వ్యవసాయ క్షేత్రాలకు రైతులు వెళ్లేందుకు దారిని పరిశీలించిన అధికారులు

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దారి ఏర్పాటుకు అధికారుల చర్యలు

బోయినిపల్లి:నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ శివారు వెంకట్రావుపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరు కట్ట క్రింద ఎస్సార్ పెట్రోల్ పంపు ప్రక్కన గల దారి రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం ఐదు మీటర్ల స్థలం వదిలిపెట్టి, పక్కన ఇనుపజాలి కంచెను నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ పెట్రోల్ బంకు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన కంచెను తొలగించి,ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.ప్రస్తుతం రైతులు వ్యవసాయ భూముల్లోకి,చేనుల్లోకి వెళ్లడానికి నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన దారి లేనందున కంచెలోపల నుండి రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తున్నారు. రైతులు వెళ్లే దారి నుండి భారీ లారీలు గ్రానైట్ ఫ్యాక్టరీలకు రావడం గమనించిన సంబంధిత ఉన్నతాధికారులు దారిని మూసివేశారు. రైతులు చేనుల్లోకి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నదని గతంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని రైతులు సమర్పించిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి రైతులకు కేటాయించిన దారి గురించి అడిగి తెలుసుకొని, పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డి.ఈ. రాజు,ఏ.ఈ. జగన్నాథ్,రైతులు చెంచు నాగరాజు,కొండం శ్రీనివాసరెడ్డి,ఆవుల లక్ష్మణ్, ఎర్ర బాల్ రెడ్డి,ఎర్ర లింగారెడ్డి, ఎర్ర నాగరాజు,గూడ బుచ్చిరెడ్డి,ఆవుల బాపురెడ్డి, ఆవుల కిషన్,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *