దశ దిన కార్యక్రమనికి హాజరైన జహీరాబాద్ ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి కీ: శే తన్నీరు సత్యనారాయణ రావు దశ దిన కార్యక్రమనికి హాజరై వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు & జహీరాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,
దశదిన కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు షేక్ సోహెల్
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం తుమ్మన్ పల్లి గ్రామ యువ నాయకులు షేక్ సోహెల్ మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు తండ్రి ఇటీవల మరణించడం తో వారి దశదినకర్మ లో పాల్గొని వారికిశ్రద్ధాంజలి ఘటిస్తు వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియాజేయాడం జరిగింది అని అన్నారు.
