గండ్ర వర్సెస్ సిరికొండ

*కరోనా వేల ఫ్లెక్సీ గోల*

*పార్టీ ఒక్కటే వర్గాలు రొండు*

శాయంపేట, నేటి ధాత్రి: కరోనా వైరస్ వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ దానికి భిన్నంగా శాయంపేట మండలంలో ఫ్లెక్సీల గోల తెర మీదికి వస్తుంది. సుదీర్ఘ కాలం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాలు చేసి, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా బాధ్యతలు చేపట్టిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన ఉద్యమాలను గుర్తించి శ్రీనివాస రామాంజనేయ ఫౌండేషన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఉద్యమ పురస్కారానికి ఎంపిక చేసి ఎంపిక పత్రాన్ని అందజేశారు. దీంతో శాయంపేట మండలంలోని సిరికొండ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తూ శాయంపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జూన్ 2వ తేదీన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రెండు రోజుల్లో గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం సిరికొండ వర్గీయులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కావాలనే కొందరు కలిసికట్టుగా ఆధిపత్యాన్ని చూపించుకోవాలనే హంక్షతో ఫ్లెక్సీ తొలగించినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో శాయంపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది.

*గండ్ర వర్స్ సిరికొండ*

శాయంపేట మండలంలో కరోనా వేల ఫ్లెక్సీల గోల వీడటం లేదు ఆటో డ్రైవర్లకు నిత్యవసర సరుకులు పంపిణీ
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీ లో స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ఫోటోలు లేకపోవడంతో ఆవిర్భావ వేడుకలలో వాగ్వివాదం చోటుచేసుకుంది, ఈ ఘటన మరువక ముందే సిరికొండ మధుసూదనా చారికి అభినందనలు తెలుపుతూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించడంతో మరో వివాదం ముందుకు వచ్చింది గండ్ర వర్స్ సిరికొండ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ రూపకంగా వివాదాలు బయట పడడం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.

*పార్టీ ఒక్కటే వర్గాలు రొండు*

2009,2018 ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణా రెడ్డి 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు చేపట్టారు, నియోజకవర్గ వ్యాప్తంగా మంచి గుర్తింపు ప్రత్యేక క్యాడర్ ఉంది,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన గండ్ర వెంకటరమణా రెడ్డి రాజకీయ పరిణామాలతో అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరారు, గండ్ర వర్గీయుల అందరూ టిఆర్ఎస్ పార్టీలో చేరారు, అప్పటి నుండి భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఒకటే అయినప్పటికీ రెండు వర్గాలుగా చలామణి అవుతున్న విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి, 1994 శాయంపేట నియోజకవర్గం,2014 భూపాలపల్లి నియోజకవర్గం నుండి గెలుపొంది శాసన సభాపతిగా బాధ్యతలు చేపట్టిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యమ కారుడిగా మంచి గుర్తింపు ప్రత్యేక క్యాడర్ ఉంది. వీరు ఇరువురికి ఉన్న ప్రత్యేక క్యాడర్ పార్టీలకతీతంగా నాయకుని వీడలేని కొందరు నాయకుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఒకటే అయినప్పటికీ వర్గాలు రెండుగా చలామణి అవుతున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి సాధించకపోతే పార్టీపై ఉన్న నమ్మకం సన్నగిల్లడంతో రాబోయే రోజులలో పార్టీకి నష్టంతో పాటు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని నాయకులు తెలుపకనే తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *