ కొ-ఆర్డినేటర్ సాగర్, రామల ప్రసాద్, అనూష, రమణ, కల్యాణి, మహేశ్, రాజశేఖర్, శేకర్ బాబు, అన్నీ మైన్స్ డెపార్ట్మెంట్స్ హెడ్స్, అధికారులు, సుపెర్వైసర్స్, యూనియన్ నాయకులు, పిట్ సెక్రెటరీలు, రుద్రంపూర్ మరియు గౌతంపుర్ సేవా సెక్రటరీలు ఆదిలక్ష్మి, భూలక్ష్మి, అనిత, అధిక సంఖ్య లో ఉద్యోగులు, కార్మికులు మరియు మహిళలు పాల్గొన్నారు
`ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వెనక్కి తెచ్చే దమ్ముందా?
`జై తెలంగాణ అనేందుకు నోరొస్తుందా?
`తెలంగాణ రైతులకు ఏనాడైనా మేలు చేశావా?
`తెలంగాణ ను ఎండబెట్టింది నువ్వు కాదా?
`సీలేరులో తెలంగాణకు వాటా లేకుండా చేసింది నిజం కాదా!
`రాష్ట్రం వచ్చాక తెలంగాణ ను అస్థిర పర్చాలని చూసిందే నువ్వు కదా!
`తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసింది ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా!
`తెలంగాణ రాకుంటే ప్రాజెక్టులు వచ్చేవా?
`తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా!
`రేవంత్ రెడ్డి అన్నట్లు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ నాయకులు చూసుకుంటారు.
`షర్మిలకు తెలంగాణలో ఏం పని అడిగిన రేవంత్ చంద్రబాబును అపగలడా?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇక తెలంగాణలో నాకేం పని. తెలంగాణ రాజకీయాలతో నాకేం అవసరం. అంటూ ఒకనాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీని వదిలేసి, తన స్వార్థం చూసున్న చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణ తో ఏం పని…తెలంగాణ ప్రాంత ఏడు మండలాలను ప్రధాని నరేంద్ర మోడి మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే ఆంద్రలో కలిపేసుకొని ఇప్పుడు ఖమ్మం మీద ప్రేమ ఒలకబోస్తే నమ్ముతారా? పోలవరం డిజైన్ మార్చి భద్రాచలం మునిగిపోవడానికి కారణమైంది మీరు కాదా? తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్ర చేసి, ఎన్నికైన తెలంగాణ తెలుగు దేశం ఎమ్మెల్యేలను గాలికి వదిలేసింది నిజం కాదా? తెలంగాణలో వున్న ఆంద్రా ప్రజలకు అన్యాయం అంటూ అనుక్షణం అసత్యాలు, అర్థ సత్యాలు ప్రచారం చేసి, ప్రజల మధ్య దూరం పెంచాలని చంద్రబాబు చూశాడు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, అధికారంలోకి రాగానే ఆంద్రా ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్తానని మాటిచ్చాడు. వారి కాళ్లలో ముళ్లు దిగినా పంటితో తీస్తానన్నాడు. అలా వారి యోగ క్షేమాలు చూసుకుంటున్నాడు. అదీ రాజనీజ్ఞుడైన నాయకుడికి వుండాల్సిన లక్షణం. చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధం. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన వుండదు. ఆయనకు ఎవరి మీద నమ్మకం వుండదు. ఆయనపై ఎవరికీ నమ్మకం లేకుండా చేసుకుంటాడు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో రాజకీయాలలో భవిష్యత్తు అంధకారం కావడంతో మళ్లీ తెలంగాణ లో చిచ్చుపెట్టే రాజకీయాల కోసం వస్తున్నాడు? అంటూ చంద్రబాబు ను తూర్పార పడుతున్న పరకాల టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో మనసులో మాట…నిన్ను నమ్మం బాబు! అని ఆంద్రప్రదేశ్ ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తెలుగు దేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడిరచారు.
ఇక అక్కడ ఏమీ మిగల లేదు. రాజకీయం చేసే అవకాశం కనిపించడం లేదు. ఎక్కడికెళ్లినా చీత్కారాలే ఎదురౌతున్నాయి. మొహం మీదే ప్రజలు నీ అవసరం మాకు లేదు బాబు…అంటున్నారు. అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయలేక, ఎండగట్టలేక, తెలుగు దేశం పార్టీ స్థానమేమిటో అర్థం కాక, వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడుస్తాడట. తన కష్టాన్నే గట్టిక్కించుకోలేక, కన్నీళ్లు పెట్టుకొని, ముదిమి వయసులో ప్రదర్శించాల్సిన గాంభీర్యం వదిలేసిన చంద్రబాబుకు రాజకీయాలు అవసరమా? ఆంద్రప్రదేశ్ కు ఏం వెలగబెట్టావని తెలంగాణకు రావాలనుకుంటున్నాడో చంద్రబాబు కే క్లారిటీ లేదు. ఒక నాడు రెండు కళ్ల సిద్దాంతం ముసుగులో తెలంగాణ చేసిన అన్యాయం ప్రజలు అప్పుడే మర్చిపోయారని అనుకుంటున్నారా?అయినా నిజమైన పోరాట యోధుడు ఎక్కడ ఓడిపోయాడో అక్కడ మళ్లీ గెలిచి నిలబడాలి. పారిపోయి వచ్చి, తలదాచుకునే చోట తొడగొడితే చెండాలంగా వుంటుంది. ప్రజలు చీదరించుకునే దాకా వస్తుంది. తెలంగాణ ఎప్పుడూ నమ్మడానికి సిద్ధంగా లేదు!తెలంగాణ లో చెల్లని కాసువే నువ్వు! ఆంధ్రలో ఏడుపులు, వేడుకోలు!తెలంగాణలో కోతల మీద కోతలు…బడాయి మాటలు. మళ్ళీ తెలంగాణలో అధికారంపై పగటి కలలు. పేరు తెలంగాణ నేతలది…పెత్తనం చంద్రబాబుది. ఎన్నటికైనా చంద్రబాబుది మోసపు రాజకీయమే! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వెనక్కి తెచ్చే దమ్ముందా? ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థ నేతవు. అని ప్రజలు ఏనాడో చీకొట్టారు. తెలంగాణకు అన్యాయం చేశావని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తిట్టుకుంటున్నారు. అయినా నీతిమాలిన తనం వదులు కోవా? వాస్తవంలో బతకలేవా??
జై తెలంగాణ అనేందుకు నోరొస్తుందా? సరే ఖమ్మంలో తెలుగు దేశం పార్టీ సభ పెట్టారు. మరి జై తెలంగాణ అన్నారా? కనీసం అనాలన్న మనసన్నా వచ్చిందా? ఆ సంకుచిత మనస్తత్వమే చంద్రబాబు జాతీయ నాయకుడు కాకుండా చేసింది. ఏది చేసినా కేసిఆర్ లాగా ధైర్యంగా చెప్పగలగాలి. ఓసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఇంటిలో ఆతిధ్యం తీసుకున్న సందర్భంలో ఆంద్ర ప్రదేశ్ రైతులు కూడా సంతోషంగా వుండాలని కోరుకున్నారు. కృష్ణా నది మిగులు జలాలు రాయలసీమ రైతులకు అందాలన్న సూచన కూడా చేశాడు. నాయకుడు అంటే అలా బ్రాడ్ మైండెడ్ గా వుండాలి. తెలంగాణ సాధన వరకే కేసిఆర్ పంతం సాగింది. ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఒక్కటే అంటారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుండడంతో కేసిఆర్ ఉద్యమం చేశారు. ఆంద్ర ప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా కాదు. ఈ మాత్రం పరిజ్ఞానం లేని చంద్రబాబు అన్ని ప్రాంతాల ప్రజలను ప్రేమించలేకపోయారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ప్రాంత అభివృద్ధిని చంద్రబాబు కాంక్షించలేకపోయాడు. తెలంగాణ అభివృద్ధి చేసింది నేనే అంటాడు. తెలంగాణ రాక ముందు తెలంగాణ ఐటిలో తెలంగాణ యువత భాగస్వామ్యం ఎంత? అన్నది ఒక్క తెలంగాణ సమాజానికే తెలుసు. అందుకే చంద్రబాబు అంటే తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలు చీకొడతారు. పరిపాలనలో సిఈఓ అని పేరు తెచ్చుకున్నాడే గాని, ప్రజల బాగోగులు చూసిన సంక్షేమ నాయకుడు అన్న పేరు మాత్రం లేకుండా చేసుకున్నాడు. 2004 లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం కోల్పోయి, మీ కోసం అంటూ బస్సు యాత్ర చేశాడు. కానీ ప్రజలు ఆదరించలేదు. ఇక చివరికి పాదయాత్ర చేశాడు. పదేళ్ల పాటు ప్రజలు దూరం పెట్టిన చంద్రబాబు ను మళ్లీ రాష్ట్రం విడిపోయాక 2014 నమ్మారు. అయినా ఆయన మారలేదు. ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు ఆగమ్యగోచరం చేశాడు. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను బురిడీ కొట్టించాడు. నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు. కట్టిన నిర్మాణాలు తాత్కాలికం అన్నాడు. ప్రజలు కూడా తనని తాత్కాలిక అవసరాల కోసమే ఎన్నుకున్నారని తెలుసుకోలేకపోయాయి. ప్రతిపక్ష పాత్రకు కూడా చంద్రబాబు పనికి రాడని విసిరేశారు. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ముందు మోకరిల్లుతున్నాడు. ఆంద్రప్రదేశ్ లో ఆఖరి అవకాశం అని ఎంత మొత్తుకుంటున్నా జనం చంద్రబాబు మొహం చూడడం లేదు. కనీసం తెలంగాణ ప్రజలైనా కనికరిస్తారేమో…అన్న ఆశతో అడుగుపెట్టాడు. కానీ తెలంగాణ ప్రజలకు కూడా చంద్రబాబు అంటే ఏమిటో బాగా తెలుసు. తెలంగాణ రైతులకు ఏనాడైనా మేలు చేశావా? తెలంగాణ ను ఎండబెట్టింది నువ్వు కాదా?సీలేరులో తెలంగాణకు వాటా లేకుండా చేసింది నిజం కాదా!రాష్ట్రం వచ్చాక తెలంగాణ ను అస్థిర పర్చాలని చూసిందే కదా! తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసింది ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా! తెలంగాణ అరవై ఏళ్ల ప్రజల కల. ఆ కల నెరవేరి తెలంగాణ అస్తిత్వం అప్పుడే స్థిరపడుతుంటే, తెలంగాణ ఏర్పాటు విఫలయత్నం అని నిరూపించే కుటిల యత్నం చేసింది చంద్రబాబు కాదా!
ఉమ్మడి రాష్ట్రం ఇంకా కొనసాగి వుంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా! తెలంగాణలో చెరువులు నిండేవా? కాలువలు వచ్చేవా? వాగులు మళ్ళీ పారేవా? ప్రాజెక్టులు కట్టేవారా? కాళేశ్వరం అన్నది వుండేదా? తెలంగాణ24 గంటల కరంటు వుండేదా? రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందేదా? రైతు బంధు వచ్చేదా? రైతు భీమా వుండేదా? కళ్యాణ లక్ష్మి అనేది కలగందుమా? చెరువులు నిండి మత్స్య పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అయ్యేదా? దళిత బంధు వచ్చునా? గిరిజన బంధుకు ఆస్కారం వుండునా? జిల్లా కో మెడికల్ కాలేజీ వచ్చేదా? జిల్లా కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరిగేదా? తెలంగాణ లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటయ్యేదా? ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేవారా? పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేదా? అంతదాకా ఎందుకు రైతులకు అవసరమైన ఎరువుల క్యూలు లేకుండా చేసేవారా? ఆసరా ఫింఛన్లు రూ. 2 వేలు. వచ్చేవా? తెలంగాణ రాకపోతే ఈ పథకాలు లేకపోతే తెలంగాణ ఎలా వుండేదో ఊహించడానికే వీలు లేకుండా వుంటుంది. రేవంత్ రెడ్డి అన్నట్లు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ నాయకులు చూసుకుంటారు. షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి రాగానే వ్యతిరేకించిన నాయకుడు రేవంత్ రెడ్డి. మాకు మేం చూసుకుంటాం…నువ్వెందుకు తెలంగాణ రాజకీయాలలో దూరుతున్నావన్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు ను కూడా తెలంగాణ లో నీకేం పని అనాల్సిన అవసరం రేవంత్ రెడ్డి కి లేదా? తెలంగాణ కు చంద్రబాబు ఒక్క మంచి పని చేసిన దాఖలాలు లేవు. కరువు జిల్లా పాలమూరును దత్తత తీసుకుంటానని చెప్పి మోసం చేసిన నాయకుడు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేరు చెప్పి, ప్రపంచ బ్యాంకు అప్పు కుప్పలు తెప్పలుగా తెచ్చాడు. పాలమూరు కరువును ఒక్క శాతం కూడా తీర్చలేదు. ఆ నిధులన్నీ అంద్రకు తరలించాడు. పాలమూరు ప్రాజెక్టులకు పైసా ఇవ్వలేదు. అప్పటికే పెండిరగ్ ప్రాజెక్టులైన వాటిని ముందట పడనీయలేదు. వాటిని పూర్తి చేయలేదు. పాలమూరు కు నీళ్లియ్యలేదు. కనీసం మంచినీటి కొరత తీర్చలేదు. మరి అంతగా మోసం చేసిన చంద్రబాబు పల్లకి మోసిన వారిలో రేవంత్ ముందు వరుస వ్యక్తి. మరి ఇప్పుడు ఆ పార్టీలో లేడు. చంద్రబాబు ను తెలంగాణ లో అడుగు పెట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ది. అంతే కాదు అటు జాతీయ స్థాయిలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో బిజేపి తో చంద్రబాబు చేతులు కలుపుతున్నాడు. బిజేపికి మేలు చేసే పనిలో వున్నాడు. తన పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చుతున్నట్లే కదా! కనీసం శిష్యుడు రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగం చేయలేని, చంద్రబాబు విషయంలో రేవంత్ ఎందుకు సైలెంట్ గా వున్నట్లు? లోగుట్టు ఏముంది! షర్మిలకు తెలంగాణలో ఏం పని అడిగిన రేవంత్ చంద్రబాబును అపగలడా? సాధ్యమయ్యే పనేనా! పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా వున్నాడు. కాలం కలిసిరావాలని తాపత్రయ పడుతున్నాడు. కాంగ్రెస్ లో ఎంత కష్టమైనా ఓర్చుకుంటున్నాడు. సీనియర్ల వేధింపులు భరిస్తున్నాడు. అడుగడుగునా అడ్డుకుంటున్న సీనియర్లను చూసి బెంబెలెత్తిపోవడం లేదు. తాజాగా కూడా సీనియర్లు రేవంత్ రెడ్డి అనుచర వర్గాన్ని టార్గెట్ చేసింది. వలస వాదులకే పదవులని సీనియర్లు కారడ్డమాడారు. వారిని మానసికంగా ఇబ్బంది పెట్టారు. పదవుల వదులుకునేలా చేశారు. అయినా రేవంత్ రెడ్డి తట్డుకొనే నిలబడుతున్నాడు. జనవరి లో పాదయాత్ర అంటున్నాడు. ఈ సమయంలో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలుపెడుతున్నాడు. అంతిమంగా చంద్రబాబు రాజకీయం కూడా రేవంత్ కు నష్టం చేకూర్చేదే…కాంగ్రెస్ లో సీనియర్ వర్గం రేవంత్ కు సపోర్ట్ చేయదు. వలస వాదులన్న ముద్రవేయించుకున్న వాళ్లు టిడిపి వైపు చూస్తే అసలు గండం రేవంత్ రెడ్డి కే…మరి ఇది ఆలోచించాడా? లేదా! ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తేరుకొని టిడిపి రాజకీయాలను అడ్డుకోకపోతే అసలైన కోవర్టు అనే ముద్ర వేసుకోవాల్సిందే. లేకపోతే కాంగ్రెస్ ను వీడలేక, టిడిపి లో చేరలేక, కొత్త కుంపటి పెట్టుకోలేక ఎన్నికల ముందు అవస్థలే కాదు, రాజకీయ జీవితానికి బైబై చెప్పుకోవాల్సిన అవసరం కూడా రావొచ్చు. లేకుంటే మళ్ళీ ఎన్నికల నాటికి నా అదృష్టం అనుకుంటూ ఎక్కడో అక్కడ కొనసాగాల్సిందే…చంద్రబాబు ను మళ్ళీ నమ్మితే తెలంగాణ వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అయినా ప్రాంతం మీద ప్రేమ మన వాళ్లకుంటుంది. మన నాయకులకు వుంటుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ కు వుంటుంది. బిఆర్‌ఎస్ పార్టీకి వుంటుంది. పరాయి నాయకులకు దోచుకోవాలని వుంటుంది. మళ్ళీ తెలంగాణను అతలాకుతలం చేయాలన్న దుర్మార్గం గూడుకట్టుకొని వుంటుంది. అందుకే తెలంగాణ ఎవరమూ చంద్రబాబు ను నమ్మం…చంద్రబాబు చరిత్ర గతం…ఆయన రాజకీయ జీవితం మిద్య…అనవసర ప్రయాస తప్ప మిగిలేదేమీ వుండదు. టూరిస్ట్ జీవితం గడపక తప్పదు. ప్రాంతేతర నాయకులను నమ్మి అరవై ఏళ్లు మోసపోయి, గోస పడ్డ గడ్డ తెలంగాణ. అలాంటి గడ్డ మీద గద్దల్లా వాలేందుకు వచ్చేవారిని నమ్మం…! చంద్రబాబు ను తెలంగాణ ప్రజలు అసలే నమ్మరు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.