త్వరలో కేటిఆర్‌ సిఎం!

`కేటిఆర్‌ సీఎంగానే వచ్చే ఎన్నికలు.

`పార్టీలో యువత ప్రధాన్యం పెరగాలంటే కేటిఆర్‌ సీఎం కావాలి.

`పార్టీ శ్రేణులనుంచి పెరుగుతున్న ఒత్తిడి.

`మంత్రుల మనసులో మాట ఇదే…

`సీనియర్లు చర్చించుకుంటున్నదీ ఇదే విషయం.

` కేసిఆర్‌ దేశ రాజకీయాలపై పూర్తి దృష్టి.

`సీనియర్‌ నేతలంతా కేసిఆర్‌ తో దేశ రాజకీయాలకు…

`యువకులంతా కేటిఆర్‌ తో రాష్ట్ర రాజకీయాలు.

` బిజేపికి కళ్లెం వేయాలన్నా, కాంగ్రెస్‌ ను కట్టడి చేయాలన్నా ఇదే సరైన సమయం.

`బిజేపి పన్నుతున్న కుయుక్తులను దేశ స్థాయిలో కేసిఆర్‌.

`రాష్ట్ర స్థాయిలో కేటిఆర్‌ ఎదుర్కోవడమే మేలు.

`రాష్ట్రం మీద సమస్యల పట్టు కేటిఆర్‌ సొంతం.

`పరిపాలనపై ఇప్పటికే పూర్తి స్థాయి పట్టు.

`పార్టీపై నిర్థిష్ట ప్రణాళికతో ముందుకు

`అన్ని రకాలుగా అన్ని విషయాలపై సమగ్ర అవగాహన

`దేశ విదేశాల పాలనలపై ప్రత్యక్ష అనుభవం.

`పారిశ్రామిక ప్రగతిపై ఇప్పటికే అనేక సమ్మిట్లు…

`నాయకులతో కలుపుగోలు తనం…

`ఎప్పుడూ ఉల్లాసంగా కనిపిస్తూ గౌరవంగా పలకరింపు కేటిఆర్‌ వ్యక్తిత్వం.

`ఎవరు పిలిచినా పలికే తత్వం…

`ట్విట్టర్‌ ద్వారా సమాచారం అందించినా స్పందించే గుణం.

`రాజకీయాలలో వుండాల్సిన సంపూర్ణ నాయకత్వం కేటిఆర్‌ నిదర్శనం

`సేవాభావానికి నిలువెత్తు సాక్ష్యం. 

`అందరూ అజాత శత్రువు అని పిలుచుకునే మూర్తిమత్వం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కల్వకుంట్ల తారకరామారావు అనే నేను…అనే మాట త్వరలో అశేష ప్రజానీకం నడుమ వినపడనుంది. ఎట్టకేలకు కొద్ది రోజుల్లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సిఎం కానున్నారు. ఇది ఫిక్స్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమచారం. గత కొంత కాలంగా ఈ మాట వినిపిస్తున్నా అప్పటి పరిస్ధితుల దృష్ట్యా వాయిదా పడుతూ వచ్చిందే. సరైన సమయం కోసం ఎదురుచూడాల్సివచ్చింది. కాని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ స్ధానం, కేసిఆర్‌ రాజకీయ ప్రస్ధానం మరో రెండు దశాబ్ధాల పాటు సాగాలంటే, భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ శక్తిగా నిబడాలంటే యువతరం నాయకత్వం కావాలి. పరిపాలనలోనూ యువతరం రంగంలోకి దిగాలి. అందుకు ముఖ్యమంత్రిగా కేటిఆర్‌ను రంగంలోకి దింపాలి. ఇంకా ఆలస్యం చేస్తే కూడా నష్టదాయం కావొచ్చన్న సూచనలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణ నూతన సచివాలయంలో కొత్త కేటిఆర్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. నిజానికి సచివాలయం దసరాకే పూర్తి చేసి, ప్రారంభిద్దామనుకున్నారు.కేటిఆర్‌ సిఎం కావడానికి సుమూర్తాలు తర్వాత వున్నాయన్న సూచనల మేరకు వాయిదా మాత్రమే పడిరది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర నాయకుల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ఒత్తిడి వున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ రాజకీయాలమీద దృష్టిపెడుతున్నారు. పార్టీ పేరు కూడా మార్పు జరిగింది. ప్రజల్లోకి ఆ పార్టీ పేరు వెళ్లింది. దేశ రాజకీయాల్లో నూతన శకం రానున్నదనే సంకేతాలు దేశ వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు క్లియరెన్స్‌ వస్తుందా? అన్న ఎదురు చూపు మాత్రమే మిగిలివుంది. ఇప్పటికే దేశ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తున్న కేసిఆర్‌ అనేక రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. ఆ మధ్య డిల్లీలోనూ ఓ పది రోజుల పాటు వుండి, బిఆర్‌ఎస్‌ నిర్మాణ పనులను సమీక్షించారు. ఇప్పుడు కూడా ఆయన డిల్లీకి వెళ్లారు. అటు జాతీయ రాజకీయాలు, ఇటు రాష్ట్ర ప్రరిపాలనా వ్యవహారాలు ఏకకాలంలో చూడడం అన్నది ఎంతైనా ఇబ్బంది కరమే. రాష్ట్రంలో ఎంత యంత్రాంగం వున్నప్పటికీ ముఖ్యమంత్రి స్వయం పర్యవేక్షణ లేని పాలన కొంత ఇబ్బంది కరమే…అందుకే ప్రతిపక్షాల నుంచి ఆ అపవాదు ఎదుర్కొనే అవకాశం రాకముందే కేటిఆర్‌ను సిఎం చేయాలని సంకల్పించినట్లు కూడా తెలుస్తోంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తనయుడిగా కేటిఆర్‌ మాటే ఎక్కడైనా చెల్లుబాటు అవుతోంది. పైగా ప్రతిపక్షాలు కేటిఆర్‌ను డిఫాక్టో సీఎం అంటూనే వున్నారు. అది నిజం చేసి, కేసిఆర్‌ డిల్లీ రాజకీయాలకు వెళ్లడానికి కూడా ముహూర్తం రెడీ అయ్యింది.  

టిఆర్‌ఎస్‌లో యువత ప్రాధాన్యం మరింత పెరగాలి.అందుకు కేటిఆర్‌ నాయకత్వం, పరిపాలన ఎంతో అవసరం. ఎంత కాదనుకున్నా, రాష్ట్రంలో కొంత యువత బిజేపి వైపు ఆకర్షితులౌతున్నారు. మరి కొంత రేవంత్‌ వర్గంగా ముద్రపడుతున్నారు. ఒక్కసారి కేటిఆర్‌ రంగంలోకి దిగితే యువతను కదిలిస్తే ఆయన వైపు మళ్లడం జరుగుతందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ రాజకీయాల్లో నిన్న తరం తర్వాత నేటి తరం అన్నది ఎంతో ముఖ్యం. గత తరం త్యాగాల పునాదులు నేడు తెలిసిన వాళ్లతోపాటు, నేడు తెలియాల్సిన యువతరం కూడా కావాలి. వారికి కనెక్టు కావాలంటే టిఆర్‌ఎస్‌లో యువతరం రావాలి. అందుకు కేటిఆర్‌ నేతృత్వంలోనే అది సాగాలి. ఇదీ పార్టీకి చెందని నేతలు చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేటిఆర్‌కు ప్రజలతో సాన్నిహిత్యం వుంది. సుధీర్ఘ కాలం పాటు ఆయన కూడా ఉద్యమం కోసం అన్ని ప్రాంతాల ప్రజలతో ఆయనకు పరిచయాలు వున్నాయి. ఆయా ప్రాంతాల మీద పూర్తి స్ధాయి అవగాహన కూడా వుంది. ఇక ప్రజలను గుర్తించడంలో కూడ తెలిక. పార్టీపరంగానే కాదు, రాజకీయ నాయకులుగా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలిసిన నేత. ప్రజల్లోకి చొచ్చుకుపోయే తత్వం కేటిఆర్‌ది. ముఖ్యంగా పెద్దతరం ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆయన వ్యవహార శైలి అనేక సందర్బాలలో కనిపించింది. ఇక తెగువ కూడా వున్న నాయకుడు. ఉద్యమ కాలంలోనే కాదు, కరోనా కాలంలో ఆయన చూపిన చొరవ అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో బైటకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాని సందర్భాలలో కూడా మున్సిపల్‌ మంత్రిగా ఆయన హైదరాబాద్‌లో రెడ్‌ జోన్‌ ఏరియాల్లో కూడా తిరగుతూ ప్రేజలకు ధైర్యం చెప్పిన నాయకుడు. ఇది కేటిర్‌లో వున్న తెగువకు నిదర్శనం. ప్రజలపై ఆయనకు వున్న మమకారానికి సాక్ష్యం. ఉద్యమ కాలంలో ముందుండి నడిచినట్లే, ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు తీర్చడంతో కూడా అంతే ముందున్నాడు. అందుకే ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడినా సిరిసిల్ల గురించి ప్రస్తావించకుండా వుండలేరు. అంటే తనను ఎన్నుకున్న ప్రజలకు నూటికి నూరు శాతం సేవ చేయడంలో కేటిఆర్‌కు అందరికన్నా ముందుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మంత్రిగా ఆయన రాష్ట్రం మొత్తం కోసం చేసే సేవ ఏమిటో మన కళ్లముందే వుంది. ఆయన నిర్వహిస్తున్న శాఖల తీరుతోనే మంత్రి కేటిఆర్‌ పనితనం ఏమిటో చెప్పొచ్చు. రాష్ట్రం ఈ రోజు పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతుంటే అందుకు కారణం కేటిఆర్‌. ఆయన చొరవ. ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవన్ని నెరవేరాలన్నా, విజయవంతం కావాలన్నా సంబంధిత మంత్రి పని తీరు కూడా ఎంతో ముఖ్యం. అందులో కేటిఆర్‌ ముందున్నాడనేది అందరూ అంగీకరిచాల్సిన విషయం. అటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడిరటుగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకున్నాడు. పార్టీ అధ్యక్షుడుగా అరవై లక్షల కార్యకర్తలను తయారు చేసిన ఘనత కూడా ఆయనదే అని చెప్పాలి. ఇకమంత్రిగా ఐటి పరిశ్రమను నిలబెట్టాడు. 

పెద్దఎత్తున ఐటి కంపనీల ఏర్పాటుకు కృషి చేశాడు.ఒక దశలో తెలంగాణలో ఐటి పరిశ్రమ పరిస్దితి ఎలా వుంటుందో అన్న సందేహాలను సైతం పటాపంచెలు చేసి, ఐటికి తెలంగాణ కేఆర్‌ఆఫ్‌ అడ్రస్‌ చేశాడు. అంతే కాదు జిల్లాల్లో ఐటి పరిశ్రమలు అన్నది ఎవరూ ఊహించింది కాదు. కాని కరీంనగర్‌, హన్మకొండలలో ఐటి హబ్‌లను ఏర్పాటు చేయించారు. ఆ ఊహలను నిజం చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జరిగిన సమ్మిట్లకు హజరై పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చిన ఘనత కూడా కేటిఆర్‌కే దుక్కుతుంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ పరుగులుపెట్టడానికి అవసరమైన టిఎస్‌ ఐపాస్‌ వంటి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేసి, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గదామం చేశాడు. అంటే ఒక నాయకుడికి వుండాల్సిన విజన్‌లన్నీ కేటిఆర్‌లో వున్నాయనేది ఇక్కడ స్పష్టమైంది. ఇక రాజకీయంగా అందరి మన్ననలు పొందుతూ వివాదాలు లేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఎక్కడా ఎవరినీ నొప్పింపకుండా ఎక్కడా మాట దొర్లకుండా చూసుకునే నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ లా దూకుడు వున్నా, అది పనితనంలో తప్ప మాటల్లో చూపించడు. మాటలు ప్రవాహంలా వచ్చినా, వాటిని కొత్త దారులకు వినియోగిస్తాడు. అంతటి చాణక్యుడు కేటిఆర్‌. అటు పార్టీ పరమైన సమర్ధత, ఇటు పరిపాలనా పరమైన విశిష్టత వున్న నాయకుడిగా కేటిఆర్‌ ఎప్పుడో తన సమర్ధతను నిరూపించుకున్నాడు. పైగా పార్టీ మొత్తం ముక్త కంఠంతో కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలనడం కూడా చూస్తూనే వున్నాం. గతంలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్‌ అంటూ మంత్రులు కూడా చెప్పిన మాట. కాకపోతే అప్పుడు మంత్రులైనా, సీనియర్‌ నాయకులైనా ప్రజలతో చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కే చెప్పి, కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. దటీస్‌ కేటిఆర్‌…రేపటి తెలంగాణ డైనమిక్‌ విజన్‌, విస్‌డమ్‌ లీడర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *