మీకు సోయుంటే ‘పీకే’ఎందుకు?

కరంటు గోసలు యాదున్నాయా?
`పూటలో ఎన్ని గంటలు పోయేదో అయినా యాదొస్తుందా?
`సకల జనుల సమ్మెకాలంలో ఎంత నరకం చూపించారో గుర్తుందా?
` పంటలు ఎండిన కాలం మర్చిపోయారా?
`ఏన్నేండ్లు బావులు ఎండిపోయాయో! యాదొచ్చెనా?
`2015లో ఎండాకాలంలో ఊటలొచ్చి, బావులు నిండి గంతులేయలేదా?
` బోర్లు ఎళ్లవోసుడు చూసినామా లేదా!
`కరంటు కష్టాలు మర్చిపోవద్దు…
`సర్‌చార్జీలు, సర్వీసు చార్జీల వాతలు ఎలా మర్చిపోతాం?
`పల్లెల్లో కరంటు చూడని రోజులెన్నో గుర్తు చేసుకోండి?
`పట్టపగలే కరంటు వెలుగులు ఎందుకున్నాయో తెలుసుకోండి!

పచ్చగున్న కాడ పండంగానే కాదు. ఎండినప్పటి సంగతి గూడ యాది చేసుకోవాలే. ఎండిన దినాలు మర్చిపోతే నష్టం. పచ్చదనం గప్పట్ల గిట్లలేకనే కొట్లాడగినం అని ఇప్పట్లోకు చెప్పాలే! గతమెప్పుడూ మర్చిపోవద్దు. గతాన్ని తల్చుకుంటూ వర్తమానం ఆగిపోవద్దు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడిరడు. ఏళ్ల తరబడి సాగిన కరంటు గోస తెలంగాణ తెచ్చి మూన్నెళ్లలో తీర్చండు. గప్పటి కష్టం యాది రాకున్నా పాయే, గాని గప్పట్ల నష్టం మర్చితే తిన్నింటి వాసాలు లెక్కవెట్టినట్లే…..తెలంగాణ ప్రజల తండ్లాట యాదిలేనట్లే…


తెలంగాణ వస్తే ఏమొస్తది? అన్నవారు ఎక్కడా కనిపించకుండాపోయారు. తెలంగాణ వచ్చాక ఏమొచ్చింది? అని రాజకీయ నిరుద్యోగులైన వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడాయని కొట్లాడిరది ప్రజలు. తెలంగాణ తెచ్చుకొని సల్లంగ బతుకుతున్నది ప్రజలు. కాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నది ప్రతిపక్షాలు. తెలంగాణ వెలుగులు జీర్ణించుకోలేని వాళ్లు. ఇప్పుడన్నా అధికారం మాకు వస్తుందా? అని ఎదరుచూస్తున్నవాళ్లు? ఎంత చెప్పినా ప్రజలు మావైపు చూస్తలేరని, మాకు ఓటు వేస్తలేరని కుళ్లుకుంటున్నవాళ్ల కళ్లముందు నిజాలు…తెలంగాణలో కరంటు వెలుగులు.
సరిగ్గా ఏడేళ్ల క్రితం తెలంగాణలో చిమ్మచీకట్లు…బతకాలంటే కరంటు. బతుకంటేనే కరంటు. అడుగేస్తే కరంటు. ఇదీ ప్రపంచపు ప్రగతి అడుగు. కరంటు లేకుండా ఏదీ లేదు. కరంటు లేకుండా ఏ పని కాదు. అన్నింటికీ సర్వరోగ నివారణి కరంటు. కాని ఆ కరంటే తెలంగాణలో కళ్ల నిండా చూసింది లేదు. రోజులో ఇరవై నాగులు గంటలు ఎన్నడా సరఫరా అయ్యింది లేదు. పగలు కరంటు చూసిన దాఖలాలు లేవు. పల్లెల్లో రాత్రిళ్లు ఎప్పుడొచ్చిపోయేదో కూడా తెలియని కరంటు. ఎండా కాలం వచ్చిందంటే నరకం. అది మాటల్లో చెప్పలేనంత వర్ణణాతీతం. అటు దోమలు. ఇటు ఉక్కపోతలు. కరంటు లేక పగలు పని లేని దినాలు. రాత్రిళ్లు నిద్రలు లేని రోజులు. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం ప్రత్యక్షంగా పాలకులు చూపించిన దశాబ్దాల కాలం. కర్రపట్టుకొని తెలంగాణ వస్తే మొత్తం తెలంగాణ వస్తే చీకటే అని లెక్కలేసి భయ పెట్టారు. ఇప్పుడున్న కరంటు కూడా కళ్ల చూడరన్నారు. కాని పని చేసుకోవాలన్నా కరంటు కావాలి. చిన్నా చితక వ్యాపారమైనా కరంటు కావాలి. ఆఖరుకు జిరాక్స్‌ మిషన్‌ నడవాలన్నా కరంటు కావాలి. నిర్మాణ రంగం సాగాలంటే కరంటు కావాలి. పంటలకు కరంటు కావాలి.
దశాబ్ధం క్రితం వరకు మనది చీకటి బతుకుల తెలంగాణ. చీకట్లు కమ్ముకున్న తెలంగాణ. వెలుగు లేని తెలంగాణ. వేకువ కరువైన తెలంగాణ. కళ్ల నిండా కాంతి చూడని తెలంగాణ. కంటి ముందు కన్నీళ్ల తెలంగాణ. కరంటు లేని తెలంగాణ. ఇంటింటికీ కరంటు సరఫరా పూర్తిగా లేని తెలంగాణ. దళిత వాడాల్లో గుడ్డి దీపాల తెలంగాణ. కరంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని తెలంగాణ. సాగుకు కూడా మీటర్లు పెట్టి కరంటు అమ్మిన తెలంగాణ. హార్స్‌పవర్‌కు రూ.50 అంటూ జాలితో కూడా దోచుకోబడ్డ తెలంగాణ. ఆఖరు అది కూడా ఎత్తేసి మొత్తానికి మొత్తం విద్యుత్‌ చార్జీల మోత తెలంగాణ. ఇదీ తెలంగాణ రైతు కష్టం. ఇదీ తెలంగాణ రైతు ఎదుర్కొన్న నష్టం. విత్తునాడు సక్కగ రాని కరంటు. నారులోనే ఎండిన పైరు. నీళ్లు చాలక ఎండిన పొలం. అర్ధరాత్రిలు బావుల దగ్గర నిద్రల తెలంగాణ. పాము కాట్లకు రైతులు బలైన తెలంగాణ. దగా పడ్డ తెలంగాణ. గోసపడ్డ తెలంగాణ. అరిగోస ఎదుర్కొన్న తెలంగాణ. తినడానికి తిండిలేని తెలంగాణ. పంటలు కూడా కళ్లారా చూసుకోలేని తెలంగాణ. భూములన్నీ పడావు బడ్డ తెలంగాణ. బీడులన్నీ నోళ్లు తెరిచిన తెలంగాణ. ఇవన్నీంటికీ సర్వ రోగ నివారిణి కరంటు జాడ లేని తెలంగాణ. ఇది చూడని వాళ్లున్నారా? ఇది తెలియని వాళ్లున్నారా? ఇది అనుభవించని వాళ్లున్నారా? ఇది మళ్లీ మళ్లీ గుర్తు చేస్తే గాని తెలుసుకోలేరా? ప్రజలకు తెలియదా? నాయకులకు తెలియదా? మరి ఇప్పుడు అలాగే వుందా? నాటి రోజుల కలలోనై కనిపిస్తున్నాయా? నాడు సక్కగ రాని కరంటుకు సర్‌చార్జీలు. సర్వీసు చార్జీలు. సెస్స్‌ చార్జీలు. పన్నుల మోతలు. వసూళ్లు వాతలు. రెండు నెలలకోసారి వచ్చే కరంటు బిల్లులు నెల నెల మొదలు పెట్టిన వసూళ్లు. జనం జేబులకు చిల్లులు. అయినా తప్పని కోతలు…తిప్పలు. పనులు లేక అప్పులు. కరంటు సరిగ్గా రాక పస్తులు.
తెలంగాణ ఎప్పుడు పచ్చబడిరది? ఎందుకు పచ్చబడిరది? అరవై ఏళ్లలో లేని వెలుగు తెలంగాణ రాగానే మూడు నెలల్లోనే ఎందుకొచ్చింది? ఇది ఎవరికీ అవసరం లేదా? ఎండా కాలం ఉక్కపోత…చలికాలం దోమలతో తంటా…వానా కాలంలోనూ కరంటు కటకట. ఇవన్నీ భరించిన తెలంగాణ. ఇవన్నీ దిగమింగిన తెలంగాణ. బిల్లులు మాత్రం నెలనెలా చెల్లించిన తెలంగాణ. రోజూ పద్నాలుగు గంటల కరంటు కోతలే. పల్లెల్లో ఇరవై గంటలకు పైగా చీకట్లే… మరి ఇప్పుడు కోత అన్నది లేని తెలంగాణ. వాతలకు దూరమైన తెలంగాణ. వెలుగుల్లో కళకళలాడుతున్న తెలంగాణ. చీకటి లేకుండా వెలుగులు నిండిన తెలంగాణ. సాయంత్రమైందంటే పగటిని తలపించేలా వెలుగుల తెలంగాణ. పట్నాలే కాదు, పల్లెల్లోనూ హైమాస్‌ లైట్ల జిలుగుల తెలంగాణ. ఈ వెలుగులు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు లేవు? ఈ కరంటు వెలుగులు ఆనాడెందుకు లేవు? ఈ ఆలోచన నాయకులకు రాదా? జనానికి చెప్పాలన్న సోయి లేదా? అరవైఏళ్లలో ఏనాడు కనిపించింది లేదు. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే నిరంతర కరంటు ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? రావడానికి కారణం ఏమిటి? రావడానికి కారణం ఎవరు? ఇవన్నీ తెలంగాణ సమాజం ఆలోచించడం లేదా? రోజులో నిరంతరం గంట కరంటు వుంటే చాలు. మా బతుకులకు ఇంత మెతుకు దొరకుతుందని మధనపడిన రోజులు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని పరిశ్రమలకు వారంలో మూడు రోజులు సెలవులు. అటు క్రాప్‌ హలిడే. ఇలా కరంటు లేక సాగు కూడా లేకుండాపోయిన రోజుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన తెలంగాణ. ఆ రోజులు గుర్తుకొస్తే ఇంకా గుబులు కళ్లలో కనిపిస్తుంది. కాని నేడు ఆ చీకటి లేదు. కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌.
ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనే పదం వినబడితే చాలు ఎండినపోయిన వరి కట్టలు పట్టుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రులగా వచ్చేవారు. కందిర్లు పట్టుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోవడం ప్రతి సమావేశాల్లో చూశాం. కాని ఆ పరిస్ధితులు నేడు తెలంగాణలోనే లేదు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోచీకట్లు. పాలకుల సవతితల్లి ప్రేమతో ఇక్కట్లు. కాని అదే మరో ప్రాంతంలో కరంటు వెలుగులు. పంటలు. వారి జీవితాల్లో సంతోషాలు. నేడు తెలంగాణలో ఎక్కడా లేనంతగా కరంటు సరఫరాలు. అదే మరో తెలుగు రాష్ట్రంలో కరంటు కోతలు. మన దగ్గర కోత అన్న పదమేలేదు. ఒక్క విద్యుత్‌ వెయ్యి సమస్యలకు మార్గాలు. ఇంటింటికీ వెలుగు. పరిశ్రమలకు పనులు. కరంటుతోనే అన్ని పనులు.
మిడిమిడి జ్ఞానం మిద్య. అదే కొందరి రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నగా మారింది. కొట్లాడినంత కాలం కొట్లాడినం. పద్నాలుగేళ్లు తెలంగాణ పోరాటం జేసినం. తెలంగాణ తెచ్చుకున్నం. కాలం కలిసొచ్చి ఎమ్మెల్యేలైనం. ఇక అన్నీ మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ చూసుకుంటడు. ఇక మాకేం పని…అని ఎవరికివారు తమతమ వ్యాపకాల్లో పడొద్దు. ఇదే ముందు నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెబుతున్నది. మనమేం చేయకపోయినా ఫరవాలేదు. తిట్టినా, పెట్టినా మన సారే…కోపమొస్తే ఓ మాటంటడు. కష్టమొస్తే కడుపుల వెట్టుకుంటడు. అని అనుకుంటున్నారే గాని పార్టీకి తిప్పలు రాకుండా జాగ్రత్తగా వుండాలన్న సోయి కొందరు మర్చిపోయిండ్రు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమౌతోంది. తెలంగాణ గోస అంటే ఏంటో తెలియని పికే సేవలు కూడా అవసరమౌతోంది. ఇప్పటికైనా నాయకులు మేలు కుంటే ఏ పీకే అవసరం లేదు. ఎవరో పీకేసేంత పెద్ద పెద్ద సమస్యలేం ఇక్కడ లేవు.

Don’t forget the power cut days

 

KCR is responsible for today’s prosperity
Enlightenment is required in the leaders

Don’t forget the past. Today we are prospering well. But don’t forget the way, how we have fought to reach this stage. To experience this prospering state of Telangana, we struggled a lot in our previous period. We have to enlighten the present generation by letting them known about the process of struggle that had been taken place to achieve separate state. We must not forget our past. At the same time let not remain idle just by recollecting our past. KCR fought for Telangana and after achieving the state he solved the problem of power cut within three months of period. There is no loss if you forget the agony faced by the people of that time. But if you forget the loss occurred to Telangana at that time, it really a betrayal to the state. It clearly states your indifference towards the Telangana people.

Nobody is now present who contended, ‘What will happen if Telananga comes?’ Now the political unemployed persons are questioning ‘what we have achieved after the formation of the state?’ Really the Telangana People, who fought for the separate state, have been experiencing the prosperity and joy full life. Only those persons who want power, alleging the people are indifferent towards them. Now let us have look into the facts behind the continuous power supply in the state.

Exactly seven years back there was severe current problem in the state. Continuous power cuts made the life of the people miserable. Almost entire day time every house holder suffered with lack of power supply. There is no need to tell about summer season. When the situation in cities and towns is like this, there is no need to explain the condition in the villages. People in rural areas were unaware about the arrival of the current in night times. Sleepless nights are very common in those days. People suffered with oppressive sultry. This was the period; the people faced the hell in the hands of the rulers. This continued for a period of decade. When Telangana people resort to struggle for separate state, the leaders frightened them by explaining how continuous dark days they will experience if separate state is formed. They also threatened the people that they never see the current in their life if Telangana is formed. But power supply is needed in the every aspect of our life. For running the business, Xerox machines, for running the motors and for studying purpose…like this in every aspect of life current is needed.

Ten years back Telangana suffered with lack of power supply. Water supply greatly disrupted due to lack of sufficient power. In rural areas, no street light functioned due to lack of proper power supply. In such crisis period also, the rulers arranged meters for the farmer’s pump sets. Telangana was exploited with charging Rs.50 per horse power. In later period this also lifted and began to increase the power tariffs. There was continuous power shortage and farmers were unable to perform their farming activities. For sowing the seeds, for irrigating the land, water is required. But when there no power supply properly how can a farmer carryout his agricultural operations with confidence? This led to the fields to transform into waste lands. When farmers went to their fields in night times fell in victims for the snake bites. Everybody knows all these facts well. Telangana suffered with food scarcity, the fallow lands spread all over with lack of water. Especially farmers struggled a lot with lack of proper power supply. At the same time power charges hike was become a common process. Unable to pay the high power charges, lack of crop production in the absence of current supply, the agony faced by the farmers never be explained.

Nearly 14 hours power cuts every day! Then how the life of the people becomes normal? But now look at the power supply situation in the state. There are no power cuts. Continuous power supply is being given to the agriculture sector. Not only cities but also towns and urban areas in the state are shining with luster during night time. Now all the people had forgotten those dark days once prevailed. Since sixty years there was a continuous struggle to get undisrupted power supply. But how this problem solved within the three months of period after achieving the separate state? Who is responsible for it? Couldn’t think about this by the Telangana society? In the united Andhra Pradesh period, the industries in Hyderabad functioned only four days in a week. Remaining three days they used to be closed down due to lack of power supply. In the villages crop holidays were implemented. But today that problem is not there. For this achievement, only one person or we can say great leader is responsible. He is Kalvakuntla Chandrasekhar Rao.

 

‘పీకే’సిన లెక్కలు?

` నమ్మి బాగుపడ్డోల్లు లేనేలేరు
` ఒక్కసారి పిలిచిన వాళ్లు మళ్ళీ పిలిచిన దాఖలాలు లేవు
` బిజేపి గెంటేసింది
` కాంగ్రెస్‌ గడప తొక్కొద్దంది?
` జేడీయూ దూరం కొట్టి..వేసిన కండువా తీసేసుకుంది
` తెలంగాణకేం అక్కరొచ్చిందని మండిపడుతున్న కార్యకర్తలు , నేతలు
` కేసిఆర్‌ పేరు చెడగొట్టేందుకే వచ్చాడంటూ మధనపడుతున్న పార్టీ శ్రేణులు


హైదరాబాద్‌ , నేటిధాత్రి :
పని మంతుడొచ్చి పందిరేస్తే, కుక్కతోక తాకి కూలిందట. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఎత్తుగడలు అలా వుంటాయన్నది తెలిసినవారు చెప్పే మాట. ఒక్కసారి ప్రశాంత్‌ కిషోర్‌ ఎక్కడ పనిచేసినా మరోసారి అవసరం వుండదు. అంటే ఆయనతో ఎవరికీ పొసగదు. కాకపోతే తెచ్చిపెట్టుకున్నాక భరించలేక, మధ్యలో వదులుకోలేక, పరువు పోగొట్టుకోలేక పాట్లు పడుతుంటారు. ఆఖరుదాకా వెంట తిప్పుకుంటారు. కోట్లకు కోట్లు అప్పటికే ఇచ్చి వుండడంతో పడి వుంటాడులే, పనికొస్తాడులే అనుకుంటుంటారు? అంతే తప్ప పికే లేకపోతే ఇక మాకు దిక్కులేదన్నంతగా ఇప్పటికీ ఏ పార్టీ లేదు. మళ్లీ ఆయన్ను దగ్గరకు రానిచ్చిన వారు లేరు. అందుకు ప్రత్యక్ష ప్రధమ సాక్ష్యం బిజేపియే. యూపిఏ రెండు తర్వాత ఎలాగైనా బిజేపి కేంద్రంలో అధికారంలోకి రావాలి. తప్పని పరిస్ధితి. మూడు సార్లు అధికారానికి దూరమైతే ప్రజలకు దూరం కాకతప్పదు. ఒక తరం తీరం దాటి పోతుంది. చెప్పుకోవడానికి ఏమీ వుండదు. అందువల్ల ఎవరో ఒకరు కావాలి. ఎవరో ఒకరు మేలు చేయాలి. ఎవరో ఒకరు వచ్చి తోడు నిలవాలి. ఇదే సమయంలో బిజేపికి పికే చీకట్లో దీపంలా కనిపించాడు. ప్రచార ఆర్భాటం బాగా తెలిసినవాడుగా తోచాడు. అప్పటికి బాగా చెప్పుకోదగ్గ నాయకుడు కూడా బిజేపిలో లేరు. దేశమంతా ప్రభావితం చేసే నాయకులు బిజేపిలో కనిపించడం లేదు. కాకపోతే అప్పటికే మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీ అభివృద్ధిలో ఐకాన్‌ అన్న ముద్ర వుంది. ఆయనను బిజేపికి చిరుదివ్వెను చేసుకుంటే తప్ప మంచి రోజులు కనిపించడం లేదు. దాంతో నమో అంటూ మొదలు పెట్టారు. దేశం, ధర్మం అంటూ ప్రచారం సాగించారు. ఇదే సమయంలో నాడు నిత్యావసర వస్తువుల పెరుగుదల. పెట్రో వాతలు. ఉల్లి, పప్పుల ధరల మోతలు. వాటికి తోడు డిల్లీలో నిర్భయ ఘటన ఒక్కసారిగా బిజేపిని తెరమీదకు వచ్చింది. మరో వైపు లోక్‌పాల్‌ బిల్లు కోసం సాగుతున్న పోరాటం. ఇలా అన్నీ బిజేపికి కలసివచ్చాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కేంద్రంలో కేవలం జవహార్‌లాల్‌ నెహ్రూ కాలంలో తప్ప రెండు సార్లు వరుసగా గెలిచింది లేదు. ఇందిరాగాంధీ కూడా వరుసగా మూడుసార్లు గెలిచింది లేదు. అలాంటిది యూపిఏ కు మూడోసారి అవకాశం వచ్యే పరిస్ధితి లేదు. బిజేపికి ఆశలు పెరిగాయి. అప్పుడున్న బలం చాలదు. దాంతో బిజేపి పికే అనే పేరును కూడా రాజకీయంగా విపరీతంగా వాడుకున్నది. సొంత ప్రచారానికి కూడా తోడు చేసుకున్నది. పీకే అనే పేరు దేశమంతా తెలిసిపోయింది. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చాక పికే పెత్తనం పార్టీలో పెరగడం మొదలైంది. ప్రభుత్వంలోనూ జోక్యం దాకా వచ్చింది. ఇది బిజేపి పెద్దలకు నచ్చలేదు. అటు ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ పికేను పక్కను పెట్టక తప్పలేదు. ఆ దరిదాపుల్లోకి రాకుండా చూడక తప్పలేదు. పికే ప్రత్నామ్నాయ పార్టీలను వెతుక్కొవాల్సివచ్చింది. బిహార్‌ లాంటి ఎన్నికలు ఆయనకు మరోసారి కలిసివచ్చాయి. కాకపోతే రెండు ప్రతిపక్షాల ఏకంతో బిజేపిని కొట్టాలనకున్నాడు. ప్రజలకు కూడా ఆ కూటమి నచ్చింది. అంతకు ముందు జల్‌, బిజిలీ అనే నినాదంతో గెలిచిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కొంత పూర్తి చేశాడు. చీకట్లను పారద్రోలాడన్న నమ్మకం కలిగించాడు. మరోసారి ప్రజలు కూడా అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నారు. పికే వెంటనే అక్కడ వాలిపోయాడు. ఇక తాను ఎన్నికల వూహకర్త నుంచి రాజకీయ నాయకుడి అవతారం దాల్చాలనుకున్నాడు. జేడియూలో చేరారు. కొంత కాలానికే ఆయన అక్కడ కూడా ఇమడలేకుండా బైటకు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే పికేను నితీష్‌కుమార్‌ బైటకు పంపేశాడు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయన వైఎస్‌ జగన్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడ ప్రజల మద్దతు జగన్‌కే వుందని కనిపెట్టి, అంతా నేనే చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. జగన్‌ గెలుపుతో పికేకు మరింత పేరు రావడం కూడా గమనార్హం. ఇక ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ ఇలా కొన్ని రాష్ట్రాలలోనూ తన వ్యూహాలంటూ చెప్పుకున్నాడు. నమ్మించాడు. తమిళనాడులో జయలలిత మరణం, ఏఐడిఎంకేలో అనైక్యత అంతా స్టాలిన్‌కు అప్పుడే కలిసివచ్చాయి. కాకపోతే ఎందుకైనా మంచిదన్నట్లు పికేను స్టాలిన్‌ పక్కన పెట్టుకున్నాడు. ఇక మహారాష్ట్రలోనూ అదే జరిగింది. శివసేన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం వంటి వాటితో బిజేపి ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బంది పడిరది. పైగా ఎప్పటినుంచో వున్న శివసనే,బిజేపి మైత్రికి బీటలు వారడం కూడా మహారాష్ట్ర ప్రజలు అంగీకరించలేదు. దాంతో బిజేపిని కాదని శివసేన వైపు కొంత, ఎన్సీపి వైపు కొంత ప్రజలు నిలిచారు. సంకీర్ణానానికి కొత్త తలుపు తెరిచారు. బిజేపి ఓటమి అంటూ కంకణం కట్టుకొని తిరగడం కూడా పికేకు కలిసి వచ్చింది.
ప్రాంతీయ పార్టీలకు అండగా అనిపిచింది. ఇంతకు మించి పీకేతో వాళ్లకు ఒరిగింది ఏమీలేదు. సహజంగా రాజకీయాలన్నాక ఎవరినో ఒకరిని నమ్మడం అన్నది తప్పదు. అందుకు ఎక్కడో పికే అన్నవాడు సాయం చేస్తాడు. వెళ్లిపోతాడు. తలనొప్పి వుండదు. ఇదే పార్టీలు కూడా అనుకునే అంశాలు. పార్టీగెలిచాక పికే కాంట్రాక్టు పూర్తిచేసుకొని చేతులు దులుపుకోవడాలు. ఇక ఆ మధ్య కాంగ్రెస్‌తో జత కట్టేందుకు, రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు కాంగ్రెస్‌తో కూడా చర్చలు జరిపాడు. కాని ఆయన వ్యూహాలేమీ కొత్తవి కాదు. కొత్తగా ఏమీ లేవు. పైగా పార్టీమీద పికే పెత్తనం ఎవరూ అంగీకరించరు. అందుకే పికేను కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. దరి చేరనివ్వలేదు. దగ్గరకు రాకుండానే దూరం జరిపింది. కాంగ్రెస్‌ గుమ్మం తొక్కకుండానే తరిమేసింది. దాంతో ఎలాగైనా ప్రాంతీయ పార్టీలను పట్టుకొని, గడ్డిపోచలను ఏకం చేసిన తాడు పేనాలనుకున్నాడు. ఎవరెవరికి కేంద్రం మీద గురి వుందన్నది తెలుసుకున్నాడు. అందరినీ సంప్రదింపులకు సిద్ధం చేయాలనుకున్నాడు. అందుకు తెలంగాణను ఎంచుకున్నాడు.
తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది ఆయనకు తెలిసిన వాళ్లైన ఆ రాష్ట్ర ఉన్నతోద్యోగులు కూడా సందిచ్చారని ఓ ప్రచారం? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను నమ్మించే ప్రయత్నంలో పికే వున్నాడన్నది వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఇదే టిఆర్‌ఎస్‌ కొంప ముంచేదాక తెచ్చుకునేలా చేస్తుందనేది చాలా మంది వాదన. అదేంటో గాని టిఆర్‌ఎస్‌కు పనిచేసేందుకు వచ్చిన పికే టిఆర్‌ఎస్‌నేతలకే కాదు, విపక్ష నేతలకు కూడా నచ్చడం లేదు. కారణం కేసిఆర్‌ అంటే ప్రతిపక్షాలకు కూడా గురి. కేసిఆర్‌ ఈసారి ఎలాంటి అస్త్ర శస్త్రాలతో వస్తాడన్న ఆసక్తి. అవి పికే లాంటి వాడి సలహాలు అంటూ జరిగే ప్రచారం కూడా ప్రతిపక్షాలకు నచ్చడం లేదు. తెలంగాణ సాధనకర్త, అభినవ తెలంగాణ నిర్మాణ కర్త, బంగారు తెలంగాణ ఆవిష్కర్తకు ఎవరో చెప్పే సూచనలు అవసరమా? అన్నది అందరి మదిని తొలుస్తున్నది. నిన్నటిదాకా అసలు కేసిఆర్‌ ఎవరి మాట వినడు. అన్నవారు. కేసిఆర్‌కు చెప్పేంద ధైర్యమా? అన్నవాళ్లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. దానికి తోడు కేసిఆర్‌ కు కూడా రాజకీయ చతురతకు ఒకరు కావాల్సివస్తున్నారా? అన్నంతంగా మాట్లాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కేసిఆర్‌ అంటే ఎంతో పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్లు కూడా ఈసడిరచుకుంటున్నారు. ఇది నిజం. పికే అనేవాడు ఎందుకు? కేసిఆర్‌కు తెలియని తెలంగాణనా? తెలంగాణ తెలియని కేసిఆరా? మధ్యలో ఈ పీకే ఎందుకు? ఆయన పికేదేముందన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. పికేకేం తెలుసు తెలంగాణ. పికేకేం తెలుసు కన్నీళ్లు. కష్టాలు. ఒక్క కేసిఆర్‌కే తెలుసు. తెలంగాణ రాక ముందు ఒక తెలంగాణ. వచ్చాక ఇప్పటి వరకు తెలంగాణ అంటే ఒక లెక్క. అది ఎప్పుడూ కేసిఆర్‌ లెక్కనే తలపించాలి. కేసిఆర్‌ వేసిన లెక్కల్లోనే సాగాలి. అదే తప్పితే భవిష్యత్తులో తెలంగాణకు ఇబ్బందే. ప్రజల గుండె చప్పుడు నిన్నటిదాకా తెలంగాణ. ఇప్పుడు కేసిఆర్‌. ఇదీ నేటి తెలంగాణప్రజల మనోగతం.
ఇది తెలిసి కూడా కేసిఆర్‌ ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా పికే చెబితే ఇక అది కేసిఆర్‌ చెప్పినట్లు ఎలా అవుతుంది. ఇది టిఆర్‌ఎస్‌కు తీరని నష్టం చేస్తుంది. ఎందుకుంటే తెలంగాణ అంటే ఆకలి తెలిసిన తెలంగాణ. ఆకలి కోసం అన్నమో రామచంద్రా అని తల్లడిల్లిన తెలంగాణ. ఆవేదనలనుంచి పుట్టింది తెలంగాణ. ఆక్రందనలనుంచి ఉరిమిన తెలంగాణ. తెగువ తెలంగాణ.తెగింపు తెలంగాణ. త్యాగం తెలంగాణ. త్యాగాల గుట్ట తెలంగాణ. నిన్న చీకట్ల తెలంగాణ. నేడు వెలుగుల తెలంగాణ.వేకువ తెలంగాణ. వెలుగు నీడల తెలంగాణ. బతుకు తెలంగాణ. బతుకు తెరువు లేక ఏడ్చిన తెలంగాణ. పచ్చటి అడువుల మధ్య ఎండిన తెలంగాణ. కాకతీయ చెరువులతో సాగు విప్లవం తెలంగాణ. నిలువెల్లా కరువు తెలంగాణ. ఇదంతా చీకటి వెలుగుల సమ్మిళితం నాడు తెలంగాణ. నేడు నడయాడుతున్న నిండైన వెలుగుల రేడు తెలంగాణ. రాజకీయ తెలంగాణ. రాజకీయ చాణక్యం తెలంగాణ. దేశంలో మైనార్టీ ప్రభుత్వాన్ని సైతం ఐదేళ్ల పాలించిన ఠీవి. మన పివీ తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణను చేసిన దాశరధి తెలంగాణ. ఉప్పెన లాంటి పదాల కవి కాళోజీ తెలంగాణ. జీవితాంతం తెలంగాణ అంటూ బతికిన గురువు జయశంకర్‌ తెలంగాణ. తెలంగాణే ఊపిరైన కేసిఆర్‌ తెలంగాణ. కొట్లాడి కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ. నాలుగు కోట్ల గొంతుక కేసిఆర్‌. తెలంగాణ జాతి విముక్తి ప్రధాత కేసిఆర్‌. బంగారు తెలంగాణ ఆవిష్కర్త కేసిఆర్‌. కోటి ఎకరాల మాగాణ కేసిఆర్‌. మరి అలాంటి కేసిఆర్‌ ఏం చెప్పినా వినే తెలంగాణ. పికే చెప్పినట్లు కేసిఆర్‌ వింటుండన్న మాట కూడా వినలేని తెలంగాణ.

గిరిజన విద్యార్థులకు అమ్మఒడి గురుకులాలు

# రాష్ట్ర సాధన తో అందుతున్న ఫలాలు
# గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రారంభం


# హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్యే పెద్ది ,జడ్పీ చైర్మన్ జ్యోతి, కలెక్టర్ డాక్టర్ గోపి
నర్సంపేట , నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అం గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటూ అమ్మఒడిల ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు మారిపోయాయని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గురుకుల పాఠశాలలో భాగంగా నర్సంపేట పట్టణంలో గిరిజన సంక్షేమ బారుల గురుకుల పాఠశాల, కళాశాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి , జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతితో కలిసి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ప్రారంభం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఆర్సిఓ డిఎస్ వెంకన్న అధ్యక్షతన కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసి వారి సంక్షేమానికి దోహదపడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ టు పీజీ విద్య ప్రవేశ పెట్టే నేడు రాష్ట్రంలో 1వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్లు, అలాగే దేశంలో ఎక్కడలేని విధంగా గిరిజన సైనిక్ పాఠశాలను కళాశాలను ప్రారంభించి తరగతులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు ఇతర దేశాల్లో చదువులకోసం కార్పొరేట్ స్థాయిలో స్టడీ సెంటర్ లను ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్యను అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ హాస్టళ్ల తో పాటు పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించటం కోసం సన్న బియ్యంతో ప్రభుత్వ పాఠశాలలో భోజన వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందిస్తున్నారని మంత్రి సత్యవతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గా మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు జిల్లా కేంద్రంలో అన్ని అన్ని విధాల సౌకర్యం ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే నేటికీ యూనివర్సిటీ అమలు కాలేదని దీంతో గత ఏడేళ్లుగా గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను కోల్పోతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు 12 కోట్ల మంది జనాభా ఉంటే వారి అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన నిధులు కంటే తక్కువగా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని దీంతో అభివృద్ధి గిరిజనుల అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని మంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో 207 గిరిజన తండాలు ఉన్నారని వారి అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం దోహదపడుతుందని అన్నారు.విద్య ఒక్కటే కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో నర్సంపేట నియోజకవర్గానికి 7 గిరిజన గురుకులాలను ప్రారంభం చేసినట్లు అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.నర్సంపేట నియోజకవర్గం తోపాటు వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల తో పాటు మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు నర్సంపేట నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి మరింత అభివృద్ధికి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఆ ఫలాలను నేడు రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలుగా పొందుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నేటి బాలలే రేపటి పౌరులు అని వారి భవిష్యత్తు కోసం ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నతమైన కార్పొరేటర్ విద్యను ఉచితంగా కెసిఆర్ అందిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత కొనసాగుతున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి కూడా అక్కరకు రాని బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని చెప్పారు.బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని తెలిపారు.ముందుగా కళాశాల పాఠశాల విద్యార్థులు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పెద్ది లతోపాటు ప్రజాప్రతినిధులు అధికారులకు గౌరవంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో
అడిషనల్ కలెక్టర్ హరి సింగ్,,జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ గుం టీ రజినీ కిషన్,వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,ఆర్డీవో పవన్ కుమార్,ఎమ్మార్వో రామ్మూర్తి,ఎంపిపి మోతె కళావతి ,జెడ్పీటీసీ కొమాండ్ల జయ గోపాల్ రెడ్డి,కౌన్సిలర్స్ దార్ల రమాదేవి, బాణాల ఇందిరా,రాంసహయం శ్రీదేవి, శీలం రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దిశానిర్ధేశకుడు

 


` దేశాభివృద్ధికి భవిష్యత్‌ దిక్సూచీ కానున్నాడు.
` మూడు నెలల్లో తెలంగాణ పల్లెల్లో చీకట్లు పారద్రోలాడు.
` రెండేళ్లలో సాగుకు ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరా


` చెరువులకు పునరుజ్జీవం పోసిన భగీరథుడు
` గోదారి జలాలతో కళకళలాడిరచాడు.
` మండు టెండల్లలోనూ చెరువులు నిండు కుండలను చేశాడు
` మూడేళ్లలో కాలేశ్వరం జలాలు తెలంగాణ పల్లెలో జాలువారించాడు.
` పేదింటి పెద్దన్నగా పది లక్షల మందికి ఆడపిల్లల పెళ్లి చేశాడు
` రైతు బంధువై, ఏడేళ్లలో రూ.54వేల కోట్లతో రైతన్నకు బాసటయ్యాడు.
` తెలంగాణ ప్రగతి దేశంలో ఆవిష్కరణకు పూనుకుంటున్నాడు.


` ప్రపంచం ముందు మన దేశాన్ని నెంబర్‌ వన్‌ చేయాలని కోరుకుంటున్నాడు
` ఉద్యమ నాయకుడు… ప్రగతికే పాలకుడయ్యాడు. a
` దేశ పాలకుడైతే…ప్రపంచమే నివ్వెరపోయే అభివృద్ధి చేస్తాడు.
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
తనేంటో చెబుతాడు. తనేం చేయాలనకుంటున్నాడో చెబుతాడు. ఏం చేస్తే ప్రజలు బాగు పడతారో వివరిస్తాడు. ఆ మార్గం అనుసరిస్తాడు. ప్రజాభివృద్ధి కోసం ఆచరిస్తాడు. అభివృద్ధి కామకుడైతాడు. ప్రగతి బాటలు వేస్తాడు. తన కలలుగన్న రంగంలో నెంబర్‌ వన్‌ అనిపించుకుంటాడు. తను సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టాడు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఇక దేశ భవిష్యత్తు మీద దృష్టి పెడుతున్నాడు. తెలంగాణను అన్ని రంగాలలో చేసిన అభివృద్ది నమూనాను దేశానికి అనుసరణీయం చేయాలని ఆలోచిస్తున్నారు. దేశ ప్రగతి పరుగులు పెట్టేందుకు అవసరమైన ఆర్ధిక విశ్లేషణ చేస్తున్నాడు. తన ఆలోచనలు తాజాగా మీడియా ముఖంగా దేశ ప్రజలతో పంచకున్నారు. తాను చేసిన అభివృద్ది నమూనాను చూపించాడు. దేశమంతా ఆచరిస్తే సంక్షేమ రాజ్య నిర్మాణమేకాదు, ప్రగతిశీల దేశ నిర్మాణం కూడా ఎలా సాధ్యమౌతుందో చెప్పాడు. దేశంలో సరికొత్త చర్చకు తెరతీశాడు. అభివృద్ది ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్లు తన మాటల ద్వారా చెప్పడమే కాదు, చూపించాడు కూడా…సంక్షేమం అంటే ఇది అని తాను ఆచరించి చూపించిన అన్ని పథకాలను వివరించాడు. ఏ రాష్ట్రంలో లేని, అమలు గురించి ఆలోచన గాని అనేక పధకాలను తెలంగాణలో ఎలా అమలౌతున్నాయో విడమర్చి చెప్పారు. అదీ కేసిఆర్‌ అని మరోసారి దేశమంతా చర్చికునే నాయకుడయ్యారు.
కేసిఆర్‌. ఈ మూడక్షరాల పదాలు…కొన్ని కోట్ల తెలంగాణ వాదుల గొంతుకలు. అవును. కేసిఆర్‌ అంటే మొన్నటి తరం ఆశయాల వారధి. నిన్నటి తరం ఆలోచనల సారధి. నేటి తరం సాధికారితకు ప్రతినిధి. రేపటి తరం కలలకు సంక్షేమాధిపతి. రాజకీయ నేతలు వేరు. సామాజిక వేత్తలు వేరు. ఈ రెండూ కలగలిసిన వారే కేసిఆర్‌ అవుతారు. సంక్షేమం అన్నది ప్రజల హక్కు. అదేదో పాలకులు ఇచ్చే బహుమతి కాదు. ఇది బాగా తెలిసిన నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ కోసం ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడుస్తున్న తరుణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తెలంగాణ సమాజానికి దివిటీ అయ్యాడు. తెలంగాణ కోసం కొట్లాడాడు. తెలంగాణ సాధించాడు. వెలుగులు ప్రసాదిస్తున్నాడు. అదీ కేసిఆర్‌. ఉద్యమ కాలంలోనే తెలంగాణ ఎలా వుండాలని కలలుగన్న ఏకైక ఉద్యమ నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ఎంత మంది పాల్గొన్నా, వారి ఆలోచనా పరిధి కేవలం సాధన వరకే…కాని కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ వస్తే ప్రజలు జీవితాల్లో ఎంత వెలుగునిండుతుందని ముందే చెప్పాడు.
ఒక్కడుగా మొదలై, ఒక్క అడుగుతో మొదలై, ఒంటరినన్న భావన లేకుండా సాగిన మలి తరం తెలంగాణ నేత. తెలంగాణ సాధన పోరాట జగజ్జేత. తన ఆలోచనే కొండత బలమై, తనే తెలంగాణ పదమై, నలుగురితో మమేకమై, తెలంగాణ దుఃఖాన్ని చూసి తనూ కన్నీటి పర్యంతమై జై తెలంగాణ అన్న నాయకుడు కేసిఆర్‌. ఎండిన బీడులు చూసి దుఃఖపడి, తడారిన ఏరులను చలించి, ఒట్టిపోయిన వాగులను చూస్తూ కళ్లలో సుడులై తరిగే నీళ్లలో దుఃఖాన్ని దాచుకున్నాడు. గంగాళ్లాలాంటి గొలుసు కట్టు చెరువులు చెంబులై, తుమ్మలు మెలిచి చెదిరిపోయాయి. తెలంగాణ వస్తే తప్ప మళ్లీ నీటి చుక్కల జాడలు చెరువుల్లో చూడలేమని జై తెలంగాణ అన్నాడు కేసిఆర్‌. తెలంగాణ పల్లె పెడుతున్న కన్నీటి ఉప్పెనుంచి రగిలిన నిప్పు కణం. అగ్ని రణం కేసిఆర్‌. అందుకే ఉద్యమ కాలంలోనే కేసిఆర్‌ను ఎదిరించాలంటే సమైక్య నాయకులు కూడా ఒకటికి రెండు ఆలోచించేవారు. కేసిఆర్‌ చెడుగుడు ఆడుకుంటే గుడ్లప్పగించి చూసేవారు. ఎందుకంటే వాళ్లు ఆనాడు చేసిన అన్యాయం నిజం. వాటిని తెలంగాణ సమాజానికి కేసిఆర్‌ వివరించడం నిజం. అందుకే నిజమన్న పర్యాయం కేసిఆర్‌ కావడంతో తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైంది. తెలంగాణ కల నిజమైంది. తెలంగాణ రాష్ట్రం కళ్లనిండా ఆవిషృతమైంది.
వచ్చే తెలంగాణే ఎలా వుండాలో ఉద్యమ కాలంలోనే బ్లూప్రింట్‌ చూపించిన కేసిఆర్‌ తెలంగాణ సాధకుడిగా ఆచరించి చూపించాడు. అభివృద్ధి ఆవిష్కరించి చూపించాడు. సంక్షేమం అందించి చూపించాడు. తెలంగాణ చీకట్లు పారద్రోలాడు. ఇది నిజం. ఈ మాటలు ఉద్యమ సమయంలోనే పదేపదే కేసిఆర్‌ చెప్పారు. కాని నాటి సీమాంధ్ర నేతలు ఎద్దేవా చేస్తూ వుండేవారు. తలాపున గోదారి పారుతున్న చుక్క గొంతు తడపదు. సింగరేణి సిరులెన్ని తెలంగాణలో వున్న పల్లెలో వెలుగు నిండదు. అందుకే తెలంగాణ అన్నది ఉద్యమ కాలం నాడు కేసిఆర్‌ చెప్పిన మాట. తెలంగాణ వస్తే మన మాగాణాలు పచ్చని పైట పర్చుకుంటాయి. మన పల్లెలు సింగరేణి వెలుగులతో చీకటిని పారద్రోలుతాయన్నాడు. అలాగే తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో కోతలు లేని కరంటును చూపించాడు. రెండేళ్లలో మొత్తం తెలంగాణ పల్లెలు,పట్టణాలే కాదు, సాగుకు కావాల్సినంత కరంటు ఇచ్చాడు. ఇంటికి ఇరవైనాలుగు గంటల కరంటు లాగే, సాగుకు కూడా ఇరవై నాలుగు గంటలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లే అన్నవారే నోరెళ్లబెట్టి చూసేలా చేశాడు. తెలంగాణలో వెలుగులు ఆవిష్కరించాడు. తనేంటో నిరూపించాడు. అదే దారిలో ఎండిన చెరువులు తప్ప నీటి జాడలు లేని దగ్గర మళ్లీ చెరువులు తవ్వించాడు. పూడికలు పూర్తిగా తీయించి, గోదారి నీళ్లతో నింపేశాడు. మండుటెండల్లో కూడా చెరువులన్నీ కళకళలాడేలా చేశాడు. తెలంగాణలో నీటి గోసలు తీర్చాడు. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత వేగమైన ప్రగతి శీల భావనను ఆచరించి చూపించాడు. మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం చేసి ప్రపంచమే అబ్బురపడేలా చేశాడు. లక్షల ఎకరాలకు నిరంతరం నీటిని అందిస్తున్నాడు. ఒకనాడు కోనసీమ గురించి చెప్పుకున్న ప్రజలు ఇప్పుడు తెలంగాణ సిరిసంపదలను గురించి చెప్పుకుంటున్నారు.
ఇక సంక్షేమాల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని కళ్యాణ లక్ష్మి అనే పధకంతో పది లక్షల మంది పేదింటి అమ్మాయిల పెళ్లి చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. అలాంటి పథకమొకటి సృష్టించొచ్చుని కనిపిపెట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆచరించి చూపుతూ పేదింటికి పెద్ద కొడుకైన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అలాగే రైతు పడే కష్టం. ఆరుగాలం అవస్ధలు. తీరా పంటచేతికొచ్చేముందు కష్టాలు. నష్టాలు. ప్రకృతి కన్నెర్రలు. అకాల వర్షాలు. వడగండ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు అడుగడుగునా గండాలే. అయినా దేశాన్ని పోషిస్తున్నది రైతన్నే. ఆ రైతు సంతోషమే రాష్ట్ర సంతోషం. ఆ రైతు ప్రగతే తెలంగాణ ప్రగతి అని నమ్మే కేసిఆర్‌ రైతు బంధువు అయ్యాడు. నాలుగేళ్లుగా రైతు బంధు అమలు చేస్తున్నాడు. ఇలాంటి ప్రగతి బాటలు దేశంలోనూ పడాలి. అందుకే కేసిఆర్‌ దేశ రాజకీయాల్లో క్రియాశీలం కావాలి. వాటిని ప్రభావితం చేయాలి. రెండేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలు, దేశంలోనూ అమలు చేస్తే దేశం ప్రపంచలోనే ఎందుకు నెంబర్‌ వన్‌ కాదో చూపిస్తానని ప్రతినభూనాడు. తెలంగాణ జన నేత, దేశ నేతగా ఎదిగితే దేశ రాజకీయ ముఖచిత్రమే కాదు, ఆర్ధిక ముఖచిత్రంలోనూ మార్పులొస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచమంతా మన వైపు చూస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జై కేసిఆర్‌ అని అంటున్న తెలంగాణకు తోడు దేశమంతా అనే రోజు వస్తుందని ఎదరుచూద్దాం…మాది తెలంగాణ అని సరగర్వంగా తలెత్తుకుందాం.

ద్వైతాద్వైతవిశిష్టాః

` ఆత్మలో లీనమైన పరమాత్మే అసలైన లోకం


` ప్రకృతిని తనలో నిక్షిప్తం చేసుకున్న దేవుడే ఈ ప్రపంచం
` నిజమే జీవిత సత్యం…
` నిజంలోనే మనిషి బతకాలి.
` నిజమే జీవితమై బతకాలి.
` నిజాన్ని నమ్మిన వాస్తవ ప్రపంచం మనం కావాలి.
`నిజాన్ని రక్షించే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి.
` నవ్వు నిజాన్ని రక్షిస్తే, అది నీకు రక్షణగా నిలుస్తుంది.
` ముచ్చింతల్‌లో శ్రీరామ నగరం అందంగా ముస్తాబు
` అంగరంగ వైభవంగా నేటి నుంచి వేడుకలు
` పది రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో అలరాడనున్న ప్రాంగణాలు
` ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోడీ హజరు, విగ్రహావిష్కరణ
` 12న రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్‌ సందర్శన. ముగింపు ఉత్సవాలు.
` రామానుజాచార్యుల సహాస్త్రాబ్ది ఉత్సవాలు నేడే ప్రారంభం.
తర్కం చాలా విచిత్రంగా వుంటుంది. గందగోళంగానే వుంటుంది. అర్ధమైనట్లే అనిపిస్తుంది. ఆ క్షణం గడిస్తే ఏం అర్ధం కానట్లేననిస్తుంది. ఎంత విడమర్చి చెప్పినా ఏదో సందేహం వ్యక్తమౌతుంది. అదే శాస్త్రం. అందుకే తర్కాన్ని ఎప్పుడూ నేరుగా చెప్పొద్దంటారు. వెయ్యేళ్లు గడుస్తున్నా ఇంకా కొన్ని తర్కాలు జనంలో నానుతూనే వున్నాయి. ఆచార వ్యవహారాలుగా అనుసరింపబడుతున్నాయి. వాటి వెనకున్న దైవాలను కొలుస్తున్నాయి. అవి వాటి గొప్పదనమే కాదు, అందించిన మహానుభావులు నిర్ధేశించిన జీవితం సత్యం కూడా…ఎంతో గొప్పది. అందుకే వాటిని మరో వెయ్యేళ్లు ప్రజలు ఆచరిస్తూ, అసతోమా సర్గమయా, తమసోమాజ్యోతిర్గమయా…అంటూ విరాజిల్లాలి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నేడు సమతామూర్తి రామానుజాచార్యుల సహస్త్రాబ్ధి ఉత్సవాలు మొదలుకానున్నాయి.శ్రీశ్రీశ్రీ తిండండి చినజీయర్‌స్వామి నేతృత్వంలో శ్రీరామ నగరం రూపుదిద్దుకున్నది. అక్కడ ఏర్పాటు చేసిన 261 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహం వెయ్యేళ్లైనా చెక్కుచెదరని విధంగా తయారు చేయబడిరది. ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరం శోభాయమానంగా రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అంకరణలు జరుపుకున్నది. ఎటు చూసినా భక్తి పారవశ్యం నింపే ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. అయితే అసలు వెయ్యేళ్ల తర్వాత కూడా రామానుజాచార్యుల బోధనలు ఏమిటన్నది ఓసారి మననం చేసుకుందాం…
మన కళ్లకు కనిపించేందంతా వాస్తవం. ప్రతీది నిజం. మనం నిజంలో బతకాలి. నిజంలోనే జీవించాలి. నిజమే జీవితం చేసుకోవాలి. నిజాన్ని ఎల్లప్పుడూ రక్షించాలి. నిజాన్ని మనం రక్షిస్తే మనల్ని నిజం రక్షిస్తుంది. ఇది తెలియాలంటే అంతకు ముందు సమాజానికి మధ్వాచార్యులు చెప్పిన ద్వైతం తెలియాలి. ద్వైతం అంటే రెండు. ఆత్మ, పరమాత్మ అనేవి రెండు. జీవుడు, జీవాత్మ అన్నవి రెండు. ప్రకృతి, దేవుడు రెండు. ఇలా ప్రపంచంలో ఏదేని వస్తువైనా రెండు రకాలుగా కనిపించొచ్చు. ఆకాశంలో ఒకరికి మేఘాలు ఐరావతంలా కనిపించొచ్చు. మరొకరికి మరో రూపంలో కనిపించొచ్చు. అంటే జీవాత్మ, పరమాత్మ అన్నవి రెండూ వున్నాయని అందరూ నమ్మాలి. అదే ఆచరించాలని మధ్వాచార్యులు చెప్పారు. ఆత్మ అన్నది నిత్యమని, సత్యమనిదానికి మరణం లేదని, దేవుడిలో లీనమైనా, అదెప్పుడూ సజీవమే అన్నది మధ్వాచార్యులు చెప్పిన సందేశం. నీవు దైవం. నేను జీవం. దేవుడు గురువు. మనిషి శిష్యుడు. జీవాత్మ, పరమాత్మ అన్నది వేర్వేరు తెలుసుకోవాలి. కంటికి కనిపించేదైనా, కనిపించనిదైనా వాసుదేవుడి మీద ఆధారపడి వుంటుందనేది చెప్పేదే ద్యైతం.
ఇక అద్యైతం. బాషా పరంగా ద్వైతం కానిది. రెండు కానిది. అంటే ఒక్కటి. సృష్టింతా ఒక్కటే. జీవుడైనా, దేవుడైనా ఒక్కటే. జీవితం…జీవాత్మ, పరమాత్మలు వేరు వేరు కాదు. రెండూ సమ్మిళితమే. రెండూ ఒక్కటే. అందుకే దేహోదేవాలయోస్రోప్తో జీవో సనాతనహాః…అన్నది శంకరాచార్యుల అద్యైతం. అంటే దేవుడు. జీవుడు ఒక్కడే. జీవాత్మనే…పరమాత్మ. పరమాత్మలేని జీవుడు లేడు. జీవుడు లేని పరమాత్మ కూడ లేడు. బ్రహ్మ ఒక్కడే దేవుడు. బ్రహ్మ జ్ఞానమే మనిషి రూపం అన్నది శంకారాచ్యులు చెప్పిన సందేశం. కాని అది అందరూ నమ్మలేదు. సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గలేదు. మరింత పెరిగాయి. చెప్పుకోవడానికి బాగానే వున్నా, అసమానతలు అంతర్లీనంగా వున్నాయి. అహం బ్రహ్మాస్మి…అని శంకరుడు అన్నట్లు అందరిలోనూ అహం పెరిగితే, నేనే గొప్ప అన్నది ఉద్భవిస్తుంది. అసమానతలు పెరిగిపెద్దవౌతాయి. మరెలా అనుకున్నప్పుడే విశిష్టాద్వైతం అన్నది ప్రచారంలోకి వచ్చింది.
ఇక విశిష్టాద్వైతం. దేవుడు వేరు. జీవి వేరు. ప్రకృతి వేరు. పంచ భూతాలు వేరు. అన్ని ఒకదానితో ఒకటి లీనమై, విలీనమై, ఏకమై ఒక్కటై విశ్వమంతాటా వ్యాప్తి చెంది వున్నాయన్నది దీని అర్ధం. జీవుడు. ప్రకృతి. ఈశ్వరుడు అన్నీ సత్యాలే అన్నది రామానుజుడు చెప్పిన సిద్దాంతం. మన శరీరంలో జీవుడున్నట్లే, శ్రీమన్నారయునుడు కూడా వున్నాడని చెబుతుంది. జీవుడు వేరు. బ్రహ్మ వేరు. జీవుడు మిథ్య కాదు. ఈ ప్రకృతిలో జీవ భిన్నత్వమే తప్ప, జీవ బేధం లేదు. విశిష్టాద్వైతం ప్రకారం దేవుడు ఒక్కడే. అతను నారాయణుడే. జీవి, ప్రకృతి ఒకే కొమ్మకు పూచినవి. పరమాత్మనుంచి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ చివరకు పరమాత్మ సన్నిధి చేరడంతో మోక్షం సిద్ధిస్తుంది. ఆ మోక్షానికి అచంచలమైన విష్ణు భక్తే ముక్తి మార్గమని అందరూ నమ్మాలి. భగవంతుని శరణాగతి ప్రతి జీవికి అవసరం. మానవులంతా సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. మోక్షంలోనే ఏ వివక్ష లేదు. కుల, లింగ వివక్షలు వుండవు. ఒక్కసారి జీవాత్మ, పరమాత్మ చెంతకు చేరితే దానికి ఎలాంటి మాలిన్యం వుండదు. కొత్తగా అంటదు. అటువంటుప్పుడు జీవుల్లో ఎందుకు ఈ వ్యత్యాసం. ఎందకీ వైరుద్యం. ఎందుకీ విపరీతం. అన్నది ప్రచారం చేయడమే విశిష్టాద్యైత మూల సూత్రం. దైవారాధనకు అందరూ అర్హులే. దైవం ముందు అందరూ సమానులే. ఈ లోకంలో అందరూ ఒక్కటే. ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. నారాయణుడే సృష్టి స్ధితి లయకారకుడు. జీవుడు చిత్తు. అచిత్తు ప్రకృతి. రెండూ నారాయణ స్వరూపాలే. అభిగమనము. ఉపాదానము. ఇజ్యము. స్వాధ్యాయము. యోగాలకు అందరూ అర్హులే. ఇదే విశిష్టాద్యైతానికి మూలం. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన. సందర్భం చెప్పుకోవాలి. సహజంగా ఏ ఉపాసకుడైనా, ఏ యోగి అయినా, ఏ బోగి అయినా, ఏ స్వామి అయినా సరే గురూపదేశం బైటకు చెప్పరు. కాని రామానుజాచార్యులు చెప్పారు. ఇదే ఆయన విశిష్టాద్వైతాన్ని ఇంకా ప్రజల్లో వెలుగొందేందుకు కారణమైంది. మనుషులంతా ఒక్కటే అన్నాడు. సమాజమంతా ఏకం కావాలన్నాడు. అందరూ ఒక్కటైనే ప్రపంచం అన్నారు. ఆయన గురువైన యమునాచార్యులు తనకిచ్చిన ఉపదేశాన్ని అప్పటికప్పుడు ప్రజలకు చెప్పాడు. నిజానికి గురూపదేశాలు చెప్పరని తెలుసు. కాని ఆ మంత్రమేమిటో ఆలయ గోపురమెక్కి అందరికీ వినిపించేలా చెప్పాడు. జగత్‌ప్రసిద్దంచేశారు. గురువు చెప్పిన మంత్రం నమో…నారాయణాయః అని అందరూ పటించాలని, పాటించాలని కోరాడు. అంటే అంటే జనులందరికీ దేవుడు మోక్షం ప్రసాదించాలని, నమో నారాయణాయః మంత్రం పటించి మోక్షసిద్ది పొందాలన్నది ఆయన అభిమతం. ఇటు జీవిగా, అటు ఆత్మగా దేవుని దృష్టిలో అందరూ సమానమైనప్పుడు, సమాజంలో హెచ్చుతగ్గులు వుండకూడదన్నది రామానుజాచార్యుల ఉపదేశం. వెయ్యేళ్ల క్రితమే మనుషులంతా ఒక్కటే అని చెప్పిన రామానుజాచార్యుల మాటలు ఇంకా ఈ సమాజంలో అనుసరించడం లేదు. అది పోవాలి. హెచ్చుతగ్గులు రూపు మాపిపోవాలి. అందరం ఒక్కటే అన్న భావన అందరిలోనూ కలగాలి. మనమంతా ఒక్కటే అన్న భావన అందరిలోనూ ఉదయించాలి. అదే అనుసరించాలి. ఇదే రామానుజాచార్యులు చెప్పింది. శ్రీశ్రీశ్రీ తిండడి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ప్రచారం చేస్తోంది. అనుసరించి, ఆచరించి సమసమాజం నిర్మిద్దాం.

*మనసున్న మారాజు కేసీఆర్*

★ గ్రానైట్ పరిశ్రమలకు జీవం పోశారు

★ స్లాబ్ విధానం కొనసాగింపు గొప్ప నిర్ణయం

★ సీఎం చిత్ర పటానికి పాలాబిషేకం

సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రానైట్ పరిశ్రమ కు పాత పద్దతిలో స్లాబ్ విధానం, 40 శాతం రాయితీ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఖమ్మం జిల్లా గ్రానైట్, స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది.

మంగళవారం ముదిగొండ పారిశ్రామిక వాడలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి గ్రానైట్ యజమానులు పాలాబిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గాయత్రి రవితో పాటు అసోసియేషన్ నాయకులు పారా నాగేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ, తమ్మినేని వెంకట్రావు, తుళ్లూరు కోటేశ్వరరావు, సాదు రమేష్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కోవిడ్ తో గ్రానైట్ పరిశ్రమ కుదేలైందని.. కొనుగోలు దారు లేక.. ఎగుమతులు నిలిచిపోయి.. రోడ్డున పడే స్థితికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో టన్నేజి విధానం అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఇది గ్రానైట్ పరిశ్రమకు విలువైన ఉపశమనం అని అభిప్రాయపడ్డారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ల సహకారం వల్లే పరిశ్రమకు మేలు జరిగిందని అన్నారు. దీని వల్ల గ్రానైట్ మీద ఆధారపడ్డ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని లక్షలాది కుటుంబాలకు మేలు జరుగిందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రానైట్ పరిశ్రమలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను కూడా సీఎం కేసీఆర్ కు విన్నవించి పరిష్కరించుకుంటామని చెప్పారు. 40 శాతం రాయితీ, స్లాబ్ సిస్టం కొనసాగింపు నిర్ణయం అమలుకు సహకరించిన మంత్రులు పువ్వాడ, ఎర్రబెల్లి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా, ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిలకు వారు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి రాష్ట్రం వ్యాప్తంగా అభినందన సభలు నిర్వహిస్తాం అని నాయకులు ప్రకటించారు.

కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు పాటిబండ్ల యుగంధర్, ఫణి కుమార్, దొడ్డా రమేష్, మంకెన శేఖర్, ఎస్. కె. ఖాసిం, గీతా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఆమెకు 6 కోట్ల ఇళ్ళా..?

`ఒక ఉద్యోగికి సాధ్యమేనా?


`కనీసం కిరాయి కూడా కష్టమే కదా?
`ఆమెకు మాత్రమే ఎలా సాధ్యమైంది?


` ఉమ్మడి మూడు జిల్లాలనుంచి సమర్పణలు?
`నెల నెల టంఛన్‌గా మామూళ్లు?
` నేరుగా అందెదెవరికీ కనిపించదు?
` ఒక్క ప్రమోషన్‌ వస్తే చాలు…ఇక నాకు అడ్డే వుండదు?
` నాపై మాట్లేడే శక్తి ఏ ఉద్యోగికీ లేదు?
`వాళ్లచేత అవినీతి చేయించేది, కాపాడేదీ మేమే?
` పై స్ధాయిలో ఉన్నాం ఊదేస్తాం?
` మీడియా వందల సార్లు రాసింది..ఏమైంది?
హైదరాబాద్‌, నేటిధాత్రి:
ఇలా ఒక శాఖలో పై స్ధాయిలో కూర్చున్న ఉద్యోగులు మాట్లాడుతుంటే కింది స్ధాయి అధికారులకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు? ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు!… అవినీతి సంపాదన అంటే అత్తగారింటి నుంచి అందే లాంఛనాలనంత సింపుల్‌గా వసూలు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించేవారిని కూడా పై స్ధాయిలో కూర్చొని వారిచేత అవినీతిని కొందరు ప్రోత్సహిస్తున్నారు?
ఆ అధికారి ఉద్యోగం కరీంనగర్‌. అదనపు బాద్యతలు రంగారెడ్డి, ఆదిలాబాద్‌. అయినా ఆమె నివానముండాల్సింది కరీంనగర్‌. కాని వుండేది హైదరాబాద్‌. కార్యాలయాలకు వచ్చేది లేదు? కార్యాలయాల్లో కూర్చొని ఫైళ్లు చూసేది లేదు? అదనపు బాధ్యతల పేరుతో తిరుగుతున్నట్లు చెప్పుకోవాలి. హైదరాబాద్‌లో ఉంటూ మామూళ్లతో వచ్చిన ఫైళ్లు క్లియర్‌చేయాలి? అయితే ఇక్కడే అసలు గుట్టు దాగి వుంది. హైదరాబాద్‌లో ఇల్లు సామాన్యమైంది కాదు. అసామాన్యమైంది. అదో అందమైన, అతి ఖరీదైన భవంతి? ఆ ఏరియాల్లో అతి సంపన్నులు మాత్రమే ఉండగలిగే ప్రాంతం. ఎంత లేదన్నా ఆ విల్లా ఖరీదు రూ.6 కోట్లుకుపైగానే వెచ్చించి, చెల్లించి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె అక్కడి నుంచి కదలరు. విధులు కూడా అక్కడ నుించే నిర్వహిస్తారు. ఇటీవల కరోనా కాలం కావడం కూడా కలిసి వచ్చినట్లుంది? ఇదో సాకు కూడా ఉపయోపగడుతోందన్నది ఉద్యోగులు చెప్పుకుంటున్న మాట. సహజంగా ఒక ఎంత పెద్ద ఉన్నతోధ్యోగి అయినా అంత పెద్ద, ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయడం సాధ్యం కాని పని. అంతే కాదు అలాంటి ఇంటికి కిరాయి చెల్లించడం కూడా అసాధ్యమే. కాని ఆమెకు సాధ్యమౌతోంది. కిరాయి చెల్లించేందుకు కాదు…ఏకంగా కొనుగోలు చేసి నివాసముంటోంది? మరి ఒక అధికారికి ఇంత సంపాదన ఎలా సాధ్యమన్నది మాత్రం ఆ శాఖ చూస్తున్న పెద్దలే చెప్పాలి.
తప్పు చేస్తే క్షమించేది లేదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. రిజిస్ట్రేషన్‌ శాఖ కమీషనర్‌ అవినీతిని సహించని, చీల్చి చెండాడే చండశాసనుడు. అయినా సరే ఆయనేం చేయలేరని ఓ ఉన్నతాధికారి ఉద్యోగులతోనే చెబుతోందని తెలిసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్‌తో ఐజిని అవుతానంటున్నారు. ఇప్పటికే నా చేతిలోనే మూడు జిల్లాలున్నాయి. ఎవరైనా తప్పు చేసి పట్టుబడితే విచారణ చేసే స్ధాయిలో ఉన్న నాపై విచారణ అన్నది అసాధ్యమైన విషయం. ఐజి కూడా నన్ను ప్రశ్నించలేరు. వివరణ అడిగే పరిస్థితి లేదు. అయినా మేం నేరుగా ఎక్కడా రూపాయి తీసుకున్నట్లు కనిపించదు. కింది స్ధాయినుంచి వచ్చే వాటాలు, వసూళ్లు, మమాళ్లు గురించి అందరికీ తెలిసిందే…వాటిపై మీడియా అనేక సార్లు రాసిందే…ఏమైంది? నా ఉద్యోగానికేమైనా ఇబ్బందైయ్యిందా? నాకు నోటీసులైనా ఇచ్చారా? ఇవ్వడానికి పైన ఎవరూ లేరు? మేమే సుప్రిం? మేం చెప్పిందే వేదం? మేం రాసిందే లెక్క? మేం చూపించిందే ఆదాయం? మేం ఎవరికి సర్టిఫికెట్‌ ఇస్తే వాళ్లే ఉద్యోగులు? కేసులున్నా సరే…మా ఆశీస్సులుంటే చాలు…వారికి మేం రక్ష…వారి నుంచి మామళ్లు వసూళ్లు మాకు సంపాదన. ఇదీ కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో జరుగుతున్న తంతు…
కొందరు అధికారులు తప్పు చేయడం కూడా తమకున్న హక్కు అన్నంత దోరణిలో వున్నారని అంటున్నారు. తప్పు చేస్తున్నామన్న కించిత్‌ భావన కొంత మందిలో ఉద్యోగుల్లో లేనట్లుంది. నేరం చేస్తున్నామన్న భయం లేదు. శిక్షను అనుభవించాల్సివస్తుందన్న బాధ లేదు. ఎందుకంటే ఉన్నత స్ధాయిలో వున్న తమను పట్టుకునే అవకాశం లేదని వారి నమ్మకం. అతి విశ్వాసం. కిందిస్ధాయి ఉద్యోగులు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపు శాఖ ఆదీనంలో అనేక కార్యాయాల్లో కింది స్ధాయి ఉద్యోగులు సాంపు పేపర్లు మాయం చేయడం తెలిసిందే. లక్షలకు లక్షలు లూటీ చేసింది వింటున్నదే. అలాంటి ఉద్యోగుల చేత చేయించాల్సిన తప్పులు చేయిస్తున్నది పై స్ధాయిలో వున్న కొంత మంది ఉద్యోగులే అన్నది చిరుద్యోగుల వాదన. ఏ కింది స్ధాయి ఉద్యోగి అంతటి ధైర్యం చేసే ప్రసక్తి వుండదని, నయానో, భయానో చేయించేది పై స్ధాయిలో వున్న వాళ్లే అన్న ప్రచారం కూడా వుంది. కింది స్ధాయి ఉద్యోగులు పై స్దాయి వాళ్లు చెప్పినట్లు వినకపోతే ఏదో రకంగా ఇరికిస్తారు? అదో భయం. వింటే ఏదోనాడు ఎప్పుడో ఒకనాడు దొరుకుతాం? కాకపోతే మళ్లీ కాపాడేది వాళ్లే కదా? అన్న నమ్మకంతో కూడా ఉద్యోగులు తప్పు చేస్తున్నారని అంటున్నారు. అయితే వాటాలు పంచుకున్నప్పుడు పెద్ద చేతులతో తీసుకునే పై స్ధాయి ఉద్యోగులు, దొరికనప్పుడు మొత్తం కింది స్ధాయి ఉద్యోగుల నుంచే వసూలు చేయిస్తుండడంతో చిరుద్యోగులు బలైతున్నారు. ఆపై తప్పు చేయకుండా వుండేలేకపోతున్నారు? పై స్ధాయికి నెల నెలా మామూళ్లు వసూళ్లు చేసి పంపక మానలేకపోతున్నారు. ఇదే ఈ కరీంనగర్‌ జిల్లా స్ధాయి ఉన్నతాధికారికి వరమైంది. గతంలో దొరికి, దోషిగా నిలబడ్డాడు సురేష్‌. మళ్లీ అధికారి ఆశీస్సులతో ఉద్యోగంలో చేరాడు. ప్రమోషన్‌ కూడా కొట్టేశాడు. ఇప్పుడు కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో వున్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయానుంచి మమూళ్లు వసూలు చేసి, నెల నెల అందించే బాధ్యతలో సురేష్‌ తరిస్తున్నాడని శాఖలోని అనేక మంది అధికారులు కోడై కూస్తున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు సురేష్‌ చేతికే విచారణ ఫైలు అందించి, ఆయన చేతే మామళ్లు వసూలుచేయించి, నెల నెల దండుకోవాల్సింనంత దండుకుంటున్న అధికారి తనను ఎవరూ ఏం చేయాలేరని కూడా అంటోందట?. కమీషనర్‌ ఏం చేయలేడని అంటోందని ఉద్యోగులే చెబుతున్నారు. ఒక్క ప్రమోషన్‌తో ఇక ఐజిని కావడమే వుందని అంటున్నారట. కమీషనర్‌కూడా నన్ను ఒక్క మాట కూడ అనలేని స్ధాయిలో వుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరి ఆమె ధైర్యమేటిటో? ఆ లెక్కేంటో ప్రభుత్వం తెలుసుకుంటే గాని అసలు బాగోతం బైట పడదు. ఆమె ఆగడాలకు , మమూళ్ల బండారం తెరతీయబడదు. ఇలా ఒకరిని చూసి ఒకరు రిజిస్ట్రేషన్‌ శాఖలో ఖజానేకే కన్నం పెడుతుంటే వారిని శిక్షించేవారే లేకపోతే విజిలెన్స్‌ అనేది ఎందుకు? ఆ పేరుతో అదే పెద్దలకు విచారణ బాధ్యతలు అప్పగించడం ఎందుకు? మరింత దోచుకొమ్మని దారి చూపడానికా? అయినా ఇలా విచ్చలవిడి సంపాదన జరుగుతుందని తెలిసినా పట్టించుకోకపోవడంలో ఆ శాఖ ఉద్దేశ్యమేమిటో కూడా ప్రజలకు తెలియాల్సిన అసవరం లేదా? ప్రభుత్వం ఇకనైనా దృష్టిపెట్టకుండా వుంటే ప్రజలు తిట్టుకునేది ముందు ప్రభుత్వాన్నే…ఆ తర్వాతే ఉద్యోగులను అన్నది తెలుసుకోలేకపోతే…మేలుకోకపోతే ప్రభుత్వ ఖజాన ఆగమౌతుంది. అధికారపార్టీకే తీరని నష్టం ఏర్పడుతంది. ఒక్కసారి అటు వైపు చూడండి. సంబంధిత మంత్రి జోక్యం చేసుకుంటేగాని పరిస్థితుల్లో మార్పు రాదు. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష నాయకులు కూడా స్పందిస్తేగాని రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగి అవినీతికి అడ్డుకట్ట పడదు.

సిద్దిపేటలో గన్ ఫైర్

సిద్దిపేటలో గన్ ఫైర్
రూ.43 లక్షలు ఎత్తుకెళ్లిన ఆగంతకులు
సిద్దిపేట నేటిధాత్రి|:సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు..

వివరాల్లోకి వెడితే.. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వచ్చారు. ప్లాట్ విక్రయ డబ్బులు రూ.43 లక్షలు కొనుగోలు దారు నుంచి నర్సయ్య తీసుకొని డ్రైవర్ కు ఇచ్చి కారులో పెట్టాడు. సంతకం చేయడానికి నర్సయ్య ఆఫీస్ లోపలికి కెళ్లాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్ పై వచ్చి ఇన్నోవా కారు అద్దాలు పగుల కొట్టి డ్రైవర్ తొడపై గన్ తో కాల్చాడు.. మరో వ్యక్తి మరోవైపు నుంచి కారు దొర్లు తీర్చి 43 లక్షల నగదు ఎత్తుకొని ఇద్దరు ఆగంతకులు బైక్ పై పారిపోయారు. కాల్చిన గన్ ని వారు ఆ కారులోనే వదిలి వెళ్లారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదప డుతాయి

క్రీడలు దేహదారుడ్యాంతో పాటు

 మానసిక ఉల్లాసానికి దోహదప డుతాయి

చెన్నారావుపేట-నేటిధాత్రి:క్రీడాలు దేహదారుడ్యాం తోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు మండలంలోని బోజెర్వ్ గ్రామ శివారులో ని జగ్గూతండాలో మల్కిశ్రీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మోహన్ ,అంగోతు భద్రయ్య , వారి ఆర్థిక సౌజన్యంతో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరై మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో పోటీతత్వం తో పాటు స్నేహపూర్వక సంబంధాన్ని పెంచుకుంటూ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. క్రేడల్లో గెలుపు ఓటములు సహజమని ఒడినవారు నిరుచ్చహపడకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన అన్నారు.మారుమూల ప్రాంతమైన జగ్గూ తండాలో క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న గౌడ్, జడ్పిటిసీ పత్తినాయక్,స్థానిక సర్పంచ్ విజయ భిక్షపతి, ఉపసర్పంచ్ సతీష్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు కుండే మల్లయ్య,,రైతు బంధు మండల కన్వీనర్ బుర్రి తిరుపతి,అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి,మండల యువ నాయకులు కంది కృష్ణ చైతన్య , మోగిలి కేశవ రెడ్డి రైతు కోర్దినేటర్ కొండవీటి ప్రదీప్ కుమార్,గట్ల రాంబాబు,శ్రీధర్ రెడ్డి, పిల్లల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

మేడారం డైరెక్టర్కు ఆత్మీయ మిత్రులకు సన్మానం

మేడారం డైరెక్టర్ కు ఆత్మీయ మిత్రులకు సన్మానం

ములుగు, నేటిధాత్రి :వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీ దేవి పేట గ్రామంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ తండ రమేష్ క్లాస్మేట్ లు ( ఆత్మీయ మిత్రులు) సోమవారం పూల గుచ్చం అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. పెండ్యాల సలేందర్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా, గ్రామ సర్పంచ్ గట్టు కుమారస్వామి ఎంపీటీసీ పత్రి లక్ష్మీ దశరథం, కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ అహ్మద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రమేష్ ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులు అందరికీ ఉంటాయని అన్నారు. తల్లి సన్నిధిలో సేవ చేయడం అదృష్టం అని వారు తెలిపారు. అమ్మవార్ల ఆశీస్సులతో లక్ష్మీదేవి పేట గ్రామము మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీర గాని సాంబయ్య, సూర్యనేని మురళీధర్ రావు, ముడిగే రాజు కుమార్, అంతటి రాము, గట్టు శ్రీను, నడి గట్టు సుదర్శన్, బొడ్డుపల్లి స్వామి, మడి పోజు రాధాకృష్ణ, రేపాల సత్యనారాయణ, పెంట ఐలయ్య, వీరగాని ఆనందం, కాసాని శ్రీహరి, కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి. సర్వర్ అహ్మద్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ తండ నగేష్ డైరెక్టర్లు చంద్రగిరి రాజయ్య, ఎంబటి సదయ్య, ఉప సర్పంచ్ అజ్మీర హరీష్, ఎండి సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

ప్రారంభానికి ముందే పెచ్చులు

కొండపాక మండలం దుద్దెడలో దుస్థితి

 కొండపాక నేటిధాత్రి:నెరవేరని నిరుపేదల కల…? లబ్ది దారుల ఎంపిక లో జాప్యం !!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన భవనాలు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుగా సాగడం లేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదల సోంతిటి కల ఎప్పుడు నేర వేరుతుందో అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నరు.

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం

నేటిధాత్రి కొండపాక:అసలే పేదరికం.. ఆపై తల్లిదండ్రుల అనారోగ్యం …ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి తల్లిదండ్రులకు కష్టంగా మారింది. దీనిని గుర్తించిన ఆపన్న హస్తం మిత్ర బృందం ఆర్థిక సహాయం అందించి తమ గొప్పతనాన్ని నిరూపించుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి సుజాత యాదగిరి కూతురు శివాని పెళ్లికి కి రూ 34000 విలువచేసే వంటింటి సామాగ్రి ఇతర వస్తువులు అందజేశారు. బృందం సభ్యులు తమ ఆర్థిక స్తోమతను బట్టి విడిగా ఆర్థిక సహాయం అందించి శివాని పెళ్ళి పెళ్లి పెద్దలు అయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలచంద్రన్ కార్యదర్శి శ్రీనివాస్ పాటు శ్యాం ప్రసాద్, సాయి, స్వామి మల్లేశం అక్బర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ కారులో బొంతు కిరికిరి!?

అనుచరులు జారిపోగళ్ల జాగ్రత్త బేతి!?

బేతికి ఎర్త్ పెట్టేందుకు బొంతు బిజీబిజీ?

గతంలోనే ఉప్పల్ టిక్కెట్ కోసం అలక?

ఆఖరు దాకా కొట్లాట?

ఈసారి టిక్కెట్ నాకే?

ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టు”కొనుట”!?

బేతి అనుచరులకు గాలం?

వ్యతిరేకుల చేత పెంచనున్న గళం!?

పరాయి పార్టీకైనా సపోర్ట్ చేస్తా!?

నాకు రాకుంటే బేతిని ఓడిస్తా?

ఉప్పల్ లోనే ఇక మకాం వేస్తా?

తాడో పేడో తేల్చుకుంటా!?

ఇక బేతి మీదే గురి, ఉప్పల్ ఇక నాదే మరి!?

కొత్త రాజకీయానికి తెరతీత…కోవర్టు రాజకీయాలకు మేత…సొంత పార్టీలోనే కుతకుత…బేతికి భవిష్యత్తు లేకుండా చేస్తా!? ఇదీ ఉప్పల్ పై కన్నేసిన బొంతు ప్రతినట? ఉప్పల్ టిఆర్ఎస్ లో గుసగుస….

విద్యార్థి తెలంగాణ ఉద్యమ రాజకీయాలలో ఎవరికీ దక్కని అవకాశం దక్కింది. ఎంతో మంది కలలు గనే హైదరాబాదు మేయర్ పదవి ఎదురొచ్చి వరించింది. పదవులు రాక ఎంతో మంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడడప్పుడా అని ఇంకా కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కానీ మేయర్ పదవిలో వుండగానే బొంతు రామ్మోహన్ కు ఎమ్మెల్యే కావాలని కోరిక కదిలింది. విద్యార్థి ఇతర ఉద్యమకారులలాగా ఏ పదవి రాకుంటే ఏదో పదవి కోసం ఎదురుచూడడం జరిగేది. కాని వెతకని తీగ కాళ్లకు తగిలి మేయర్ అయ్యాడు. వెతికితే ఇంకెంత పెద్ద తీగ తగులుతుందో అని ఆశ పడ్డాడు. ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాడు. పదవిలో వుంటూనే మరో పదవా? ఆశకైనా ఓ హద్దు వుండాలని చాలా మంది చీదరించుకున్నారట అప్పట్లో… అయినా పట్టు వదలని విక్రమార్కుడిని నేను అని అండర్ గ్రౌండ్ కు వెళ్లాడు. పార్టీ కనికరించలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నెర్ర చేశాడు. బేతి సుభాష్ రెడ్డి ఉద్యమ కారుడు. అనేక త్యాగాలు చేశాడు. అంతకుముందు ఎన్నికల(2014)లో పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికలలో బోలెడు ఖర్చు చేసుకున్నాడు. క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ తెలిసి కూడా బొంతు అప్పుడే కిరికిరి పెట్టాడు. అనంతరం మళ్లీ మేయర్ కావాలన్నాడు. పార్టీ ఒప్పుకోలేదు. తన సతీమణిని జిహెచ్ ఎంసి. ఎన్నికలలో నిలబెట్టాడు. అయినా తన ప్రయత్నం తాను చేశాడు. వీలు పడలేదు. తర్వాత కాలంలో ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు కుదరలేదు. కనీసం మేడ్చల్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలని చూశాడు. ఇక ఆఖరు అస్ర్తంగా పార్టీలో చిచ్చు పెడితే తప్ప, ఎమ్మెల్యే కు ఎర్తు పెడితే తప్ప తనకు మార్గం సుగమం కాదని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై ప్రత్యేకంగా, పరోక్షంగా కార్పొరేటర్ శ్రీదేవితో ఆరోపణలు చేయిస్తూనే వున్నారు. కాకపోతే ఇటీవల ఇక పూర్తి స్థాయిలో ఉప్పల్ రాజకీయాలలో బొంతు కీలకం కావాలని నిర్ణయం తీసుకున్నారట.

నాయకుల పెదాలమీద కనిపించే ప్లాస్టిక్ నవ్వులే కాదు, మాటున వాడిన నవ్వులు కూడా దాగి వుంటాయి. పైకి మాత్రమే అలాయ్ బలాయ్..లోపలంతా లడాయే! ఉప్పల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ లో అంతర్గత పోరు శెభాష్ రెడ్డి అని బేతి సుభాష్ రెడ్డి అనిపించుకుంటుండడం కొందరికి ఇష్టం లేదు. ఎలాగైనా బేతి సుభాష్ రెడ్డి పరపతి తగ్గించాలి. పలున చేయాలి. అనుచరులను దూరం చేయాలి. ప్రజల చేత మాటలనిపించాలి. ఇతర ప్రతిపక్షాలను ఎగదోసి వివాదాలు సృష్టింపజేయాలి. అందుకు ఎలాగైనా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచర వర్గాన్ని మచ్చిక చేసుకోవడం, వ్యతిరేక వర్గాన్ని ఎగదోసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతోందని సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి మళ్లీ టిక్కెట్ రావొద్దు. ఎవరు గెలిచినా పరవాలేదు. బేతి సుభాష్ రెడ్డికి టిక్కెట్ రావొద్దు. అసంతృప్తిని ఎగదోయాలి. వాళ్లందరినీ ఏకం చేయాలి. నివురుగప్పిన నిప్పులా ఎన్నికల నాటికి ఒక్కసారిగా బేతిపై తిరుగుబాటు చేయించాలి. టిక్కెట్ దక్కించుకోవాలి. ఇదీ ఓ నాయకుడి పన్నాగం అని విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ నాయకుడు ప్రధమ పౌరుడి స్థానంలో కూర్చున్న సమయంలో బేతికి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు అనేకం చేశాడు. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు, బేతి సుభాష్ రెడ్డి వున్న సాన్నిహిత్యం ముందు ఆ నేత పాచికలు పారలేదు. కుయుక్తులు చెల్లలేదు. అయినా ఆఖరు నిమిషం దాకా ఉప్పల్ టిక్కెట్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. అఖరుకు అలక పానుపు కూడా ఆశ్రయించాడు. కాకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగి భుజ్జగించారు. కానీ ఆ నాయకుడు బేతి సుభాష్ రెడ్డి గెలుపుకోసం పెద్దగా పని చేసింది లేదన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈసారి ఎన్నికల బరిలో దిగాలంటే బేతి సుభాష్ రెడ్డి అనుచరులను దూరం చేయాలి. ఆయన వ్యతిరేకులను ఏకం చేయాలి. నిత్యం మీడియాలో కనిపించాలి. అందుకోసం ఇటీవల ఎక్కడా లేని విధంగా ఉప్పల్ నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు యూనియన్ కార్యకలాపాలను అనువుగా బొంతు మల్చుకునే ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయినట్లు అర్థం చేసుకున్నాడు. ఇక ఉప్పల్ ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ పేరుతో రాజకీయానికి తెరలేపినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ కార్యక్రమాలలో మేయర్. విజయలక్ష్మి. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి పాల్గొనాలి. కానీ మల్లారెడ్డి ఇతర కార్యక్రమాల వల్ల హజరు కాలేదు. బొంతు రామ్మోహన్ ను కూడా జర్నలిస్టులు ఆహ్వనించినట్లు తెలిసి ఎమ్మెల్యే హజరు కాలేదు. మేయర్ రానని ముందే చెప్పేశారు. ఇదే జరుగుతుందని బొంతు ముందే ఊహించాడు. తను హజరై వన్ మ్యాన్ షో చేశాడు. ఇదేదో బాగుందన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. జర్నలిస్టులతో వేదికలు పంచుకుంటూ ఎమ్మెల్యే వ్యతిరేకులతో కలిసి సాగుతూ, తన మార్క్ రాజకీయం ఇప్పటినుంచే మొదలు పెడితే తప్ప క్లైమాక్స్ లో టిక్కెట్ నాకు దక్కదని బలంగా నిర్ణయించుకున్నాడట…పార్టీ పెద్దలు ఆలోచిద్దాం…అని చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారట…!

*మేడారం జాతర సమీక్ష లో వద్దిరాజు రవిచంద్ర*

 

కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
-మంత్రులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన గాయత్రి రవి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పై శనివారం మేడారంలో ఉన్నతా స్థాయి సమీక్ష సమావేశం మంత్రులుతో అధికారులతో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. డిజిపి మహేందర్ రెడ్డిలతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్.ఎర్రబెల్లి దయాకరరావులు సుదీర్ఘంగా చర్చించారు. తొలుత హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.CS సోమేష్ కుమార్.DGP మహేందర్ రెడ్డి లను గాయత్రి రవి పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు…అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో మేడారం జాతర శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు గాయత్రి రవితో అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయించారు .ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు. ఎంపీలు మాలోతు కవిత.పసునూరి దయాకర్.MLC లు కడియం శ్రీహరి. బండా ప్రకాష్.MLA లు సితక్క.గండ్ర వెంకటరమణ రెడ్డి.ములుగు ZP చైర్మన్లు కుసుమ జగదీష్.గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు…

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం

కరీంనగర్ జిల్లా ప్రతినిధి నేటిదాత్రి:తిమ్మాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు నేడు అనగా 29/01/2022 ఉదయం10గం ఉద్యోగాలు కలిపించాలని,నిరుద్యోగ భృతి ఇవ్వలని డిమాండ్ తో మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసామయి క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసిన అన్ని మండలాల అధ్యక్షులకు నియోజకవర్గ కమిటి సభ్యులకు ధన్యవాదాలు తెలియాజేస్తు వెంటనే ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి ప్రకటించాలని ఉద్యోగుల వెంటనే విడుదల చేయలని లేనిపక్షంలో ఏమ్మేల్యేలను రోడ్లమీద తిరగనివ్వమని హెచ్చిరిస్తున్నాం.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు

చెన్నారావుపేట-నేటిధాత్రి:మండలంలోని చెరువుకొమ్ము తండ కు చెందిన.భూక్య నర్సు, వాంకుడోతు శ్రీను.లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ మండల నాయకులు బోడ బద్దు నాయక్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు బోడ బద్దు నాయక్ వారికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదారణంగా ఆహ్వానించి నారు ఈ కార్యక్రమంలో .బోడ రవి నాయక్.వాంకుడోతు బాలు.భూక్య లచ్చిరాం. మోహన్.రాజా.బోడ సాగర్ నాయక్. బోడ మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి

మంగపేట నేటిధాత్రి:మండలంలోని రాజుపేట గ్రామంలో ఉన్న సమ్మక్క సారక్క వే బ్రిడ్జ్ అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలకు తక్కువ లోడుతో వెళ్తున్న టు రసీదులు ఇస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో శుక్రవారం నాడు జిల్లా మెట్రాలజీ అధికారి శ్రీలత సమ్మక్క సారక్క వే బ్రిడ్జి ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వే బ్రిడ్జ్ సరిగాలేదని వేయింగ్ లో తేడాలు ఉన్నందున కేస్ బుక్ చేసి ఇండికేటర్ ను సీజ్ చేసినట్లు తెలిపారు.

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం
-ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్,నేటిధాత్రి:సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్.రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శనివారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందచేసారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 12 మంది బాధితులకు మంజురైన ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయల (5,80,500) చెక్కులను అందచేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, గోగుల రాజు, బుజ్జి వెంకన్న, మందుల రఘు, శంకర్, వెంకట్రాం, ఎలెందర్ మరియు తదితరులు ఉన్నారు.

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత
కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్ట కాలంలో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజ్ తెరాస కవితక్క యువసేన మండల అధ్యక్షులు వేల్పుల సునీల్, జావిద్,ఎమ్ సురేష్ ల ఆధ్వర్యంలో 300 ఎనర్జీ డ్రింక్ బాటిల్ కేసముద్రం విలేజ్ లో ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, ఎంపిటిసిల మండల ఫోరం అధ్యక్షులు సట్ల వెంకన్న, ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షుడు అట్ల శ్రీనివాస్,సీనియర్ నాయకులు నీలం దుర్గేష్, గొల్లపల్లి వీరస్వామి,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట శ్రీను గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు సారయ్య, వార్డు మెంబర్లుతుంపిల్ల వెంకన్న,మేకల సురేష్, శంకర్ నాయక్, బాబుల చేతుల మీదుగా ఎనర్జీ డ్రింక్ ని పేద ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డొనికల రాజు,వేల్పుల వెంకన్న, కీర్తి రజిని, కాడబోయిన కృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version