మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఓపెన్ ప్లాట్ల యజమానులు తమ ఫ్లాట్లల్లో(ఖాళీ స్థలం) ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, ఖాళీ స్థలాలల్లో నీరు నిలవలేకుండా మొరంతో నింపుకోవాలని, లేనియెడల మున్సిపల్ ఆక్ట్ 2019 ప్రకారం ఫ్లాట్ల యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ…. ఓపెన్ ఫ్లాట్ల ల్లో వర్షపు నీరు ఉండటం, పిచ్చిముక్కలు పెరగడం వలన దోమలు వృద్ధి చెంది ప్లాట్ల పక్కల నివసించే ప్రజలు అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులు వెంటనే పిచ్చి మొక్కలను తొలగించి, నీరు లేకుండా చూసుకోవాలని తెలిపారు. కాలువలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని, ఎవరైనా కాలువలపై నిర్మాణాలు చేపడితే వెంటనే తొలగించుకోవాలని లేని ఎడల అక్రమ నిర్మాణాలను 3 రోజులలో తొలగిస్తామని అన్నారు.