తక్షణం పరిష్కరించండి

తక్షణం పరిష్కరించండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై శాఖలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కారమార్గం చూపెట్టాలని, అపరిష్కతంగా ఉంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి బాధ్యలవుతారని స్పష్టం చేశారు. పెండింగ్‌ ఫిర్యాదులపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ వస్తున్నందున రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయాశాఖల అధికారులకు పంపించినప్పుడు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారు, మిగిలినవి ఎందుకు పరిష్కరించలేకపోయారో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, సంబంధిత నివేదికలను అందజేయాలని సంయుక్త కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసినందున ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దష్టిపెట్టాలని సంయుక్త కలెక్టర్‌ జిల్లా అధికారులకు తెలిపారు. పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజావాణికి వచ్చిన వారి నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, డీఆర్వో ఎన్‌. ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రవీందర్‌, డిడేంలంమ సరస్వతి , డిసిఓ మహమ్మద్‌ అలీ, ఈఈలు విగ్నేశ్వర్‌రెడ్డి, కనకరత్నం, డిటిఓ కొండల్‌ రావు , సిపిఓ రాజారామ్‌, డిఎస్‌సిడిఓ రాజేశ్వరి, బిసిడిఓ సువర్ణ కిరీటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి జన తాకిడి…కిక్కిరిసిన కలెక్టరేట్‌

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ప్రజవాణిని తిరిగి ప్రారంభించడంతో పెద్దఎత్తున ప్రజలు కల్లెక్టరేట్‌కు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు తెలిపారు. మొత్తం 163 దరఖాస్తులు రాగా వాటిలో పెన్షన్‌ సంబంధిత దరఖాస్తులు 82 కాగా, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు కోరుతూ 31, రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ 50 దరఖాస్తులు అందాయి.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *