నేటిధాత్రి ఔదార్యం

*అర్ధరాత్రి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండ*
*ఏంజీఏం నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలికాకుండా సమయస్ఫూర్తి చాటిన నేటిధాత్రి*

నేటిధాత్ర:ఏల్కతుర్తీ మండలం దండేపల్లి గ్రామానికి చేందిన పోచయ్య అనే వ్యక్తికి బుధవారం రాత్రి సూమారు 8 గంటల సమయంలో ఆయన పనులు ముగించుకుని ఇంటికి వేళ్తున్న క్రమంలో కమలాపూర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.దింతో ప్రమాదంలో తలకు, శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయలవ్వడంతో బాట సారులు గుర్తించి ఆంబులేన్స్ కు సమాచారం ఇచ్చారు . ఘటన స్థాలనికి చేరూకున్న ఆంబులేన్స్ భాదితుడు పోచయ్యను వరంగల్ పట్టణంలోని ఏంజీఏం ఆసుపత్రికి తరలించారు. విషయం తేలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పరీస్థీతీ విషమంగా ఉన్న పోచయ్యకు వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం రేండు ఇంజక్షన్స్ వేసి చేతులు దులుపుకున్నారు. భాదితుడు పోచయ్యకు సీటి స్కాన్ సహా పలు పరిక్షలు అవసరమని చేప్పీ ప్రస్తుతం ఆ సౌకర్యాలు ఇక్కడ లేవని బయట చేయించుకోవాలని సుచించారు .దింతో నీరుపేద కుటుంబం కావడంతో పరిక్షలు చేయించడానికి మా వద్ద డబ్బులు లేవని ఏలాగైనా దయచూపీ పరిక్షలు ఇక్కడే చేయాలనీ ప్రాదేయపడ్డారు. ఐన ఆసుపత్రిలో ఇప్పుడు చేయడం కుదరదనీ మీరు ఆలస్యం చేస్తే వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం జరీగే అవకాశం ఉందని తర్వాత ఏం జరిగినా మాకు సంభందం లేదని తేల్చి చేప్పేసారు . దింతో ఏం చేయాలో దీక్కు తోచని పరీస్థీతుల్లో ఉన్న వారిని గమనించిన విజయ్ నాయక్ అనే వ్యక్తి *నేటిధాత్రి* సంస్థల ఛైర్మన్ కట్టా రాఘవేంద్ర రావుకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి *నేటిధాత్రి* దినపత్రిక బ్యూరో బిర్రు కూమారస్వామికి భాదీతులకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. దింతో ప్రాణాపాయ పరీస్థీతుల్లో ఉన్న పోచయ్యను ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సోంత ఖర్చుతో అవసరైన పరిక్షలు జరిపించి తిరిగి ఏంజీఏంలో చేర్పించారు.
*నేటిధాత్రి చూపిన సమయస్ఫూర్తి, సమాజం పట్ల భాద్యతకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తేలిపారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *