పట్టుబడిన భామ, బాస్‌…?

పట్టుబడిన భామ, బాస్‌…?

చెట్టాపట్టాలేసుకుని వయసును, హోదాను, వృత్తిధర్మాన్ని మరచిపోయి ఏకంగా ప్రభుత్వ వాహనాన్ని తన సొంత వాహనంలా వాడుకుంటూ పిల్లలకు బుద్దులు నేర్పాల్సిన ఆ అధికారి ఓ భామతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటాన్ని బాస్‌ కుటుంబసభ్యులతో సహా కార్యాలయ సిబ్బంది, తోటి అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటూ ఛీకొడుతున్నారు. ‘నవ్విపోదురుకాక…నాకేంటి అన్నట్లు’ అతను భామతో తిరుగుతున్న వ్యవహారం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. బయట ప్రపంచంలోనే కాదు, ఏకంగా తాను విధులు నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలోనే వీరు ఏకాంతంగా కలుసుకుని ప్రైవేట్‌గా మాట్లాడుకునే పరిస్థితికి వెళ్లారంటే వీరి మధ్యన ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రెండునెలల క్రితం భామ, బాస్‌ ఓ హోటల్‌ లాడ్జిలో అర్థరాత్రి పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా అడ్డంగా దొరికిపోయారని సమాచారం. దొరికిన వెంటనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లగా ఓ ఇద్దరు పైరవీ చేసి పోలీస్‌స్టేషన్‌ నుండి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం ఎక్కడ బయటపెట్టొద్దని పోలీసులను వేడుకున్నారని తెలుస్తోంది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.