అలుపెరగని యోధుడు… సాటిలేని ధీరుడు.

`తెలంగాణ చ్కెతన్య కిరణం కేసిఆర్‌.

`కాలానికి ఎదురీధిన యోధుడు.

`తెలంగాణ జాతి కోసం…జాగృతి కోసం బరిగీసి నిలిచిన నాయకుడు.

`సబ్బండ వర్గాల ఐక్యతా రాగం కేసిఆర్‌.

`ఒక్కడుగా మొదల్కె, కోట్లాది గొంతుకైన ఉద్యమ కెరటం కేసిఆర్‌.

`తెలంగాణకే నూతన అధ్యాయం లిఖించాడు.

`తెలంగాణ విముక్తికోసం ప్రాణాలు ఫనంగా పెట్టాడు.

`తెలంగాణ గుండె చప్పుడే కేసిఆర్‌.

`జ్వలించే ఉద్యమ స్వరూపం కేసిఆర్‌.

`అలలాంటి అవరోధాలు..కడలి లాంటి ఎదురు తెన్నులు ఎదుర్కొన్నాడు.

` రైతు కదలించిన ఉద్వేగమే కేసిఆర్‌.

`కేసిఆర్‌ కారణజన్ముడు…ఆదర్శప్రాయుడు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

చలించే హృదయం స్పందిస్తుంది. స్పందిచే మనసు ఆలోచిస్తుంది. ఆలోచించే విధానం దారి వెతుకుతుంది. లక్ష్యం నిర్ధేశించుకొని, గమ్య వైపు అడుగులు వేస్తుంది. విజయం సాధిస్తుంది. జెండా ఎగురుతుంది. అందుకు పట్టుదల, నిర్విరామ కృషి, వెనకడుగు వేయని తత్వం నిండుగా వున్నవారు ఎంతటి లక్ష్యాన్న్కెనా ముద్డాతారు. ఆచరణలో ఎన్ని అవరోధాలు ఎదురైనా అవలీలగా ఎదుర్కొంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గుండె ధ్కెర్యం చెదరరు. దారులు మూసుకున్నా వెనకడుగువేయరు. నిధోరధకాలను ఎదరించి నిలబడారు. విజేతగా నిలుస్తారు. అలాంటి విజేత ముఖ్యమంత్రి కేసిఆర్‌. 

కాలానికి ఎదురీదిన యోధుడు…

ప్రజల్లో చ్కెతన్య రగిల్చిన చాణక్యుడు. ఎదురొచ్చిన వారిని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు…తెలంగాణ సాధనలో అందరినీ ఏకతాటి మీదకు తెచ్చిన ఉత్తేజితుడు…తెలంగాణ కల గన్నాడు. అందరినీ ఏకం చేశాడు. ముక్కోటి తెలంగాణ వాసుల చేత జ్కె తలంగాణ అనిపించాడు. జనం నినదించేలా చేశాడు…ప్రతి ఒక్కరూ జ్కె తెలంగాణ నానాదం నామస్మరణ చేసేలా చేశాడు. తెలంగాణ జాతి కోసం..తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ వెలుగు కోసం, పీడిత పాలనుంచి విముక్తి కోసం బరిగీసి నిలిచాడు. సకల జనులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేశాడు. సబ్బండ వర్గాల ఐక్యతా రాగంతో జ్కె తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా నినదించేలా చేశాడు. అతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఒక్కడుగా మొదల్కె, కోట్లాది మంది గొంతుకలయ్యాడు…లక్షలాది మంది పోరాట యోధులను తయారు చేశాడు…ఉద్యమ ఆకాంక్ష నింపాడు. తెలంగాణ ఏర్పాటే శరణ్యమన్న భావన అందరిలో రగిలించాడు. తెలంగాణ చరిత్రకే నూతన అధ్యాయం లిఖించాడు. తన కీర్తిని శాశ్వతం చేసుకున్నాడు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం ఒడ్డేందుకు సిద్దపడ్డాడు. చావు నోట్లో తలపెట్టి, తెలంగాణ సాధించాడు. తెలంగాణ అన్నది సంధితో సాధ్యం కాకపోతే సమరమే అని ముందు నుంచే ప్రజలను సన్నద్దం చేశాడు. కడలి తరంగం అంతరంగమై అలలలాంటి తెలంగాణ ఆవేశాన్ని ఉద్యమంగా మలిచాడు. జనం గొంతుకలో కేసిఆర్‌ అనే నామస్మరణ కూడా జత చేశాడు…పిడికిలెత్తి తాను నినదిస్తూ, ప్రతి ఒక్కరి చేత తెలంగాణ జపం చేయించాడు. తెలంగాణ గుండె చప్పుడు ఉద్యమానికి తోడు చేశాడు. పల్లె ప్రజల ఊపిరిని తెలంగాణ ఉద్యమానికి ఆయువు చేశాడు. తెలంగాణ సాధనే లక్ష్యమై, ఉద్యమ శ్రీకారంలో అభిమన్యుడ్కె గెలిచి, నిలిచిన సింహస్వప్నం కేసిఆర్‌. 

 రాజనీతి అన్నది ఒకరు నేర్పితే నేర్చుకునేది కాదు… చెబితే అబ్బేది కాదు. మనసులో వుండాలి. 

జనం కోసం ఆలోచించే వ్యక్తిత్వం మెండుగా వుండాలి. ఈ తరం నేతల్లో జ్కె తెలంగాణ అన్నది గుండెల నిండా నింపుకున్న ఏకైక నేతగా, ఒక్కడ్కెన నేతగా గుర్తింపు పొందాడు. జనం కోసం తన అడుగులు ఉద్యమం వైపు సాగించాడు. చలించే హృదయంలో జ్వలించేదే ఉద్యమ స్వరూపం. కడలి ఎదురొచ్చినా, అలలు అడ్డుపడినా ఆగనిది పోరాటం. అందుకే కన్నీరుపెడుతున్న తెలంగాణ గోసకు విముక్తి ప్రసాదించాడు. తన ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణ యాసకు జోడిరచాడు. జనంలో మమేకమైన మాటలు చెప్పాడు. సమయాను కూలంగా పాటలు కూడా కై కట్టాడు. జనానికి నచ్చే విధంగా నచ్చ చెప్పాడు. తెలంగాణ పడుతున్న వేదన, ఆవేదన, తిప్పలు తన మాటాల్లో తూటాల్లా పేల్చాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరంతరం ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. తెలంగాణ అస్ధిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తెగించి కోట్లాడిన ధీరుడు. అహింసాయుతపోరాటం నడిపి, మరో స్వాతంత్య్రం సంగ్రామ విజేతశీలిగా కేసిఆర్‌ కీర్తింపబడ్డాడు. అభినవ గాంధీగా, తెలంగాణ పితగా పిలువబడుతున్నాడు. 

 బతుకు జీవుడా అని కాలం వెల్లబుచ్చుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి తల్లడిల్లిన మనసు కేసిఆర్‌ది.

  ఆకలికి కూడా లెక్కలేసుకొని బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్‌. జనం బొంబాయికి వెళ్లి కూలికో, బొగ్గుబాయిలో బతుకులు బలికో అన్నట్లు బతుకుల దారి కోసం వెలుతున్న వలసలను చూసి గుండె చెరువైపోయి తెగించి జ్కె తెలంగాణ అన్నాడు. కంటి నుంచి కారే కన్నీరు కూడా గుండెల దాకా చేరకముందే ఆవిరైపోతున్న రైతన్న కష్టం చూసి చలించిపోయాడు. ఎడారిగా మారుతున్న తెలంగాణ మాగాణ మట్టివాసనలేకుండా,నీటి చుక్క జాడ లేకుండా నెర్రెలు బారిన పొలాలను చూసి కుమిలిపోయాడు. ఎద్దులేని ఎవుసం చేస్తున్న రైతులు కదిలించిన ఉద్వేగమే కేసిఆర్‌. నీటి కటకటలు తీరక, ఎండిన బావుల్లో చుక్క కనిపిస్తుందా? అని తొంగి చూస్తే బావుల్లో కన్నీళ్లు పడని కాలమది. పూడికల మీద పూడికలు తీయించినా, చుక్క కానరాని గడ్డు రోజులవి. గుక్కెడు మంచి నీటి కోసం నడి నెత్తిన బిందెలు ఎత్తుకొని ముళ్లు గుచ్చుకుంటున్నా, నొప్పిని భరిస్తూ కడివెడు నీళ్లు మోసుకొచ్చుకున్న తల్లులును చూసి తెలంగాణ విముక్తి కోసం నడుం బిగించాడు. ఉద్యమ కాలం నాడే చెరువుల మరమ్మత్తులు మొదలుపెట్టాడు. తెలంగాణ తెచ్చి, మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తెచ్చాడు. ప్రతి చెరువు నిండాలి. ప్రతి ఇంటికి మంచినీరందాలి. ఏ ఆడపడుచు బిందె పట్టుకొని బ్కెటకు వెళ్లకుండా చేశాడు. మిషన్‌ భగీరధతో ఇంటింటికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాడు. చరిత్రలో ప్రతి ఉద్యమ నాయకుడికి ఒకే చరిత్ర వుంటుంది.

కేసిఆర్‌ జీవితమే ఒక చరిత్ర.

 ప్రతి పేజీ ఒక చరిత్రే..ఉద్యమ చరిత్ర…తెలంగాణ సాధన చరిత్ర…బంగారు తెలంగాణ నిర్మాణ చరిత్ర…ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చరిత్ర. ఇది ప్రపంచంలో ఏ నేతకు దక్కని అరుద్కెన గౌరవం. అది నిలుపుకున్న కేసిఆర్‌ తెలంగాణకే వరం. రైతన్నకు కన్నుల నిండా కనిపించే నీటి జాలు చూపించాడు. తెలంగాణ పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో తెలంగాణకు నీటి గోస తీర్చాడు. గడప గడపకు సంక్షేమాన్ని మోసుకెళ్తున్నాడు. తెగించి కొట్లాడిన చేతులతోనే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నాడు. సమసమాజ నిర్మాణం సాగిస్తున్నాడు. తెలంగాణలో కరంటు వెలుగులు నింపాడు. రెప్పపాటు కూడా విరామం లేని కరంటు సరఫరా చేస్తున్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాడు. రైతులకు రైతుబంధు అందిస్తున్నాడు. రైతు భీమా కూడా అందేలా చేస్తున్నాడు. దళితులకు దళిత బంధు అమలు చేస్తున్నాడు. గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించాడు. కదలించే హృదయం…చలించే మనసు రెండూ కేసిఆర్‌కు వున్నాయి. అందుకే సంక్షేమ రాజ్య నిర్మాణం చేస్తున్నాడు. తెలంగాణలను అన్ని రంగాల్లో మందుంచుతున్నాడు. కన్నీరు తుడిచే కరుణామయ మూర్తిగా కళ్యాణ లక్ష్మి అమలు చేస్తూ, ప్రతి ఇంటికి పెద్దకొడుకై ఆసరా అందిస్తున్నాడు. అండగా వుంటున్నాడు. అందుకే కేసిఆర్‌ కారణ జన్ముడు… ఆదర్శప్రాయుడు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *