ఖానాపురం నేటిధాత్రి:ఖానాపురం మండలంలోని రాగం పేట గ్రామానికి చెందిన యాసాల కొమురయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అతని కుటుంబానికి ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఒక క్వింటా బియ్యం పంపించగా సోమవారం రోజు అనగా గురువారం సర్పంచ్ బాషబోయిన ఐలయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపూరి వెంకన్న,దుగ్యాల రాజేశ్వర్ రావు, అన్నెబొయిన లింగయ్య,అన్నెబొయిన ఎల్లయ్య,కప్పల శ్రీనివాస్,తడుగుల సాంబరాజు,కుందనపెళ్లి కృష్ణ గ్రామస్థులు పాలగిన్నారు.
ఖానాపురం నేటిధాత్రి:ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ వారి కార్యాలయం వద్ద ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జనగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాష్ రావు, నర్సంపేట మార్కెట్ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,వారిచే ఆదివారం రోజు నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి పత్రిక అని ఎప్పటికిప్పుడు నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలలో ముందుంటుందని అన్నారు. సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అత్యంత రహస్య సమాచారాన్ని చేరవేస్తూ నిజమైన వార్తలను నిలువెత్తు రూపంగా నేటిధాత్రి పత్రిక అని,సమాజంలో మార్పు తీసుకువస్తూ అన్యాయం జరిగిన చోట ఆపద్బాంధవుడిలాగ ప్రజా సమస్యలను వెంటనే ఉన్నత అధికారులదృష్టికి తీసుకువస్తుంది నేటిధాత్రి పత్రిక అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, వేములపల్లి వాసు, ఖానాపురం నేటిధాత్రి రిపోర్టర్ జగనం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టాగ్ లైన్ ‘చిక్కడు`దొరకడు’? స్టాంపు వెండర్లను ఇరికించాడు? రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్‌కు పెన్షన్ లేకుండా చేశాడు? 16లక్షల స్టాంపు పేపర్లు మాయం చేశాడు? సస్పెండ్ అయినా తిరిగి ఉద్యోగంలో చేరాడు? రెండు కేసులు? రెండు సార్లు జైలు?? కేసు నడుస్తున్నా…ప్రమోషన్? ఇంత వరకు ఏ సినిమాలో చూడని అద్భుతమైన మలుపుల అవినీతి….? తన మీద విచారణ ఫైల్ తన చేతిలోనే??? సహజంగా సర్వే జనా సుఖినోభవంతు అని అందరం అనుకుంటాం. మీ అందర్నీ దోచుకుంటేనే
మేం బాగుంటామని కొందరు అనుకుంటారు? అందులో ఒక్కరు ఆర్వోలో పనిచేసే ఓ సూపర్ సూపరెండెంటు?
అధ్భుతమైన స్క్రీన్‌ప్లేతో తన అవినీతి ఉద్యోగ జీవితాన్ని అందంగా మల్చుకుంటూ సాగుతున్నాడు. తన వద్దకు వచ్చే వారిని అధ్భుతంగా ఇరికిస్తూ, వారిపై నెపం నేట్టేస్తూ అందర్నీ నమ్మిస్తున్నాడు. కేసులైనా, జైలైనా సరే…ఎప్పటికీ వుంటుందా? ఎప్పుడూ అనుభవిస్తామా? సంపాదిస్తే చాలు…అదే మనల్ని కాపాడుతుంది? మేనేజ్ చేసేందుకు ఆ మనీ ఉపయోగపడుతుంది? ఇదీ సదరు ఉద్యోగి ఆలోచనాపర్వం…ఆర్వోలో 16లక్షల మాయానికి శ్రీకారం… కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపు కార్యాలయంలో దశాబ్ధం క్రితం రూ.16లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమయ్యాయి. అందరి చూపు ఒక్కడిమీదే వుంది. అందరి వేళ్లూ అతన్నే చూపిస్తున్నాయి.కాని ఆయన చూపించే వేలుకే పవరెక్కువ అని తేలింది. ఆయన వైపు వేలు చూపించిన వారిని ఇరికించి, వారి లైసెన్సులు రద్దు చేయించాడు. అతని పైఅధికారికి రిటైర్డైనా పెన్షన్ లేకుండా చేశాడు…రెండు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.రెండుసార్లు జైలు జీవితం అనుభవించాడు. కొంత కాలం ఖాళీగా వున్నాడు. పై వాళ్లను ప్రసన్నం చేసుకున్నాడు. తిమ్మిని బమ్మిని చేశాడు. తనదేం తప్పులేదని నమ్మించాడు. ఎంక్వరీ వేసిన అధికారుల చేతనే, పోనీ పాపం అనిపించేలా చేసుకున్నాడు. తిరిగి తన ఉద్యోగం తాను సంపాదించుకున్నాడు. తర్వాత ప్రమోషన్ కూడా పొందాడు. జూనియర్ అసిస్టెంటు నుంచి సీనియర్ అసిస్టెంటు అయ్యాడు. సస్పెన్షన్ తొలగించుకొని ప్రమోషన్‌లో సబ్ రిజిస్ట్రార్ అయ్యాడు. తాగా 317 జీవోతో. డిఐజీ కార్యాలయంలో పోస్టింగ్ కొట్టేశాడు. విచిత్రమేమింటే తన ఎదుర్కొంటున్న విచారణకు సంబంధించిన ఫైలు తన చేతుల్లో పెట్టుకున్నాడు. తనపై విచారణకు ఆదేశించిన పెద్దలందరి సేవలు చేస్తూ తరిస్తున్నాడు. వారి చేత ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే: చాలా ఇంట్రెస్టింగ్ కథ. ప్రతి మలుపులోనూ ట్విస్టులే …ట్విస్టులు…ఎండిరగ్ లేకుండా మలుపులతోనే సాగుతున్న అధ్భుత నిజ కధ…అవినీతి ఎలా చేయాలో…చేసినా ఎలా తప్పించుకోవాలో…సినిమాలో కూడా ఇంతవరకు చూపించనటువంటి కథ. కొన్ని శాఖలకు బాగా తెలిసిన కథ. పాపం ప్రజలే వింటే ఆశ్చర్యపోయే కథ. విస్తుపోయే కథ. ఆయన పేరు…సురేష్…కరీంనగర్ జిల్లాలోని డిఐజి కార్యాలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంటు.ఫ్లాష్ బ్యాక్‌కు ఒక్కసారి వెళితే…వరంగల్ జిల్లాకు చెందిన సురేష్ వాళ్ల తండ్రి సబ్ రిజిస్ట్రార్. ఆయన ఉద్యోగాన్ని కారుణ్యనియాకమంలో తన కుమారుడు సురేష్ ఇచ్చారు. అదే శాఖలో క్లర్క్‌గా కరీంనగర్‌లో జాయిన్ అయ్యాడు. ప్రతి జిల్లా రిజిస్ట్రేషన్, స్టాంపు కార్యాలయంలో రెండు రకాల సెక్షన్‌లుంటాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ (ఏబి) స్టాప్ కౌంటర్. ఒరిజినల్ బ్రాంచ్ (ఓబి)స్టాంప్ కౌంటర్. ఓబి. స్టాంపు కౌంటర్‌లో సురేష్ క్లర్క్. ఈ క్లర్క్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధి విభాగంలో విధులు నిర్వర్తించాడు. కొంత కాలానికి ప్రమోషన్ వచ్చింది. సీనియర్ అసిస్టెంట్ అయ్యాడు. కార్యాలయంలో వున్న పై అంతుస్థులోని ఏబి. కౌంటర్‌కు మార్చబడ్డాడు. కాకపోతే కింద వున్న ఓబి స్టాంపు కౌంటర్ పనులు కూడా అతనే నిర్వర్తించాడు. నిజానికి ఈ పని వదిలేయాలి. ఆ స్ధానంలోకి మరో క్లర్కు వచ్చినా వాటి పర్యవేక్షణ పై వారి ఆశీస్సులతో సురేషేచూసుకుంటూ వచ్చేవాడు. అప్పటి సబ్ రిజిస్ట్రార్‌కూడా సురేష్‌న గుడ్డిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతో స్టాంపు పేపర్ల పర్యవేక్షణలో నిర్లిప్తత వహించాడు. సురేష్ ఏది చెబితే అదే నిజమని నమ్మేవాడు. ఇదే సురేష్‌కు కలిసొచ్చింది. ఆదాయ మార్గానికి సుగమమైంది. ఎన్ని వెళ్తున్నాయి, ఎన్ని ఛలాన్లు వస్తున్నాయన్నదానిపై సురేష్‌ను గుడ్డిగా నమ్మిన సదరు సబ్‌రిజిస్ట్రార్‌కు మోసం చేస్తున్నట్లు ఎప్పుడూ అనుమానం రాకుండా చూసుకున్నాడు. నిజానికి స్టాంపు పేపర్లు గతంలో ఎస్టీవో కార్యాలయంలో ఇచ్చేవారు. రిజిస్ట్రేషన్లు ఇక్కడ, స్టాంపు పేపర్లు అక్కడ కావడంతో అన్నీ ఇక్కడే దొరికేలా ప్రభుత్వం వీలు కల్పించింది. ఇదే సురేష్ లాంటి ఉద్యోగుల పాలటి వరమైంది. ఇంకేముంది. సబ్ రిజిస్ట్రార్‌కు సురేష్ అంటే పూర్తి నమ్మకం ఏర్పడిరది. దాంతో సురేష్ తన చేతి వాటం చూపించడం మొదలు పెట్టాడు. అప్పుడిరత…అప్పుడిరత అన్నట్లు రూ.18లక్షల దుర్వినియోగానికి చేరింది. అది కాస్త ఓసారి బైట పడిరది. నాన్ జ్యుడీషియల్, ప్రాంకింగ్ మిషన్ పేపర్లు సురేష్ మాయం చేశాడని తేలింది. స్టాంపు వెండర్ల నుంచి డబ్బులు తీసుకోవడం…వారికి నేరుగా స్టాంపు పేపర్లు ఇచ్చాడని తెలిసిపోయింది. ఈ విషయం శాఖ పెద్దలకు తెలియడంతో విచారణ చేపట్టారు. జరిగిన అవినీతి నిజమే అని గుర్తించారు.అయితే జరిగిన విషయంలో తాము కలుగ జేసుకోకపోతే ఇది పెద్దదయ్యే ప్రమాదముందని పెద్దలు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా సురేష్‌ను కాపాడే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అప్పటి జల్లా అధికారి రమణారావు ఆశీస్సులతో సురేష్ ఎలా బైటపడాలో సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ఎవరెవరైతే స్టాంపు వెండర్లు డబ్బులు ఇచ్చి, ఛలాన్లు తీసుకెళ్లారో…వారి పేరు మీద పకడ్భందీగా డిడిలు తీసి, ఆ సొమ్మును సురేష్ చెల్లించేశాడు. విచారణలో సురేష్ తప్పేం లేదని, అంతా స్టాంపు వెండర్లదే తప్పని రిపోర్టు ఇచ్చారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి స్టాంపు వెండర్లను అదుపులోకి తీసుకొని, విచారించగా సురేష్ చేసిందే తప్ప, మేం చేసిందేమీ లేదని జరిగిన విషయాలు పూస గుచ్చినట్లు చెప్పేశారు. డామిట్ సురేష్ కథ అడ్డం తిరిగింది. రెండు రకాలు స్టాంపు డ్యూటీల మూలంగా రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రెండు సార్లు జైలు కెళ్లడం జరిగింది. మళ్లీ రంగంలోకి దిగిన శాఖ పెద్దలు మళ్లీ సురేష్‌కు కాపాడుకుంటూ వచ్చారు. పెద్దల ఆశీస్సులు మెండుగా?: ఓ వైపు కరీంనగర్‌లో రెండు రకాల కేసుల మీద విచారణ జరుగుతున్న క్రమంలోనే సురేష్ తిరిగి విధుల్లో చేరాడు. తర్వాత డిఐజి. నాయుడు రంగంలోకి దిగి మళ్లీ విచారణకు ఆదేశించారు. మళ్లీ ఏం జరిగిందో ఏమో! కాని ఆయన కూడా సురేష్‌కు అనుకూలంగానే రిపోర్టు ఇచ్చేశారు. ప్రమోషన్‌కు బాటలు వేశారు. పెద్దపల్లిలో కొంత కాలం సబ్ రిజిస్ట్రార్‌గా సురేష్ పనిచేయడానికి మార్గం సుగమం చేశారన్న ఆరోపణలు వున్నాయి. ఇటీవల జివో నెంబర్.317 మూలంగా సబ్ రిజిస్ట్రార్‌గా నుంచి తిరిగి ప్రస్తుతం డిఐజీగా వున్న ట్వింకిల్ జాన్ కార్యాలయానికి తబాదల మీద వచ్చాడు. గతంలో దశాబ్ధం క్రితం జరిగిన అవకతవల మీద మళ్లీ దర్యాప్తుకు ఆదేశించిన డిఐజి. పదకొండు నెలల తర్వాత ఎలాంటి విచారణ జరగకుండానే సురేష్ తప్పేం లేదని రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ట్విస్టేమిటంటే ఇప్పటికీ కొనసాగుతున్న విచారణ ఫైలు, సురేష్‌ను దోషిగా నిరూపించే ఫైలు తిరిగి తిరిగి ఇప్పుడు ఆయన టేబుల్ మీదకు వచ్చింది. ఆయన చేతిలోనే వుంది? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టకుండా పోవడం అంటే ఇదే…సినిమాల్లో కూడా ఇంతటి సీన్లు ఎవరూ చూపించలేదు. కరీంనగర్‌లో ఇప్పటికీ రెండు కేసులు మీద విచారణ జరుగుతోంది. అవి క్రిమినల్ కేసులు. అయినా ఆయనకు ఉద్యోగం మళ్లీ వచ్చింది. ప్రమోషన్ వచ్చింది. సేఫ్‌గా డిఐజి కార్యాలయానికే ఉద్యోగం అలాట్ అయ్యింది. తన మీద విచారణ ఫైల్ తన చేతిలో భద్రంగా వచ్చి వాలింది. దీన్ని ఏమంటారు…వెతకబోయే తీగ కాలికి తగినట్లే…కదా? కాకపోతే ప్రభుత్వ ధనం ధనం దుర్వినియోగం చేసి, స్టాంపు వెండర్ల లైసెన్సులు రద్దుకు కారణమై, నమ్మినందుకు తనకేం సంబంధంలేని ఓ రిటైర్డు సబ్ రిజిస్ట్రార్‌కు పెన్షన్ రాక పోవడానికి కారణమైన సురేష్‌పై ఇప్పటికైనా విచారణ వేగవంతమౌతుందా? లేకా అక్కడే కథ కంచికి చేరుతుందా? అన్నది ఉన్నత స్ధాయి అధికారులే తేల్చి చెప్పాలి. అసలే తెలంగాణలో పరిపాలనా సంస్కరణల కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి అండ్ కమీషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తున్నాడు. అసలు ఆయన శాఖలో ఎలాంటి అవినీతిని ఆయన సహించరు. అలాంటిది ఏకంగా స్టాంపులు దుర్వినియోగం చేసి, దొంగ ఛలాన్లను సృష్టించి, డిడీలతో మాయ చేసి, సస్పెండ్ అయ్యి, కేసులు విచారణలో వుండగానే తిరిగి విధుల్లో చేరి, ప్రమోషన్లు పొందిన సురేష్‌ను ఉద్యోగ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయనకు సహరించిన ఉన్నతాధికారులపై కూడా ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి.
గ్రానైట్ , గ్రానైట్ అనుబంధ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సంబంధిత సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, మైనింగ్ శాఖ డీఎంజీ రొనాల్డ్ రోస్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావులతో పరిశ్రమ ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఆధ్వర్యంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. 40% రిబేట్ తో కూడిన స్లాబ్ విధానాన్ని కొనసాగించాలని, కొత్త పరిశ్రమలకు లీజులు, ప్రోత్సాహకాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రతినిధులు హామి ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ పెద్దలకు అందజేశారు.
ఈ సమావేశంలో మైనింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధులు పి. శంకర్, తమ్మినేని వెంకట్రావు, ఉప్పల వెంకటరమణ, విన్నకోట అజయ్ తదితరులు పాల్గొన్నారు.
*వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ లు*
– *అర్హులందరికీ క్షేత్ర స్థాయిలోనే వాక్సినేషన్ ఇస్తున్నాం*
– *సర్వే కు ప్రజలు సహకరించాలి*
– *కరోనా,ఒమిక్రాన్ విషయంలో భయం వద్దు*
– *అధిక ఖర్చు పెట్టుకుని ప్రైవేటు దవాఖానలకు పోవద్దు*
– *ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధం*
– *జ్వర సర్వే క్షేత్ర పరిశీలనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*
— *ఇంటింటికీ వెళ్లి స్వయంగా జ్వర సర్వే చేసిన ఆరోగ్య మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు*
– *టీకా వేసుకున్నారా…!! మాస్క్ ధరించండి.. జ్వరం , జలుబు , దగ్గు లాంటి లక్షణాలు ఉంటే చెప్పండి …!! జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరింపు*
.సిద్ధిపేట 22 జనవరి 2022 :
కరోనా వ్యాధి వ్యాప్తినీ అరికట్టేందుకు ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య, పంచాయితీ రాజ్, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నదని ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న ఫీవర్ సర్వేకు సహకరించాలని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు కోరారు.
రాష్ట్రంలో ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రతీ రోజు లక్షకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు, 2 కోట్ల టెస్ట్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలెవరు గాబరపడొద్దని, ఆందోళన చెందొద్దని.. ప్రయివేటు ఆసుపత్రులకు పోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ 37వ వార్డు అంబేద్కర్ నగర్ – కరీంనగర్ రోడ్డున శనివారం ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించి ప్రజల యోగక్షేమాలపై దృష్టి సారించి ముందుగా ఈ వార్డులో ఆశా వర్కర్లు ఎవరినీ.. ఈ ప్రాంతంలో అందరూ రెండో డోస్ వేసుకోవడం పూర్తయ్యిందా అంటూ ఆశాలను ఆరోగ్య మంత్రి ఆరా తీశారు. ఏం అమ్మా రెండు టీకాలు వేసుకోవడం పూర్తయ్యాయా.. మూడో డోస్ టీకాకు మీకు ఇంకా ఎంత కాలం గడువుందని ముచ్చటిస్తూ.. ఒక్కో ఇంటి వారిని ఆప్యాయంగా పలకరింపులు చేస్తూ.. ఓ ఇంట్లో ఏం పోశవ్వ ఏన్ని టీకాలు వేసుకున్నావ్.? ఒకటే సారూ. మరీ మిగతావి ఎందుకెయ్యలేదని ఆరా తీస్తే.. సూదికి భయపడతారట.. అని దూరముందని తెలియగానే సూదికి భయపడతరా.. తల్లీ అంటూ కరోనా రాకుండా ఉండేందుకే టీకాలు అంటూ దగ్గరుండి టీకా వేయించారు.
ఆ తదుపరి ఏం అమ్మా మీ ఇంట్లో అందరూ టీకాలు వేసుకున్నారా.. ఇంటి గేటు దగ్గర నుంచే గ్యాదగోని రేణుకా ఇంట్లో 60 ఏళ్లు నిండిన అవ్వను.. నువ్వు ఎన్ని డోసులు వేసుకున్నావ్ తల్లీ ఆరా తీసి రెండని చెబితే, రెండు కాదు, మూడు టీకాలు పడాలి కదా.. ఆర్ఏంఓ కాశీనాథ్ ఆన్ లైనులో చెక్ చేసి మూడో టీకా బూస్టర్ డోస్ దగ్గరుండి ఇప్పించారు. ఇదే క్రమంలో అంజమ్మను పలకరిస్తూ.. నీకు మాస్కు లేదని, మాస్కు పెట్టుకోవాలని తన వద్దనున్న మరో మాస్క్ ఇచ్చారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికురాలు దేవవ్వతో ముచ్చటిస్తూకరోనా టీకాలు వేసుకున్నావా.. ఆరోగ్యం బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫీవర్ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ కిట్లు పలువురికి అందించారు.
*ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.* *కరోనా కట్టడికి ప్రజలకు సూచనలు చేశారు.*
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీవర్ సర్వేలో భాగంగా నిన్న మొదటి రోజు 12 లక్షల 68 వేల మంది ఇళ్లకు మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందితో కలిసి 48 వేల మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించినట్లు, వీరికి ఆరోగ్య కార్యకర్తలు నిత్యం ఫోన్ లేదా స్వయంగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలు పరిశీలిస్తారని, వ్యాధి తీవ్రత, ఇతర సమస్యలు ఉంటే దగ్గరలోని దవాఖానకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇంకా అవసరమైన వైద్యాన్ని ప్రజలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు.. ఎంత మంది ప్రజలు ఆసుపత్రికి వచ్చినా.. టెస్టింగ్ సెంటర్లు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు తెలిపారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్ సర్వే చేయిస్తారని, కరోనా పరీక్షల కోసం లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లు పెంపు చేస్తామని వెల్లడించారు.
నిన్న ఒక్క రోజే 12 లక్షల మందిని పరీక్షలు చేశారని, హోమ్ ఐసోలేషన్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని, ప్రతీ నిత్యం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని, అన్నీ రకాల వైద్యం చేస్తామని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ కోసం వైద్య సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. మందుల ద్వారా తగ్గుతుందని, ఆరోగ్య శాఖ చెప్పినప్పటికి ప్రతి రోజు సర్వే చేస్తున్నట్లు, గ్రామ ప్రజా రక్షణకై ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
గతంలో సెకండ్ వేవ్ ఉధృతి సమయంలో జ్వరం సర్వే చేసి 2 కోట్ల 25 లక్షల కిట్లు అందించిందని, ఫీవర్ సర్వే చేయడం పట్ల కేంద్రం, నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి సర్వే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చిందని, గత ఫీవర్ సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడిలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పోరాడుదామని వైద్య మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. పిల్లలు కోసం ప్రత్యేకంగా, పెద్దల కోసం ప్రత్యేక వార్డు లాంఛ్ ఏర్పాట్లు చేసినట్లు, ప్రతీరోజూ కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సర్వేలను జిల్లా కలెక్టర్లు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఆక్సిజన్ సామర్థ్యం పెంచినట్లు, గతంలో 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా, దాన్ని ఇప్పుడు 370 మెట్రిక్ టన్నుల సామర్థ్యంకు పెంచి ఆక్సిజన్ నిల్వలు సిద్ధంగా పెట్టినట్లు మంత్రి వివరించారు.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తుందని, గ్రామ ప్రజల ఆరోగ్య కోసం ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా కూడా వైద్య ఖాళీలు లేకుండా అన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అన్నీ పోస్టులు భర్తీ చేసినట్లు వైద్య మంత్రి తెలిపారు. ఎక్కడైనా ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయమని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఆశా కార్యకర్తలు సమాచారం అందించే, వారి సేవలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, దీంతో ప్రాణ ముప్పు ఉండదని, రక్షణ కవచంగా టీకా పని చేస్తుందని వైద్య మంత్రి భరోసా ఇచ్చారు.
సెలవు దినాలలో కూడా వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బందిని అందుబాటులో నిలిపినట్లు, లక్షణాలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలకు చెప్పాలని, స్వంత వైద్యం మంచిది కాదని చేసుకోవద్దని, ప్రయివేటు దవాఖానలోకి పోయి మీ డబ్బులు వృథా చేసుకోవద్దని ఆరోగ్య మంత్రి ప్రజలకు సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, డీఏంహెచ్ఓ మనోహర్, జిల్లా నోడల్ వైద్యాధికారి కాశీనాథ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా దిశగా అడుగులు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం దిశగా డిల్లీ వేధికగా తెలంగాణ నూతన ఆవిష్కరణలు… కేసిఆర్ కీలకంగా భవిష్యత్తు రాజకీయాలు… ఆలోచన ఒక్కటే చాలదు. ఆచరణ కావాలి. అవి పుష్కలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌లో వున్నాయి. కల కంటే చాలదు. నెరవేరే ప్రయత్నం చేయాలి. అందుకు కృషి చేయాలి. పట్టుదల చూపించాలి. ఇవన్నీ మెండుగా కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. పద్నాలుగేళ్ల అలుపు లేని పోరాటం చేశాడు. తెలంగాణ గొంతులన్నీ ఏకం చేశాడు. లక్ష్యం వైపు తనొక్కడేకాకుండా మూడు కోట్ల తెలంగాణ ప్రజలను వేలు పట్టి నడిపించాడు. రాజకీయ పార్టీలకు జై తెలంగాణ అనడమే అనివార్యం అనేదాకా తీసుకొచ్చాడు. తెలంగాణ ఇక ఇవ్వడం తప్ప ఏం చేయలేమని కేంద్రం ప్రకటించేలా ఉద్యమ రాజకీయ పోరాటం నడిపాడు. విజయం సాధించాడు. తెలంగాణ ఆవిష్కరణకు మూలమయ్యాడు. కీలకమయ్యాడు. తెలంగాణ కొత్త చరిత్రకు ఆద్యుడయ్యాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి, మలి ముఖ్యమంత్రిగా సంక్షేమరాజ్య ఆవిష్కరణకు బాటలు వేశాడు. ఇదీ ఒక లక్ష్య సాధకుడి పయనం. చేరుకున్న గమ్యం. అలాగే ఇప్పుడు కేంద్రం వైపు అడుగులు…వెనకడుగు వేయని ఆత్మ విశ్వాసం కావాలి. అది కేసిఆర్‌లో కొండంత వుంది. వెనక్కి లాగేవారు చాలా మంది వుంటారు. జాగ్రత్తగా వుండాలి. ఇలాంటివి ఎన్నో తెలంగాణ ఉద్యమ కాలంలో చూసిన అనుభవం ఆయనకు సొంతం. వెన్నుపోటు పొడిచేవారు వుంటారు. వారి నుంచి అప్రమత్తంగా వుండాలి. ఇది బాగా తెలిసిన నేత కేసిఆర్. ఎందుకంటే తెలంగాణ జెండా ఎత్తిన తొలినాళ్లలో రాజకీయ అవసరాల కోసం, ఆయనతో కలిసి సాగి, పదవుల కోసం, పరపతి కోసం పాలకులాడిన వారు ఎంత మంది పంచన చేరారో కేసిఆర్‌కు బాగా తెలుసు. నమ్మి వారికి పదవులు అందిస్తే, టిక్కెట్లిచ్చి గెలిపిస్తే, ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ఎంత మంది చూశారో చరిత్రకు తెలుసు. ఆయన భి`పారం ఇస్తే టిఆర్‌ఎస్ టిక్కెట్టు మీద గెలిచి, నాటి అధికార పార్టీకి కాంగ్రెస్‌కు, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు కోవర్టులుగా మారిన వారు ఎవరో ప్రపంచానికి తెలుసు. టిఆర్‌ఎస్‌లోనే వుంటూనే కొంత మంది, పార్టీనుంచి దూరంగా జరిగి పదేపదే కేసిఆర్‌ను కించపర్చినవాళ్లున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్టు మీద గెలిచి తెలంగాణ రాదని ప్రకటించినవారున్నారు. కేసిఆర్ వల్ల అసలే రాదని స్వార్ధపూరిత రాజకీయాలు చేసి, రాజకీయ యవనిక మీద వారి పేర్లు వాళ్లంతట వాళ్లే చెరిపేసుకున్నవారు వున్నారు. ఇన్ని చూసి, అనుభవించి, ఎవరినీ నమ్మకుండా, ఒక్కడుగా ఒంటి చేత్తో పోరాటం చేసి, వచ్చేవారిని స్వాగతిస్తూ, వెళ్లేవారిని వదిలేస్తూ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్. ఆయనకు ఎవరు ఎలా వెన్నుపోటు పొడుస్తారో పూర్తిస్ధాయిలో అనుభవం వున్న నాయకుడు. అలాంటి నాయకుడు ఎంత అప్రమత్తతో వుంటాలో కేసిఆర్‌కు మరోకరు చెప్పాల్సిన పనిలేదు. గుర్తుచేయాల్సిన అవసరం అంత కన్నా లేదు. అందుకే కేసిఆర్‌కు వున్నంత ముందు చూపు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదనే చెప్పాలి. ఇక మనసంతా లక్ష్యం నింపుకోవాలి. అంటే కలైనా,నిజమైనా, తింటున్నా, పడుకున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, మౌనంగా వున్నా, ప్రతి క్షణం తలిచేదే లక్ష్యం. అలాంటి లక్ష్య సిద్ది కేసిఆర్‌కు మాత్రమే సొంతం. అది తెలంగాణ సాధనతోనే నిరూపితం. అందుకే ఆయన మనసంతా తెలంగాణనే కాదు, ఒళ్లంతా కళ్లు చేసుకొని మరీ తెలంగాణ సాధన కోసం శ్రమించారు. ప్రత్యర్ధులనుంచి వచ్చే ప్రతి బాణాన్ని ఎదుర్కొన్నారు. వాటికి సమాధానం చెప్పారు. తిరుగులేని శక్తి కేసిఆర్ అని కోట్లాది మందితో కొనియాడబడ్డారు…అదీ కేసిఆర్…. అదే కసి…అదే లక్ష్యం: ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనేది సినిమా డైలాగేమో! కాని దాని ఆచరణకు బ్రాండ్ అంబాసిడర్ కేసిఆర్…అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. పైగా రాజకీయ నిర్ణయాలలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కూడా అంతే…గతంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్, తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డిఏ( నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్)లలో కీలక భూమిక పోషించారు. కాని వాళ్లు ప్రధాన మంత్రులు కాలేకపోయారు. కింగ్ మేకర్‌ల పాత్రకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు కేసిఆర్ ఒక అడుగు ముందుకేసి, కేంద్రంలో కీలకపాత్ర పోషించి, ప్రధాని కూడా కావొచ్చేమో! అన్న ప్రచారం కూడా వున్నదే… దక్షిణాదినుంచి తొలి ప్రధాని పివి. తర్వాత తెలుగు వారికి ఆ అవకాశాలు ఎవరికీ రాలేదు. ఒక దశలో చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాని అందులో నిజమెంత అన్నదానిపై ఎవరూ స్పష్టతనివ్వలేదు. కాకపోతే కేంద్రలో కీలకభూమిక మాత్రం పోషించారు. ఇప్పుడు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పడమే కాదు, క్రియాశీల పాత్ర పోషించే అవకాశం మరోసారి దక్షిణాదికి వచ్చే వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈ మధ్యే ఎన్నో దశాబ్ధాల ఎదురుచూపుల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్‌కు ఆ ఆశలు లేవు. ఆయన ఇప్పుడే కేంద్రంలో కీలకం కావాలన్న ఆలోచన లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆ ఆలోచనల్లో లేరు. కర్ణాటక నుంచి కూడా పెద్దగా కేంద్రంలో తనదైన శైలి రాజకీయాలు చేసే నాయకులు లేరు. కాని మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం వుంది. కుమార స్వామి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒక వేళ భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల హవాతో కేంద్రంలో హంగ్ ప్రభుత్వాలే ఏర్పాటైతే కుమారస్వామికి కలిసివస్తే మాత్రం ఒకే ఇంట్లో ఇద్దరు ప్రధానులైన చరిత్ర , ఇందిరాగాంధీ కుటంబం తర్వాత చరిత్రకెక్కుతారు. కాని ఆ అవకాశం రాకపోవచ్చు. ఇక కేరళ సంగతి తెలిసిందే. సిపిఎం ఎప్పుడూ భాగస్వామ్యమే తప్ప, పాలనకు కేంద్రంలో సరిపోదు. ఇక మహా రాష్ట్ర నుంచి శరత్ పవార్ వున్నారు. ఎన్సీపీ నాయకుడు శరత్ పవార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కలిస్తే కేంద్రలో తిరుగులేని శక్తిగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటౌతుందని చెప్పడంలో సందేహంలేదు. కేసిఆర్ మదిలో నిర్మితమౌతున్న ధర్డ్ ఫ్రంట్‌లో అత్యంత సీనియర్‌గా శరద్ పవార్ వుంటారు. ఆయనకు కూడా ప్రధాని అయ్యే ఛాన్సులున్నాయి. ఇక బెంగాల్ దీదీ గురించి తెలిసిందే…ఇటీవలే తేజస్వీ యాదవ్ బృందం కేసిఆర్‌ను కలవడం అన్నది జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైపోయింది. కేసిఆర్ తన రాజకీయ చాణక్యానికి పదును పెడుతున్నాడని తెలిసిపోయింది. ఇక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపిప్రభావం తగ్గితే, ఇక వచ్చేందంతా ప్రాంతీయ పార్టీల హావానే అన్నది చెప్పకతప్పదు. అప్పుడు కేసిఆర్ మాత్రమే కీలకంగా మారక తప్పదు. అందుకే గత ఎన్నికల నుంచే బ్లూప్రింట్ రూపకల్పనతో కేంద్రం వైపు అడుగులు వేస్తూ, బాటలు ఏర్పాటు చేస్తున్న కేసిఆర్ ప్రచారం యూపిలో అత్యంత కీలకమౌతుందని అందరూ అనుకుంటున్నారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు సాక్ష్యం ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన యూపిలో ఎస్పీకి మద్దతుగా కదిలితే, తెలంగాణ తరహాలో యూపి అభివృద్ధి ఎలా చేయాలన్నదానిపై ఎన్నికల ప్రచారంలో చెబితే ఇక ఎస్పీకి తిరుగుండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గడచిన ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో వున్న బిజేపిని , గత ఎన్నికల్లో యూపిలో అత్యధిక మెజార్టీతో గెలిపించినా జరిగిన ప్రగతి ఎంతో కళ్లముందు కనిపిస్తున్నదే. ఇక మరోసారి బిజేపిని నమ్మినా జరిగేదేమిటో ప్రజలకు తెలుసు. ఇలాంటి సమయంలో కేసిఆర్ రంగలోకి దిగి, తెలంగాణలో జరిగిన ప్రగతి, అమలౌతున్న సంక్షేమ పథకాలను యూపికి పరిచయం చేస్తే ఇక ఎస్సీకి తిరుగుండదు. యూపిలో ఎస్పీ గెలిస్తే భవిష్యత్తులో కేంద్రంలో కేసిఆర్‌కు ఎదురుండదు. ధట్సాల్…
కరీంనగర్ తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం సృష్టించింది. నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసిన శ్రీనివాసాచారి తనకు చెందాల్సిన ఆస్తిని తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని మృతుడు పేర్కొన్నాడు. కరీంనగర్ లోని భగత్ నగర్ లోని ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీనివాసచారి వివరించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్/ హైదరాబాద్ నేటిధాత్రి: హైదరాబాద్ శాసనమండలి ఆఫీస్ ఆవరణంలోని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలుపొందిన తాత మధు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత,జెడ్పి చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ ఆలీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, ఖమ్మం డి సి సి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హరిసింగ్, బయ్యారం మండలం ప్యాక్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
తామర పురుగు,తెగులు మరియు అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం.రాజేందర్ డిమాండ్ చేశారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా పొలం.రాజేందర్ మాట్లాడుతూ తామర పురుగు,తెగులు,అకాల వర్షాల వల్ల మిర్చితో పాటు పత్తి, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి అన్నారు,ఆరుగాలం కష్టబడి చేసిన పంటలు దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి రాదని రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే పాలకులుగాని అధికారులుగాని వారి పంటలను సందర్శించకపోవడం ఒక భరోసా ఇవ్వకపోవడం బాధాకరంఅని వారు అన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం ఆర్టికల్చేర్ వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో సర్వేచేయించి ఎకరానికి లక్ష రూపాయల నష్ట పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నష్టపోయిన రైతులందరిని సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు తోట.దేవరాజు,ఏరినేని.నగార్జున్,రైతులు రాంనేని,రఘుపతి,రాంనేని,పెద్ద మల్లయ్య,తోట.లక్ష్మి మల్లు,మొళ్ళు.రాజేందర్,గుంటి.శంకర్ తదితరులు ఉన్నారు
*కొత్తగూడ, నేటి ధాత్రి.* ఆదివాసీ ల ప్రాంతంలో ఎస్ టి రిజర్వేషన్ లో గెలుపొందిన సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఎంపీపీ లు జడ్పీటీసీ లు, ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు తమ జాతికి భారత రాజ్యాంగం లో కల్పించబడిన హక్కులు,చట్టాల అమలు కోసం పాటు పడకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తు షెడ్యూల్డ్ ఏరియా ను కాపాడటం లో ముందు వరుస లో ఉండాల్సిన వారు రాజకీయ మనుగడ కోసం గిర్జనేతరులకు వంత పాడుతూ వారి ఓట్లకోసం తమ వ్యవస్తనే కాల రాసుకుంటూ ఆదివాసీ ల ఆస్తిత్వం ను నాశనం చేస్తున్నారని రాజకీయ పార్టీల ఎజెండా ను మోస్తూ వలస వాద గిర్జనేతరుల తో రాజకీయ సహవాసం చేస్తూ కేవలం వ్యక్తి గత అవసరాలను తీర్చు కుంటూ ఆదివాసీ లను మోసం చేస్తున్నారని ఇకనైనా ప్రజా ప్రతి నిధులు సోయి తెచ్చుకొని ఆదివాసీ హక్కు లు చట్టాలు ప్రాంతం ను కాపాడు కోసం ప్రజల తో కలసి పోరాటం చేయడం కోసం సిద్ధం కావాలని ఈ రోజు కొత్తగూడ మండల కేంద్రం లోని ఐటీడీఎ గెస్ట్ హౌస్ యందు ఆలూరి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి పాల్గొని మాట్లాడారు . ఈ సమావేశంలో పడిగే నగేష్,కొటేం ముఖర్జీ,తాటి సునీల్, కల్తీ శ్రీనివాస్, పడిగే మంగయ్య, సిద్దబోయిన సంజీవ్,మేడ బుచ్చిరాములు, సువర్ణ పాక వెంకట రత్నం, వజ్జ రవి,కుంజ నర్సింగరావు, సిద్దబోయిన జీవన్,దారం సమ్మయ్య, అలెం బాబుపాల్గొన్నారు.
ఖానాపురం మండలంలోని పలు గ్రామాలలో కోతుల బెడదను విజృంభిస్తున్నాయి. మండలంలోని పలు గ్రామాలలో కోతులు ఇంట్లో చొరబడి బియ్యం పారబోయడం అన్నం తినడం కోడి గుడ్లు తినడం ఇలా ఇల్లంతా చిందరవందరగా చేస్తున్నాయి. గత రెండు నెలలో క్రితం బడికి వెళుతుంటే ఇద్దరు విద్యార్థులను కరవడం కూడా జరిగింది అని, కోతుల బెడదను పట్టించుకునేదెవరు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇంబ్బందులు పడుతుంటే చూస్తువుంటారా అని అన్నారు. అలాగే ఆయా గ్రామాల కార్యదర్శిలు .ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నారు,రాత్రి వేళల్లో కూడా కోతులన్నీ ఇండ్లలోనే చెట్ల మీద నిద్రిస్తూ అరుస్తూ గోల గోల చేస్తున్నాయి.రాత్రిలు,పగలు ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆయా గ్రామాలకు సంబంధించిన గ్రామ కార్యదర్శిలు పట్టించుకుని, ఈ కోతుల బెడద నుండి గ్రామ ప్రజలను కాపాడాలని పలు గ్రామాల ప్రజలు కోరారు.
మిర్యాలగూడ, నేటిధాత్రి:ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతా మధు శాసనమండలి సభ్యులుగా గురువారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తనయుడు,యువనేత నల్లమోతు సిద్దార్ధ తాతా మధుకు శాసనమండలిలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. టీఆర్ఎస్ ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. నూరేండ్ల పాటు చెక్కుచెదరని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో గులాబీ పార్టీ రోజురోజుకు మరింత బలోపేతం అవుతోందన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై, నాయకత్వంపై ఉన్న ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాతా రావును గెలిపించారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి లో తాతా రావు కీలక పాత్ర పోషిస్తారని భాస్కర్ రావు ఆకాంక్షించారు. కాగా, గతనెల 14న విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులంతా గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు తన సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో గెలుపాందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకి 480 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకి 242, కొండపల్లి శ్రీనివాసరావుకి 4, కోండ్రు సుధారాణికి ఒక్కటి కూడా పడలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
అయోధ్యనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం రోజు గ్రామ ప్రధాన వీధిలో ఎంపీటీసీ నిధుల ద్వారా ఎంపీపీ ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణం కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు జడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి,ఉపేందర్ రెడ్డి తెరాస మండల అధ్యక్షులు వెంకటనర్సయ్య మరియు గ్రామ సర్పంచ్ జర్పుల అశోక్ ఉప సర్పంచ్ కూస లింగమూర్తి మరియు గ్రామ వార్డు మెంబర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి యుగేందర్, భద్రు, రాజు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక శ్రీకాంత్ ఇటీవల వచ్చిన అఖండ చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కొడుకు రోషన్ పెళ్లి సందడి చిత్రంతో వచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు.
కరోనా కాలంలో కాపురాలు మాయం… సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు… చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే… ధనుష్ , ఐశ్వర్యలు ప్రకటన… శ్రీజ, కళ్యాణ్ దేవ్ కూడా అదే దారి అంటూ వార్త… ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం… దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు… పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం అంతా ఒక్క దగ్గరే వుంటున్నారు. అంటే భార్యాభర్తలు కూడా అందుకు మినహాయింపుకాదు. అందులోనూ ఇద్దరూ సినీ పరిశ్రమలో ఏక కాలంలో బిజీగా వుంటే మాత్రం ఇక కథ అంతేనని కరోనా కాలం రుజువు చేసింది. సహజంగా ఒకరికొకరు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తే విహరం ప్రేమను పెంచుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే వుంటుంటే దూరం పెంచుతుందని నిరూపించింది. అవును సినీ మాయ. ఆకర్షణ. అది తగ్గితే ఇక అంతే…దూరం పెరుగుతుందంతే…! జస్ట్ బ్రేకప్…అన్నది చాలా చిన్న పదం. పెద్ద నిర్ణయం. తెలుగులో విడాకులు…మావిడాకులు ఎండిపోకుండానే విడాకులా? అని సినిమాల్లో డైలాగులు వింటే ఏమిటో అనుకున్నాం…కాని అదే సినిమా వాళ్లు ఈ మధ్య చాలా సింపుల్‌గా జస్ట్ బ్రేకప్ అంటుంటే చూస్తున్నాం…ఇదే మాయ రోగం అని తిట్టుకుంటున్నాం…సోషల్ మీడియాలో ఎవరికి వారు తమ బాధలు, కోపాలను కూడా చూపిస్తున్నారు. సినిమా వాళ్లు సమాజం మీద ఇంతగా పెనవేసుకుపోయారా? అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతుంది. వాళ్లు కలిసింటే ఏమిటి? విడిపోతే ఏమిటి? కాని అవునా…అని తెగ బాధపడిపోతుంటారు. వాళ్లకు లేని బాధలు ప్రేక్షకులే చూపిస్తుంటారు. కన్నీరు కారుస్తుంటారు. సినిమా లేని జీవితం లేదంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా హీరో, హీరోయిన్లు కలసి ఎక్కడికైనా వెళ్లినా, ఎవరూ చూడని ప్రాంతంలో కనిపించినా అదో రకం కథలు అల్లడం, అన్నవి వార్తలుగా వుండేవి. ఆసక్తిని పెంచేవి. ఓసారి మురళీమోహన్, జయచిత్ర పెళ్లికి సంబంధించిన షూటింగ్ డ్రెస్సులోనే ప్రయాణం చేసి వెళ్తుంటే దాసరి నారాయణ రావు లాంటి వారు కూడా అపోహ పడి ఏంటీ పెళ్లయిపోందా? అన్నాడట. అంటే సినిమా వాళ్ల వార్తలు ప్రజలకే కాదు, సినీ జనాలకు కూడా వార్తలే…అన్నపూర్ణ అనే ఓ నటి అమ్మగా అనేక సినిమాల్లో నటిచింది. ఆమె అమ్మ పాత్రదారిగా వేసిన సినిమాల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా భర్త పాత్రలు వేసేవారు. ఆమె ఇతర నటులకు భార్య పాత్ర వేస్తున్నప్పుడు ఎదురుపడితే తలకొట్టుకునేవాడట…అంటే సరదాగానే అనుకోండి…కాకపోతే పాత్రల్లో పరకాశ ప్రవేశంచేసి, తోటి నటుల మధ్య అనుబంధాలు అంత పెనవేసుకొని పోయేవట. అలా కొన్ని బంధాలుగా మారిన సందార్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి వాటిలో కృష్ణ, విజయనిర్మల, నాగార్జున,అమల, రాజశేఖర్, జీవిత. ఇలా కొన్ని జంటలు మాత్రమే చివరి దాకా మూడు ముళ్ల బంధాలను గౌరవిస్తూ జీవితం సాగిస్తున్నారు. కాని అవకాశం కోసం, ఆశ్రయం కోసం, సినీ రంగంలో నిలదొక్కు కోవడం కోసం, ఆదిపత్యంతో అహంతో పెళ్లి చేసుకోవడం, ముందు ప్రేమించి తర్వాత హింసించి వదిలేయడం కూడా కామన్‌గా సినీ రంగంలో జరిగిన సంఘటలను అనేకం వున్నాయి. అలా జీవితాలు ఆగం చేసుకున్నవారు వున్నారు. శరత్‌బాబు చెప్పే విషయానికి, రమా ప్రభా చెప్పే వివరణకు ఎక్కడా పొంతన వుండదు. కాకపోతే ఇద్దరూ కలిసి జీవితం సాగించారన్నది నిజం. రమా ప్రభ వల్ల శతర్ బాబు ఎదిగాడన్నది ఎవరు కాదనలేని నిజం. సిల్క్‌స్మిత వాంటివారి జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం కూడా రంగుల ప్రపంచంలోని మోసమే…ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో మంచి నటుడు అనిపించుకున్న చలం, తన జీవితంలో ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను ఆగం చేశాడు. ఆయన ఆగమయ్యాడు. నటనలో జాతీయస్ధాయి అవార్డులు అందుకున్న శారద జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడని అంటుంటారు. ఇలా సినీ ప్రపంచంలో అనేక కథలు…అనేక విషాదాలు… ఎవర్‌గ్రీన్ శోభన్ బాబు…జయలలిత..: ఇది నిజమెంతో కాదో తెలియదు కాని ఇద్దరి మధ్య సఖ్యత అన్నదానిపై అప్పట్లోనే రకరకాలు ఊహాగానాలు. ఎవరూ నిజమని చెప్పింది లేదు. రుజువు చేసింది లేదు. కాని అదిగో పులి..అంటే ఇది తోక అన్నట్లు…వారి అన్యోన్యతకు ఓ కూతురు అన్నారు. కాని ఎవరూ చెప్పింది లేదు. కాని జయలలిత దత్తపుత్రుడు సుధాకర్ ను పెంచి పెద్ద చేసి, ఎంతో వైభవంగా వివాహం చేసింది. మరి సొంత కూతురే వుంటే దత్త పుత్రునికి అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారన్నది ఎవరూ చెప్పలేదు. శోభన్‌బాబు, జయలలిత ఇద్దరూ కలసి హైదరాబాద్‌లో కొంత కాలం వుంటూ వెళ్లేవారని అంటుంటారు. అందుకు సాక్ష్యంగా జేజేఆర్ గార్డెన్స్ మాత్రం వుంది. అప్పట్లోఎన్టీఆర్ కూడా ఓ సీనియర్ నటితో సన్నిహితంగా వుండేవాని అంటుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అంటుంటారు…ఇలా పాత కాల ముచ్చట్లు ఎన్ని విన్నా అదో రకమైన ఆసక్తి కాని నేడు….విడాకులపై ఆసక్తులు పెరుగుతున్నాయి. ఒకనాడు నాగార్జున, తన మొదటి భార్య విడిపోయారంటే అదో పెద్ద వార్త…ఎందుకూ? అన్నది ఆనాడు చర్చే…ఇప్పుడు చైతన్య…సమంత విడిపోయారన్నది ఓ పెద్ద వార్తే…నిన్నటిదాకా రచ్చ రచ్చే…ఇప్పటికీ వాళ్లిద్దరూ ఏది చేసినా ఏదో ఒక వార్తగా మారుతోంది. కాకపోతే తాజా పద్దెనెమిదేళ్లు కలిసి కాపురం చేసిన ధనుష్ , రజనీకాంత్ కూతురు ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నారన్న వార్త వెలువడిన కొద్ది సేపటికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా మళ్లీ విడాకులు అట…అన్న వార్తలు హల్ చల్ చేశాయి. అంటే పెళ్లికి ఎలాంటి గౌరవం లేదా? అన్నది సమాజంలో చర్చ మొదలైంది. సినిమా వాళ్లంటే సమాజంలో ఓ క్రేజ్…వాళ్లు ఏ దుస్తులు వేసుకుంటే అవే వేసుకోవాలి. వాళ్లు ఎలా నడుచుకుంటే అలా నడుచుకోవాలి. వారిని అనుసరిస్తుండాలి. ఇప్పుడు సమాజంలో తాజాగా విడాకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఒకరి తర్వాత ఒకరు…సినీ పరిశ్రమలో ఇదేం దరిద్రం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదన్నది ఎలా ఎప్పుడూ వార్తగా నిలుస్తుందో…విడాకుల వార్తలు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి వినిపిస్తూనే వుంటుంది. అలా తీసుకున్నవారిలో నయన తార కోసం భార్యా పిల్లల్ని వదిలేసిన ప్రభుదేవకు నయన తార హాండ్ ఇచ్చేసింది. దాంతో తగిన శాస్తి జరిగిందన్న వాదనలు కూడా సమజం నుంచి వినిపించాయి. అటు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ది ఎలాగో, దక్షిణాదిన నయన తార వార్తలు అంతే…గా నడిచాయి. శింబుతో తోపాటు…మరి కొంత మంది నటులతో పెళ్లిదాకా వచ్చి, ఆగిపోవడాలు..అన్నది కామన్‌గా మారిపోయింది. తాజగా సమంత, చైతన్యల బ్రేకప్‌తో చాలా మంది అదే బాటలో నడుస్తున్నారని తెలిసి ప్రేక్షకులు ఆశ్యర్యపోతున్నారు. వీటన్నింటికీ కారణం కేవలం ఇగో…అంతే…అది తగ్గదు…వాళ్లను తగ్గనీయదు…కాకపోతే మళ్లీ కలిసిపోవచ్చు… కధలు కుదిరితే కలిసి సినిమాలు చేయొచ్చు…జనమే వెర్రివెంగలప్పలయ్యేది….
బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు? పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా? గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా? ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా? గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే? ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా? ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు? గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి నేతలు ఏం చెబుతారు? తెల్లని కాగితం అగ్రిమెంటుకు చెల్లుతుందా? తూతూ మంత్రంగా రాసుకుంటే చట్టం ముందు నిలబడుతుందా? నాలా మీద జాగ ఇస్తామంటే సంతకాలు చేసేస్తారా? ఎవరివారు బేరాలు మాట్లాడుకుంటే సరిపోయిందా? ఇప్పటికైనా బిజేపి పెద్దలు కళ్లు తెరవకుంటే, పార్టీకే తీవ్ర నష్టం? వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ ఇలాంటి పనులు చేస్తే జనం నమ్ముతారా? దేవుడికే దిక్కులేకుండా చేస్తుంటే, మా బతుకులు బాగు చేస్తారని అనుకుంటారా? వచ్చేది మేమే…గెలిచేది మేమే అనుకుంటూ పై స్ధాయి నేతలు బడాయిలకు పోతుంటే, అందిన కాడికి నొక్కుతూ, జేబులు నింపుకుంటూ, కింది స్ధాయిలో పార్టీకి బొక్కలు పెడుతున్నారు. ఇదీ బిజేపిలో సాగుతున్న పైన పటారాం..లోన లొటారం ముచ్చట. దైవం, హైందవం, హిందుత్వం, ధర్మం, దేశం అంటూ మాటలు చెప్పుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టు కూడా నాయకులు ప్రవర్తించాలి. త్యాగాలు చేయాలి. అంతే కాని ధర్మం ముసుగేసుకొని, అందిన కాడికి దోచుకుంటాం…దేవుడికైనా శఠగోపం పెట్టేస్తామంటే ఇలాగే వుంటుంది. జూబ్లీహిల్స్ అభయాంజనేయ స్వామికి జరిగిన అన్యాయమే రేపు మాకు జరుగుతుంది? అని ప్రజలు అనుకుంటున్నారు. హైందవం ప్రకారం ధర్మం అంటే గుడి, దేవుడు. ఎందుకంటే ధర్మ పరిరక్షకుడు దేవుడు. ఆయన వుండేది గుడిలో…మరి ఆ పరిరక్షకుడైన దేవుడి కోసం, ధర్మనిరతిని అనుసరించాల్సిన బిజేపి నేతలు ఏం చేస్తున్నారు. ధర్మాన్ని పాటిస్తున్నారా? బిజేపి నేతలమని చెప్పుకోగానే సరిపోతుందా? వాళ్లు, ఓట్ల నాడు పనిచేస్తే చాలనకుంటుందా? ఇంకేం అక్కర్లేదా? ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత వారి మీదలేదా? ఒక వేళ వాళ్లు తప్పు చేస్తే పార్టీ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదా? మీరు చేయాల్సింది మీరు చేసుకోండి? మేం చూసుకుంటామని పార్టీ ఏమైనా భరోసా కల్పిస్తోందా? ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం బిజేపి నేతలపై వుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ గుడి వివాదమేమీ చిన్నది కాదు. దేవుడు ఎక్కడైనా దేవుడే…గుడి చిన్నది కదా? అని దేవుడు చిన్న దేవుడౌతాడా? ఇదెక్కడి చోద్యం. పెద్ద గుళ్లలోని దేవుళ్లను తొలగిస్తే, గుళ్లు కూల్చేస్తేనే తప్పా…చిన్న చిన్న గుళ్లు మింగేసినా బిజేపి రాష్ట్ర నాయకులకు పట్టదా? కింది స్ధాయి నేతలంతా కలిసి గుడిని, గుట్టను మింగేవాళ్లకు సహకరిస్తూ, వాళ్లు కూడా మింగుడులో పాలు పంచుకుంటుంటే కూడా తప్పని అనిపించడం లేదా? జూబ్లీహిల్స్ గుడి వివాదం ఏమైనా కొత్తదా? ఆరు నెలలుగా రగులుతున్నదే… రాష్ట్రంలో ఏ మారు మూల ఏం జరిగినా తెలిసే ఈ రోజుల్లో జూబ్లీహిల్స్ కొండ మామjైు, గుడి మాయమై, దేవుడికే దిక్కులేకుండాపోతుంటే బిజేపి రాష్ట్ర నాయకత్వానికి తెలియంకుండా వుంటుందని ఎవరైనా అనుకుంటారా? రాష్ట్ర పార్టీ చిత్తశుద్ది ఎంత గొప్పదో తెలుసుకోలేరా? మేమే హిందుత్వానికి ప్రతీకలమంటే ఇదేనా? గుడి వున్న స్ధలాన్ని మాయం చేసేవారికి సాయం చేయడమే ధర్మపరిరక్షణ అని కూడా బిజేపి నేతలు అనుకుంటున్నారా? గుడి వున్న స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంటే బిజేపి చూస్తూ ఎలా ఊరుకున్నది. ఇదేనా హైందరపరిరక్షణ కోసం పాటుపడుతున్న బిజేపి అన్న అనుమానం ప్రజలకు రాదా? ఉత్తర ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణం గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందా? జూబ్లీహిల్స్‌లో అంజన్న గుడి కూల్చినా ఫరావాలేదా? దాని ఆనవాలు లేకుండా చేస్తున్నా బిజేపి పెద్దలు కదలరా? లేకపోతే….అవును మేం…గుడికన్నా, దేవుడికన్నా, వ్యాపారులకే సపోర్టు చేస్తామని చెప్పండి? కనీసం అప్పుడైనా జనం నిజం చెప్పారని అనుకుంటారు. అంతే కాని ఆగం, ఆగం చేసి, హడావుడి, హడావుడి చేసి, గుడిని కదలనీయం…గుట్ట తొలవనీయం అని పెద్దపెద్ద మాటలు చెప్పిన బిజేపి నేతలు ముడుపులు తీసుకొని నోరు మూసుకున్నారని సాక్ష్యాత్తు బిల్టర్లే చెబుతుంటే ఆ పార్టీ పెద్దలకు వినిపించడం లేదా? గుడి కడితే మాకేం వస్తుంది, కనీసం ఆపినట్లు నటిస్తే నాలుగు రూపాయలు వస్తాయని అనుకున్నారా? అన్నది కూడా స్పష్టం చేయాలి. గుంటూరు స్వామి చాలా స్పష్టంగా, సూటిగా బిజేపి నేతలకు ఎంతెంత ముట్టజెప్పారన్న మాటను చెప్పారు. పల్లపు గోవర్ధన్ అనే నాయకుడికి రూ.కోటి…విహెచ్‌పికి చెందిన నేత రామరాజుకు రూ. కోటి. ఇచ్చినట్లు గుంటూరు స్వామి ప్రజల సమక్షంలో చెప్పేశారు. మరి అలాంటప్పుడు అటు భజరంగదళ్ ఏం చేస్తున్నట్లు? ఇటు విశ్వహిందూ పరిషత్ ఏం చేస్తున్నట్లు? మరో మాజీ బిజేపి ఎమ్మెల్యేకు ముట్టాల్సినంత ముట్టినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక స్ధానిక కార్పోరేటర్ వెంకటేశ్‌కు లక్షల్లో రూకలు ముట్టినట్లు, కొంత పని కాంట్రాక్టు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇది నిజామా కాదా? అన్నది వాళ్లే చెప్పాలి. ముందు గుంటూరు స్వామి మీద కేసు నమోదు చేసినట్లు చెప్పిన బిజేపి నేతలు ఆ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నట్లు. కోట్ల రూపాయలు తీసుకుంటే చాలు, గుడి కడితే మాకేంటి…కట్టకపోతే మాకేంటి అనుకునేంత కుత్సిత స్వభావ నేతలను బిజేపి ప్రోత్సహిస్తున్నట్లు అనుకోవచ్చా? అనే ప్రశ్నలకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్రపెద్దలు కూడా నోరు విప్పాల్సిందే…వివరణివ్వాల్సిందే…లేకుంటే దేవుడితోనే ఆడుకుంటారా? దైవం, ధర్మం అనుకుంటూ రాజకీయాలు చేస్తూ, వచ్చేది మమే…వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పుకుంటూ చేయాల్సినపనులు ఇవేనా? ఇప్పుడే ఇలా చేస్తుంటే, రేపు అధికారంలో కూర్చుండబెడితే, గట్టలు, గుళ్లు మేమే మింగేస్తామని పరోక్షంగా చెప్పినట్లు కాదా? పార్టీకి ఇలాంటి నేతలు తీరని నష్టం చేస్తున్నట్లు కాదా? భవిష్యత్ రాజకీయ నిర్మాణం, పార్టీ కోసం పని చేయాల్సిన నేతలు, త్యాగాలు చేయాల్సిన నేతలే ఇలా ధర్మం తప్పితే పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా ఆదరిస్తారు? హైదరాబాద్ నడిబొడ్డునే ఇలాంటి దుర్చర్యలకు బిజేపి నేతల ముసుగులో దేవుడికే నీడ లేకుండా చేయడానికి సహకరించడం న్యాయమేనా? పంచుకోవాడాలలో పాలు పంచుకుంటుంటే, వాటాలతో జేబులు నింపుకుంటుంటే పార్టీ ఎలా ఉపేక్షిస్తోంది. ఇలాంటివారిని ప్రోత్సహించడం ఒక భాగమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకమానవు. జూబ్లీహిల్స్ గుట్ట, గుడి విషయంలో అన్ని వేళ్లు బిజేపి వైపే చూపిస్తుంటే బిజేపి నేతలు ఏమని సమాధానం చెప్పుకుంటారు? సహజంగా నాయకులు ఏ రియలెస్టేట్ వ్యాపారమో చేసుకుంటూ గడిరచిన సొమ్మును రాజకీయాల్లో ఖర్చు చేసి, ప్రజలకు చేరువౌతున్న రోజులు. కాని గుడి పేరు చెప్పుకొని వ్యాపారులకు కొమ్ము కాస్తూ, గుడికే శఠగోపం పెడుతూ, ప్రజలకు ఎలా చేరువౌతారు. నిజానికి ఇలాంటి సంఘటనల్లో, సందర్భాలలో అధికార పార్టీకి చెందిన నేతలు, నాయకులు వత్తాసు పలుకడం చూస్తుంటాము. కాని ఇక్కడ టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఎవ్వరూ అటు వైపు తొంగిచూడలేదు. అందులో పాలు పంచుకోలేదు. ఏ పాలు కోరలేదు. ఎవరితో లాలూచీ పడలేదు. దాన్ని రాజకీయం చేయలేదు. గుడి అడ్డుకుంటున్నామని అడ్డదారులు తొక్కలేదు. కాంగ్రెస్‌నేతలు కూడా అక్కడికి చేరింది లేదు. ఆపే ప్రయత్నం చేసింది లేదు. మొత్తంగా వచ్చింది బిజేపి నేతలు. దాని అనుబంధ సంస్ధలైన విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ సంస్ధలు. ఇక్కడ మరో చమత్కారమేమింటే భజరంగదళ్ అంటేనే హనుమంతుడు. అలాంటిది అభయాంజనేయ స్వామి గుడికే దిక్కులేకుండా చేస్తున్నవారి పంచన చేరి, జేబులు నింపుకునే ప్రయత్నం భావ్యమా? ఆ సంస్ధ నేతలు ఇలాంటి యవ్యారాలు చేయడం పద్దతేనా? వీళ్లా ధర్మం కాపాడేదన్న అనుమానం రాకుండా వుండదా? ఎవరిని మోసం చేయడానికి ధర్మం కోసం, దైవం కోసం, దేశం కోసమంటూ పైకి మాయ మాటలు చెప్పి మూటలు దోచుకెళ్లడం అన్నదానికి ఈ ఒక్క సందర్భం చాలదా? ఎక్కడికక్కడ నియోజవర్గ స్ధాయి నాయకుల నుంచి మొదలు, కార్పోరేటర్ దాకా అందినకాడికి దండుకొని మింగేసి, నీతి వాఖ్యాలు వల్లిస్తే జనం వింటారా? నమ్ముతారా? ఇప్పటికైనా బిజేపి పెద్దలు ఆలోచించుకోవాలి. గట్ట లేకుండా చేసి, గుడి ఆనవాలు కనిపించకుండా చేసి, నాలాలో భాగమైన స్ధలం ఇస్తామంటే స్ధానిక కార్పోరేటర్ ఎలా సంతం చేస్తాడు? ప్రభుత్వ భూమిని రాసిచ్చే అధికారం ఎవరికైనా వుంటుందా? ఏదో ఒక కాగితం మీద రాతలు రాసుకుంటే అవి అగ్రిమెంట్లు అవుతాయా? చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా? దానికి ఎలాంటి చట్టబద్దత అవసరం లేదా? ఇలా బిజేపికే శఠగోపం పెట్టే నాయకులు అందిన కాడికి దోచుకుంటూ, పార్టీప్రతిష్టను బజారు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చర్యలు ఏమైనా తీసుకుంటారా? అసలు ఏం జరిగిందన్నదానిపై పార్టీపరమైన కమిటీ ఏదైనా ఏర్పాటు చేస్తారా? దోషులని తేలితే వాళ్లను పార్టీనుంచి తప్పిస్తారా? భవిష్యత్తులో ఇలాంటి పనులు ఏ నాయకుడు చేయకుండా గట్టిగుణపాఠంచెబుతారా? అన్నది పార్టీ నుంచి స్పష్టత కావాలి. ఇవ్వాలి…గుడి నిర్మాణ బాధ్యత కూడా తీసుకోవాలి. ఇంత జరిగాక తప్పుకుంటామంటే చాలదు!
అయితే నాకేమిస్తావో ఒక్క ముక్కలో చెప్పు? ఇచ్చేవాడు లటుక్కు… మింగే వాడు మిటుక్కు…? అంతేనా…గుంటూరు శివ స్వామి? కరి మింగిన వెలగ పండు జూబ్లిహిల్స్ కొండ ఊర్లు పంచుకున్నంత పని చేశారు? గుట్ట మాయం, గుడికి శఠగోపం? గుంటూరు స్వామి చెప్పిన నిజాలు? వాటాలు పంచుకున్నట్లేనా.. నాయకులు? స్వామి చెప్పినవన్నీ ఒప్పుకున్నట్లేనా? దేవుడినే మాయం చేసిన ఘనులు? నిలదీయాల్సిన వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్నారు? దేవుడికే నీడ లేకుండా చేస్తున్నారు? అడిగిన వాళ్లకు, అడినట్టు కోట్లుకు కోట్లు పప్పు బెల్లం పంచినట్లు ఎందుకు పంచుతున్నట్లు? అసలు ప్రసాదం అందిరికీ అందకుండా గుడి కట్టరెందుకు? ఇంత మందికి ఇన్నేసి కోట్లు ఇచ్చే బదులు వాటితోనే గుడిని గొప్పగా కట్టొచ్చు..కదా???.యాదాద్రిలో కొత్త గుడిలా చరిత్రలో నిలిచిపోతుంది కదా!! అమ్మమ్మా…ఆ…ఒక్కటీ అడక్కు…నిజంగా అక్కడ గుడి కడితే మాకు మిగిలేది ప్రసాదమే…అందులో కారం కారం మిరియాలే…!! చేదు…చేదు ఆవాలే!!! ఈ మాత్రం తెలియకుండానే వ్యాపారం చేస్తున్నామా? అడిగినోళ్లు అడిగినట్లు ఎంత పంచుకుంటూ పోయినా సరే…మిగిలేది ఎంత లేదన్నా…ఇంకో పది కొండలు కొనేంత? అమ్మా…గుడి కట్టేయడమే…అదే చేయాలనకుంటే ఇంతెందకు? ఈ తంతంతా ఎందుకు? అందుకే అడగిన వారికి అడిగినట్లు సమర్పించుకుంటూనే వుంటాం…కాని … ఆ గుడి అంటూ…ఆ ఒక్కటీ అడక్కు….!!! గుడి అంటూ మళ్లో సారి మాట్లాడొద్దు…సరేనా…అంతే కదా…! ఇదే కదా..!! జరుగుతోంది గుంటూరు స్వామి!!! ఇక్కడ అడిగేవారు అడుగుతున్నారా? లేక ఇచ్చేవారు ఇచ్చేస్తున్నారా? అన్న దాని గుట్టు కూడా పూర్తిగా గుంటూరు శివ స్వామి మాత్రమే విప్పాలి. సర్వసంగ పరిత్యాగులైన వాళ్లే అసలు బండారం బైట పెట్టాలి. అక్కడ గుడి వుంటుందా? వుండదా? తేల్చి చెప్పాలి. ఈ దాగుడు మూతలకు తెరదించాలి…! కరిమింగిన వెలగ పండులో కనీసం పెంకైనా మిగులుతుందేమో! కాని గుట్ట మింగిన వాళ్లు ఇసుక రాయి ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు. సహకరించిన వాళ్లకు వాటాలకు వాటాలు పంచుకుంటూ పోతూ, నోర్లు మూయిస్తున్నారు? ఇసుక రేణువు కూడా ఆనవాలు కనిపించకుండా. చదును చేసి, దేవుణ్ణి ఖాళీ చేయించి, నివాసాలకు అనువు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ కొండ, గుడి అని చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నారు. కొబ్బరి కాయ కొడితే చాలు పక్కన పడి వుంటాడు…అని దేవుణ్ణి ఓ మూలన పడేశారు. ఇంకే ముంది? నోరెత్తినవాళ్లందరినీ నోట్ల కట్టలతో మూయించారట? కోట్లకు కోట్లు విసిరేస్తున్నారట. ఈ మాట స్పష్టంగా గుంటూరు స్వామి, మీడియా సమక్షంలో, భక్తుల సందోహంలో చెప్పిన మాట. ఆయన ఏ ఒక్కరినీ వదల్లేదు. ఎవరినీ విడిచిపెట్టలేదు. ఎవరు ఎంతెంత తీసుకున్నారన్నదానిని పూస గుచ్చినట్లు చెప్పారు. మాటల తూటాలు పేల్చారు. అయినా ఏ ఒక్కరి నుంచి స్పందన లేదు? మేం తీసుకోలేదని చెప్పిన వాళ్లు లేరు? అంటే మౌనం అర్ధాంగికారమా? పూర్ణాంగీకారమా? అన్నది తెలియాల్సివుంది. కోట్లు జేబులో వచ్చి చేరాయి…దేవుడు పేరుతో జేబులు నిండాయి. గుడి ఎటు పోతే మాకేంటి? గుట్ట మాయమైతే మాకేంటి? దేవుడు ఎటు వెళ్లిపోతే మాకేంటి అనుకుంటున్నారా? అసలేం జరిగింది?: రెడ్‌ఫోర్ట్ అక్భర్ పేరిట ఓ వెంచర్ ఏర్పాటుకు రాత్రికి రాత్రికి జూబ్లిహిల్స్‌లోని ఓ గుట్ట చుట్టూ రేకులు కట్టేశారు. ఒక రకంగా చెప్పాంటే గుట్టను చుట్టేశారు. దాని మీద రాతలు రాసేశారు. ఆ స్ధలం విస్తీర్ణం కూడా రాసేశారు. అక్కడో గుడి వుంది. ఆ గుడిలో అభయాంజనేయ స్వామి దేవుడున్నాడు. కాని స్వామిని భక్తులకు కనిపించకుండా చేశారు. భక్తులు వెళ్లేందుకు దారి లేకుండా చేసేశారు. పూజలు బంద్ చేశారు. భక్తులకు దూరం చేశారు. ఈ ముచ్చట, ఆనోట ఈనోట జనానికి తెలిసిపోయింది. ఒక్కొక్కరు వస్తూ వెళ్తున్నారు. ఇదేం చోద్యమనుకుంటున్నారు. ఈ వార్త భజరంగల్, విశ్వహిందూ పరిషత్ వాళ్లకు సమాచారం అందింది. ఇంకేముంది హడావుడి మొదలైంది. బిజేపి శ్రేణులు కదిలారు. ఏదో పెద్ద కథే జరిగేలా వుందని అందరూ అనుకున్నారు. ఆ సంస్ధ ప్రతినిధులు కూడా అనుకున్నారు. ఆ స్ధలం చుట్టూ ఏర్పాటు చేసిన రేకులు మాయం చేశారు. రాతలు తుడిపేశారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలు పెట్టారు. అధికారులు రంగంలోకి దిగారు. అందరూ కలిసి సంస్ధ యాజమాన్యానికి కొమ్ము కాశారు. మళ్లీ రేకులతో చుట్టేశారు. గట్టు మీద వున్న గుడి కూల్చేశారు. దేవుణ్ని కిందికి దించేశారు. అయినా ఎవరూ కదల్లేదు. దేవుడికే దిక్కులేకుండాపోతే మేం చేస్తామని సామాన్యులు అనుకున్నా, బిజేపి మాత్రం మేమున్నామన్నట్లు నమ్మించింది. నటించింది. ఇదీ అక్కడి ప్రజలు అంటున్నమాట. చాలా కాలం పాటు ఏ వివాదం లేకుండా పోయింది. ఆదాయ మార్గం కరువైందనుకున్న సందర్భంలో గుట్ట, గుడి బిజేపి నేతలకు ఓ వరంగా మారింది. స్ధానిక ప్రజా ప్రతినిధులకు ఓ కల్ప వృక్షంగా కనిపించింది. ఆఖరుకు బిజేపిలోని కొందరు పెద్దలకు, ఆరెస్సెస్, భజరంగదళ్ ముఖ్యులకు కూడా వరంగా మారింది. ఈ మాట గుంటూరు స్వామి చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎవరైతే గుడి విషయంలో ముడుపులు తీసుకున్నారో వాళ్లను ఆయా హిందూ సంస్ధలైన, బిజేపి అనుబంధ సంస్ధలనుంచి తొలగించాలని కూడా గంటూరు స్వామి డిమాండ్ చేశారు. అయినా ఉలుకూ , పలుకూ లేదు. కారణం ఏమైవుంటుంది? అన్నదానిపై ఎవరూ స్పందించకపోవడమంటేనే తేలు కుట్టిన దొంగలు కావడం కాదా? దేవుడినే మాయం చేసి, వాటాలు పంచుకొని?: ఇది నిజంగా ఏ నీతో నాయకులే చెప్పాలి. అది ప్రభుత్వ స్థలమని అందిరికీ తెలుసు. ఆ స్ధలం ఎలాంటి ఆక్షన్ లేకుండా, రెడ్ ఫోర్డ్ అక్భర్ అనే సంస్ధకు అత్తసొమ్ము, అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుసు. అసలే ప్రభుత్వం భూముల అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ఈ తరుణంలో హైదరాబాద్‌కు గుండెకాయా లాంటి ప్రదేశంలో అంత స్ధలం అప్పనంగా ఎలా అప్పగించారు? అందుకు ఎవరెవరికి ఎంత ముట్టాయన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి?. ఎక్కడికక్కడ భూములు వేలం వేసి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతుంటే, ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ స్పెషల్ జీవో ఇచ్చి, ఎలా దారాధత్తం చేశారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులంతా ఎలా సహకరించారు? అసలు అక్కడ గుడే లేదని ఓ తహసిల్ధార్ ఎలా రిపోర్టు ఇస్తాడు? అదే తహసిల్ధార్ ప్రభుత్వ స్థలమన్న బోర్డు గతంలో ఎందుకు పెట్టించాడు? అక్కడ గుడే లేకపోతే, 2016లో కార్పోరేటర్ విజయారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఎలా పిర్యాధు చేశారు? అన్నదానిపై ఎవరు క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని ఆరోపణలు ఎక్కడా వినలేదు?: ఏ గుడి అయినా ఎక్కడైనా గతంలో ప్రైవేటు స్థలాలలో వెలిసినట్లు చరిత్రలో లేదు. అలాగే జూబ్లిహిల్స్‌లోని ఈ అభయాంజనేయ స్వామి గుడి కూడా ప్రభుత్వ స్థలంలోనే వుంది. పూజలు కూడా జరుగుతున్నాయి. ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి గుట్ట మొత్తం ఓ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ప్రభుత్వం, గుడిని కూల్చేసుకోండి అని ఏమైనా ప్రత్యేక అనుమతినిచ్చిందా? స్ధానిక ఎమ్మెల్యే గుడి కూల్చేందుకు ఎలా సహకరిస్తాడు? ఏకంగా గుడి కోసం నాలా కబ్జా చేసిన బిల్డర్ల్‌కు సహకరిస్తూ, ఎలా కొబ్బరి కాయ కొడతారు? నాలా స్థలంలో గుడి నిర్మాణం సాధ్యమయ్యేదేనా? అలా నిర్మాణం చేయొచ్చా? గుడి ప్రాంతాన్ని కాదని, కొండను తవ్వి, గుడిని, దేవుణ్ణి దూరంగా విరిరేస్తామంటే ఎమ్మెల్యే ఎలా ఒప్పుకున్నారు? గుంటూరు స్వామి చెప్పినట్లు అందరకీ వాటాలు వెళ్లాయన్నట్లు…ఇక్కడ కూడా జరిగిందా? అన్న అనుమానం ప్రజలకు రాకమానదు. స్ధానిక ప్రజా ప్రతినిధిగా వున్న ఎమ్మెల్యే ఎవరికి రక్షణ కోసం వున్నట్లు? ఎవరికి కొమ్ము కాస్తున్నట్లు? ఇదే వరుసలో అసలు గుడిని అడ్డుకోవాల్సిన స్ధానిక కార్పోరేటర్ కు కూడా తులాభారం అందినట్లు చెబుతున్నారు. నిజమేనా? అన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక దీనిపై మొదటినుంచి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్న మరో బిజేపి నాయకుడు పల్లపు గోవర్ధన్‌కు ఓ హోటల్‌లో కోటి రూపాయుల తీసుకున్నట్టు గుంటూరు స్వామి వెల్లడిరచారు. ఇది నిజమేనా? ఇక మాజీ ఎమ్మెల్యే బిజేపి నాయకుడికి కూడా పెద్దఎత్తున ముడుపులు అందాయన్న మాట వినిపిస్తోంది? నిజమేనా? భజరంగ్ దళ్, ఆరెస్సెస్ నాయకులకు కూడా అమ్యామ్యాలు అందుకున్నట్లు గుంటూరు స్వామి వాళ్లు ఆ సంస్థలకే చీడ పురుగులు అన్నంత మాట మాట్లాడారు? అయినా వారిపై ఆయా సంస్ధలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముడుపుల విషయంలో నోరెందుకు తెరవడం లేదు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపై వుంది. బిల్డర్లు ఎంతో చాకచక్యంగా?: సమస్యను పక్క దోవ పట్టించడంతో ఆ సంస్ధ ప్రతినిధులు ఆడుతున్న చదరంగం ఎంతో చాకచక్యమైంది. వారు వేస్తున్న పాచికులు ఎంతో చాణక్యమైనవి. అసలు వివాదం పైకి కనిపించకుండా, నోరు తెరిచిన వారందరినీ నోట్లకట్టలతో కొనేసి, తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు, ఒకరి మీద, మరొకరిని ఉసిగొల్పి, అసలు రాజకీయం నెరిపి, గుట్టను ఇప్పటికే సగం తరలించారు. ఇంకా వున్నా…చూస్తున్నంతలో అంతా మాయమౌతుంది. టిఆర్‌ఎస్ రాలేదు. బిజేపి వచ్చినా…ఇక గుంటూరు స్వామి అసలేం జరిగిందో చెప్పేశాడు. కాంగ్రెస్ ఎప్పుడొచ్చిందో…ఎప్పుడు మౌనాన్ని ఆశ్రయించిందో తెలిసిందే…చిన్న చిన్న విషయాలను పెద్దది చేసే రేవంత్ రెడ్డి, ఇంత పెద్ద విషయాన్ని వందల కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంటే కళ్లు మూసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడంలేదు. కొన్నవారిని గురించి వివరాలు వెల్లడిరచలేదు. ఇక పిపిసి అధికార ప్రతినిధిగా దాసోసు శ్రవన్ ఒక్కసారి మీడియా సమావేశం… ఆ తర్వాత దాన్ని నిద్రలోనే మర్చిపోవడం చేసేశారు…ఒక రకంగా అందరూ మర్చిపొమ్మని చెప్పేశారు…! ఇదీ సంగతి…
` దొరికినా వాళ్లింకా నిజాయితీ పరులేనా? ` రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సస్పెండైన వారిపై చర్యలు తీసుకోరా..? ` ఎక్కడ మా మేడకు చుట్టుకుంటుందో నని ఎలాంటి దర్యాప్తు లేకుండానే వదిలేస్తారా? ` కావాలనే కాలయాపన చేస్తూ అక్రమార్కులకు ప్రోత్సాహమా..?
` కమీషనర్ గారు ఒక్కసారి ఇటువైపు చూడండి ` పూర్తి లెక్కలు తీయించండి? ` సస్పెండ్ అయినవారి సంగతి తెల్చాలనే డిమాండ్ ` తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు.. మరిచిన జిల్లా పెద్దలు..? ` ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా పద్దతి మార్చుకోని వారిపై ఓ కన్నేయండి? హైదరాబాద్ , నేటిధాత్రి : ఆస్ధి…ఈ మాట వినగానే ఎవరికైనా ఒక ధైర్యం. ఒక భరోసా…అది నివాసమైనా, సాగు భూమైనా జీవితానికి సంబంధించినది. ఆకలి తీర్చుతుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే అలాంటి ఆస్ధులలో స్ధిరాస్ధులు అన్నవి ఎంతో కీలకం. అలాంటి వాటిని తమ సొంతం చేసుకోవడానికి, వాటిపై యాజమాన్య హక్కులు సాధించుకోవడం అవసరం. అందుకోసం ప్రభుత్వానికి అవసరమైన చెల్పింపులు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తమదైపోతుంది. తమ ఆస్దిగా స్ధిరపడిపోతుంది. ఇక్కడే దళారులకు, రిజిస్ట్రేషన్ అధికారులకు పండగ. సహజంగా క్రయ విక్రయ ప్రక్రియలు సమాజంలో సహజం. పైగా రియలెస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరగడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు తాకిడిపెరిగింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో రిజిస్ట్రేషన్ల శాఖ అంత్యంత కీలకమైంది. రాజుల కాలం నుంచైనా సరే భూమి శిస్తు అన్నది అత్యంత ప్రధానం. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ఎవరి స్ధిరాస్ధి వారిదే అన్నది రుజువుకు ఇదే ఆధారం. అందులో మార్పులు, చేర్చులు, చేతులు మారడాలు అన్నది జరిగిన ప్రతీసారి రిజిస్ట్రేషన్ తప్పని సరి. ఇదే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది. దాంతో ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాయలం గుమ్మం తొక్కాల్సిందే. ముడుపులు చెల్లించాల్సిందే. కాగితాలు ఎంత పక్కాగా వున్నా సరే…అక్కడ ఆమ్యామ్యాలు చెల్లించకపోతే ఫైలు కదిలే సమమస్యే లేదు. ఏదో ఒక తిరకాసు సృష్టించాల్సిందే ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. స్టాంపు వెండర్ దగ్గర నుంచి మొదలు, డాక్యుమెంటు రైటర్, సబ్ రిజిస్ధ్రార్ దాక. మధ్యవర్తులు, సబ్ రిజిస్ట్రార్‌లు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యాలు ఇంత మందిని సంతృప్తి పరిస్తే తప్ప, డాక్యుమెంటు మీద సంతకం పడదు. నీ చేతికి రాదు. ఇదీ జనం అవస్ధలు. ఈ అవస్ధలు అందరికీ తెలిసినే…అయితే అప్పుడప్పుడు మేం వున్నామంటూ ఓసారి ఏసిబి దాడులు. ఇంత వరకు బాగానే వుంది. సస్పెండ్ చేసినట్లు ఓ ముక్క చెప్పడం…వదిలేయడం రిజిస్రేషన్ల శాఖలో పరిపాటిగా మారింది. వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తక్కువేం లేదు. ` వరంగల్‌లో సస్పెండైన వారిపై కానరాని చర్యలు వరంగల్‌లోనే సంపత్ కుమార్, రాంచంద్రయ్య, శ్రీనివాస్, సురేంద్రబాబు నలుగురు సస్పెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అనేక మంది రిజిస్ట్రార్‌లు పట్టుబడ్డారు. అందులో ఏదో చిన్న చిన్న మొత్తంతో కాదు, ఏకంగా లక్షల రూపాయలుతో కూడా పట్టుబడిన వారున్నారు. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ ఏకంగా రూ.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఆయనకు సహకరించిన డాక్యుమెంటు రైటర్ వాసును కూడా ఏసిబి వాళ్లు పట్టుకున్నారు. కాని ఏమైంది. దర్యాప్తు ఎంత వరకు వచ్చింది. అన్నది ఎప్పుడో మర్చిపోయారు. దాని మూలాలు వెతకడం వదిలేశారు. గత ఏడాది సెప్టెంబర్ 7న బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్ ఏసిబికి పట్టుబడ్డారు. రూ.75వేలు తీసుకుంటుంటగా ఏబిసి వల వేసి పట్టుకున్నది. కాని ఏమైంది. ఏం కాలేదు. ఆ తర్వాత ఫైలు ముందుకు కదల్లేదు. ఆయనపై విచారణ పెద్దగా సాగింది లేదు. ఇటీవల కాలంలో యాదాద్రి లోనూ సబ్ రిజిస్ట్రార్ కాలం కలిసొచ్చిందనుకున్నాడో ఏమో! ఇక అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డాడు. పరిసర ప్రాంతాల్లో భూములకు పెద్దఎత్తున డిమాండ్ విపరీతంగా పెరిగింది. నగరానికి దగ్గర కావడంతోపాటు, యాదాద్రి పేరుతో నూతన ఆలయ నిర్మాణం జరగడంతో అక్కడ ప్రాంతాలకు ఒక్కసారిగా రియలెస్టేట్ భూమ్ వచ్చేసింది. సహజంగా యాదాద్రి చుట్టుపక్కల భూముల ధరలు రాత్రికి రాత్రి విపరీతంగా పెరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని చేర్చాక మరీ రియలెస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా వెంచర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ల విక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాంతం అభివృద్ధి చెందుతుండడంతో, అక్కడ భూములు కొనేసుకునేందుకు ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇది రిజిస్రేషన్ల శాఖకువరమైంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ` యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇదే సమయంలో యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఏకంగా దుకాణమే తెరిచినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. రైతులు, వ్యాపారులు, సామాన్యుల నుంచి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ పేరిట వసూలు చేస్తున్నారని ఏసిబికి ఉప్పందింది. దాంతో వాళ్లు రిజిస్ట్రార్ కార్యాలయంలోనే సోదాలు చేసి దేవానంద్‌ను పట్టుకున్నారు. రియల్టర్‌ను బెదిరించి మరీ వసూలు పేరుతో డాక్యుమెంటు రైటర్ వసూలు చేయడాన్ని ఏసిబి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను సస్పెండ్ చేశారు. పైగా అదే సబ్ రిజిస్ట్రార్ ఇంట్లోకూడా పెద్దఎత్తున సోదాలు నిర్వహించి భారీగా నగదు కూడా, డాక్యుమెంటు, ఆస్ధులు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లుపై కూడా వేటు పడిరది. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఆయన ఏకంగా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల చేయడం. రాత్రిళ్లు కూడా కార్యాలయంలోనే వుంటుండడం… పెద్దఎత్తున చీకటి సమయంలో అక్రమ రిజిస్రేషన్లు చేస్తున్నట్లు తెలిసి, ఏబిసి రైడ్ చేసి మరీ పట్టుకున్నది. అక్కడ అక్రమంగా ఏకంగా 400పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెల్లడైంది. ` మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ అప్పారావు వీళ్లే కాదు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ అప్పారావు ఆ మధ్యే సస్పెండ్ అయ్యారు. లక్సెట్టిపేట ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ రతన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ నలుగురు రిజిస్ట్రార్‌లతోపాటు, ఇతర సిబ్బంది సస్పెండ్ అయివున్నారు. కాని వారిపై చర్యలు మాత్రం తీసుకున్నది లేదు. ఇలా ఇంత మంది సబ్ రిజిస్ట్రార్‌లు పట్టుబడినా వారిపై శాఖాపరమైన చర్యలు లేవు. వారికి శిక్షలు లేవు. సస్పెండ్ పేరుతో ఉద్యోగానికి కొంత కాలం మాత్రమే దూరం చేస్తున్నారు. అంటే తర్వాత ఎప్పుడో అదును చూసి వారికి తిరిగి విధులు అప్పగించడానికే అన్నది ఇక్కడ స్పష్టమౌతోంది. పైగా కాలం గడిస్తే, ఆయనది తప్పేం లేదన్నట్లు కూడా రికార్డులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. అంతా పై అధికారుల చేతుల్లో పని. వారు కూడా కనికరిస్తే చాలు మళ్లీ ఉద్యోగంలో చేరడం పెద్ద పని కాదు. సాక్ష్యాత్తు వారు ఏసిబి వలలో చిక్కినా వారికి ఎప్పుడైనా మళ్లీ పోస్టింగులు రావొచ్చన్న మాటే డిపార్టుమెంట్లో చెబుతున్నారే గాని, వారికి శిక్ష పడుతుందన్న మాట ఎవరి నుంచి రావడంలేదు. వారి మీద ఎలాంటి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినా పై వారి లీలలు కూడా బైట పెట్టేందేకు సస్పెండ్ అయిన ఉద్యోగులు వారి గుట్టు బైట పెట్టేందుకు సిద్దపడుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అందుకే సస్పెండ్ అయిన వారి పట్ల ఉదాసీతన కనబర్చుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. మొండికిపోయి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారంటే వారి పాత్ర ఎంత వుందనేది కూడా ఇక్కడే స్పష్టమౌతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాలం గడిస్తే అంతా సర్ధుకుంటుంది. లేకుంటే మన మెడకు చుట్టుకుంటుంది. ఎందుకు తొందరపడడం అన్న ఆలోచనలతో చాలా మంది పై అధికారులు కాలయాపనపైనే మొగ్గు చూపుతున్నారని సమాచారం. అందుకే పూర్తి స్ధాయి ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. సంబంధిత శాఖ కమీషన్ శేషాద్రి అధ్యక్షతన ఉన్నత స్ధాయి కమిటీ కూడా ఏర్పాటైంది. దాంతో సస్పెండ్ అయిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో వారి పరిస్థితి కథ కంచి చేరొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కూడా పెద్దఎత్తున చర్యలు తీసుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఎందుకైనా మంచిది కమీషనర్ ముందు తన శాఖనుంచే ప్రక్షాళన మొదలు పెడితే మరింత రసవత్తరంగా వుంటుంది. అవినీతి పరుల ఆట కట్టినట్లైతుంది.
కేంద్ర రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు ` కేంద్రం ఒక మిథ్య…అది ఎన్టీఆర్ మాట ` అదే బాటన కేసిఆక్ రాజకీయ మార్పుకు శ్రీకారం ` థర్డ్ ఫ్రంట్ నిర్మాణ దిశగా ప్రయత్నాలు ` జాతీయ స్ధాయిలో ముమ్మరంగా చర్చలు ` లౌకిక వాద శక్తుల ఏకంతో సరికొత్త సమీకరణాలు ` కాంగ్రెస్‌తో కలవడమా? లేదా? అన్నది తర్వాత ` ముందు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమే అసలు ఎజెండా ` జాతీయ పార్టీలను శాసించడమే అసలు లెక్క
హైదరాబాద్ , నేటిధాత్రి: చూసే చూపు, వేసే అడుగు, మాటల్లో వాడీ, వేడీ…చిత్తశుద్ది, వాక్‌శుద్ధి వుంటే నాయకుడు అనుకున్నది సాధిస్తాడని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ నిదర్శనం. ఆయన అడుగులు తార్కాణం. ఆయన ఆశయాలు ఆదర్శం. ఆయన నిర్ణయాలు ప్రయత్నం…ఆయన ఎంచుకున్న ఉద్యమం నినాదం…జై తెలంగాణ జెండా ఎగరేయడమే, ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం అనుకున్నారు. సాధించాలనుకున్నారు. పిడికిలెత్తారు. జనాన్ని ఏకం చేశారు. జనమంతా జై తెలంగాణ అనేలా చేశారు. ముక్కొటి మంది తెలంగాణ వాదులు ఏకమయ్యారు. పిల్లా, జెల్లా, ముసలీ, ముతక అందరూ అదే నినాదం…ఎవరి నోట విన్నా ఒకటే విధానం..అదే తెలంగాణ వాదం…తెలంగాణ సాధన కార్యం. అంతే కాలం కరిగిపోయింది. రణం చివరి దాకా నడిచింది. పద్నాలుగేళ్ల ఉద్యమ కళ్లు మూసితెరిచినంత కాలంలో సాగిపోయింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. కేసిఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ ఆవిష్కారమౌతోంది. అదీ నాయకుడి చూపుకు వుండే విలువ. అదే నాయకుడి మాటకుండే విలువ. ఒకనాడు ఉద్యమ నాయకుడు కేసిఆర్ సభలైనా, మాటలైనా, టివీలలో చర్చలైనా, సిడీలలో ఆయన ప్రసంగాలైనా సరే…ఎక్కడ విన్నా అవే మాటలు.. ఏ పెళ్లిలోనూ తెలంగాణ పాటలే…అంతే అదంతే…తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర నిర్మాణమే…అలా నాయకుడి మాట మంత్రం కావాలి. ఆయన మాటలే మంత్రోపదేశాలు కావాలి. జనం నమ్మాలి. నరనరాన ఆయన మాటలు జీర్ణించుకోవాలి. అదే 2001లో మొదలైంది. 2014లో ఫలించింది. అందుకే కేసిఆర్ ఇప్పటికీ ఏది మాట్లాడినా, ఏది చెప్పినా ఎంతో ముందు చూపుతో చెబుతారని అంటారు. నమ్ముతారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసిఆర్ మొదటిసారి మూడో ఫ్రంట్ ముచ్చట చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ మాట కేసిఆర్ మర్చిపోయారు. అని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు అనుకున్నారు. కాని ఆయనను నమ్మిన వాళ్లు మాత్రం అమ్ములపొదిలోని అస్త్రాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసే రకం కాదు కేసిఆర్ అని అనుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. అస్త్రశస్త్రలు తీసే సమయం ఆసన్నమైంది. దేశ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. జనం ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సరైన సమయం. ఈ సమయంలో మూడో ఫ్రంట్ అన్న మాట కాకపోయినా, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో చలనం వచ్చిందన్న నమ్మకం ప్రజలకు కలగాలి. బలంగా వున్న ప్రాంతీయ పార్టీలు ఏకమౌతున్నాయని అనిపించాలి. అప్పుడు జాతీయ పార్టీల వైపు ప్రజలు చూడరు. జాతీయ ప్రయోజనాల పేరుతో రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాదికి, బిజేపి ఏతర రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓ వైపు రైతాంగ సమస్యలు…మరో వైపు నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు…అడ్డూ అదుపు లేకుండా పోతున్న భూముల ధరలు…సామాన్యుడు బతకలేని పరిస్ధితులు.. ప్రెటో, డీజిల్ ధరలు…వంటగ్యాస్ కొనలేని పరిస్ధితులు. ఇవన్నీ బిజేపి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అందుకే ఇదే సరైన సమయం. ఆ మధ్య ముఖ్యమంత్రి కేసిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవడంతోనే అసలు స్కెచ్ మొదలైంది. దేశంలో వరుసగా బిజేపిపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లడం వంటివి చూస్తూనే వున్నాం. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలవడం, రాజకీయాలపై చర్చలు జరపడం ఒక ఎత్తు. అంతకు ముందే సిపిఎం జాతీయ నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌తో బేటీ కావడం అన్నది అందుకు బలాన్ని చేకూర్చింది. ఉత్తరాధి విషయానికి వస్తే, ఆప్, తృణమూల్ పార్టీలు ఎలాగూ థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేయొచ్చు. ఎలాగైనా రాజకీయ సమీకరణాలు మొదలు కావడం అన్నది ఒక శుభపరిణామం…అది కేసిఆర్ వల్లనే సాధ్యం. రాష్ట్రాలను చిన్న చూపు చూడడం అన్నది జాతీయ స్ధాయి రాజకీయాలకు అలవాటు. అందులో ఉత్తర భారతంలో బలంగా వున్న జాతీయ పార్టీలు దక్షిణాధి రాష్ట్రాలను పెద్దగా పట్టించకోవన్న ఆరోపణలు ఇప్పటికే వున్నాయి. అందుకు కాంగ్రెస్, బిజేపి ఏం మినహాయింపు కాదు. కాకపోతే కాంగ్రెస్‌కు గతం నుంచైనా దక్షిణాదిలో బలం ఎక్కువే. కాని నాయకత్వం మాత్రం మొత్తం ఉత్తరాధిదే. ఇది కాంగ్రెస్‌లో వున్న ఏకైక అసంతృప్తి. ఇక బిజేపిలో మాత్రం మొత్తం ఉత్తరాధి పెత్తనమే. దక్షిణాదిలో అంత బలమైన నాయకుడు ఎవరూ లేరు. ఎదగనీయరు అన్న విమర్శలు బిజేపిలో వున్నాయి. గతంలో దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్ అధ్యక్షుడిగా వుండడాన్ని సహించలేని ఉత్తరాధి నాయకత్వం ఆయనను తెహల్కా పేరుతో పార్టీ ఫండ్‌ను కూడా అవినీతిగా చిత్రీకరించి, దించేసింది. మనో వేధనకు గురిచేసింది. పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన బంగారు లక్ష్మణ్ చేసింది తప్పు కాదని తెలుసు. కాని ఆయనపై కక్షపెంచుకున్న కొంత మంది నేతలు చేసిన నిర్వాకం మూలంగానే ఆయన నిష్క్రమణం అలా జరిగిందని అంటుంటారు. అలాగే దక్షిణాదినుంచి మరో బలమైన నేతగా ఉన్నత స్ధాయికి ఎదిగిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కావాలనే ఉత్తరాధి నాయకత్వం పక్కనపెట్టిందన్న అసంతృప్తి దక్షిణాది రాజకీయ నాయకులకెంతోమందికి వుంది. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా వుంటే దక్షిణాదికి ఇప్పటికే ఎంతో మేలు జరిగేనే మాట వుండనే వుంది. గత ప్రభుత్వ హయాంలో తొలి నాళ్లలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు అనేక నిధులు అందించిన సంగతి తెలిసిందే. పైగా తనదైన శైలిలో రాజకీయాలు చేసే వెంకయ్య నాయుడును మౌన ముని చేసేశారన్న మాటలు వింటూనే వుంటాం. ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగమే కావచ్చు. కాని కొన్ని ప్రాంతాల బలమైన వాయిస్ వినిపించకుండా చేయడం కూడ సరైంది కాదు. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజేపిలు దక్షిణాదిపట్ల కొంత వివపక్షపూరితమైన రాజకీయాలు చేస్తారన్న అపవాదు మాత్రం వుండనే వుంది. కాంగ్రెస్ నుంచి దక్షిణాది ప్రధాన మంత్రిగా పని చేసిన మొదటి ప్రధాని పి.వి. నర్సింహారావుకు చివరి క్షణాలలో ఇచ్చిన మర్యాద ఏమిటో చూసిందే…అందరికీ తెలిసిందే. నాడు కాంగ్రెస్‌ను అందరూ దుమ్మెత్తిపోసింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌లో మార్పు వస్తుందనే అనుకుంటున్నారు…థర్డ్ ఫ్రంట్‌తో కలిస్తే తప్ప కాంగ్రెస్‌కు కూడా భవిష్యత్తు లేదనే అనుకుంటున్నారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ముందగుడు ఎప్పుడు వేస్తారా! అని ఎదురుచూస్తున్నారు.
ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం కుటుంబసమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా కరోనతో విముక్తి పొంది సుఖ సంతోషాలతో.ఆరోగ్యంగా ఉండాలని..ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్.రథసారథి KTR గారి సారధ్యంలో మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని కోరుతు..ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.