నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోగల పదో వార్డులోని పోచమ్మ ఆలయంలో విఘ్నేశ్వర నవరాత్రుల ఉత్సవాలు నాల్గోవరోజు చేరుకోగా గణనాథుని ఘనంగా పూజలు నిర్వహించారు.కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, పోచమ్మ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తులసి మాలలతో భక్తి శ్రద్ధలతో వేద పండితులు నిశాంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపెల్లి కళ్యాని సతీష్, నాగిశెట్టి ప్రణీత ప్రవీణ్, ఎదురబోయిన మౌనిక నవీన్, అదర్ సండె రమాదేవి రాజు, రావిళ్ళ సుమతి రమేష్ దంపతులు పూజలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎదురబోయిన రామస్వామి, తౌటం వెన్నెల, నిశాంత్, బొల్ల సుమ, అశోక్, గందె కోటేశ్వరి, రాళ్లబండి సరోజన, వార్డులోని ప్రజలు, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు